ప్రధాని మోడి డిగ్రీ, PG ఫోర్జరీ?!


బి‌జే‌పి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ పక్క సోనియాను టార్గెట్ చేసుకోగా, ఢిల్లీ ముఖ్యమంత్రి నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని టార్గెట్ చేసుకున్నారు.

మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు ఏమిటో కోర్టులు ఇతమిద్ధంగా ఏమి తేల్చలేదు. BA అని ఒక ఎన్నికల్లోనూ, B Com ఫస్ట్ ఇయర్ అని మరో ఎన్నికల్లోనూ అఫిడవిట్ లో రాయడం బట్టి స్మృతి ఇరానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదని స్పష్టం అయింది. కానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే క్రమంలో తానున్నానని ఆమె చెప్పదలిచారో ఏమో తెలియదు కానీ ఆ పని కూడా ఆమె సక్రమంగా చేయలేకపోయారు.

ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విద్యార్హతలపైన ఏ‌ఏ‌పి నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురి పెట్టారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాధినేత రాష్ట్రపతి అయినప్పటికీ కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రధాన మంత్రి చేతుల్లో కేంద్రీకృతం అయి ఉంటాయి. ఆయన కేంద్ర మంత్రివర్గంలో సమానుల్లో ప్రధముడు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని రాష్ట్రపతి వద్దకు వెళ్ళేది కాబోయే ప్రధాన మంత్రి గారే.

కాబట్టి తమను పాలిస్తున్న ప్రధాన మంత్రికి సరైన విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకునే హక్కు, అవసరం భారత ప్రజలకు ఉన్నదనడంలో సందేహం లేదు. ఈ కారణం వలన ప్రధాన మంత్రి విద్యార్హతలు తెలుసుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలు ప్రజల తరపున చేస్తున్నవే. అసలు ప్రస్తుతం జరుగుతున్న యాగీ ఏమీ అవసరం లేకుండానే ప్రధాన మంత్రి స్వయంగా తన విద్యార్హతలను, సర్టిఫికేట్ లతో సహా వెల్లడి చేస్తే ఆయన తరచూ చెప్పుకునే నీతి, నైతికతలను తానే పాటించినట్లే అవుతుంది. అలా జరగకపోగా ఆయన విద్యార్హతలు వెల్లడి చేయకుండా యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి తేవడం బట్టి పలు అనుమానాలు కలుగుతున్నాయి.

ఒక్క నరేంద్ర మోడి గారే కాదు, ప్రధాన మంత్రి పదవికి కాంగ్రెస్ తరపున అర్హుడుగా ప్రచారం పొందుతున్న రాహుల్ గాంధీ సైతం తన విద్యార్హతలను వెల్లడి చేయడం సముచితం కాగలదు. సోనియా గాంధీ రాజకీయ పార్టీ నాయకురాలు మాత్రమే. ప్రధాన మంత్రి పదవి కావాలని కోరుకోనంత వరకు, లేదా ఎవరైనా ప్రతిపాదించనంత వరకు ఆమె విద్యార్హతలతో ప్రజలకు అవసరం లేదు. తమ విద్యార్హతల పట్ల అబద్ధాలు చెప్పకుండా ఉంటే అదే పది వేలు!

కేజ్రీని కదిపారు, తుట్టె కదిలింది!

అరవింద్ కేజ్రీవాల్ ఓటర్ ఐడి కార్డ్ వివరాలపై దాఖలైన ఆర్‌టి‌ఐ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాని గ్రాడ్యుయేషన్ సమస్య చర్చకు వచ్చింది. ఘజియాబాద్ నివాసి ఐన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నివాసిగా ధృవీకరణ ఇచ్చి ఎం‌ఎల్‌ఏ అయ్యారని కనుక ఆయన ఎన్నిక చెల్లదని ఓ వ్యక్తి ఢిల్లీ హై కోర్టుకు వెళ్ళగా ఆ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

