ఇండస్ నీటి ఒప్పందం (IWT) పైన సమావేశం నిర్వహించి, పాకిస్తాన్ కు MFN (మోస్ట్ ఫెవర్డ్ నేషన్ -అత్యంత సానుకూల దేశం) హోదా ఇవ్వడం పైన మరో సమావేశాన్ని వచ్ఛే వారం ఏర్పాటు చేయాలని తలపెట్టడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూరి దాడికి ప్రతిస్పందనగా మిలటరియేతర అవకాశాలన్నింటిని పరిశీలిస్తున్నామన్న సంకేతాలను పంపారు. “నెత్తురు, నీళ్లు కలిసి మెలిసి ప్రయాణం చేయలేవు” అని ఆయన అన్నట్లుగా తెలుస్తున్నది. అయినప్పటికీ, సమావేశం తర్వాత, కనీసం ప్రస్తుతానికి IWT కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. బదులుగా, ఇండస్ నీటి వినియోగాన్ని పొందిక ఒనర్చడానికి తీసుకోవలసిన చర్యల జాబితాను కేంద్రం రూపొందించింది; ఇది చేయడంలోనే ఇండియా ఇన్నాళ్లు విఫలం అవుతూ వచ్చింది. నిజం ఏమిటంటే IWT ని రద్దు చేయడం ఆరంభానికి వీలు కానిది; కాగా ఈ సమయంలో సమావేశం నిర్వహించడం సదవగాహనతో కూడినది కాదు. ఎందుకంటే “దరిద్రానికి వ్యతిరేకంగా పోరాడండి” అంటూ కోజికోడ్ ఉపన్యాసం ద్వారా పాకిస్తాన్ పౌరులకు మోడీ ఇఛ్చిన సందేశంతో ఈ చర్య పొసగకుండా పోయి వారిని అయోమయంలో పడవేస్తుంది. మరీ ముఖ్యంగా, ఇండియా నుండి పాకిస్తాన్ లోకి ప్రవహించే ఇండస్ మరియు దాని ఐదు ఉప నదుల నీటి పంపకాన్ని నిర్దేశించే 1960 నాటి ఒప్పందం ప్రపంచ బ్యాంకు (అప్పట్లో IBRD – ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకంస్ట్రక్షన్ అండ్ డవలప్మెంట్) మధ్యవర్తిత్వంలో జరిగింది; పైగా నియంత్రణ రేఖ వెంబడి జరిగిన యుద్ధాలు, ఘర్షణల ద్వారా జరిగింది. దానిని రద్దు చేసినట్లయితే ఈ ప్రాంతీయ స్ధిరత్వానికి ప్రమాదం కావటంతో పాటు ప్రపంచ వ్యాపితంగా ఇండియా విశ్వసనీయతను దెబ్బ తీస్తుంది. “పశ్చిమ” నదులతో, స్వల్ప కాలిక పధకం ప్రకారం జమ్మూ & కాశ్మిర్ రాష్ట్రం పొలాలను మెరుగుగా సాగు చేయడం మినహా, ఇండియా ఏమి చేసే ఉద్దేశంలో ఉన్నదీ ఇంకా స్పష్టత లేదు. ఇండస్ ఉప నదుల నీటి ప్రయాణాన్ని ఆటంకపరిచి, పాకిస్తాన్ కు వెళ్లే నీటి మట్టాన్ని మార్పు చేయటానికి వీలుగా ఆనకట్టలు నిర్మించాలంటే, వాటి నిర్మాణానికే దశాబ్దానికి పైగా కాలం పడుతుంది. అటువంటి చర్యల వాళ్ళ కలిగే పర్యావరణ మరియు భౌగోళిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటే వాటి నిర్మాణానికి అంతర్జాతీయ నిధుల సమీకరణ కష్టం కూడా.
