క్రికెట్ లో కోహ్లీ, బాలీవుడ్ లో అమీర్ ఖాన్… భళా!


Amir & Salman

బాలీవుడ్ హీరోలు కూడా నేల మీద నిలబడవచ్చనీ/గలరనీ, ప్రజల సమస్యల పైన స్పందించవచ్చని/గలరనీ నిరూపించిన, నిరూపిస్తున్న హీరోల్లో ఒకరు అమీర్ ఖాన్!

అమీర్ ఖాన్ కాకుండా జనానికి సంబంధించిన రోజువారీ సమస్యలపైన సానుకూలంగా, ప్రగతిశీలకరంగా స్పందించగల ఖరీదైన సెలబ్రిటీలు ఇండియాలో దాదాపు ఇంకెవరూ లేరని ఘంటాపధంగా చెప్పవచ్చు.

క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోలలో అమీర్ ఖాన్ కాస్త వినమ్రంగా ఉంటారు. హేతుబద్ధంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తారు. పెద్దగా బడాయిలకు పోకుండా దేశం కోసం ఆడుతున్నట్లు, ప్రేక్షకులు లేకపోతే తాము లేమని తెలిసి నడుచుకుంటారు.

భారత దేశంలో సెలబ్రటీలు అందరూ అయితే క్రికెట్ కు గానీ లేదా బాలీవుడ్ కి గానీ చెందినవారే అయి ఉంటారు. అందుకే ఈ రెండింటి గురించి చెప్పటం.

ఇంతకీ అమీర్ ఖాన్ చేసిందేమిటి? చేసింది ఏమీ లేదు గాని అన్నది మాత్రం ఉన్నది. ఇటీవల తోటి హీరో సల్మాన్ ఖాన్ చేసిన ‘రేప్’ వ్యాఖ్యలని ఎలాంటి శషభిషలు లేకుండా, మొహమాటం లేకుండా యెకాయెకిన ఖండించేశాడు అమీర్ ఖాన్!

సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై వ్యాఖ్యానించమని విలేఖరులు కోరినపుడు “అబ్బే నాకు తెలీదు”, “నన్ను వివాదాల్లోకి లాగొద్దు” అంటూ తప్పించుకోలేదు. “నేను అక్కడ లేను… కానీ మీడియా రిపోర్టులను బట్టి చూస్తే గనక అతను ఆ మాటలు అనడం దురదృష్టకరం. మొరటుతనంతో కూడినవి” అని స్పష్టం చేశాడు అమీర్ ఖాన్!

అలాగని సల్మాన్ ఖాన్ ని సంస్కరించే పనిని తన నెత్తిన వేసుకోలేదు కూడా. “ఆయనకి ఏమైనా సలహా ఇవ్వదలిచారా?” అని విలేఖరులు ప్రశ్నించినపుడు అమీర్ ఖాన్ “సలహా ఇవ్వటానికి నేనెవరిని?” అని కొట్టిపారేశాడు. అదనపు వార్తల్ని సృష్టిద్దామనుకున్న విలేఖరికి ఆ విధంగా ఆశాభంగం ఎదురయింది.

సుల్తాన్ షూటింగ్ సందర్భంగా శారీరకంగా యమ యాతన పడ్డానని చెప్పుకుంటూ సల్మాన్ ఖాన్ ‘షూటింగ్ ముగిశాక నా పరిస్ధితి రేప్డ్ ఫుమెన్ లాగా అయ్యేదిఅని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలనే అమీర్ ఖాన్ తప్పు పట్టారు.

ఉద్తా పంజాబ్ సినిమా సెన్సారింగ్ విషయంలో బాలీవుడ్ అంతా ఒక్కటై నిరసించింది. ‘అన్యాయం, అక్రమం’ అంటూ ఆక్రోశించింది. ‘మా సృజనాత్మకతను అణచివేస్తున్నారు’ అంటూ ఆందోళన పడింది. ఉద్తా పంజాబ్ సినిమా నిర్మాతల పక్షం చేరి నిరసనలకు పూనుకుంది.

కానీ ఇదే తరహా స్పందన సల్మాన్ ఖాన్ వ్యాఖ్యల పైన లేకుండా పోయింది. ఏ ఒక్కరూ కిక్కురు మనలేదు. ఏమంటే ఏమవుతుందో అన్నట్లుగా ఎవరికి వారు నోరు కట్టేసుకున్నారు. అలాంటి వాతావరణంలో అమీర్ ఖాన్, ఆ వ్యాఖ్యలను ఖండించాడు. అందుకే అమీర్ ఖాన్ తనకుంటూ ప్రత్యేక ఇమేజి సంపాదించుకున్నాడు.

క్రికెట్ లో విరాట్ కోహ్లీ కూడా ఇంతే. తన మాజీ గర్ల్ ఫ్రెండ్ అనుష్కా శర్మ విషయంలో ఎంతో ధైర్యంగా క్రికెట్ అభిమానుల అసభ్య, సంస్కారహీన వ్యాఖ్యలను కోహ్లీ ఎదుర్కొన్నాడు. ఆ వ్యాఖ్యలని తప్పు పట్టాడు. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో నేరుగా వ్యాఖ్యాతలతో తలపడ్డాడు.