మూడు నియోజకవర్గాల్లో (యూ‌పిలో ఒక చోట, ఢిల్లీలో రెండు చోట్ల) ఓటర్ గా కేజ్రీవాల్ నమోదు అయ్యారని ఢిల్లీ బి‌జే‌పి కూడా ఆరోపించింది. అయితే ఈ విషయం కేజ్రీవాల్/ ఏ‌ఏ‌పి అప్పటికే ఎన్నికల కమిషన్ కు సమాచారం ఇచ్చారని, ప్రస్తుత నివాసం తప్ప ఇతర రెండు చోట్ల పేరు తొలగించాలని దరఖాస్తు చేశారని వెల్లడి అయింది. ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోకపోవడంతో మూడు చోట్ల పేరు ఉన్నదని తేలింది.

ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ సమర్పించిన నివాస ధృవీకరణ పత్రాలు, వోటర్ ఐడి ఉపసంహరణ దరఖాస్తులు ఇవ్వాలని పిటిషన్ దాఖలైన క్రమంలో “ఎం‌ఎల్‌ఏ గా మీరు పబ్లిక్ ఆధారిటీ ఎందుకు కాదో -పబ్లిక్ ఆధారిటీ పత్రాలు ఆర్‌టి‌ఐ హక్కు పరిధిలోకి వస్తాయి- చెప్పాలి” అంటూ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కేజ్రీవాల్ కు నోటీసు జారీ చేసింది. అప్పటికి పబ్లిక్ ఆధారిటీగా సి‌ఐ‌సి ప్రకటించిన 6 రాజకీయ పార్టీలలో ఏ‌ఏ‌పి లేదు.

నోటీసుకు బదులిస్తూ కేజ్రీవాల్ “నా నివాస ధృవ పత్రాలు వెల్లడించడానికి అభ్యంతరం లేదు. కానీ అవే ప్రమాణాలను మీరు ప్రధాన మంత్రి విషయంలో ఎందుకు పాటించడం లేదు? ఆయన విద్యార్హతల వివరాలు చెప్పాలని కోరుతున్న ఆర్‌టి‌ఐ పిటిషన్లను ఎందుకు అనుమతించరు?” అని సమాధానం ఇచ్చారు. ఈ సమాధానాన్ని ఆయన పత్రికలకు విడుదల చేశారు.

కేజ్రీవాల్ సమాధానానికి సి‌ఐ‌సి సానుకూలంగా స్పందించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గ్రాడ్యుయేషన్ చేశారని చెబుతున్న ఢిల్లీ యూనివర్సిటీ, పి‌జి చేశారని చెబుతున్న గుజరాత్ యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది, డిగ్రీ, పి‌జి సర్టిఫికేట్ కాపీలను వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇవ్వాలని ఆదేశాలలో కోరింది. డిగ్రీ, పి‌జిలకు సంబంధించిన రోల్ నెంబర్, సర్టిఫికేట్ తేదీలు ఆయనకు ఇవ్వాలని కోరింది.

దానితో మొదలు!

అప్పటి వరకు ప్రధాన మంత్రి విద్యార్హతలపై దాఖలయిన ఆర్‌టి‌ఐ దరఖాస్తులను అటు యూనివర్సిటీలు, ఇటు ప్రధాన మంత్రి కార్యాలయము నిరాకరిస్తూ వచ్చాయి. ఒకరిపై ఒకరు వంతులు పెట్టుకుంటూ వచ్చాయి. పి‌ఎం‌ఓ ని అడిగితే ఎలక్షన్ కమిషన్ దగ్గరకి వెల్లమంటుంది. ఎలక్షన్ కమిషన్ ని అడిగితే యూనివర్శిటీల వద్దకి వెళ్ళమని చెబుతుంది. యూనివర్సిటీలేమో పి‌ఎం‌ఓ దగ్గరికి వెళ్లమంటాయి.

