యూపిఏ ఏలుబడిలో ఎలాంటి సానుకూల పరిణామం జరిగినా అది రాహుల్ గాంధీకో, సోనియా గాంధీకో క్రెడిట్ అయ్యేది. ఏమన్నా (ఒప్పుకోవలసిన) తప్పులు జరిగితే మాత్రం అవి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఖాతా లోకి వెళ్లిపోయేవి.
ఎన్‌డిఏ-2 ఏలుబడిలోనూ అంతే. పాత్రధారులు మారారు గానీ సీన్ మారలేదు. జిడిపి వృద్ధి రేటు పెరిగినా, చమురు ధరలు తగ్గి ద్రవ్యోల్బణం తగ్గినా, ఉప ఎన్నికల్లో గెలిచినా… అవన్నీ మోడి గాలి + అమిత్ షా చాణక్య ఎత్తుల ఫలితంగానే జరుగుతున్నాయి.
ఢిల్లీలో చావు దెబ్బ తిన్నా, బీహార్ లలో చావు తప్పి కన్ను లొట్టబోయినా, హెచ్‌సియూ వ్యవహారం ఎదురు తన్నినా, జేఎన్‌యూలో గర్వ భంగం జరిగినా, అవన్నీ మంత్రులు, పార్టీ నేతల తప్పులు అవుతున్నాయి.
రియో-డి-జనేరియో ఒలింపిక్స్ కి ఇండియా నుండి 118 మంది వెళితే, ఒకరూ ఇద్దరు గురువుల వల్ల రెండు మెడల్స్ ఇండియాకు దక్కాయి. ఆ మెడల్స్ ఖ్యాతి ఎవరి సొంతమో (ఎవరు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారో) కార్టూన్ తెలియజేస్తోంది.
యధారాజాతధాప్రజా!
మెడల్స్ క్రెడిట్ ఆటగాళ్లది కాదంటారా .?ఒకవేళ ఐతేయ్ మరి ఒకే కోచ్ దగ్గర శిక్షణ పొందిన ఆటగాళ్లు ఇద్దరికీ మెడల్స్ రాలేదు కదా (సింధు అండ్ శ్రీకాంత్ ఇద్దరు గోపీచంద్ దగ్గర శిక్షణ పొందారు కదా ) అలాని కోచ్ పాత్ర మరువకూడదు ఇద్దరి కృషి ముఖ్యమే
నారాయణ గారూ, మీరు పైన పాఠ్యం చదివారా?
మెడల్స్ ఖ్యాతి సొంతం చేసుకునేందుకు రాజకీయ నాయకుల (ఇక్కడ అమిత్ షా) ప్రయత్నించే విషయాన్ని కార్టూనిస్టు వ్యంగ్యంగా చూపించారు. నేనూ అదే రాశాను.
అసలు రాజకీయనాయకులకు (అందులో అమిత్ షా కి) ఏంటి సంబంధం? సారీ ఇక్కడ నేను అమిత్ షా ని ఐడెంటిఫై చేయలేదు ఫోటో లో