ఒక అనుభవజ్ఞులైన రాజకీయ నేత మరియు వైట్ హౌస్ కు పోటీ చేస్తున్న మొట్ట మొదటి నామిని అయిన వ్యక్తి, మొండి అయినప్పటికీ ఆశ్చర్యకారకమైన ప్రజాభిమానాన్ని చూరగొన్న స్ధిరాస్ధి వ్యాపారిని (ఎన్నికలకు ముందు జరగవలసిన) మూడు చర్చలలోని మొదటిదానిలో ఎదుర్కొంటున్న దృశ్యం హైప్ కు తగినట్లుగానే ఆవిష్కృతం అయింది. అత్యధిక మీడియా సంస్ధలు చర్చ విజయాన్ని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, మాజీ విదేశీ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) హిల్లరీ క్లింటన్ కే అప్పగించినట్లు కనిపిస్తుండగా, అనేక ఆన్ లైన్ పోల్ లు గెలిచింది ఆమె ప్రత్యర్థి అయిన డోనాల్డ్ ట్రంప్ అని సూచిస్తున్నాయి. ఆన్ లైన్ పోల్స్ లో అధికంగా ఊరు, పేరు లేకుండా జరిగేవి; అశాస్త్రీయ స్పందనలు లక్ష్యం చేసుకుని జరిగేవి. NBC న్యూస్ యాంకర్ లెస్టర్ హోల్ట్ మోడరేటర్ గా నిర్దేశించిన చర్చాంశాలు కొంత మేరకు క్లింటన్ కు అనుకూలంగా తేలాయి. తన ఆదాయ పన్ను పత్రాలను వెల్లడి చేయడానికి ట్రంప్ నిరాకరించిన అంశాన్ని, ఒబామా పుట్టుక చోటుని అనుమానించిన బిర్దర్ వివాదాన్ని మిసెస్ క్లింటన్ స్వరూపం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను మోడరేటర్ హోల్ట్ చర్చలోకి తెచ్చినప్పుడు చర్చ కాస్తా క్లింటన్ వైపు మొగ్గింది. కానీ చర్చలోకి ప్రముఖంగా రాని అంశాలు: (ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణకు) ప్రయివేటు ఈ మెయిల్ సర్వర్ ని క్లింటన్ వినియోగించడం, 2012 నాటి బెంఘాజీ దాడికి ఆమె ముందుకు తెచ్చిన స్పందనలు (సమాధానాలు), క్లింటన్ చారిటబుల్ ఫౌండేషన్ (స్వచ్చంద సంస్ధ) ఆదాయ వ్యవహారాలూ, వాల్ స్ట్రీట్ కంపెనీలతో ఆమెకు ఉన్న సామీప్యత.. ఇవన్నీ క్లింటన్ ను వెనకడుగు వేసేందుకు దోహదం చేసేవి కాగా అవేవి చర్చకు రాలేదు. ఫలితంగా ఆమె Mr ట్రంప్ కి అనేక ప్రలోభాలకు ఆశ పెట్టడం ఆయన వాటిని అదాటున స్వీకరించడం జరిగిపోయింది. చివరికి ఆమె చర్చ నడక పైన భరోసాగా, లాయర్ తరహా ఆదేశయుతంగా బైటికి వచ్చారు.
