సోనియా అంటే మోడీకి భయం -కేజ్రీవాల్


Kejriwal at AAP rally

Kejriwal at AAP rally

అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణం విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆం ఆద్మీ పార్టీ ఈ రోజు ఢిల్లీలో ప్రదర్శన నిర్వహించారు. ఏ‌ఏ‌పి నేతలు అనేకమంది పాల్గొన్న ఈ ర్యాలీని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. వందల మంది కార్యకర్తలను అరెస్టు చేశారు.

ర్యాలీకి ముందుగా జరిగిన బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు. ప్రసంగంలో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఉబుసుబోక ప్రసంగాలను నిలువునా చీరేశారు. సోనియా గాంధీ అంటే మీకు ఎందుకు భయం అని నిలదీశారు. ఒకరి తప్పులను మరొకరు కాపాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం పై పై విమర్శలు చేసుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగం లోని ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి:

“ఇటలీ కోర్టు ఆదేశాల్లో సోనియా గాంధీ, అహ్మద్ పటేల్ ఇతర కాంగ్రెస్ నేతలు, అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. కానీ సోనియా గాంధీని అరెస్ట్ చేయడానికి మోడీకి ధైర్యం చాలడం లేదు. ఆమెను ఇంటరాగేట్ చేసేందుకు, కనీసం రెండు ప్రశ్నలు వేసేందుకు ఆయనకు ధైర్యం లేదు…

“మోడీ గారూ, చర్యలు తీసుకుంటారని మిమ్మల్ని ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నారు. ఆ పనిని ఇటలీ కోర్టుకు వదిలి పెట్టమని కాదు… ఆమెను జైలుకు పంపినట్లయితే మా ఛాతీలు 56 అంగుళాలకు పెరిగి ఉండేవి… తాను కాకుండా ఇటలీ కోర్టు గాంధీ పేరు చెప్పిందని మా ప్రధాన మంత్రి చెబుతుంటే…, నేను మోడీ గారిని అడగాలనుకుంటున్నాను, మోడీ గారూ ఆమె అంటే మీకు ఎందుకు భయం?

“అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ హెలికాప్టర్ కుంభకోణంలో విచారణ ఇంతవరకు ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. రెండు సంవత్సరాలలో అగస్టా కుంభకోణం పైన వాళ్ళు చేసిన విచారణ ఏమిటి? ఇటాలియన్ ప్రభుత్వం విచారణ పూర్తి చేసింది, కోర్టులో కేసులు పెట్టింది, తీర్పు వెలువడింది, లంచాలు చెల్లించినవారిని జైలుకు కూడా పంపింది.

“అన్నా ఉద్యమం మొదలైనప్పుడు ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు… కాంగ్రెస్, బి‌జే‌పి లు ఒకే నాణేనికి రెండు వైపులు అని వారికి తెలుసు. కానీ లోక్ సభ ఎన్నికలకు ముందు మోడీ గారు బ్రహ్మాండమైన ప్రసంగాలు దంచారు. దానితో అవినీతి అంతం అవుతుందని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు.

“కాంగ్రెస్ అధ్యక్షురాలి అల్లుడు రాబర్ట్  వాద్రా పైన భూ కుంభకోణం విషయమై చర్యలు తీసుకుంటామని మోడి ఎన్నికల్లో ప్రకటించారు. రెండేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ, హర్యానా రాజస్ధాన్ రాష్ట్రాల్లో అధికారం తమ చేతుల్లోనే ఉన్నప్పటికీ ఆయనను (వాద్రాను) ఇంతవరకు ఒక్కసారి కూడా విచారించలేదు.

“అవినీతిపరులను జైలుకు పంపుతామని మోడీ చెప్పారు. రెండేళ్లు గడిచాయి. ఇంతవరకు ఒక్క వ్యక్తి కూడా జైలుకి వెళ్లలేదు… దేశ ప్రజలు మోసగించబడ్డారు. వారి ‘అవినీతి కుమ్మక్కు’ కు వ్యతిరేకంగా నాలుగేళ్ల తర్వాత అవినీతి వ్యతిరేక ప్రదర్శన జరిగిన ఇదే చోట మళ్ళీ సమావేశం కావాలసి వచ్చింది.