ప్రధాన మంత్రి “ఒప్పందాన్ని” సమీక్షిస్తారంటూ ఘనంగా ప్రకటన చేయగా ఆర్భాటపు హెడ్ లైన్లతో టీవీ ఛానెళ్లు మరింత వర్థిల్లింప జేసాయి; కానీ ఆ (ప్రకటన) తర్వాత ఏ చర్యలు తీసుకోవాలో కేంద్రం ఆలోచించలేదన్నది స్పష్టమే. అయితే వేడి వేడి అలంకార ప్రాయ మాటల స్ధానే ఒప్పందంపై సహేతుక విశ్లేషణను ప్రవేశపెట్టడం ద్వారా జరగనున్న తీవ్ర నష్టాన్ని పరిమితం చేసింది. పాకిస్తాన్ పైన మునుముందు మరిన్ని ప్రకటనలు చేసే ముందు ఆశావహ దృష్టితో కూడిన జాగరూకతను ఇండియా పాటించినట్లయితే అది వివేకవంతం కాగలదు -ఉదాహరణకి, ద్వైపాక్షిక వాణిజ్య తక్కువ స్ధాయిలో ఉన్నందున MFN హోదాను రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్ధకు ఎంత మాత్రం శిక్ష అయి ఉండేది కాదు. యూరి లాంటి టెర్రరిస్టు దాడులకు ఇవ్వగల ప్రతి ఒక్క ప్రతి స్పందన అవకాశాన్ని బహిరంగ ప్రదర్శనకు ఉంచడానికి బదులు జాగ్రత్తగా మదింపు వేసిన వివిధ చర్యలను కలగలిపి ప్రయోగించాలి. ఇండియా తన రక్షణలను మెరుగుపరుచుకోవలసిన అవసరాన్ని యూరి దాడి బట్టబయలు చేసిన అంశాన్ని ఇండియా విస్మరించజాలదు. ఇండియా మళ్ళీ మళ్ళీ నేర్చుకున్నట్లుగా, రెచ్చగొట్టుడు ధోరణి ఎదురైనప్పుడు, మన దేశం ఆధారపడదగ్గదే గాని పొరుగు దేశానికి మల్లే అహేతుకమైన, బాధ్యతారాహిత్యంతో కూడిన చర్యల జోలికి వెళ్ళేది కాదన్న సందేశం అందేటట్లుగా మన స్పందన ఉండాలి.
*********
చాలా రోజులకి ద హిందూలో సానుకూల అవగాహన చూడగలుగుతున్నాము. ఆర్ధిక అంశాలు, మధ్య ప్రాచ్యంకు సంబంధించిన ఘటనలు తదితర అంశాల విశ్లేషణలో మోడీ ప్రభుత్వ దృక్కోణాన్ని తలకెత్తుకుని ప్రభువుల అనుజ్ఞ కోసం తపించే సేవకుడిగా కనిపిస్తున్న ద హిందూ, పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి మోడీకి సరైన సుద్దులు చెప్పటానికి సిద్ధపడింది. బహుశా సంపాదకీయాల రచయితలు మారినప్పుడు ఈ తేడాలు వస్తాయనుకుంటాను.
ప్రపంచ బ్యాంకు మధ్య వర్తిత్వం వహించినంత మాత్రాన ఒక ఒప్పందాన్ని సమీక్షించరాదన్న నియమం ఏమి లేదు. ఒప్పందాన్ని సమీక్షించడమా లేదా అన్నది మారిన పరిస్ధితులు, ఇరు పక్షాలలోని ప్రజల ప్రయోజనాల పైన ఆధారపడి మాత్రమే నిర్ణయించుకోవాలి. ప్రస్తుత సందర్భంలో IWT ఒప్పందం ప్రకారం పశ్చిమ నదులు మూడింటిని ఇండియాకు, తూర్పు నదులు మూడింటిని పాకిస్తాన్ కు అప్పగించారు. అలా మనకు అప్పగించిన మూడు నదులనే ఇప్పటి వరకు సరిగ్గా వినియోగించుకోలేదు. ఇక పాకిస్తాన్ కు వెళ్లే నీటిని అడ్డగించి నిల్వ చేసే ఆనకట్టలు ఎప్పుడు కట్టేరు?!