క్లింటన్ అత్యంత నైపుణ్యతతో ట్రంప్ బలహీనతలపైన -మధ్య తరగతి ప్రజలకు ఆదాయ మద్దతు కంటే బడా వ్యాపార సంస్ధలకు పన్ను మినహాయింపులకు ఆయన సుముఖంగా ఉండటం, జాతి వివక్ష విలువలకు మద్దతు ఇచ్సినట్లుగా సూచించే ఆయన పాత వ్యాపారాలు మరియు వ్యక్తిగత సంబంధాలు, నాటో, ఇరాన్, ఉత్తర కొరియా, చైనా, మెక్సికో లాంటి అంశాలపై అస్ధిరతకు దారి తీసేట్లుగా ఉన్న ఆయన అవగాహనలు- కేంద్రీకరించారు. క్లింటన్-ట్రంప్ ల యుద్ధానికి సంబంధించి ఎదురయ్యే లోతైన ప్రశ్న ఏమిటంటే: అసలు ట్రంప్ లాంటి వ్యక్తి ఇంత దూరం ఎలా రాగలిగారు? రాజకీయంగా పరిగణించదగిన మైనారిటీలను -మెక్సికన్లు , ఆఫ్రికన్-అమెరికన్లు, ముస్లింలు, LGBT , ఇతరత్రా సామర్థ్యంగల వాళ్ళు (వికలాంగులు), మహిళలు- గాయపరిచేట్లు మాట్లాడే ఆయన అలవాటు ఆయన ప్రజాభిమానాన్ని ఎందుకు తగ్గించటం లేదు? (ఈ ప్రశ్నకు సమాధానంలో) ఒక భాగం ఏమిటంటే, అదంతా ఆయన చూపే ఆకర్షణయుత ప్రదర్శనకు సంబంధించినది; క్లింటన్ ఎంతగా ఆచి తూచి స్పందించినా, విధానాల ప్రిస్క్రిప్షన్ లను ఎంతగా వివరించినా ఆ విషయంలో మాత్రం ఆమె ట్రంప్ కంటే చాలా వెనకనే ఉండిపోయారు. అయినప్పటికీ ట్రంప్ ఇంకా ఇంకా పైపైకి ఎదుగుతూ పోవటానికి వెనుక కనిపిస్తున్న ఆందోళనకారక కారణం ఏమిటంటే ఆయన అభ్యర్థిత్వం, వాషింగ్టన్ లో రాజకీయ వ్యవస్ధ పనిచేయకపోవడం ఫలితంగా ప్రజలు దేశవ్యాపితంగా భ్రమలు కోల్పోతున్న పరిస్ధితి కొనసాగుతున్నదని సూచించటం. అనేక ఏళ్లుగా సాగుతున్న పక్షపాత కలహాలు, విధాన స్తంభనల ఫలితంగా, ఎంతటి ప్రమాదానికైనా తెగించి ఒక అలంకారయుత గ్రెనేడ్ ను ఫెడరల్ ప్రభుత్వం వైపు విసిరి వణుకు పుట్టించటానికి అమెరికన్లు సిద్ధపడి ఉండవచ్చు. అత్యంత తీవ్ర స్ధాయి విద్వేషాలతో విడిపోయిన ఓటర్లను ఉపశమింపజేసి ఫెడరల్ పాలన పట్ల వ్యక్తం అవుతున్న రుచి విహీనతను నిగ్రహింప జేయడానికి వారి నాయకులు కృషి చేయక తప్పదని ఈ పరిస్ధితి సూచిస్తున్నది.
*********
గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల చర్చలను మన ఆంగ్ల టి.వి చానెళ్లు పూర్తిగా ప్రసారం చేశాయి. ప్రసారం అయ్యాక వారి చర్చలపైన, చర్చల ఫలితాల పైనా కూడా ప్రత్యేక కార్యక్రమాలు నడిపాయి. తాము కూడా వారి చర్చలపై చర్చలు చేశాయి. అమెరికాలో స్ధిరపడుతున్న భారతీయుల సంఖ్య పెరగడం, ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారతీయ అభ్యర్థులు కూడా పెరగడం ఇందుకు కారణాలుగా చెబుతున్నప్పటికీ ఈ పరిస్ధితి గతంలో కూడా ఉన్నదే. అప్పుడు లేని ఆసక్తిని చానెళ్లు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నట్లు?
ద హిందూ గుర్తించినట్లుగా, ఈ బ్లాగ్ లోనే ఒక ఆర్టికల్ లో చెప్పినట్లుగా అమెరికాలో వాల్ స్ట్రీట్ కంపెనీలు మెజారిటీ హిల్లరీయే గెలవాలని కోరుకుంటున్నవి. అందుకోసం అవి హిల్లరీకి దండిగా నిధులు సమకూర్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికన్ మిలటరీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంతా ఇప్పుడు హిల్లరీ వెనక నిలబడింది. దానికి కారణం అమెరికా సాగిస్తున్న యుద్ధాలను కొనసాగిస్తానని, మిలట్రీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కంపెనీల లాభాలు కొనసాగేలా చూస్తానని ఆమె నమ్మకంగా హామీ ఇవ్వడమే. దురాక్రమణ, ఆధిపత్య యుద్ధాలకు అమెరికా ఆర్ధిక వ్యవస్ధకు అవినాభావ సంబంధం ఉన్నది. కానీ ఈ పరిస్ధితే అమెరికా ప్రాభవం కోల్పోవడానికి అమెరికా ప్రజల్లో వ్యతిరేకత పుట్టడానికి కారణం అయింది. అందుకే తానూ బడా వ్యాపారాలకు పన్నులు తగ్గిస్తానని చెబుతున్నా, ట్రంప్ పట్ల ఆదరణ కనబరుస్తున్నారు.