VK & AS

గతంలో ఐ‌పి‌ఎల్ మ్యాచ్ ల సందర్భంగా ప్రేక్షకులు టీముల మధ్య చెరో పక్షం చేరిపోయి జాతీయ ఆటగాళ్లను కూడా హేళన చేసేందుకు సిద్ధపడినప్పుడు కూడా కోహ్లీ ఇలానే స్పందించాడు. ఐ‌పి‌ఎల్ కేవలం లీగ్ మ్యాచ్ లే అనీ, వాటిల్లో వివిధ టీముల్లో ఉండే జాతీయ ఆటగాళ్లు ఇంటర్నేషనల్ మ్యాచిల్లో కలిసే ఆడతారని గుర్తు చేస్తూ ప్రేక్షకుల వ్యాఖ్యలను, ప్రవర్తనను నిర్మొహమాటంగా తప్పు పట్టాడు విరాట్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ నుండి ఇలాంటి స్పందన రావటం ఆయన పది జన్మలు ఎత్తినా సాధ్యం కాదు.

మొన్నటి ఐ‌పి‌ఎల్ లో విరాట్ చెలరేగి ఆడినప్పుడు అభిమానులు మళ్ళీ అనుష్క శర్మను గుర్తుకు తెచ్చి కు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు విడిపోయినందు వల్లనే విరాట్ బాగా ఆడుతున్నాడని చెబుతూ విడిపోయినందుకు ఆమెకు ధాంక్స్ చెబుతూ వ్యాఖ్యలు చేశారు కొందరు వెధవలు.

దానికి instagram లో విరాట్ కోహ్లీ ఇచ్చిన స్పందన ఆచంద్రతారార్కం అంటే అతిశయోక్తి కాదు. కావాలంటే చూడండి!

Shame on those people who have been having a go at anushka for the longest time and connecting every negative thing to her. Shame on those people calling themselves educated. Shame on blaming and making fun of her when she has no control over what i do with my sport. If anything she has only motivated and given me more positivity. This was long time coming. Shame on these people that hide and take a dig. And i dont need any respect for this post. Have some compassion and respect her. Think of how your sister or girlfriend or wife would feel if someone trolled them and very conveniently rubbished them in public. #nocompassion#nocommonsense

Virat response to trolls

తాను విడిపోయినప్పటికీ మాజీ గర్ల్ ఫ్రెండ్ అయినప్పటికీ ఆమెపై చేసిన సంస్కారహీన వ్యాఖ్యలకు స్పందించకుండా వదిలిపెట్టలేదు విరాట్. నీ తల్లినీ, చెల్లినీ, గర్ల్ ఫ్రెండ్ నీ ఇలాగే వేధిస్తే ఎలా బాధ పడటారో ఆలోచించి చూడమని కూడా హెచ్చరించాడు. ఈ రోజుల్లో అంత ధైర్యం ఎవరు చేయగలరు?

డబ్బు మీద ఒకటే యావ తప్ప మనిషిగా స్పందించే క్రికెటర్ ఉన్నారా? ఫ్యాన్స్ ని తప్పు పడితే ఎక్కడ ఫ్యాన్ బేస్ పోతుందో అన్న భయంతో నోరు విప్పరు. తాము అద్దాల మెడలో ఉన్నామన్న స్పృహలో ఉంటూ జాగ్రత్తగా స్పందిస్తూ ఉంటారు. ఇలాంటి బంధనాలను విరాట్ ఏ మాత్రం లెక్క చేయలేదు. ఆటలో ఎంత దూకుడుగా అయితే దేశం తరపున ఆడతాడో అదే దూకుడుతో ఒక తప్పుని ఖండించడానికి ముందుకు రావటం, తనకు నష్టం జరగొచ్చని తెలిసి కూడా, విరాట్ కు మాత్రమే సాధ్యం అయింది కావచ్చు.

ఇందుకే బాలీవుడ్ లో అమీర్ ఖాన్, క్రికెట్ లో విరాట్ కోహ్లీ తమ పునాదులను మరిచిపోని ప్రత్యేక వ్యక్తులు అనటం!

One thought on “క్రికెట్ లో కోహ్లీ, బాలీవుడ్ లో అమీర్ ఖాన్… భళా!

  1. తన ప్రేయసి నుండి దూరం జరిగినపుడు(?) విరాట్ ను ఉద్దేశించి కొంతమంది ఫాన్స్ చేసిన వ్యాఖ్యలకు ప్రగతిశేలంగానే స్పందించాడు. అంతే కాకుండా ఆటగాళ్ళను ఆటగాళ్ళగానే చూడాలని ప్రతీ ఆటగాడూ చెప్పే మాటలే,ఇందులో పెద్ద విశేషమేమీ లేదు.

    2006,జూలై 11 న ముంబాయిలో జరిగిన లోకల్ ట్రైన్ బ్లాస్ట్లలో ముందుగా స్పందించిన సెలెబ్రెటి సచినే.

    బాక్షెర్ సరితా దేవి కి మద్దతుగా నిలిచింది కూడా సచినే.

    నా ఉద్దేశం సచిన్ ఉత్తముడని కాదు.అలాగనీ విరాట్ కూడా.

    ఇద్దరూ బహులజాతి కంపనీల ఉత్పత్తులకు ప్రచారం చేసిపెట్టిన వాళ్ళే.

    అలా చూసుకొంటే పెద్ద సెలెబ్రిటీ లలో రజనీ కాంత్ తప్ప బహుశా అందరూ ఉత్పత్తుల ప్రచారానికి తోడ్పడిన వాళ్ళే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s