AAP rally at Jantar Mantar

AAP rally at Jantar Mantar

“నా పైన సి‌బి‌ఐ చేత దాడి చేయించారు. రోజంతా తనిఖీ చేసినా నాలుగు మఫ్లర్లు తప్ప వారికి ఏమీ దొరకలేదు.  కానీ సోనియా గాంధీ పైన మాత్రం ఇంతవరకు రైడింగ్ జరపలేదు. ఆమె అంటే మోడి ఎందుకు భయపడుతున్నారు? ఎన్నికల ముందు వాద్రాను ‘కాంగ్రెస్ అల్లుడు’ గా మోడి అభివర్ణించేవారు. ఇప్పుడు చూడబోతే మోడి కూడా ఆయనను దత్తత తీసుకున్నట్లు కనిపిస్తోంది.

“భూ కుంభకోణానికి సంబందించి ఆయన (వాద్రా) పత్రాలు రాజస్తాన్ లో పడి ఉన్నాయి. హర్యానా, రాజస్ధాన్ లలో వారి ప్రభుత్వమే ఉన్నది. ఇక వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఆయనపైన చర్య ఎందుకు తీసుకోరు? సి‌బి‌ఐ ఆయనను ఒక్కసారి కూడా ప్రశ్నించడానికి పిలవలేదు. ఎందుకంటే మోడికి అందుకు ధైర్యం లేదు.

“మీరు ఆమెను అరెస్టు చేయండి. రెండు రోజుల పాటు విచారణ చేయండి. నిజం దానంతట అదే బైటికి వస్తుంది.

“అమిత్ షా అంటారు ‘సోనియాజీ లంచాలు తీసుకున్నది ఎవరో దయ చేసి చెప్పండి’ అని. మనోహర పరికర్ అడుగుతారు ‘సోనియాజీ దయచేసి చెప్పండి లంచాలు తీసుకున్నవారి పేర్లు చెప్పండి దయచేసి’ అని. ఈ రకంగా ఎక్కడన్నా విచారణ జరుగుతుందా? మీరు ఇరువురు (కాంగ్రెస్, బి‌జే‌పి) ఒకరికొకరు సహకారం చేసుకుంటారు అని చెబితే మీకు ఎవరూ ఓటు వేసి ఉండేవారు కాదు.

“ఈ రెండు పార్టీలకూ, ఒకరి రహస్యాలు మరొకరికి తెలుసు. నిజానికి మోడీ డిగ్రీలకు సంబంధించిన రహస్యాలు మాకు ఇచ్చింది గుజరాత్ కాంగ్రెస్ నాయకులే. మోడి డిగ్రీ సమస్యను లేవనెత్తడానికి గాంధీ కుటుంబం వారికి అనుమతి ఇవ్వలేదు.

“వాళ్ళిద్దరి మధ్య మంచి అవగాహన ఉన్నది. ‘మిమ్మల్ని కేవలం దూషిస్తాను తప్ప అగస్టా సమస్య విషయంలో గాంధీని అరెస్టు చేయబోను’ అని మోడి కాంగ్రెస్ కు అభయం ఇచ్చారు. ‘మోడీ డిగ్రీ విషయం ప్రశ్నించబోము’ అని కాంగ్రెస్ మోడీకి అభయం ఇచ్చింది.

“10 సం.ల పాటు యూ‌పి‌ఏ అధికారంలో ఉన్నది. ఆ కాలంలో మోడి సాగించిన కుంభకోణాల రహస్యాలను అన్నింటినీ వాళ్ళు తమ వద్ద రహస్యంగా ఉంచుకున్నారు. గాంధీ అరెస్టు అయితే, వాద్రా అరెస్టు అయితే తన రహస్యాలు కూడా బహిరంగం అవుతాయని  మోడీకి బాగా తెలుసు.

