ఈ కార్టూన్ కి ఇక వ్యాఖ్యానం అవసరమా?
ఈ కార్టూన్ గీసిన కేశవ్ “కార్టూన్ ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత ప్రభావవంతంగా ఉంటుంది” అని చెబుతారు. అందుకే ఆయన తన కార్టూన్ లకి, ఎప్పుడో తప్పదు అనుకుంటే తప్ప వ్యాఖ్యానం ఇవ్వరు.
జలాంతర్గామి అంటేనే రహస్య ఆయుధం అని లెక్క! సముద్రం అడుగున రహస్యంగా దాగి ఉండాల్సిన స్కార్పీన్ ఒడ్డుకు కొట్టుకొని రావడం బట్టి దానికి బాధ్యత వహించవలసిన వాళ్ళు ఎంత బాధాతాయుతంగా ఉన్నారో తెలిసిపోతున్నది.
స్కార్పీన్ జలాంతర్గామి రహస్యాలు బహిరంగం కావడం గురించి ఇంతకు మించిన గొప్ప కార్టూన్ మరొకటి ఉండదేమో!