ఇష్రాత్ జహాన్, హిందూత్వ మరియు ఒక ఆంగ్ల ఛానెల్!


డేవిడ్ కోలమన్ హేడ్లీ అలియాస్ డేవిడ్ హేడ్లీ అలియాస్ దావూద్ సయీద్ జిలానీ!

భారత ఉపఖండంలో ఇప్పుడితగాడి పేరు ఒకటే మోతగా మోగుతోంది. పత్రికలు, ఛానెళ్లలో ఎక్కడ చూసినా ఈయన పేరు కనపడని చోటు లేదు.

భారత దేశంలో చారిత్రక ప్రదేశాలను చూసి తరిద్దామని వచ్చిన విదేశీ టూరిస్టులు హెడ్లీ నామ స్మరణతో తరించిపోతున్న మన న్యూస్ చానెళ్లను చూస్తే గనక గబుక్కన ఆయన మన నేషనల్ హీరో అనుకోవచ్చు కూడాను!

జనానికి అదృష్టమో/ దురదృష్టమో గానీ ఐ‌సి‌సి వరల్డ్ టి20 టోర్నమెంట్ జరుగడం వల్ల హేడ్లీ మేనియాలో కొట్టుకు పోయే ప్రమాదం నుండి కాస్త బైటపడ్డారు.  లేనట్లైతే మరో వాయ జాతీయవాద గబ్బు తరంగంలో పడి ఊపిరాడక కొట్టుకులాడేవాళ్ళు!

వార్తా చానెళ్లలో ఆంగ్ల చానెల్ టైమ్స్ నౌ చానెల్ ది అదో తరహా రోదన! ప్రకృతి యొక్క మూడు మౌలిక రంగుల్లోని నీలం, ఎరుపు రంగుల (మూడోది ఆకుపచ్చ రంగు) మిశ్రమంలో కొట్టొచ్చినట్లు కనపడే ఈ చానెల్ ఎప్పుడూ అరుపులూ పెడబొబ్బలతో హోరు మంటూ ఉంటుంది. వాటిల్లో ఎక్కువగా వినిపించేది చానెల్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఆర్ణబ్ గోస్వామి పెట్టే పెడబొబ్బలే.

ఆ చానెల్ ని చూస్తే (తెలిసిన వారికి) వెంటనే గుంటూరు మిర్చి యార్డు గుర్తుకొస్తుంది. తళతళమని మెరుస్తూ కనిపించే మిరపకాయల కుప్పలను చూసి ఆకర్షితులై దగ్గరికి వెళితే మిర్చి ఘాటు ఝమాయించి కొడుతూ ప్రతాపం చూపిస్తుంది. గాలినిండా వ్యాపించి ఉన్న మిర్చి సెంటు కళ్ళకి నీళ్ళు, ఒంటికి మంట తెప్పిస్తుంది.

టైమ్స్ నౌ చానెల్ కూడా అంతే. పెద్ద పెద్ద జ్ఞానులు చర్చించుకుంటున్నారని వినడం మొదలు పెడితే అక్కడి జ్ఞానుల అరుపులు కేకల మధ్య మనకు వినపడే ఒకే ఒక్క సందేశం: హిందూత్వ!

ఈ ఆవుస్వామి (గోస్వామి) గారు తనకు ఆజ్ఞానులుగా కనిపించిన వారిని ప్యానెల్ చర్చల పేరుతో స్టూడియోలకు పిలిపించి తానే అంతా మాట్లాడేస్తూ ఉంటాడు. వాదీ, ప్రతివాదీ, తీర్పరీ అన్నీ తానే అయిపోయి ఆజ్ఞానులకు వన్ వే జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు.

చర్చ సజావుగ జరగడానికి తానే ఓ పేద్ధ సైంధవుడై కూర్చుంటాడు. విచిత్రం ఏమిటంటే టి‌ఆర్‌పి రేటింగ్స్ లో ఈ చానెల్ దే అగ్రస్ధానం ట! మెజారిటీ భారతీయ ఆంగ్ల జ్ఞానుల అభిరుచి అలా తగలడింది!

ఈ ఛానెల్ కి హిందూత్వ జాతీయవాదం అంటే త(ర)గని ముచ్చట. పాకిస్తాన్ అన్నా, కాశ్మీర్ అన్నా తగని ద్వేషం. చర్చ అంటూనే అవతలి అభిప్రాయాన్ని వ్యక్తం చేయనివ్వకుండా తానే అంతా కానిచ్చెయ్యడం ఈ చానెల్ ప్రత్యేకత.