నరేంద్ర మోడి వాస్తవానికి ఎలాంటి డిగ్రీ గానీ పి‌జి గానీ చదవ లేదనీ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. అందుకే యూనివర్సిటీలు ఆయన విద్యార్హతలు చెప్పలేకపోతున్నాయని ఆయన ఆరోపణ. ఆయన నిజంగా విద్యార్హతలు కలిగి ఉంటే వాటిని వెల్లడి చేయడానికి ఇన్ని మల్లగుల్లాలు పడాల్సిన అవసరమే లేదని కేజ్రీవాల్ వాదిస్తున్నారు. ఇందులో వాస్తవం ఉన్నదని వేరే చెప్పనవసరం లేదు.

ఆర్‌టి‌ఐ పిటిషన్ కు సమాధానం ఇవ్వడానికి యూనివర్సిటీలు, పి‌ఎం‌ఓ నిరాకరిస్తుండగానే ప్రధాని మోడి డిగ్రీ, పి‌జి సర్టిఫికేట్ల కాపీలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయ్యాయి. వాటిని యూనివర్సిటీలే లీక్ చేశాయని పత్రికల సమాచారం.

ఈ సర్టిఫికెట్లలో పలు లొసుగులను కార్యకర్తలు వెలికి తీశారు. పి‌జి సర్టిఫికేట్ లో ఆయన పేరు స్పెల్లింగ్ తదితర అంశాలు తేడాగా ఉండగా ఇతర పత్రాలలో ఏకంగా పుట్టిన తేదీయే తేడాగా ఉన్నట్లు తేలింది.

డిగ్రీ తదితర సర్టిఫికేట్లు

డిగ్రీ తదితర (ఎన్రోల్మెంట్) పత్రాల కాపీలను అహ్మదాబాద్ మిర్రర్ పత్రిక ప్రచురించింది. నరేంద్ర మోడి వెబ్ సైట్ ప్రకారం ఆయన పుట్టిన తేదీ 17 సెప్టెంబర్ 1950. కానీ అహ్మదాబాద్ మిర్రర్ పత్రిక ప్రచురించిన పత్రాలలో 29, ఆగస్ట్ 1949 గా పేర్కొనబడి ఉంది.

అనేక మంది కార్యకర్తలకు అధికారికంగా అందుబాటులో లేని డిగ్రీ తదితర పత్రాలు అకస్మాత్తుగా ఒక పత్రికకు ఎలా లభించాయి అన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు. ప్రధాన మంత్రి విద్యార్హతలపై అనేక అనుమానాలు వ్యాప్తి చెందుతూ అదొక కుంభకోణంగా మారే పరిస్ధితి తలెత్తడంతో పబ్లిక్ వినియోగం కోసం, వారి ప్రోబింగ్ మైండ్ లను శాంతపరచడం కోసం ఇలా పత్రికకు లీక్ చేశారని విమర్శకులు విశ్లేషిస్తున్నారు.

ఆర్‌టి‌ఐ కార్యకర్త రోశన్ షా ఈ అహ్మదాబాద్ మిర్రర్ ప్రచురించిన పత్రాలలో తప్పులను ఎత్తి చూపారు. గుజరాత్ యూనివర్సిటీ, మోడి విద్యార్హత పత్రాలను ఫోర్జరీ చేసి పత్రికలకు లీక్ చేశారని ఆయన ఆరోపించారు.

కాలేజీ ప్రిన్సిపాల్ కే ఎం జోషి హిందూత్వ భక్తుడని ఆరోపించిన రోశన్ గతంలో ఆర్‌టి‌ఐ దరఖాస్తులను ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు. “ప్రిన్సిపాల్ కే ఎం జోషి ప్రకటనలు వాటికవే వైరుధ్యాపూరితం. మొదట ఆయన తాము 5 యేళ్లకు పూర్వ రికార్డులను భద్రపరచము అని చెప్పారు. తర్వాత మోడి పత్రాలను తానే వెరిఫై చేసినట్లుగా సంతకం చేశారు. ఇది ఎలా సాధ్యం?” అని రోషన్ ప్రశ్నించారు.