“తన డిగ్రీ బూటకం అని అంగీకరిస్తే దేశం మిమ్మల్ని గౌరవించడం కొనసాగిస్తుంది. కానీ ప్రజలు మోసాన్ని, ఫోర్జరీ డిగ్రీలను మాత్రం సహించబోరు.

“ఇదే తరహా సమస్య వచ్చినప్పుడు మా ఎం‌ఎల్‌ఏలు అరెస్టు అయ్యారు. మోడీని కూడా ఢిల్లీ మాజీ న్యాయ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ తరహాలోనే విచారణ చేయాలి. బూటకపు డిగ్రీ కేసులో ఆయనను అరెస్టు చేశారు.

“మోడీ రహస్యాలలో ఒకటి ఆయన డిగ్రీ. ఆయన తన అఫిడవిట్ లో ఢిల్లీ యూనివర్సిటీ నుండి బి‌ఏ పట్టా, గుజరాత్ యూనివర్సిటీ నుండి ఎం‌ఏ పట్టా పుచ్చుకున్నానని చెప్పారు. ప్రధాన మంత్రి కావాలంటే విద్యార్హతలు ఉండాలని నేను చెప్పడం లేదు. డిగ్రీలు లేకపోయినా తెలివిగలిగి ఉండడం సాధ్యమే… ఆయన 12వ తరగతి పాస్ అయితే, మాకు అందువల్ల సమస్య ఏమీ లేదు… కానీ ఆ సంగతి ఆయన చెబితే దేశం ఆయనను గౌరవిస్తుంది… కానీ ఫోర్జరీ డిగ్రీతో మోసం చేసి, ఫ్రాడ్ కు పాల్పడితే మాత్రం దేశం సహించదు.”

అరవింద్ ప్రసంగంలో తప్పు పట్టవలసిన అంశం ఒక్కటీ లేదు. ఆయన చెప్పినట్లు 12th పాస్ విద్యార్హత మాత్రమే కలిగి ఉన్నప్పటికీ తెలివి ఉన్న ప్రధానిని ప్రజలు గౌరవిస్తారు. కానీ ఫోర్జరీ డిగ్రీ, పి‌జి లు విద్యార్హతలుగా చెప్పే మోసపూరిత ప్రధానిని, ఆయన ఎంత తెలివి కలిగిన వ్యక్తి అయినా, దేశ ప్రజలు సహించబోరు.

ప్రధాన మంత్రి మోడికి డిగ్రీ, పి‌జి లు లేవని తెలిసాక హిందూత్వ అనుచర భక్త గణానికి అకస్మాత్తుగా మన చదువు, మన డిగ్రీలు, మన యూనివర్సిటీలు, మన కాలేజీలు పనికిరానివి అని తెలిసి రావడం ఆశ్చర్యకరం.

మన దేశంలో డిగ్రీలు, ఇంజనీరింగ్, మెడికల్ చదివిన మన ఆణి ముత్యాలే అమెరికా, ఐరోపాలను ఏలుతున్నారన్న విషయం చెప్పుకుని మన ప్రధాని మురిసిపోయిన సంగతి ఈ భక్తగణం అప్పుడే మర్చిపోవడం మరింత ఆశ్చర్యకరం. అమెరికా వెళ్ళినా, బ్రిటన్ వెళ్ళినా, చివరికి మంగోలియా వెళ్ళినా భారత విద్యార్ధులే ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఉన్నత సేవలు అందిస్తున్నారని మోడి కొనియాడిన సంగతి భక్తగణం మర్చిపోయారు.

