రష్యా ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్ధ ఐరోపాకు విస్తరించడానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తున్నది. పశ్చిమ దేశాలకు ఈ రంగంలో ఇప్పటి వరకు ఆధిపత్యంలో ఉండడంతో అమెరికా, ఐరోపాలు ఆడింది ఆటగా చెల్లిపోయింది. ఈ పరిస్ధితిని మార్చే లక్ష్యంతో రష్యా, చైనాలు మొదలు పెట్టిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి.
మిర్ నేషనల్ పేమెంట్ సిస్టం (మిర్ జాతీయ చెల్లింపుల వ్యవస్ధ) పేరుతొ రష్యా తన సొంత జాతీయ మరియు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్ధను గత ఏడు ప్రారంభించింది. ఏప్రిల్ 1, 2015 తేదిన రష్యాలో ప్రారంభం అయిన ఈ వ్యవస్ధ ఇప్పుడు అంతర్జాతీయ చెల్లింపులకు కూడా విస్తరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు వీసా, మాస్టర్ కార్డు లతో చర్చలు జరుగుతున్నాయని నేషనల్ కార్డు పేమెంట్ సిస్టం (NSPK) అధిపతి వ్లాదిమిర్ కొమ్లెవ్ తెలిపాడు.
ఉక్రెయిన్ లో అమెరికా, ఈయూ ప్రవేశ పెట్టిన కృత్రిమ తిరుగుబాటుకు సహకరించడానికి రష్యా నిరాకరించడంతో పాటు క్రిమియా రిఫరెండంను గౌరవించి రష్యాలో కలిపేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్యపై అమెరికా, ఈయూ లు ఆగ్రహించాయి. రష్యాపై ఆంక్షలు ప్రకటించి అమలు చేశాయి. ఆంక్షలలో భాగంగా అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్ధలో రష్యా వాణిజ్య చెల్లింపులను కొనసాగకుండా నిరోధించింది. ఫలితంగా రష్యా, తన సొంత ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్ధను అభివృద్ధి చేసుకోవడం ప్రారంభించింది. రష్యాను కష్ట పెట్టి నష్టం తలపెట్టిన అమెరికా చివరికి రష్యాకు మేలు చేసింది. ఇప్పుడిక…
అసలు టపాను చూడండి 245 more words