[ఇప్పటి కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా, అప్పటి ముఖ్యమంత్రి మోడిని ఇంటర్వ్యూ చేసిన వీడియోను ఎన్‌డి‌టి‌వి ప్రసారం చేసింది. అందులో మోడి తాను స్కూల్ విద్య తోనే చదువు ముగించానని ప్రజా పాఠశాల కంటే మించిన విద్యాభ్యాసం మరేముంటుందని చెప్పారు. అయితే తర్వాత కాలంలో విద్య అవసరం గుర్తించి బైటి (external) నుండి పరీక్షలకు హాజరై డిగ్రీ, పి‌జి లను పూర్తి చేశానని చెప్పారు. ]

“ఈ లోపు బి ఎన్ స్కూల్ వాళ్ళు పత్రాలు విడుదల చేశారు. వాటి ప్రకారం ప్రధాన మంత్రి పుట్టిన తేదీ 29/08/1949. అంకెలలో,  అక్షరాలలో సైతం ఇదే రాసి ఉన్నది” అని రోషన్ చెప్పారు. (జనతా కా రిపోర్టర్ మే 2, 2016)

1967 లో ఒక సంవత్సరం పాటు మోడి ఎం ఎన్ సైన్స్ కాలేజీలో చదివారు. ఆ కాలేజి ప్రిన్సిపాల్ కే ఎం జోషి నే రోషన్ భక్త అని చెబుతున్నారు. పత్రాలలో దొర్లిన తప్పును ఆయన కాలేజీ అధికారులపైకి నెట్టివేశారు. “మా దగ్గర ఉన్న పత్రాలు పాతవి. చేతితో రాసినవి. కనుక రికార్డు వ్రాసిన వ్యక్తి తప్పు రాసి ఉండొచ్చు” అని కే ఎం జోషి జనన తేదీ తప్పులను సమర్ధించారు.

మోడి పత్రాలలో పుట్టిన తేదీ తప్పుగా ఉండడం గమనించి తాము వద్ నగర్ లో (మోడి చదివిన) బి ఎన్ హై స్కూల్ కు తనిఖీ నిమిత్తం వెళ్లామని అక్కడ పుట్టిన తేదీ 17, సెప్టెంబర్ 1950 అనే ఉన్నదని జోషి చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా మోడి వెబ్ సైట్ లో ఉన్నదే అసలు పుట్టిన తేదీ అని జోషి రుజువు చేసే ప్రయత్నం చేశారు.

కానీ అక్కడ కూడా జోషి అబద్ధం చెప్పాడు. ఆర్‌టి‌ఐ కార్యకర్తలు నేరుగా బి ఎన్ స్కూల్ కి వెళ్ళి స్వయంగా రికార్డులు పరిశీలించారు. జోషి చెప్పినదానికి భిన్నంగా పుట్టిన తేదీ 29, ఆగస్టు 1949 గా పేర్కొనబడి ఉన్నది. స్కూల్ రికార్డులు తప్పా లేక నరేంద్ర మోడి వెబ్ సైట్ తప్పా?

“గుజరాత్ యూనివర్సిటీ మోడి రికార్డులను సృష్టించింది. ఈ (పత్రాల స్కానింగ్) ఫోటోని గమనిస్తే కాగితాలు తెల్లనివి అని గ్రహించవచ్చు. దాన్ని బట్టి వాటిని రీ-క్రియేట్ చేశారన్న అనుమానం వస్తోంది. ఎందుకంటే 30 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచాక కాగితాలు పసుపు ఛాయలోకి మారుతాయి. అలాంటి రంగును పునః సృష్టించడం అసాధ్యం. కానీ ఫాబ్రికెట్ చేయడం తేలికే. గుజరాత్ యూనివర్సిటీ దీనిని ప్రారంభించింది. ఢిల్లీ యూనివర్సిటీ త్వరలో ఈ పద్ధతి అనుసరిస్తుంది” అని రోషన్ షా వివరించారు.