ప్యానెల్ చర్చ అంటే రెండు విరుద్ధ అభిప్రాయాలు (వ్యక్తులు కాదు) ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం. సొంత తప్పులు, పరుల ఒప్పులు తెలుసుకోవడం. తద్వారా ఉన్నంతలో సరైన జ్ఞానాన్ని వీక్షకులకు అందించడం.

టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్-చీఫ్ గోస్వామి ఇవి తప్ప అన్నీ చేస్తాడు. ఆ క్రమంలో తప్పు మీద తప్పు చేస్తుంటాడు. గాలి మీద గాలి పోగు చేస్తుంటాడు. ఆ క్రమంలో పుకార్లు, అబద్ధాలు నిజాలుగా చెలామణి చేస్తాడు. అవన్నీ తుస్సుమన్నాక ఏమీ ఎరగనట్లు ఇంకో గాలి పోగు చేయడానికి సిద్ధం అవుతుంటాడు. వాళ్లకలా చెల్లుద్ది గావాల!

డేవిడ్ కోలమన్ హెడ్లీ మొదటి విడత వీడియో సాక్ష్యంలో  ఇష్రాత్ జహాన్ పేరు దొర్లి పడింది. ఇష్రాత్ జహాన్ లష్కర్-ఏ-తొయిబా కు చెందిన టెర్రరిస్టు అని ఆయన ప్రకటించేశాడు. అదే సమయంలో హోమ్ మినిస్ట్రీ మాజీ సెక్రటరీ పిళ్లై గారు ఓ ప్రకటన చేశాడు “ఇష్రాత్ జహాన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో మొదటి అఫిడవిట్ ను అప్పటి రాజకీయ స్ధాయిలో (హోమ్ మంత్రి చిదంబరం) సవరించారు. ఇష్రాత్ జహాన్ టెర్రరిస్టు కాదు అంటూ రెండో అఫిడవిట్ ఇచ్చారు. సవరణలో నా ప్రమేయం ఏమీ లేదు” అని (టూకీగా) ఆయన చెప్పారు.

నవంబర్ 26, 2008 నాటి ముంబై టెర్రరిస్టు దాడులకు రెక్కీ నిర్వహించిన డేవిడ్ హేడ్లీ అంతటి వాడు ఇష్రాత్ జహాన్ LeT సభ్యురాలు అని తీర్మానించాడు. ఆయన చెప్పిన ఇష్రాత్, గుజరాత్ పోలీసులు (అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో) బూటకపు ఎన్ కౌంటర్ లు చంపిన ఇష్రాత్ ఒకరేనా అన్న ప్రశ్నే అనవసరం.  ఇష్రాత్ అఫిడవిట్ లో రాజకీయ అధికారి (మంత్రి చిదంబరం) స్వయంగా మార్పులు చేసాడని సాక్షాత్తూ హోమ్ శాఖ మాజీ కార్యదర్శి గారే చెప్పారు.

ఇకనేముంది! టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్-చీఫ్ కి బోలెడు మేత! ఆకలితో ఆవురావురుమంటున్న పెద్దపులి లేడి కూనపై లంఘించినట్లుగా ఇష్రాత్ జహాన్ మృత జ్ఞాపకాలపైకి ఉచ్ఛ నీచాలు మరిచి లంఘించారు.

హేడ్లీ ఏ సందర్భంలో ఇష్రాత్ గురించిన వ్యాఖ్యలు చేశాడో, పిళ్లై చెప్పిన తాజా విషయం అసలు గోస్వామి వికృత ఊహాగానాలకు సరిపడుతుందో లేదో అన్న విచక్షణ లేకుండా చర్చలు సాగించారు.

