బ్రెజిల్ లో ప్రభుత్వ మార్పు -ది హిందు ఎడ్..


Dilma Roussef

Dilma Roussef

(Regime change in Brazil శీర్షికన మే 13 తేదీన వెలువడిన ది హిందు సంపాదకీయానికి యధాతధ అనువాదం.)

*********

అది మరో పేరుతో జరిగిన తిరుగుబాటు కుట్ర. సెనేట్ అభిశంసన ఓటు ద్వారా అధ్యక్షులు దిల్మా రౌసెఫ్ ను అధికార పదవి నుండి సస్పెండ్ చేయడం ద్వారా బ్రెజిల్ ప్రతిపక్షం అరుదైన విజయాన్ని సాధించింది. 55-22 ఓట్ల తేడాతో నెగ్గిన అభిశంసన 13 సం.ల వర్కర్స్ పార్టీ (పి‌టి) పాలనకు అంతం పలికింది. రౌసెఫ్ ఇప్పుడు 6 నెలల వరకు కొనసాగగల అభిశంసన విచారణను ఎదుర్కోవలసి ఉన్నందున ఆమె రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడింది. ఈ విచారణ, ఆమె మళ్ళీ అధ్యక్ష పదవిని పొందేదీ లేనిదీ నిర్ణయిస్తుంది. ప్రతిపక్ష రాజకీయవేత్తలు (ఓటింగు) ఫలితం దరిమిలా సంతోషంగా ఉండడం అర్ధవంతమే అయినా, దేశం ఎదుర్కొంటున్న భారీ సవాళ్లను అధిగమించడానికి నిలకడ కలిగిన ప్రభుత్వ పాలన అవసరం ఐన నేటి పరిస్ధితుల్లో, ముఖ్యంగా ప్రస్తుత ఆర్ధిక సంక్షోభం, ముదిరిపోయిన అవినీతి సమస్యల నేపధ్యంలో అభిశంసన వల్ల బ్రెజిల్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరింత తీవ్రం అవుతుంది. ఇలాంటి పరిస్ధితి నుండి దేశాన్ని బైట పడవేయడంలో రౌసెఫ్ నిస్సందేహంగా మరింత కృషి చేయగలరు. ప్రపంచ మార్కెట్ లో పడిపోయిన సరుకుల ధరలు ముఖ్యం గా ఎగుమతి ఆధారిత బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధను గట్టి దెబ్బ తీసాయి. ఫలితంగా తలెత్తిన సవాళ్లను ఎదుర్కోవడంలో ఆమె ప్రభుత్వం తగినంతగా సిద్ధపడలేదు. లోటును నియంత్రించడానికి వీలుగా ప్రజా పద్దులలో కోత విధించడం లాంటి ఆమె తీసుకున్న చర్యలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేశాయి. పి‌టి సాంప్రదాయక పునాది అయిన శ్రామిక ప్రజలు ఆమెకు దూరంగా జరిగారు. దానితో పాటు పి‌టిలో పరివ్యాప్తమైన అవినీతిని నిరోధించడంలో ఆమె కాస్త కూడా ఏమీ చేయలేదు. అయితే అటువంటి రాజకీయ వైఫల్యాలు అభిశంసనకు కారణం కాగలవా అన్నది ఒక ప్రశ్న. అలాగే రౌసెఫ్ ను బలవంతంగా పదవి నుండి తప్పించడం, బ్రెజిల్ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి దోహదం చేస్తుందా?

