[ఫేస్ బుక్ లో క్షత్రియ వర్మ ఖాతా లో దీన్ని చూశాను. న్యూస్ ఛానెళ్లను సున్నితంగా, సునిశితంగా విమర్శిస్తున్న ఈ తమాషా సంభాషణను చదవండి, బాగుంది. -విశేఖర్]
*********
ఒక పత్రికా విలేఖరి ఒక రైతును ఇంటర్ వ్యూ
చేస్తున్నాడు.
—
విలేఖరి: మీ మేకలకు మీరు ఏం పెడతారు..?
రైతు : నల్లమేకకా.., తెల్లమేకకా..?
వి : నల్లమేకకు..
రై : గడ్డి..
వి : మరి తెల్లమేకకు..?
రై : గడ్డి..
వి : మీరు మీ మేకలను ఎక్కడ కట్టేస్తారు..?
రై : నల్లమేకనా.., తెల్లమేకనా..?
వి : నల్లమేకను..
రై : బయటి వసారాలో..!!
వి : మరి తెల్లమేకను..?
రై : దాన్ని కూడా బయటి వసారాలో..!!
వి : వీటికి స్నానం ఎలా చేయిస్తారు..?
రై : నల్లమేకకా.., తెల్లమేకకా..?
వి : నల్లమేకకు..
రై : నీటితో..
వి : మరి తెల్లమేకకు..?
రై : దానికి కూడా నీటితో..!!
వి : నీకసలు బుధ్ధి వుందా..? రెండిటికీ ఒకేలా
చేస్తున్నప్పుడు అస్తమానూ నల్లమేకకా..,
తెల్లమేకకా అని ఎందుకడుగుతున్నావు..?
రై : ఎందుకంటే నల్లమేక నాది.
వి: మరి తెల్లమేక..?
.
.
.
.
.
.
.
రై : అదికూడా నాదే..!!
.
విలేఖరి తల గోడకేసి కొట్టుకున్నాడు.
రైతు నవ్వుతూ అన్నాడు..
ఇప్పుడర్థమైందా.. మీరు టివిలో ఒకే వార్త తిప్పి
తిప్పి గంటలు గంటలు చూపిస్తూంటే మా
ప్రేక్షకులకి ఎలా వుంటుందో..?
Feeling Silly……………
నచ్చితే షేర్ చేయడం మరువద్దు…………….
Ha ha super sir meeru kooda chamatkarule sir
Very happy to see this in your blog
Thank u sir