చివరికి ఏమి తేల్చారంటే మోడీ ప్రతిష్ట దిగజార్చడానికి ఆనాటి యూ‌పి‌ఏ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. దానిలో భాగంగా నిఝంగానే టెర్రరిస్టు అయిన ఇష్రాత్ జహాన్ ను టెర్రరిస్టు కాదని హోమ్ మంత్రి కోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడు. గుజరాత్ పోలీసులు న్యాయంగానే ఇష్రాత్ ఇంకా ముగ్గురు ముస్లిం యువకులను ఎన్ కౌంటర్ లో చంపారు. కానీ యూ‌పి‌ఏ ప్రభుత్వం కుట్ర చేసి తప్పుడు సాక్షాలు చూపి, అఫిడవిట్ లు సవరించి బూటకపు ఎన్ కౌంటర్ కధ అల్లారు. తద్వారా గుజరాత్ ప్రభుత్వ ప్రతిష్టని, ప్రభుత్వ నేత మోడీ ప్రతిష్టను మంట గలపాలని కుట్ర చేశారు.

జరిగిన ఘటనలను, ఆ ఘటనలపై జరిగిన పరిణామాలను ముక్కలు చేసి, చెల్లా చెదురుగా విసిరేసి, ఆ ముక్కలను ఏరుకొచ్చి తమకు కావలసిన రూపంలో అతికించి జనానికి ప్రదర్శించడం!

వాస్తవంగా జరిగింది ఏమిటి? ఇష్రాత్ జహాన్ తో పాటు గుజరాత్ పోలీసులు, ఐ‌బి (ఇంటలిజెన్స్ బ్యూరో) అధికారులు చంపేసిన జావేద్ షేక్ అలియాస్ ప్రాణేష్ పిళ్లై, జీషన్ జోహార్, అంజదాలీ అక్బరాలీ రాణా లను బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేశారు.

ముందుగా మత్తు మందు ఇచ్చిన నలుగురిని ఓ కారులో కూర్చోబెట్టి అహ్మదాబాద్ శివార్లలో హై వే రోడ్డు పైన కారుపై బులెట్లు కురిపించి చంపేశారు. వాళ్ళు లష్కర్-ఏ-తోయిబాకు చెందిన కరుడు గట్టిన టెర్రరిస్టులనీ, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, విశ్వ హిందూ పరిషత్ నేతలు ప్రవీణ్ తొగాడియా & జైదీప్ పటేల్, ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ మొ న వారిని హత్య చేసేందుకు వస్తున్నారని కట్టు కధ అల్లారు.

రాజేంద్ర కుమార్ గుజరాత్ లో కేంద్ర ఐ‌బి స్టేషన్ అధిపతి. ఆయిన, గుజరాత్ కు నలుగురు టెర్రరిస్టులు మోడి తదితరులను హత్య చేసేందుకు కారులో వస్తున్న విషయానికి సంబంధించి గుజరాత్ పోలీసులకు గూఢచార సమాచారం ఇచ్చాడని ఆ సమాచారం మేరకు గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్ శివార్లలో కాపుగాసి కారును అడ్డుకున్నారని, వారు ఏ కే 47 తో కాల్పులు జరపడంతో గుజరాత్ పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని దానితో ఆ నలుగురు అక్కడికక్కడే చనిపోయారని కధ అల్లారు.

ఇది కట్టు కధ అన్న విషయాన్ని గుజరాత్ హై కోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (కాంగ్రెస్ ప్రభుత్వం కాదు సుమా!) పరిశోధించి నిగ్గు దేల్చింది. దరిమిలా సి‌బి‌ఐ విచారణకు కోర్టు ఆదేశించింది. సి‌బి‌ఐ విచారణ సిట్ కనుగొన్న అంశాలను నిర్ధారించింది.

ఇష్రాత్ జహాన్ ముంబై సమీపంలోని ముంబ్రా నివాసి. కాలేజీ విద్యార్ధిని. జావేద్ షేక్ కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో అధికారి రాజేందర్ కుమార్ కు ఇన్ఫార్మర్. అతనికి అప్పటికే పెళ్లయింది, కుటుంబం ఉన్నది. అతను వాస్తవానికి కేరళకు చెందిన హిందువు, పేరు ప్రాణేశ్వర్ పిళ్లై. ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం మతం మారి జావేద్ షేక్ గా పేరు మార్చుకున్నాడు.

గుజరాత్ పోలీసు అధికారులు, గుజరాత్ యాంటీ-టెర్రరిస్టు స్క్వాడ్ (ఏ‌టి‌ఎస్) అధికారులు, ఐ‌బి అధికారి రాజేందర్ కుమార్ లు సంయుక్తంగా కుట్ర చేసి నలుగురు యువకులను కూడగట్టి ముందుగానే అహ్మదాబాద్ రప్పించి హత్య చేశారు. ఈ సంగతిని తిరుగులేని ఆడియో సాక్షాలతో, ఇతర మెటీరీయల్ సాక్షాలతో, సందర్భ సాక్షాలతో సిట్, సి‌బి‌ఐ లు రుజువు చేశాయి.

