ఓర్లాండో షూటింగ్: నిమిషంలో 49 మందిని చంపేశాడా?


Orlando shooting

ఒర్లాండో షూటింగ్ గుర్తుందాండి? జూన్ 12 తేదీ ఆదివారం రాత్రి (తెల్లవారు ఝామున) 2 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు పల్స్ నైట్ క్లబ్ లో తుపాకులతో కాల్చి 49 మందిని చంపేశాడని, మరో 53 మందిని గాయపరిచాడని పత్రికలు మనకు చెప్పిన సంఘటన!

ఇలాంటి షూటింగ్ లను, తద్వారా జరుగుతున్న రక్తపాతాన్ని ‘లోన్ వోల్ఫ్ ఆటాక్స్’ గా అమెరికా భద్రతా సంస్ధలు చెబుతున్నాయని, వారి కధలను, కధనాలను భారత పత్రికలు అంది పుచ్చుకుని మనకు చేరవేస్తున్నాయని రెండు వారాల క్రితం ఈ బ్లాగ్ లో ఓ ఆర్టికల్ ప్రచురితం అయింది, ది హిందు ఎడిటోరియల్ అనువాదం, దానిపై విమర్శల పేరుతో.

రెండు రోజుల క్రితం జూన్ 28 తేదీన ఫ్రీడం ఔట్ పోస్ట్ బ్లాగ్ ఒక సంచలన కధనాన్ని ప్రచురించింది. ఎఫ్‌బి‌ఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) విడుదల చేసిన ఫోన్ సంభాషణలను ఈ బ్లాగ్ ప్రచురించింది. జడ్జ్ నెపోలిటానో ఈ బ్లాగ్ నిర్వాహకులు. తన బ్లాగ్ ఆర్టికల్ లోని అంశాలతో, ఆయన ఫాక్స్ న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.

ఎఫ్‌బి‌ఐ విడుదల చేసిన transcripts (హంతకుడు ఒమర్ మటీన్, బందీలను విడుదల చేయటానికి పోలీసుల తరపున అతనితో చర్చలు చేసిన బృందానికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు) ను సమయం తో సహా బ్లాగ్ ప్రచురించింది.

స్పష్టత కోసం: ఈ transcripts బ్లాగ్ నిర్వాహకులు తయారు చేసింది కాదు, ఎఫ్‌బి‌ఐ స్వయంగా విడుదల చేసింది మాత్రమే.

transcripts ప్రకారం తెల్లవారు ఝాము 2:02 AM కు పల్స్ నైట్ క్లబ్ లో కాల్పులు జరిగాయన్న సంగతి ఒర్లాండో పోలీసుల ఫోన్లు రికార్డు చేశాయి. 2:04 AM కు అదనపు ఒర్లాండో పోలీసు బలగాలు అక్కడికి వెళ్ళాయి. 2:08 AM నుండి 2:18 AM వరకు పోలీసులు క్లబ్ లోకి వెళ్ళి మటీన్ తో తలపడ్డారు. 2:35 AM కు మటీన్ 911 కి ఫోన్ చేసి తాను ఇసిస్ కు విధేయుడిని అని చెప్పుకున్నాడు.

ఈ 2:02 AM నుండి 5:14 AM వరకు మూడు సార్లు పోలీసులు మటీన్ తో ఫోన్ లో చర్చలు జరిపారు. ఈ సమయంలో కాల్పులు జరిగినట్లు నమోదు కాలేదు. బందీలు చనిపోయినట్లు పోలీసులు చెప్పలేదు.

5:14 AM కి మటీన్, పోలీసులు పగల గొట్టిన గోడ రంధ్రం నుండి, బందీలతో కలిసి, క్లబ్ బైటికి వచ్చాడు. అతనికి, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. 5:15 AM కు మటీన్ చనిపోయాడు.

2:02 AM నుండి 5:14 AM వరకు కాల్పులు జరగకపోతే, బందీలు చనిపోక పోతే 49 మందిని మటీన్ ఎప్పుడు చంపినట్లు? ఒక్క నిమిషం లోనే 100 మంది మీదికి మటీన్ కాల్పులు జరిపాడా?

బందీలలో కొంత మంది పొరపాటుగా పోలీసుల కాల్పుల్లో చనిపోయి ఉండవచ్చని పోలీసుల ప్రతినిధులు చెప్పారని ప్రధాన స్రవంతి పత్రికలు చెప్పాయి. దీనిని బట్టి ఏమి అర్ధం అవుతోంది?

మటీన్ కూడా గే అని అతని భార్య చెబుతుండగా అదే గే మటీన్ ‘గే క్లబ్’ ను ఎందుకు టార్గెట్ చేసినట్లు? మటీన్ కూ ఇసిస్ కూ సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లేవని చెబుతున్న ఎఫ్‌బి‌ఐ మాటల్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

ఎఫ్‌బి‌ఐ విడుదల చేసిన transcript ని కింద చూడవచ్చు.

Orlando shooting transcript

Orlando shooting transcript 02

One thought on “ఓర్లాండో షూటింగ్: నిమిషంలో 49 మందిని చంపేశాడా?

 1. Hello sir,
  “I’m sorry but I disagree with you about this article

  first point :
  transcripts ప్రకారం తెల్లవారు ఝాము 2:02 AM కు పల్స్ నైట్ క్లబ్ లో కాల్పులు జరిగాయన్న సంగతి ఒర్లాండో పోలీసుల ఫోన్లు రికార్డు చేశాయి.

  this means some one from the Night club called 911 and reported the shooting.that means the shooting started already.

  second point :

  2:04 AM కు అదనపు ఒర్లాండో పోలీసు బలగాలు అక్కడికి వెళ్ళాయి.
  this means the officer, that is near by the area reached the location and called for the back up . they did not proceed in any manner until 2:04 AM

  Third point :
  2:08 AM నుండి 2:18 AM వరకు పోలీసులు క్లబ్ లోకి వెళ్ళి మటీన్ తో తలపడ్డారు.

  Actually Not . They try to engage him but few shoot outs happened as counter strike. and the actual call out is at 2:18 AM by S.W.A.T

  2:02 AM నుండి 5:14 AM వరకు కాల్పులు జరగకపోతే, బందీలు చనిపోక పోతే 49 మందిని మటీన్ ఎప్పుడు చంపినట్లు? ఒక్క నిమిషం లోనే 100 మంది మీదికి మటీన్ కాల్పులు జరిపాడా? you think he did not ??

  మటీన్ కూడా గే అని అతని భార్య చెబుతుండగా అదే గే మటీన్ ‘గే క్లబ్’ ను ఎందుకు టార్గెట్ చేసినట్లు? at the same time his father saying he hate homosexuals and his ex-wife saying his behavior was like, he is a Bi-polar

  what i am trying to say is, the suspect had at least 3 min time before he got distracted by any means . He used AR-15 assault rifle and opened fire from an upper arena to downward Dance floor arena , which could lead more damage than what actually happened in 2 min.

  this is True in-deed terror attack by a lone wolf , who actually no contact with any group but announced allegiance with the terror group( by his own call to 911).
  Who can say its NOT?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s