అయితే మోడి కనీసం కాలేజీ అయినా చదివారా? అహ్మదాబాద్ మిర్రర్ పత్రిక ప్రకారం 1967లో ఆయన ప్రీ-సైన్స్ పాస్ అయ్యారు. ఇది ఒక సంవత్సరం కొర్సే అయినా క్లాస్ XII తో సమానం. అదే సమయంలో అదే కాలేజీలో ఇప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ MSc సెకండ్ ఇయర్ లో ఉన్నారని కాలేజీ రికార్డులు చెబుతున్నాయి. (బొమ్మ చూడండి)

కాలేజీ రికార్డులెమో మోడి ప్రీ స్కూల్ చదివారని చెబుతుండగా మోడి స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనేమో తాను హై స్కూల్ తో చదువు మానేశానని చెప్పారు. ఆ తర్వాత external విద్యార్ధిగా డిగ్రీ, పి‌జి పూర్తి చేశానని చెప్పారు గానీ క్లాస్ XII తో సమానమైన ప్రీ-సైన్స్ చదివానని చెప్పలేదు.

మరో విషయం: తాను 1967 లో హిమాలయాలకు వెల్లానని గతంలో

పి‌జి పత్రం

పి‌జి పత్రం కూడా ఇంటర్నెట్ లోనే ప్రత్యక్షం అయింది. ఆర్‌టి‌ఐ దరఖాస్తుకు సమాధానంగా కాదు.

రోషన్ షా ఈ కింది అంశాలు లేవనెత్తారు.

  • “అది డూప్లికేట్. ఆర్‌టి‌ఐ దరఖాస్తుకి ఒరిజినల్ పత్రం నకలు ఇవ్వాలి. కానీ ఈ పత్రం డూప్లికేట్ కాపీ అని స్పష్టంగా రాసి (టైప్ చేసి) ఉన్నది (బొమ్మ చూడండి).
  • “పత్రం పైన verified -తనిఖీ చేయబడింది- అని ఉండగా, దాని కింద సంతకం చేసి ఉన్నది. అంటే ఒరిజినల్ పత్రాన్ని తనిఖీ చేసి డూప్లికేట్ ఇచ్చాం అని చెబుతున్నట్లు అర్ధం. తమ వద్ద రికార్డులు లేవు అన్నవాళ్లు అకస్మాత్తుగా దీనిని ఎలా వెలికి తీశారు?
  • “పత్రం ప్రకారం మోడి మేజర్ “ENTIRE POLITICAL SCIENCE”. ప్రపంచం లోనే పోలిటికల్ సైన్స్ ముందు ఎంటైర్ అన్న పదం చేర్చిన మొట్ట మొదటి యూనివర్సిటీ గుజరాత్ యూనివర్సిటీ అయి ఉండాలి.
  • “ఆయన తండ్రి పేరు DAMODERDAS అనీ DAMODARDAS కాదనీ పత్రం చెబుతోంది.
  • “సర్టిఫికేట్ పైన ఏప్రిల్ 1, 2016 తేదీ ఉన్నది. అనగా ఏప్రిల్ ఫూల్స్ డే! ప్రశ్న ఏమిటంటే 01.04.2016 ముందు సి‌ఐ‌సి సర్టిఫికేట్ కాపీ ఇవ్వాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. యూనివర్సిటీలు కూడా గతంలో ఆర్‌టి‌ఐ దరఖాస్తులను తిరస్కరించాయి. కనుక డూప్లికేట్ ఇవ్వమని గుజరాత్ యూనివర్సిటీని ఎవరు అడిగినట్లు? దానిని ఎవరు ఆమోదించినట్లు?

