బ్రెగ్జిట్ రిఫరెండం అనంతరం ఈయూ సభ్య దేశాలలో క్రమంగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. యూరో జోన్ నుండి బైట పడాలని కొన్ని దేశాలలోని పార్టీలు డిమాండ్ చేస్తుంటే అసలు యూరోపియన్ యూనియన్ నుండే బైట పడాలని మరికొన్ని సభ్య దేశాలలోని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
యూరో జోన్ నుండి బైట పడడం అంటే ఉమ్మడి కరెన్సీ యూరోని జాతీయ కరెన్సీగా త్యజించడం. యూరోపియన్ యూనియన్ నుండి బైట పడటం అంటే అసలు మొత్తంగా యూరోపియన్ ప్రాజెక్టు నుండి బయట పడటం. బ్రిటన్ తన సొంత కరెన్సీని కొనసాగిస్తూ ఈయూ లో చేరింది. అనగా అది యూరో జోన్ లోని దేశంగా ఎన్నడూ లేదు. బ్రెగ్జిట్ రిఫరెండం ఈయూ నుండే బైటకు రావాలని నిర్దేశించింది.
ఇటలీ యూరో జోన్ దేశం. తన సొంత జాతీయ కరెన్సీ ‘లీరా’ ను వదులుకుని 1999 లో యూరో జోన్ లో భాగం అయింది. ఈయూ సభ్య దేశమే యూరో జోన్ లో చేరగలదు. కనుక ఇటలీ ఈయూ సభ్య దేశం కూడా. ఇటలీ బ్యాంకులు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని యూరోపియన్ బ్యాంకింగ్ అధారిటీ గత ఆగస్టులో నిర్వహించిన స్ట్రెస్ టెస్ట్ ఫలితంగా వెల్లడి కావటంతో అప్పటి నుండి యూరో వ్యతిరేక సెంటిమెంట్లు ఆ దేశంలో విస్తృతం అయ్యాయి.
ఇటలీకి 360 బిలియన్ యూరోల మేర చెడ్డ రుణాలు ఉన్నాయని స్విట్జర్లాండ్ లోని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్…
అసలు టపాను చూడండి 420 more words