మన కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో, భీమా కార్యాలయాల్లో, విద్యుత్ పరిశ్రమలో, ఇనుము-ఉక్కు, గ్లాస్, అల్యూమినియం, సమాచార సాంకేతిక రంగం, ఎలక్ట్రానిక్ మున్నగు అనేకానేక పరిశ్రమల్లో వివిధ స్ధాయిల్లో పని చేస్తున్నవారందరూ మన డిగ్రీలు, పి‌జిలు, ఇంజనీరింగ్, మెడికల్ పట్టాలు చేతబట్టిన వారే తప్ప ఎక్కడో గాల్లో నుండి ఊడిపడలేదు. (వేద విజ్ఞానం ఎలాగూ ఉన్నత కులాలకే పరిమితం కాబట్టి అదీ వారు నేర్వలేదు.) వారి డిగ్రీలకు విలువ లేకుండానే, ఏమీ నేర్వకుండానే ఇన్ని చేస్తున్నారా అన్నది భక్తగణం వివరించవలసి ఉన్నది.

మనది బ్రిటిష్ దొర మెకాలే రూపొందించిన గుమాస్తాలు తయారు చేసే విద్యా విధానమనీ ఉన్నత వర్గాలకు సేవలు చేసే గుమాస్తా విద్యలను వదిలి దేశ శ్రామిక ప్రజలకు సేవ చేసే శాస్త్రీయ విద్యకై పోరాడాలని విప్లవ విద్యార్ధి సంఘాలు 1970 ల నాడే పిలుపు ఇచ్చాయి. ఈ రోజు ప్రధాని మోడికి డిగ్రీలు లేవని వెల్లడి అయ్యాక ‘అందని ద్రాక్ష పుల్లన’ ప్రాతిపదికన అయినా హిందూత్వ భక్తగణం విప్లవ కమ్యూనిస్టు విద్యార్ధులు చెప్పిన విషయంతో ఏకీభవించడం విశేషమే.

12 thoughts on “సోనియా అంటే మోడీకి భయం -కేజ్రీవాల్

  1. It seems you are the only person still be living Aravind Kejriwal crap. Nobody takes him seriously. He is a joker.

    You are talking like AAP spoke person Raghav chadda. He talks nonsense only. One day Prashant bhushan scolded him left,right and center. How come aap party will send such a useless fellows discussion.

  2. Aravind Kejriwal is the Chief Minister of Delhi state. He/AAP is the only person/party who/which got the most highest seats in an assembly.

    It seems you are comforting yourself by accepting whatever written and said aganist Kejriwal.

    It is the wish and necessity of Congress and BJP to believe AK is a joker & he is not taken seriously… and all that crap.

    I believe AK matters, at least, for now.

  3. కాషాయం గ్యాంగుకి సోషల్ మీడియా సైట్లలో ఉన్న బలగంతో అరవింద్‌ని unpopular చేస్తున్నారేగానీ. నిజానికి ప్రస్తుత రాజకీయాల్లో అతిపెద్ద failure మన గౌరవనీయులైన PM గారు. ఆయనిచ్చిన వాగ్దానాల్లో ఆయన ఎన్నింటిని నిలబెట్టుకున్నరో లెక్కలేస్తే, అధికారంలోకి రాగానే తన వాగ్దానాలమీద దృష్టిసారించి వాటిని నిలుపుకున్న అరవింద్ మేరుపర్వతమంత ఎత్తున కనిపిస్తాడు (మన కాషాయ నేత పుట్టగొడుగంత ఉండొచ్చు). అరవింద్‌కూడా రాజకీయం చేస్తున్నాడు కాదనను. మరి అంత కంటే కూటరాజకీయం PM చేస్తున్నప్పుడు సోషల్ మీడియాల్లో ఒక్క పోస్టైనా రాలదేం? అసలు ప్రస్తుతమున్నాయన దేనిలో మెరుగు? పాతాయనలాగే మౌనముద్రదాల్చడంలోనా? అసలు విషయాలని పక్కనబెట్టి, దేశభక్తి, గోవధ లాంటి non-issuesతో పబ్బం గడుపుకోవడంలోనా? అసలు విషయాలను sideline చేయడానికి ప్రజల emotions రెచ్చగొట్టడంలోనా? ప్రజలకు చేతిలో వైకుంఠం చూపించడంలోనా? విమర్శించినంతనే మీదకు దూకే మూకను సోషల్ మీడియాల్లో తయారుచేసుకోవడంలోనా? అవినీతిపరులకి చేయూతనందించడంలోనా? (అన్నింటిలోనూ అని భావము)

