–
అదే భారత పాలకవర్గాలైతే ఎగిరి గంతేసి ఉండేవాళ్లు. చట్టాలు నిర్దేశించిన నియమ నిబంధనలను అన్నింటినీ తుంగలో తొక్కేసి ‘రండి రండి రండి దయ చేయండీ! తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!’ అని పాడుతూ స్వాగత సత్కారాలు పలికేవాళ్లు.
“చైనాలోకి జొరబడడం ఎంతవరకు వచ్చింది?” అని రాయిటర్స్ వార్తా సంస్ధ ‘నెట్ ఫ్లిక్స్ ఇంక్.’ కంపెనీ సిఈఓ రీడ్ హేస్టింగ్స్ ని అడిగింది. దానికాయన నిరాశగా పెదవి విరిచి “ప్చ్! ఎలాంటి పురోగతి లేకుండా పోయింది” అని పాపం నిస్పృహతో బదులిచ్చాడు.
నెట్ ఫ్లిక్స్ ఇంక్ అంటే అమెరికాకు చెందిన వీడియో స్ట్రీమింగ్ కంపెనీ. హాలీవుడ్ సినిమాలను, టి.వి సీరియళ్లను ప్రసారం చేసే అమెరికా సినిమా ఛానెళ్లు ఉన్నట్లే వాటిని ఇంటర్నెట్ మాధ్యమంలో స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేసేందుకు నెట్ ఫ్లిక్స్ కంపెనీ వెలిసింది.
ఇంటర్నెట్ అంటే ప్రపంచంలో అన్ని చోట్లా ఉంటుంది గనక పెద్దగా పెట్టుబడి లేకుండానే ప్రపంచం లోని నలుమూలలకీ చొరబడి లాభాలు గుంజుకునే వెసులుబాటు నెట్ ఫ్లిక్స్ కి ఉంటుంది. ఈ కంపెనీకి గత కొంత కాలంగా అమెరికాలో లాభాలు పడిపోతున్నాయి. వృద్ధి మందగించింది. దానితో అది కొత్త మార్కెట్ వెతుకులాటలో పడిపోయింది.
నెట్ ఫ్లిక్స్ వినియోగదారుడికి కంప్యూటర్ అయితే గనక బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఏ ల్యాప్ టాప్ గానీ, టాబ్లెట్ గానీ చివరికి స్మార్ట్ ఫోన్ అయినా సరే, 3G…
అసలు టపాను చూడండి 536 more words