పి‌జి పత్రానికి సంబంధించి మరిన్ని అవకతవకలు కార్యకర్తలు వెల్లడి చేశారు. పి‌జి సర్టిఫికేట్ పైన వి‌సి కే ఎస్ శాస్త్రి సంతకం చేశారు. PTI రిపోర్ట్ ప్రకారం కే ఎస్ శాస్త్రి, ఆయన కుమారుడు ప్రజ్ఞెష్ శాస్త్రీలు ఇద్దరూ ఫోర్జరీ, అదనపు ఫీజు వసూళ్ల నేరాల కింద నవంబర్ 2003 లో అరెస్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, యూ‌జి‌సి లు నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ ఫీజు SLIMS కాలేజీ నుండి వసూలు చేశారని వారిపై ఆరోపణలు వచ్చాయని అప్పటి డి‌సి‌పి అజయ్ తోమర్ విలేఖరులకు చెప్పారు.

“మాజీ వైస్ ఛాన్స్లర్ ను ఫోర్జరీ, అవినీతి నిరోధక చట్టం, చీటింగ్ నేరాల కింద అరెస్ట్ చేశాము. వివరాలపై దర్యాప్తు చేస్తున్నాము” అని డి‌సి‌పి చెప్పినట్లుగా డెక్కన్ హెరాల్డ్ పత్రిక పి‌టి‌ఐ ని ఉటంకిస్తూ నివేదించింది.

పి‌జి పత్రం పైన మరో సంతకం దారు మినేష్ షా. ఆయనని కూడా 2012 లో అరెస్ట్ చేశారు. “గుజరాత్ యూనివర్సిటీ వి‌సి డాక్టర్ పరిమళ్ త్రివేది, ఇన్-చార్జ్ రిజిస్ట్రార్ మినేష్ షా, డెవలప్ మెంట్ ఆఫీసర్ వైశాలి పధియార్ లతో కుమ్మక్కై యూనివర్సిటీ కి చెందిన కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారు” అని ఆరోపిస్తూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 409, 420, 465 ల కింద వారిపై కేసు నడుస్తోంది.

ఇంతమంది సత్యసంధులు, నైతిక వర్తనులు అందరూ కలిసి ప్రధాన మంత్రి విద్యార్హతలను రుజువు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారంటే ఏమిటి అర్ధం?

చట్టం ఎం‌ఎల్‌ఏలు, ఎం‌పి లకు ఎలాంటి విద్యార్హతలు నిర్దేశించలేదు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రిలకు కూడా విద్యార్హతలు నిర్దేశించలేదు. కనుక డిగ్రీ, పి‌జి లు లేకపోవడం వల్ల మోడి పదవి ఊడిపోదు.

కనీసం బి‌ఏ, బి కామ్ చదవని స్మృతి ఇరానీ యేల్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందినట్లు పత్రికలకు ధైర్యంగా చెప్పారంటే ఎలా అర్ధం చేసుకోవాలి?  అనేకమంది భారతీయ ఎం‌పిలు (80 మంది వరకు) అమెరికన్ యేల్ యూనివర్సిటీలో 6 రోజుల సర్టిఫికేట్ చేశారు. దానినే డిగ్రీగా చెప్పగల ఎం‌పి మానవ వనరులను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రజలు అనుమానిస్తే తప్పు కాదు కదా?

దేశాన్ని ఏలుతున్న వ్యక్తులు ఫోర్జరీ పత్రాలతో విద్యార్హతలు సంపాదించారంటే అలాంటి వారి పాలన ఎలా ఉంటుంది? వారు యూనివర్శిటీలలో అవినీతిని నిరోధించడానికి చిత్తశుద్ధి చూపగలరా? పాలనలో అవినీతి పట్ల ఏ వైఖరిని చూపుతారు?

భారత ప్రజల్ని తొలుస్తున్న ప్రశ్నలు ఇవే.

9 thoughts on “ప్రధాని మోడి డిగ్రీ, PG ఫోర్జరీ?!

  1. తన విద్యార్హతల గురించి నిజం చెప్పలేని(బహుశా తెలియదేమో) పిరికిపంద నరేంద్ర మోదీ!