  4. తెలుగు మీడియాలో ఆర్.యస్.యస్ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉందని, మీడియాలో పనిచేస్తున్న ఓ మిత్రుడు మొదట చెప్పినప్పుడు నమ్మబుద్ది కాలేదు. కానీ తెలుగు మీడియా వార్తలని ప్రొజెక్ట్ చేస్తున్న తీరు గమనిస్తే అది నిజమేనని ఇట్టే తెలిసిపోతుంది. ఈనాడు గురించి ఇక చెప్పక్కర్లేదు. ఆంధ్ర జ్యోతి అప్పుడప్పుడూ ఎడిటొరియల్ లో BJP వ్యతిరేక వ్యాసాల్ని ప్రచురిస్తుంటుంది.(నా వ్యాసాల్ని కూడా కొన్ని ప్రచురించింది). తటస్థంగా ఉన్నట్లు చూపించుకోవడం కోసమో, లేక, ఎడిటోరియల్ వ్యాసాల్ని ప్రజలు పెద్దగా చదవరనే నమ్మకంతోనో.

    పై వార్త విషయానికి వస్తే.. సహజంగా 5 ఏళ్ళకోసారి వచ్చే ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో, ఢిల్లీ ప్రజలు కౌన్సిలర్లను ఎన్నుకుంటారు. కౌన్సిలర్లు మేయర్ని ఎన్నుకుంటారు. కాకపోతే మేయర్ ఎన్నిక అయిదేల్లకోసారి కాకుండా, ప్రతి సంవత్సరమూ జరుగుతుంది. మేయర్ పదవి ఒక సం, మహిళకు, మరో సం,రిజర్వ్ అభ్యర్థికి, మరో సం, ఓపెన్ కేటగిరీ అభ్యర్థికి.. ఇలా ఉంటుంది. సహజంగా అత్యధిక కౌన్సిలర్లను గెలుచుకున్న పార్టీ అబ్యర్థులే ఈ అయిదేల్లూ మేయర్గా ఎన్నికవుతుంటారు. 2012లో జరిగిన ఎన్నికల్లో BJP అధిక స్థానాలు గెలుచుకుంది.AAP అప్పుడు పోటీలో లేదు.
    ఓ సారి BJPని చిత్తుగా ఓడించిన ఢిల్లీ ప్రజలు, మళ్ళీ అంతలోనే BJPని గెలిపించడం ఏంటి, అంతగా మోడి పొడిచిందేం లేదుగా అనే క్యూరియాసిటీతో, ఓ అయిదు నిమిషాలు గూగుల్ సెర్చ్ చేస్తే ఈ విషయాలు తెలిశాయి.
    మరి ఈ విషయాలు ఆంధ్రజ్యోతిలోని మేధావులకు తెలియవా? వారికి ఇలాంటి అణుమానాలు రావా? అనేవి ఆలోచించాల్సిన ప్రశ్నలు.

  5. జ్యోతి మేధావులకు తెలియకేం? కాకపోతే అవి పరోక్ష ఎన్నికలన్న సంగతి ఉద్దేశ్యపూర్వకంగా చెప్పకుండా వదిలేసింది. జ్యోతి మాత్రమే కాదు. ఈ వార్త ప్రచురించిన పత్రికలన్నీ, ది హిందు తో సహా, అసలు సంగతి వదిలేశాయి. బహుశా పి‌టి‌ఐ లాంటి సంస్ధల నుండి వాళ్ళంతా ఆ వార్త కొని ఉండాలి. ఉన్నత స్ధాయిలో అవగాహన మేరకు ఇలాంటివి జరుగుతాయి. ఒకరికి వ్యాపారం కావాలి. మరొకరికి ప్రచారం కావాలి, అది ఎలా వచ్చినా సరే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s