ఇది (అభిశంసన) అవినీతికీ, రౌసెఫ్ ఆర్ధిక సామర్ధ్య రాహిత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం అనీ అభిశంసన మద్దతుదారులు, రాజకీయ నాయకులు మరియు ఇతరులు, చెబుతున్నారు. ఈ వాదనలో కనీసం రెండు సమస్యలు ఉన్నాయి. మొదటిది, ఆమె ఎలాంటి అవినీతి కేసులోనూ నిందితురాలు కాదు. పరిహాసభాజనమైన సంగతి ఏమిటంటే ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షులు (యాక్టింగ్ ప్రెసిడెంట్) గా అధికారం చేపట్టే ఉపాధ్యక్షులు మైఖేల్ టెమర్ ఒక పెట్రోబాస్ లంచాల కేసులో నిందితుడుగా ఉండడం. సర్వేల ప్రకారం బ్రెజిల్ ప్రజల్లో కేవలం 2 శాతం మంది మాత్రమే ఆయనను అధ్యక్షుడుగా మద్దతు ఇస్తున్నారు. 60 శాతం మంది ఆయనను అబుశంసించడానికి మొగ్గు చూపారు. అభిశంసన ఓటింగు నిర్వహించిన సెనేట్ అధిపతి రెనాన్ కల్హీరోస్ సైతం 11 క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నాడు. రెండవది, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, ప్రజామోదం లేని తాత్కాలిక అధ్యక్షుడు స్వేచ్ఛా పతనంలో ఉన్న బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధను గట్టెక్కించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇంతవరకు స్పష్టత లేదు. రౌసెఫ్ అప్రతిష్ట పాలయినప్పటికీ బ్రెజిల్ పేద ప్రజానీకంలోని పెద్ద సెక్షన్ లో ఇప్పటికీ పి‌టి ఆదరణ కలిగి ఉన్నది. అభిశంసనకు వ్యతిరేకంగా పి‌టి తన వీధుల్లో నిరసనలను కొనసాగించే పక్షంలో -అందులో కొన్ని హింసాత్మకంగా మారుతున్నాయి- టెమర్ విశ్వసనీయమైన అధికారాన్ని నెలకొల్పడం మరింత కష్టతరం అవుతుంది. ఈ సంక్షోభం నుండి బైటపడడానికి ఉన్న మెరుగైన ప్రజాస్వామిక మార్గం తాజాగా ఎన్నికలు నిర్వహించి తదుపరి అధ్యక్షులు ఎవరన్నది ప్రజలే నిర్ణయించుకునే అవకాశం కల్పించడం. కొత్త తీర్పు ప్రాతిపదికన ఆయన లేదా ఆమె మళ్ళీ కొత్త ఆరంభాన్ని చేపట్టవచ్చు. దురదృష్టవశాత్తూ, బ్రెజిల్ ఉన్నత రాజకీయ వర్గానికి వాస్తవ సమస్యలను పరిష్కరించడం కంటే రాజకీయ మాయోపాయాలలోనే అమిత ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోంది.

*********

దిల్మా రౌసెఫ్ అభిశంసనలో చురుకుగా పాల్గొన్న ప్రతిపక్ష రాజకీయ నాయకులకూ, అమెరికాకూ ఉన్న సంబంధాలను కోణాన్ని సంపాదకీయం విస్మరించింది. వికీ లీక్స్ వెలువరించిన రహస్య డిప్లొమేటిక్ కేబుల్స్ ప్రకారం తాత్కాలిక అధ్యక్షుడు మైఖేల్ టెమర్ అమెరికా ఎంబసితో నేరుగా సంబంధాలు నిర్వహించాడు. లూలా-రౌసెఫ్ ల నాయకత్వం లోని వర్కర్స్ పార్టీని గద్దె దించడానికి ఆయన నిత్యం అమెరికా ఎంబసీతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాడని డిప్లొమేటిక్స్ కేబుల్స్ ద్వారా వెల్లడి అయింది.

Anti-impeachment protests in Rio

Anti-impeachment protests in Rio

సంపాదకీయంలో పేర్కొన్నట్లుగా అవినీతి వ్యతిరేక పోరాటమే రౌసెఫ్ అభిశంసన చెబుతున్న నాయకులే పీకల లోతు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి ఉండగా దిల్మా రౌసెఫ్ పైన ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. ఆమె అభిశంసనకు ప్రతిపక్షాలు చూపిన కారణం బడ్జెట్ అంకెలను మేనిపులేట్ చేశారనే. నిజానికి బడ్జెట్ అంకెలను మార్చడం అన్నది ప్రతి దేశంలోనూ ప్రభుత్వాలు చేసే పనే. బడ్జెట్ అన్నది ఒక సంవత్సరం పాటు ప్రభుత్వం చేసే ఖర్చుల పధకం/అంచనా. అవసరాన్ని బట్టి ఈ అంకెలు మారవచ్చు. నిజంగా అవినీతి చేయడం కోసమే బడ్జెట్ లో కేటాయింపులు మార్చితే నిస్సందేహంగా విచారించవలసిందే. కానీ రౌసెఫ్ పైన ఒక్క అవినీతి కేసూ లేకపోగా ఆమె అభిశంసనకు నేతృత్వం వహించిన వారే తీవ్ర అవినీతికి పాల్పడిన కేసుల్లో ఉన్నారు.

