ఇది ఆంగ్ల వార పత్రిక ఔట్ లుక్ జరిపిన/జరుపుతున్న సర్వే.
మే 9 తేదీన ప్రారంభం అయిన ఈ సర్వే మే 23 తేదీన ముగుస్తుంది.
పత్రిక కింది భాగంలో చెప్పినట్లుగా ఈ సర్వే శాస్త్రోక్తంగా జరిగినది/జరుగుతున్నది కాదు.
కేవలం పత్రికను సందర్శిస్తున్న వారు మాత్రమే ఓటు వేయగా వచ్చిన/వస్తున్న ఫలితాలు. సర్వేలో ఓటు వేసిన వారికి మాత్రమే ఓటు ఫలితాలు కనిపిస్తాయి.
పత్రిక వెబ్ సైట్ నుండి స్క్రీన్ షాట్ తీసి ప్రచురించడం జరుగుతోంది.
మే 10 రాత్రి గం 9 : 30 ని.లకు తీసిన స్క్రీన్ షాట్ ఇది. సర్వే పేజీ కోసం ఈ లంకే లోకి వెళ్ళండి.
ఎన్నికల్లో మోడీ స్వయంగా పదుల కొద్దీ సభలు జరిపినా, ‘రాంజాదే-హరాంజాదే’ అంటూ ముస్లిం-హిందువుల మధ్య తగవులు రెచ్చగొట్టినా, జనం పట్టించుకోకుండా అత్యధిక మెజారిటీని ఏఏపి కి కట్టబెట్టారు. బిజేపి ని 2 స్ధానాలతో సరిపుచ్చుకొమ్మని శాసించారు.
ఆ కక్షతో, భయంతో బిజేపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లోని ఏఏపి ప్రభుత్వాన్ని నామ మాత్రం చేయడానికి మొదటి నుండి శాయశక్తులా కృషి చేస్తూ వచ్చింది. అవినీతి వ్యతిరేక నినాదంతో అధికారంలోకి వచ్చిన ఏఏపి ప్రభుత్వం కేంద్ర సచివుల అవినీతిపై చర్యలు తీసుకుంటారన్న భయంతో ఢిల్లీ ప్రభుత్వం కింద ఉన్న అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) ని తన స్వాధీనం లోకి తీసుకుంది. తద్వారా ఏఏపి ప్రభుత్వ ప్రధాన ఆయుధాన్ని రద్దు చేసింది.
జైట్లీ అవినీతిపై విచారణ జరుగుతుందన్న భయంతో రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ పైనే సిబిఐ చేత దాడి చేయించింది. సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినీతి అంటూ కాకమ్మ కబుర్లు చెప్పింది. ఈ నేపధ్యంలో మోడి ప్రభుత్వం పై ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న పోరాటం న్యాయ సమ్మతం, ప్రజా అవసరం.
ఏఏపి పోరాటాన్ని మౌనంతో చంపడానికి బిజేపి, కాంగ్రెస్ లు ఆదిలో ప్రయత్నాలు చేసి విఫలం అయినాయి. కేసులతో వేధించాలని ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. సిబిఐ దాడులతో బెదరగొట్టాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇప్పుడు మోడీ బిఏ, ఎంఏ పట్టాలపై ఏఏపి సాగిస్తున్న పోరాటాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి బదులు వ్యక్తిగత నిందా ప్రచారంతో, అపరిశుద్ధ సోషల్ మీడియా వ్యాఖ్యలతో ఓడించాలని చూస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎన్ని రాతలు రాసుకున్నా, టైమ్స్ నౌ లాంటి పెడబొబ్బల-హాహాకారాల-అహంకారాలతో ఎన్ని జిమ్మిక్కులు చేసినా సామాన్య ప్రజలదే అంతిమ పలుకు. ఢిల్లీ సామాన్యుడి చూపు ఏఏపి వైపే ఉందన్నది సత్యం.