హిల్లరీ యుద్ధోన్మాది. వాల్ స్ట్రీట్ మనిషి. ఈ సత్యాన్ని అమెరికన్లు అనేకులు గుర్తించారని ట్రంప్ కు లభిస్తున్న ఆదరణ తెలియజేస్తున్నది. ఈ ఆదరణను showmanship ఫలితంగా చెప్పడం ఇరుకు పరిశీలన. ఏళ్ళ తరబడి సాగుతున్న వాల్ స్ట్రీట్ అనుకూల విధానాల పట్ల ప్రజలలో వ్యక్తం అవుతున్న వ్యతిరేకతను ఇలాంటి ఇరుకు పరిశీలనతో గుర్తించటం సరియైనది కాదు. అమలు చేస్తాడో లేదో తెలియదు గాని ట్రంప్ అధికారం లోకి వస్తే రష్యా వ్యతిరేకతను తగ్గించి, స్నేహ సంబంధాలను పెంచుకుంటానని హామీ ఇస్తున్నందున ట్రంప్ అధ్యక్షరికం ప్రపంచంలో పలు చోట్ల పెచ్చరిల్లిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చల్లబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐరోపా దేశాలను రష్యాతో ఘర్షణ వైపుగా నడిపించడాన్ని కూడా నిలిపివేస్తామని సూచిస్తున్నందున ఉక్రెయిన్, సిరియా యుద్ధాలు తెరిపిడి పడవచ్చు. హిల్లరీ ఉద్దేశాలు ఇందుకు సరిగ్గా వ్యతిరేకం అని స్పష్టం అయినందునే ట్రంప్ పట్ల పెరుగుతున్న ఆదరణ.
కనుక ప్రపంచానికి ముఖ్యంగా అణచివేతకు, యుద్ధ పీడనకు గురవుతున్న దేశాలకు ట్రంప్ అధ్యక్షరీకమే మెరుగుగా కనిపిస్తున్నది.
2008 లో ఒబామా కూడా ఇలానే యుద్ధానికి అవుతున్న రక్షణ బడ్జెట్ ను తగ్గిస్తానని,ప్రపంచమంతా శాంతి నెలకొల్పుతాననీ ఉత్తరకుమార ప్రకటనలు చేసి,చివరికి నోబుల్ శాంతి బహుమతిని(అధ్యక్షబాద్యతలు చేపట్టిన అనతికాలంలోనే అందుకున్నాడు) అందుకున్నాడు.కానీ చివరికి,జరిగిందేమిటి?
బుష్ హయంలో కన్నా మరంత తీవ్రస్థాయిలో,దురాక్రమణ యుద్ధలు చేపట్టాడు.
కనుక ఎవరు అధ్యక్షభాద్యతలు చేపట్టినా పెట్టుబడీదారుల ప్రాయోజనాలు కాపడడంలో వెనుతిరిగిచూడరు!
You have a point.
ఔను, “ఎవరు అధ్యక్షభాద్యతలు చేపట్టినా పెట్టుబడీదారుల ప్రయోజనాలు కాపాడడంలో”.వెనుకంజ వెయ్యరు, నిజమే –
కానీ ఇక్కడ గుర్తించ దగ్గ విషయం: అమెరికా ప్రజల మనోభావాలు – అమెరికా ప్రభుత్వ అంతర్జాతీయ విధానాల పట్ల – ఎలా మార్పు చెందుతున్నాయి అనేది.
కొంత మందికి ఇంతకుముందూ తెలుసు, కానీ ఇప్పుడు ఎక్కువ మంది ‘అమెరికా (కుదిరితే బుల్లీయింగ్ లేకపోతె బుకాయింపు) స్ట్రాటజీని గుర్తిస్తున్నారు – అని ఈ ఎలక్షన్ డ్రామా సూచిస్తోంది.
Yes. You are right Kalyani garu. One has to observe the developmental movement and it’s direction. In the process we have to acknowledge any slightest movement and it’s implication.