ఐ‌బి అధికారి రాజేందర్ కుమార్ తన ఇన్ఫార్మర్ జావేద్ షేక్ అలియాస్ ప్రాణేష్ పిళ్లై ద్వారా ఇతర ముగ్గురిని సమీకరించాడు. ఇష్రాత్ జహాన్ జావేద్ షేక్ కు పరిచయమై అప్పటికి 45 రోజులే. ఆ 45 రోజుల్లో 35 రోజులు కాలేజీకి వెళ్లిందని కాలేజీ అటెండెన్స్ రిజిష్టర్ల ద్వారా రుజువయింది. అంతకు మునుపు కూడా ఏ ఒక్క రోజూ ఆమె కాలేజీకి వెళ్లకుండా లేదని కాలేజీ రికార్డులు చెప్పాయి. జావేద్ తో కలిసి ఆమె ప్రయాణించింది కేవలం 10 రోజులు. ఆ 10 రోజుల్లో హిందూత్వ నేతలను మట్టుబెట్టే మానవ బాంబుగా ఎలా మారుతుంది? మారదు, మారలేదు, అసలామె టెర్రరిస్టు కాదు అని సిట్ అధికారులు చెప్పారు కూడా. 

నలుగురు మృతులు, వారు చనిపోయిన జూన్ 15, 2004 కు రెండు మూడు రోజులకు ముందే గుజరాత్ ఏ‌టి‌ఎస్ నిర్బంధంలో ఉన్నారని గుజరాత్ పోలీసు అధికారి డి హెచ్ గోస్వామి (రిటైర్డ్ డి‌ఎస్‌పి) సిట్, సి‌బి‌ఐ లకు చెప్పాడు. సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయబడిన ఆయన సాక్షం గుజరాత్ హై కోర్టులో సి‌బి‌ఐ దాఖలు చేసిన చార్జి షీటులో ఒక భాగం.

ఇష్రాత్ జహాన్ తదితరులను ముందుగా నిర్బంధం లోకి తీసుకుని బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేశారని గుజరాత్ హై కోర్టు తీర్పు చెప్పడానికి కొన్ని రోజుల ముందు ఆ  తీర్పును ఎలా ప్రభావితం చేయాలో గుజరాత్ రాష్ట్ర ఉన్నత స్ధాయి పోలీసు అధికారులు, ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఓ చోట కూర్చుని చర్చించుకున్న సంగతి వెల్లడి అయింది. ఆ సమావేశంలో పాల్గొన్న గుజరాత్ పోలీసు అధికారి జి ఎల్ సింఘాల్ వారి సంభాషణను రికార్డు చేసి వెల్లడి చేశాడు. ఆయన కూడా ఇష్రాత్ జహాన్ హత్య కేసులో నిందితుడే. సదరు ఆడియో టేపులు కూడా సి‌బి‌ఐ చార్జి షీట్ లో భాగం.

ఇష్రాత్ జహాన్, జావేద్ తదితరులు నిజంగా టెర్రరిస్టులే అయితే, హై కోర్టు తీర్పును ప్రభావితం చేయడం ఎందుకు? సిట్ చీఫ్ సతీష్ వర్మతో తాను 4 గంటలు మాట్లాడానని బూటకపు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న 18 మంది గుజరాత్ పోలీసు అధికారుల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించి వారికి సహాయం చేయాలని కోరారని అప్పటి గుజరాత్ హోమ్ మంత్రి ప్రఫుల్ పటేల్ చెబుతున్న మాటలు ఆడియోలో రికార్డ్ అయ్యాయి. హోమ్ మంత్రి స్వయంగా హై కోర్టు తీర్పును, సిట్ అధికారిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడన్నమాట! నిజమైన ఎన్ కౌంటరే అయితే అలా ఎందుకు ప్రయత్నించాలి? బూటకపు ఎన్ కౌంటర్ గనకనే ‘జరిగిందేదో జరిగింది. కనికరించండి’ అని బతిమాలుకోవాల్సి వచ్చింది.

