ఎట్టకేలకు క్రికెట్-రాజకీయ మరియు రాజకీయ-క్రికెట్ పెద్దల నిరసనల మధ్య సుప్రీం కోర్టు, జస్టిస్ లోధా కమిటీ నివేదికను ఆమోదించింది. కమిటీ ప్రతిపాదించిన, తాము ఆమోదించిన సిఫారసులను ఆరు నెలల లోపు బిసిసిఐ అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కమిటీ సిఫసిఫారసుల మేరకు రాజకీయ పదవులు అనుభవిస్తున్న వారు క్రికెట్ పాలనా పదవులలో ఉండటానికి వీలు లేదు. ఆ లెక్కన ఢిల్లీ క్రికెట్ సంఘం నేతగా కొనసాగుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలి.
మరొక సిఫారసు మేరకు 70 యేళ్ళు పైబడిన వారు క్రికెట్ బోర్డు పదవుల్లో కొనసాగటానికి అనర్హులు. ఈ నిబంధన ప్రకారం వయసు మీరినా కూడా క్రికెట్ చూరు పట్టుకుని వెళ్ళాడుతున్న రాజకీయ నాయకులు పదవీ లాలసకు వీడ్కోలు చెప్పాలి.
మరాఠా నేత, ఎన్సీపి అధిపతి శరద్ పపవార్, తమిళనాడు స్ట్రాంగ్ మేన్ గా చెప్పబడే శ్రీనివాసన్ మొదలైన పెద్దలతో పాటు వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో క్రికెట్ బోర్డు పదవులను బల్లుల్లా అంటిపెట్టుకుని ఉన్న అనేక మంది క్రికెట్ జలగలు పదవీ వియోగం పొందనున్నాయి.
వీళ్లకి క్రికెట్ ఆట కంటే అది కూడ బెట్టే ధన రాశుల పైనే ఎక్కువ మక్కువ. కర్ర సాయంగా లేనిదే నడవ లేని ఈ పెద్దలు క్రికెట్ బ్యాట్ సాయంతో కోట్లు పీల్చుతూ వచ్చారు. బిసిసిఐ లో సెటిలైపోయిన ఈ వృద్ధ పరాన్న భుక్తులు సుప్రీం తీర్పుతో అక్కడ నుంచి తిట్టుకుంటూ, అయిష్టంగా బైటకు వస్తున్నారన్నమాట!