వచ్చే డిసెంబర్ చివరి వరకు ఉచిత డేటా ఆఫర్ తో 4G మార్కెట్ లో తొక్కిసలాట సృష్టించిన రిలయన్స్ జియో తన అప్లికేషన్స్ ద్వారా సేకరించే యూజర్ (కస్టమర్ల) డేటాను ప్రకటనల కంపెనీలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లుగా హ్యాకర్ గ్రూఫు హ్యాక్టివిస్ట్ సంస్ధ ‘ఎనోనిమస్’ ప్రకటించి సంచలనం సృష్టించింది.
గూగుల్ కంపెనీ లాగానే భారీ మొత్తంలో ఉచిత సేవలు, ఉచిత యాప్స్ ను యూజర్స్ కు ఇవ్వజూపుతున్న రిలయన్స్ కంపెనీ తన ఉచిత సేవలు వాస్తవానికి మరింత లాభాలు సంపాదించేందుకేనని, తన కస్టమర్ల ప్రయివసీని తాకట్టు పెట్టి మరి అధిక లాభాలు సంపాదించడమే దాని లక్ష్యమని హ్యాక్టివిస్ట్ గ్రూపు వెల్లడి చేసిన వాస్తవాల ద్వారా స్పష్టం అవుతున్నది.
దేశ వ్యాపితంగా 4G స్పెక్ట్రంలో అత్యధిక భాగాన్ని వేలంలో కొనుగోలు చేసిన రిలయన్స్ కంపెనీ ఇటీవలనే చాలా ఆలస్యంగా 4G కంయూనికేషన్, డేటా సేవలను ప్రారంభించింది. వచ్చి రావడంతోనే కస్టమర్లకు భారీ బొనాంజా ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యర్థి కంపెనీలు గుక్క తిప్పుకోకుండా చేసింది. రిలయన్స్ జియో ప్రకటించిన పధకంలో మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి.
1. జీవితాంతం ఉచిత వాయిస్, SMS సేవలు
2. డిసెంబర్ 31, 2016 వరకు అన్ని సేవలు ఉచితం
3. జనవరి 1, 2017 నుండి ఇతర కంపెనీల బేస్ డేటా రేటులో జియో డేటా బేస్ రేటు 10 శాతం (1GB = రు. 50/-)
ఈ మూడు…
అసలు టపాను చూడండి 443 more words
శేఖర్ గారికి,
“వినియోగదారుల సమాచారాన్ని ఇతర సంస్థలకు అమ్ముకుంటే మనకు వచ్చే నష్టమేంటి? సేవలని ఉచితంగా ఇస్తున్నప్పుడు వాటిని పూడ్చుకోవడానికి ఇలాంటివి చేయడంలో తప్పేముంది?” అనే సగటు పౌరుడి/వినియోగదారుడికి సమాధానం ఏంటి?(నాకు కూడా)