టైమ్స్ నౌ తాజాగా చెప్పడం ఏమిటంటే హోమ్ శాఖ లోని అండర్ సెక్రటరీగా పని చేసిన అధికారి ఆర్ వి ఎస్ మణిని సి‌బి‌ఐ చిత్రహింసలు పెట్టి చిదంబరం అఫిడవిట్ లపై సంతకం చేయించారు అని. మణి తయారు చేసిన అఫిడవిట్ ని చిదంబరం మార్చాడు అని. ఇది టైమ్స్ నౌ ఇప్పుడు కొత్తగా కనుక్కున్నట్లు చెప్పింది గాని వాస్తవానికి పాత వార్త.

ఆర్ వి ఎస్ మణి హిందూత్వ మనిషి. గుజరాత్ లో తయారు చేసిన అఫిడవిట్ పైన ఢిల్లీ నుండి వచ్చే మణి సంతకం చేస్తారని, తయారుగా ఉండమని గుజరాత్ పోలీసు అధికారి జి ఎల్ సింఘాల్ కు పురమాయిస్తున్న ఆడియో టేపును కూడా సి‌బి‌ఐ గుజరాత్ హై కోర్టుకు సమర్పించింది.

అప్పటి గుజరాత్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏ‌డి‌జి‌పి) మరియు గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ అధికారి కూడా అయిన పి పి పాండే ఈ ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి. అఫిడవిట్ పై సంతకం చేస్తున్న మణి తరపున ఒక లాయర్ ఉండాలి. అఫిడవిట్ ని ఆ లాయరే తయారు చేయాలి. ఆర్ వి ఎస్ మణి తరపున అఫిడవిట్ తయారు చేసిన లాయర్ పేరు అభిచందాని. అఫిడవిట్ కావలసినట్లుగా తయారు చేయగలిగితే ‘ఆయన హై కోర్టు జడ్జిగా నియమితులయ్యేలా చూస్తానని చెప్పు’ అని పాండే, సింఘాల్ కు చెబుతున్నట్లుగా ఆడియోలో రికార్డ్ అయింది.

[జి ఎల్ సింఘాల్ రికార్డ్ చేసిన వివిధ ఆడియో టేపుల్లో బూటకపు ఎన్ కౌంటర్లు జరగబోతున్న సంగతి నల్ల గెడ్డం, తెల్లగడ్డం లకు తెలుసు అన్న సమాధారం కూడా రికార్డ్ అయింది. తెల్ల గడ్డం అంటే ముఖ్యమంత్రి మోడి అనీ, నల్ల గడ్డం అంటే అప్పటి గుజరాత్ హోమ్ మంత్రి ఇప్పటి బి‌జే‌పి అధ్యక్షులు అమిత్ షా అనీ తెహెల్కా, ఔట్ లుక్ లకు రాసిన పరిశోధనాత్మక వ్యాసాల్లో రాణా ఆయూబ్ చెప్పారు.]

ఇప్పుడు ఈ మణి, టైమ్స్ నౌ లో కనపడి “నన్ను చిత్ర హింసలు పెట్టి రెండో అఫిడవిట్ పైన సంతకం చేయించారు. సిగరెట్ తో కాల్చారు” అని చెబుతున్నాడు. అఫిడవిట్ పైన రాజకీయ (మంత్రి) స్ధాయిలో మార్పులు చేశారని అప్పటి హోమ్ సెక్రటరీ జి కే పిళ్లై కూడా టైమ్స్ నౌ కు చెప్పాడు. ముందే చెప్పినట్లు ఇవన్నీ పాత వార్తలు. జి కే పిళ్లైని తాజాగా ఆదానీ కి చెందిన ఓ విద్యుత్ కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరుగా నియమించారు. కనుక తలవని తలంపుగా ఆయన టైమ్స్ నౌ కి పాత వార్తని కొత్తగా ఎందుకు చెప్పారో అర్ధం చేసుకోవచ్చు.

వాస్తవం ఏమిటంటే పైన చెప్పినట్లు మొదటి అఫిడవిట్ ను గుజరాత్ రాజకీయ నాయకులు, పోలీసుల ఒత్తిడి లేదా ఆశల మేరకు గుజరాత్ ప్రభుత్వానికి అనగా అప్పటి ముఖ్యమంత్రి మోడి కి నష్టం కలగకుండా ఉండేలా అభిచందాని తయారు చేస్తే దానిపైన ఢిల్లీ నుండి వచ్చిన అండర్ సెక్రటరీ సంతకం చేశాడు. తగిన ప్రతిఫలం పొంది ఉంటారని వేరే చెప్పాలా?

