[బల్గేరియా పత్రిక “A-specto” లో బల్గేరియా రచయిత ఏంజెల్ జంబాజ్కి చేసిన రచన ఇది. బల్గేరియన్ భాషలో చేసిన రచనను వలెంతినా జోనేవా ఆంగ్లంలోకి అనువదించగా సౌత్ ఫ్రంట్ ప్రచురించింది. దానిని తెలుగులోకి మార్చి ఇక్కడ ప్రచురిస్తున్నాను. యూరోపియన్ యూనియన్ ను సభ్య దేశాలపై ముఖ్యంగా సభ్య దేశాల శ్రామిక ప్రజలపై, వారి సంస్కృతిపై, వారి జీవనంపై, వారి కుటుంబాలపై ఏ విధంగా రుద్దారో ఈ రచన తెలియజేస్తుంది. -విశేఖర్]
*********
సందేహం లేదు, ఇది చరిత్రాత్మకమే.
ఎంతటి భారీ ఒత్తిళ్ళు ఎదురైనా, ఉన్మాదంతో సంబంధం లేకుండా, లోపలే ఉండాలంటూ ప్రాపగాండాలు ఉరికి పడినా, ఒబామా – సోరోస్ లు దిగివచ్చినా…, గ్రేట్ బ్రిటన్ పౌరులు తమ అభిప్రాయాన్ని ప్రకటించారు.
ఈ ఫలితం ఒక హెచ్చరిక సంకేతం!
బ్రసెల్స్ లోని బ్యూరోక్రట్లకు, ఎవరి చేతా ఎన్నడూ ఎన్నుకోబడని స్వయం సంతృప్త రకాల ప్రతిష్టకు, దేశాల తరపున మాట్లాడుతున్నందుకు, వాళ్ళ తలపొగరు బెదిరింపులకు, “జనానికి ఏం కావాలో” తమకు తెలుసని నటించేవారికీ, (ప్రజల అభిప్రాయాలు) అడగటానికి పరిగణించటానికి నిరాకరిస్తున్నందుకు…
ప్రాధినిధ్య ప్రజాస్వామ్యం మరియు ప్రత్యక్ష ప్రజాస్వామ్యాలను నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలకు…
వలసల సంక్షోభాలపై బ్రసెల్స్ అనుసరించిన ఆత్మహత్యా రాజకీయాలకు…
(ఐరోపా) ఖండానికి వాస్తవ ప్రమాదంగా అవతరించిన టర్కిష్ నియంతకు సంబంధించిన పిచ్చి రాజకీయాలకు…
(యూరోపియన్) యూనియన్ ను రాజ్యాలకు రాజ్యం (సూపర్ స్టేట్) గా, ఐరోపా కంటే పై స్ధానంలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరప్ గా నిలపాలని చేసిన ప్రయత్నాలకు…
వాస్తవంగా అన్నీ ఒకటే నాటకంలో పని చేస్తున్న సో-కాల్డ్ ‘వామపక్ష’, సో కాల్డ్ ‘మితవాద’ మరియు ‘మధ్యేవాద’ రాజకీయ పార్టీల కపట నాటకానికి…
తమను విమర్శించిన వారీనందరినీ ‘పాపులిస్టులు’ అనీ, ‘తీవ్రవాదులు’ అనీ, ఇంకా ఏవేవో పేర్లతో పిలుస్తున్నందుకూ…
ఖాళీ మాటలకూ, అవివేక వాగుడుకూ…
ప్రజా జీవనంలోని సున్నితమైన రంగాల్లో వారి మూర్ఖపు జోక్యానికీ…
కుటుంబ సంబంధాల్లో కర్కశ జోక్యానికీ…
తప్పనిసరి చేసిన స్వయం-సంపర్కుల ప్రదర్శనలకు…
అంతే లేని నియంత్రణలకు…
దోసకాయ, నూనె సీసాల షేపులు కూడా ఎలా ఉండాలో నియంత్రించినందుకు…
కాదు బాబోయ్ కాదు, మేము పాపులిస్టులమూ కాదు, తీవ్రవాదులమూ కాదు. మేము మా పితృ భూములను ప్రేమిస్తాం.
ఫెడరల్ ప్రాజెక్టు ఇక చచ్చింది!
యూరోపియన్ యూనియన్ లో భాగంగా మిగిలి ఉండేందుకు బల్గేరియాకు ఇంకా ఆసక్తి ఉన్నదా? అవును, ఉన్నది. జాతీయ ప్రయోజనాలు, లక్ష్యాలు, ప్రతిష్టలు గౌరవానికీ, పరిగణనకూ నోచుకునే యూనియన్ లో సభ్యత్వంపై ఆసక్తి మెండుగానే ఉన్నది.
బ్రిటిష్ రిఫరెండం ఫలితం ఒకటి చెబుతోంది: ఈ రాజకీయ ప్రాజెక్టును తిరిగి చర్చించాలి అని.
పుట్టిన ఊర్ల యూరప్ కు ఇక సమయం ఆసన్నం అయింది!