వర్షాలు లేవు గానీ… -కార్టూన్


Raining promises

వర్షాలు లేవు గానీ ఎన్నికల పుణ్యాన వాగ్దానాలు వరదై పారుతున్నాయి.

హెలికాప్టర్ లో సుడిగాలి పర్యటనలు చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు.

2014 సాధారణ ఎన్నికల్లో బి‌జే‌పి నేత నరేంద్ర మోడి ఎన్ని వాగ్దానాలు కురిపించారో గుర్తుందా?

 1. విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల డబ్బు వెనక్కి తెప్పిస్తాం. ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు జమ చేయిస్తాం.
 2. ‘నేషనల్ రూరల్ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ మిషన్’ ద్వారా గ్రామాలకు టెలీ మెడిసిన్, మొబైల్ హెల్త్ కేర్ వసతి కల్పిస్తాం. వ్యవసాయం కోసం ఐ‌టి వినియోగిస్తాం. రియల్ టైమ్ సమాచారం అందిస్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, రిటైల్ వ్యాపారులు, చిన్న-మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు అందరికీ ఐ‌టి వినియోగం అందుబాటులోకి తెస్తాం.
 3. అవినీతి నిర్మూలనకు ప్రతి ప్రభుత్వ పనీ డిజిటైజేషన్ తప్పనిసరి చేస్తాం.
 4. వన బంధు కళ్యాణ్ యోజనా కింద ట్రైబల్ అభివృద్ధి ఆధారిటీ ఏర్పాటు చేస్తాం. పూర్తి విద్యా వ్యవస్ధలు నెలకొల్పడం, ఇళ్ళు-నీరు-ఆరోగ్య సౌకర్యాల మెరుగుదల, గిరిజన గ్రామాల విద్యుదీకరణ, గిరిజన సంస్కృతి ఉట్టిపడే ఉత్పత్తులకు టూరిస్టు పట్టణాలలో ప్రోత్సాహం… మొ.వి ఈ పధకంలో అమలు చేస్తాం.
 5. గిరిజనులను భూముల నుండి వెళ్లగొట్టకుండా చూస్తాము.
 6. మైనారిటీ విద్యా సంస్ధలు, వ్యవస్ధలను బలీయం కావించి ఆధునీకరిస్తాం. నేషనల్ మదరసా మోడర్నైజేషన్ కార్యక్రమం చేపడతాం.
 7. అత్యంత వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ప్రాధామ్యతా ప్రాతిపదికన ఇతర అభివృద్ధి జిల్లాలతో సమాన స్ధాయికి తెస్తాం.
 8. ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్ధను సమీక్షించి సగటు మనిషి మేలు జరిగేలా భేషైన పంపిణీ పద్ధతులను తెస్తాం.
 9. వివిధ స్ధాయిల్లో Felloship, Internship కార్యక్రమాలు ప్రవేశపెట్టి యువత సేవలను గవర్నెన్స్ లో వినియోగిస్తాం.
 10. యుద్ధ ప్రాతిపదికన న్యాయస్ధానాల్లో ఖాళీలు భర్తీ చేస్తాం. కింది స్ధాయిలో కోర్టులు, జడ్జిల సంఖ్య రెట్టింపు చేస్తాము.
 11. పెండింగ్ కేసులు తగ్గించడానికి నేషనల్ లిటిగేషన్ పాలసీ తెస్తాం. పెండింగ్ కాలం తగ్గిస్తామ్.
 12. కోర్టుల ఆధునీకరణకు, సామర్ధ్యం పెంపుకు నిధి ఏర్పాటు చేస్తాం.
 13. గంగా ప్రక్షాళన చేస్తాం. దేశవ్యాపితంగా నదులన్నీ శుభ్రం చేసేస్తాం.
 14. గ్రామాల వరకు జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ నిర్మిస్తాం. బహిరంగ స్ధానాల్లో వై-ఫై జోన్లు ఏర్పాటు చేస్తాం.
