యూరి దాడికి ప్రతీకారంగా ఇండియా, పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించింది; భౌతిక మిలటరీ యుద్ధం కాదు, ఆర్ధిక యుద్ధం! అమెరికా నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ బాగానే పాఠాలు నేర్చుకుంటున్నారు సుమీ!
ఎకనమిక్ వార్ అని భారత ప్రభుత్వం సూచిస్తున్న చర్యలలో కొన్ని అంశాలు:
1. సాప్తా ఒప్పందం కింద ఇచ్చిన రాయితీలను ఉపసంహరించడం: సాప్తా (SAPTA ) అంటే దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం అని అర్ధం. సార్క్ కూటమి దేశాలు (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు) తమ దేశాల పరిధుల్ని స్వేచ్ఛా వాణిజ్య మండలంగా ప్రకటించాయి. దీని కింద కొన్ని పన్నులు, దిగుమతి సుంకాల పైన రాయితీ ఇవ్వబడుతుంది.
2. MFN స్టేటస్ పైన WTO కు ఫిర్యాదు చేయటం: MFN అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ -అత్యంత సానుకూల దేశం- అని అర్ధం. ఒక దేశం మరొక దేశానికి ఈ స్టేటస్ ఇస్తే, ఇచ్చిన దేశంలో ఇవ్వబడిన దేశానికి కొన్ని రాయితీలు సిద్ధిస్తాయి. ఈ స్టేటస్ ని ఇండియా పాకిస్తాన్ కి ఇచ్చింది గానీ, పాకిస్తాన్ ఇండియాకు ఇవ్వలేదు. ఈ స్టేటస్ గురించిన వివాదాలపై WTO కు ఫిర్యాదు చేసి తీర్పు కోరవచ్చు.
ఎకనామిక్ వార్ లో భాగంగా MFN స్టేటస్ ని ఇండియా ఉపసంహరించవచ్చు. కానీ మోడీ ప్రభుత్వం అలా చేయటం లేదు. అది కొనసాగనిస్తు తమకు అదే స్టేటస్ ఇవ్వకపోవటం…
అసలు టపాను చూడండి 355 more words