అబ్బే ఆ వరదలు కాదు లేండి!
ఇదో కొత్త రకం వరద! ఒపీనియన్ పోల్స్ లో జయలలితకు వ్యతిరేకంగా మొగ్గు ఉన్నట్లు తేలడంతో ఆమె వాగ్దానాల వర్షం కురిపిస్తున్నారు. కాదు కాదు, వరద పారిస్తున్నారు. మచ్చుకు కొన్ని వాగ్దానాలు చూడండి.
ఈ వరద విద్యలో ప్రస్తుతానికి జయలలిత గారిదే పై చేయి.
-
ప్రతి రెండు నెలలకీ ఒక్కో యింటికి 100 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆటంకం (కోతలు) లేని విద్యుత్
-
మహిళలు స్కూటర్లు కొనడానికి 50% సబ్సిడీ
-
క్లాస్ 11, 12 విద్యార్ధులకు ఇంటర్నెట్ తో సహా ఉచిత ల్యాప్ టాప్ లు
-
రేషన్ కార్డులు ఉన్న వాళ్లందరికీ ఉచిత సెల్ ఫోన్లు
-
గర్భిణులకు రు 18,000 సాయం, ప్రసూతి సెలవు 6 నుండి 9 నెలలకు పెంపు
-
2016-2021 కాలంలో రైతులకు రు 40,000 కోట్ల రుణాలు
-
మహిళలకు ఉచిత ఆటో రిక్షాలు, ఉచిత డ్రైవింగ్ శిక్షణ
-
మత్స్యకారులకు, వారి కుటుంబాలకు సహాయం రు 50 వేలకు పెంపు
-
మహిళలకు 4 గ్రాముల ఉచిత బంగారం
-
ప్రాధమిక విద్యార్ధులు అందరికీ ఉచిత బ్రేక్ ఫాస్ట్
-
చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కుల్లో 20 శాతం భూములు ఎస్‌సి, ఎస్‌టి లకు రిజర్వ్
-
అమ్మ మాస్టర్ హెల్త్ చెకప్ పధకం, సబ్సిడీ ధరలకు మహిళలకు హెల్త్ చెకప్ కేంద్రాలు
-
రాష్ట్ర సేవలు పొందడానికి అమ్మా బ్యాంకింగ్ కార్డులు
-
7వ పే కమిషన్ ప్రకారం రాష్ట్ర ఉద్యోగులకు జీతాల పెంపు
-
ప్రభుత్వ ఉద్యోగులకు రు 40 లక్షల ఇంటి రుణాలు
-
నిరుద్యోగ విద్యార్ధులకు విద్యా రుణాలు
-
గుడులకు రు 1 లక్ష సహాయం
-
పొంగల్ పండగకి రేషన్ కార్డు దారులకు రు 500/- బహుమతి కూపన్లు
-
10 లక్షల ఇళ్ళు
-
బహిరంగ స్ధలాల్లో ఉచిత వై-ఫై
-
ముల్లపెరియార్ డ్యాం లో నీటి మట్టం 142 అడుగుల నుండి 152 అడుగులకు పెంపు
ఇంకా బోలెడు!
ఇది వరద కాదా మరి! ఈ దెబ్బతో జనాన్ని మళ్ళీ తన వైపుకు తిప్పుకున్నట్టేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకనేం. కార్యం నెరవేరినట్లే!