  2. వారు యూనివర్శిటీలలో అవినీతిని నిరోధించడానికి చిత్తశుద్ధి చూపగలరా? పాలనలో అవినీతి పట్ల ఏ వైఖరిని చూపుతారు

    Well. First of all Govt should praivetaise all universities. That is the only solution for corruption in universities.
    Second point education lost its sheen. Coming days nobody bothers about education qualification. it’s waste of time to spend 24 years. Those days were gone. Going forward high school education is sufficient. If any body wants to do some specialization they can focus in that particular area. People are not joining engineering courses. All these BA, B COM,MA….degrees outdated. Those courses will die natural death.

    There is no single scam in Modi Govt. It seems you are not following Arnab show on helicopter scam. He will become PM next election also.

  3. It is another matter whether our Degrees and PGs are useful or not.

    But why should a PM lie about having those useless degrees? That is the question. It seems you didn’t notice the crux of the article.

    BTW, are you saying that Modi will be closing down JNU, Jadavpur, HCU and Osmania universities?

  4. “If any body wants to do some specialization they can focus in that particular area.”

    I think you need to “do” some specialization in English 🙂

    ఏదైతే ఇతరులు చేస్తే తప్పో, అదే పని మోదీ (లేదా భా.జ.పా. నాయకులు) చేస్తే అది అంతగా పట్టించుకోవాల్సిన అవసరంలేని విషయమౌతుంది. ద్వంద్వవిలువలు అన్న సాంప్రదాయాన్ని మనం బహుచక్కగా అనుష్ఠిస్తున్నాం.

  5. I am with Sunder in this matter. All those universities should be closed down immediately. How can the unpatriotic doctors, that are coming out from those universities treat the patriotic patients? Correct na sunder?

    Jai Narendra Modi.
    M.B.A( Pls don’t ask for certificates. He did BA and MA. hence MA + BA = MBA, those who are weak in Algebra can never understand this)

  6. Of course there is no necessity of education to rule the country. The parliament and assemblies are crowded with such people who rule the country by the advice of the bureaucrats. The problem is why should anybody shirk to tell the truth about their educational qualifications. Is there any clause in the constitution that uneducated are not eligible to become a minister or a prime minister? .

  7. No. There is no such clause. But there is an act that stipulates election contestants should provide facts, nothing but facts, in their affidavits while submitting their nominations. Our PM Modi said he had done BA, MA in election affidavits.

    According to a Supreme Court Judgement (maybe in 2013) the contestant should not leave any question unanswered. If blank space is left against any single question the election officer can declare that nomination as disqualified. That’s why Modi had to reveal that he was married to Jashoda Ben in 2014.

    So if Modi didn’t possess educational qualifications as provided by him in election affidavit, he can be interrogated for providing wrong information. But still, as a PM Modi is immune to interrogation of any kind as long as he sits in PM’s chair.

    Also in India, there is no tradition of arresting top political people for their crimes how serious or petty they may be, except that they would be utilized for political gains. There is a tacit understanding between various political parties that one should not target the opposite’s political careers. If any one political party dares to do that the chain reaction follows automatically. Almost all top leaderships of all parties would have to be behind bars.

    Do you remember Tomar? He was law minister in Kejriwal’s cabinet. It was raised that his degree certificate was a forged one. Delhi police, under the orders of Modi Govt, arrested and interrogated him. He was made to roam around Delhi city along with police and asked to show where he wrote his exams.

    Modi is secured from this process by the constitutional immunity provided to PM chair. So, there is no immediate threat to Modi.

    Even then it is a matter of embarrassment for a PM, if he is not in a position to prove his educational credentials as provided by him.

  8. మోది ఈ దేశ ప్రజాస్వామ్యం మీద ప్రజలకున్న అవగాహనకు నిదర్శనం. ధనస్వామ్య తాబేదార్ల తార్కిక పట్టుకు నిదర్శనం. అర్ణబ్ గోస్వామి తరువాయి పి.ఎమ్.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s