 15. 50 టూరిస్టు సర్క్యూట్ల నిర్మాణం కోసం మిషన్ చేపడతాము. ఆర్కియాలజీ, హెరిటేజ్, సంస్కృతి, హిమాలయాలు, ఎడారి, సముద్ర తీరం, వైద్యం… మొ.న అంశాలు ధీమ్ గా ఈ సర్క్యూట్లు ఏర్పాటవుతాయి.
 16. కేంద్ర-రాష్ట్రాల సంబంధాలు మెరుగుపరుస్తాం.
 17. ప్రభుత్వ రికార్డులు డిజిటైజ్ చేసి ప్రజలకు తేలికగా అందుబాటులో ఉండేలా చేస్తాం.
 18. ప్రభుత్వ పధకాలు, కార్యక్రమాలు అన్నింటికి సామర్ధ్య ప్రదర్శన సమీక్షలు, సామాజిక-పర్యావరణ ఆడిట్ లు నిర్వహిస్తాం.
 19. పంచాయితీల నుండి కేంద్రం వరకు కవర్ చేస్తూ నేషనల్ ఈ-గవర్నెన్స్ నెలకొల్పుతాం.
 20. ప్రతి ఇల్లూ డిజిటల్ అక్షరాస్యతతో నింపుతాం. ఇండియాను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చి దిద్దుతాం.
 21. ప్రభుత్వ పధకాల డెలివరీ సక్రమంగా జరగడం కోసం మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, ఇతర ప్రభుత్వ అంగాలు అన్నింటిని రేషనలైజేషన్ చేస్తాం.
 22. జైళ్ల వ్యవస్ధని టెక్నాలజీతో, మౌలిక వసతులతో ఆధునీకరించి, భద్రత మానవ హక్కులను బలీయం చేస్తాం.
 23. సైబర్ క్రైమ్ నిరోధానికి పోలీసులకు సాంకేతిక శిక్షణ ఇప్పిస్తాం.
 24. మత నేతలతో చర్చించి వక్ఫ్ బోర్డులకు అధికారాలు కల్పిస్తాం; వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలను తొలగిస్తాం.
 25. 100 స్మార్ట్ నగరాలు నిర్మిస్తాం. వీటిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు ఉంటాయి.
 26. బాల కార్మిక నిషేధ, నియంత్రణ చట్టం సమీక్షించి, సవరించి, బలీయం చేస్తాం. సమగ్ర శిశు రక్షణ పధకం తెస్తాం.
 27. వికలాంగ వ్యక్తుల హక్కుల బిల్లు తెస్తాం. వికలాంగ వ్యక్తిని పోషించే కుటుంబానికి అత్యధిక పన్ను రాయితీ ఇస్తాం.
 28. దేశవ్యాపితంగా ఇరుగు పొరుగు పిల్లలు, యువకులతో కూడిన యూత్ పార్లమెంటులు నడుపుతాం. తద్వారా ఉత్తేజపూరిత విద్యార్ధుల కమిటీల ఏర్పాటుకు కృషి చేస్తాం.
 29. ‘నేషనల్ స్పొర్ట్స్ టేలంట్ సర్చ్ సిస్టం’ ఏర్పాటు చేసి కౌమార దశ నుండే ఆటల నైపుణ్యాన్ని వెలికి తీస్తాం. హౌసింగ్ కాలనీలు అన్నీ విధిగా స్పొర్ట్స్ వసతులు ఉండాలని నిర్దేశిస్తాం.
 30. రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలలో 33 శాతం మహిళా రిజర్వేషన్లు కల్పిస్తాం.
 31. యాసిడ్ దాడుల బాధితుల నిధి ఏర్పాటు చేసి బాధితుల వైద్య ఖర్చులు, కాస్మోటిక్ సర్జరీల ఖర్చులు భరిస్తాం.
 32. పాఠశాల విద్యా బోధనలో ఆత్మ రక్షణ బోధన ప్రవేశపెడతాం.
 33. పూర్తి మహిళా సిబ్బందితో మొబైల్ బ్యాంక్ నెలకొల్పి మహిళలలో ప్రత్యేక నైపుణ్యాలు వెలికి తీసే శిక్షణ ఇస్తాము. మహిళా వ్యాపారవేత్తల తయారీకి ఇంక్యుబేటర్ పార్క్ ఏర్పాటు చేస్తాం.

ఇవి మచ్చుకు కొన్ని. రెండేళ్లు గడిచాయి. ఈ వాగ్దానాలలో ఎన్ని నెరవేరాయో, కనీసం నెరవేరే ప్రక్రియలో ఉన్నాయో ఎవరికి వారు నిర్ణయించుకోవలసిందే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s