తన పెరటి దొడ్డిగా భావించే లాటిన్ అమెరికాలో వెనిజులా, అర్జెంటీనా, బ్రెజిల్, క్యూబా, ఈక్వడార్, బొలీవియా తదితర దేశాల నాయకత్వంలో అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా శక్తివంతమైన కూటమి ఏర్పడి అభివృద్ధి చెందుతోంది. ఈ కూటమి పలు దేశాలకు సరసమైన ధరలకు గ్యాస్, చమురు అందజేయడం ద్వారా అమెరికా చమురు ప్రయోజనాలకు గండి కడుతోంది. ఈ నేపధ్యంలో లాటిన్ అమెరికా దేశాలను కట్టడి చేసే దిశలో సి‌ఐ‌ఏ పలు కుట్రలకు పాల్పడుతోంది. అర్జెంటీనా లో ప్రభుత్వాన్ని మార్చడంలో సఫలం అయింది. వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావేజ్ ను హత్య చేయించింది. దిల్మా రౌసెఫ్, అర్జెంటీనా మాజీ ప్రధాని క్రిస్టినా లకూ క్యాన్సర్ వ్యాధి అంటించింది.

మరీ ముఖ్యంగా బ్రెజిల్ దేశం చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా, ఇండియాల తో కలిసి బహుళ ధృవ ప్రపంచం అభివృద్ధికి కృషి చేస్తోంది. అమెరికా, ఐరోపాలకు బ్రిక్స్ కూటమి చరిత్రలో ఎరుగని సవాలు విసురుతోంది. ఈ నేపధ్యంలో బ్రెజిల్ లో వర్కర్స్ పార్టీ ఆధిపత్యానికి దెబ్బ కొట్టడానికి అమెరికా అనేక యేళ్లుగా కృషి చేస్తోంది. దాని ఫలితమే బ్రెజిల్ లో సాగిన అనధికారిక రాజ విద్రోహం.

5 thoughts on “బ్రెజిల్ లో ప్రభుత్వ మార్పు -ది హిందు ఎడ్..

  1. అమెరికా, ఐరోపాలకు బ్రిక్స్ కూటమి చరిత్రలో ఎరుగని సవాలు విసురుతోంది-దీని గురించి క్లుప్తంగా వివరిస్తారా?

  2. Sekhar, DO NOT Publish this comment.

    Read below posts. If you think below information true. Pls write in telugu.

    1. Brazil’s acting president used to be US intel informant – WikiLeaks

    https://www.rt.com/news/342933-temer-us-brazil-spying/

    2. A warning message “Brazil is a trial run for what’s planned for India too” and a some facts

    •China has slowed down dramatically, Russia is in doldrums after oil price collapse and Brazil is facing political turmoil

    •India must remain guarded against some of the sinister designs of the western ‘money-men’

    In due course, the Japanese economy tanked, and it hasn’t recovered for some twenty years. I suspected that the top moneymen in the West did something – I am not quite sure what – that trapped the Japanese. I have been waiting for something along the same lines to happen to China, and sure enough, it has. My suspicion is that all the explanations about ‘middle-income trap’ and ‘structural adjustment’ and so on are just bunkum, and that there is some deeper malaise. I have no idea what that is, though.

    But the net result is that China’s trove of foreign currency reserves of $3 trillion began to bleed (by $500 billion to $1 trillion in 2015) precisely at the moment that it tried to build up the yuan as a reserve currency, and to create an alternative to the IMF/World Bank through its Asian Infrastructure Bank (AIIB) and the BRICS Bank. See what I mean about Goldman Sachs (which I use as a generic name for the big moneymen of the West).

    http://swarajyamag.com/world/the-brics-are-dead

  3. మూల గారు,

    బ్రిక్స్ విసురుతున్న సవాళ్ల గురించి గతంలో ఆర్టికల్స్ రాశాను కదా. కొత్తగా అడుగుతారేం?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s