ఇష్రాత్ జహాన్, జావేద్, జీషన్, రాణాలలో చివరి ఇద్దరు ఎవరో వారి మూలాలు ఏమిటో తెలియదు. కానీ వారిని తెచ్చింది మాత్రం జావేద్ షేక్. జావేద్ వివిధ సమయాల్లో ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా అరబ్ దేశాలకు వెళ్ళి వచ్చాడు. బహుశా ఆ పరిచయాలు అయి ఉండవచ్చు. వాళ్ళు పాకిస్తానీ టెర్రరిస్టులు అని గుజరాత్ పోలీసులు, బి‌జే‌పి నేతలు ఇప్పటికీ ఢంకా భజాయిస్తారు. ఆ ఢంకా ఎంత ఓటిదో ఇష్రాత్, పిళ్లైల విషయంలో చూసాము.

వాస్తవాలు ఇవీ. ఇవన్నీ కోర్టుల్లో సి‌బి‌ఐ రుజువు చేసిన నిజాలు. బి‌జే‌పి/మోడి కేంద్రంలో అధికారం లోకి వచ్చాక అమిత్ షా పైన నమోదై ఉన్న బూటకపు ఎన్ కౌంటర్ కేసుని ముంబై హై కోర్టు రద్దు చేసేసింది. (తులాసీరామ్ ప్రజాపతి, షొరాబుద్దీన్ షేక్, షొరాబుద్దీన్ భార్య కౌసర్ బీ లను బూటకపు ఎన్ కౌంటర్ లో చంపేందుకు కుట్ర చేసిన కేసులో అమిత్ షా నిందితుడు. ఈ కేసుకు సంబంధించిన ఆడియోలను కూడా జి ఎల్ సింఘాల్ సి‌బి‌ఐ కి ఇచ్చాడు.

ఆ తర్వాత ఇష్రాత్ తదితరుల బూటకపు ఎన్ కౌంటర్ కేసులో జయలుకి వెళ్ళిన గుజరాత్ పోలీసులు అందరూ వరుసగా విడుదల అయ్యారు. మోడి అధికారం పుణ్యాన వారికి జైలు విముక్తి కలిగింది. ఈ విడుదల ఎంత లేదన్నా మోడికి ఉన్నదని చెప్పే ప్రతిష్టమైన మచ్చ. కనుక విడుదలలను న్యాయబద్ధం చేసుకోవాలి. దానితో పాటు కుట్ర చేసి దొంగ కేసులు పెట్టారని కూడా చెప్పుకోవాలి. దానికోసమే డేవిడ్ హేడ్లీ వీడియో సాక్షం సందర్భంగా టైమ్స్ నౌ కొత్తగా వెలికి తీసిన చద్ది వార్తలు!

యూ‌పి‌ఏ ప్రభుత్వ హయాంలో హేడ్లీని భారత జాతీయ పరిశోధన సంస్ధ (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ -ఎన్‌ఐ‌ఏ) విచారణ చేయడానికి అమెరికా అసలే ఒప్పుకోలేదు. అనేక విధాలుగా బతిమాలుకున్నాక అమెరికా వెళ్ళి అక్కడ జైలులో హేడ్లీని ‘ఇంటర్వ్యూ’ చేయడానికి మాత్రమే అమెరికా ఒప్పుకుంది. అది కూడా ఇంటర్వ్యూలో హేడ్లీ వెల్లడి చేసే వివరాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ బైటికి చెప్పకూడదని భారత ప్రభుత్వం నుండి హామీ తీసుకున్నాకనే ఒప్పుకుంది.

అలాంటి అమెరికా మోడి అధికారం లోకి వచ్చాక హెడ్లీని నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత కోర్టులు విచారణ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నట్లు? భారత ప్రభుత్వం నుండి తగిన బేరసారాలు, రాయబారాలు, హామీలు లభించాకనే వీడియో విచారణకు అమెరికా ఒప్పుకుని ఉంటే అదేమంత ఆశ్చర్యం కాబోదు. కాకపోతే ఏమి హామీ ఇచ్చారు అన్నదే సమస్య. అది ఇప్పుడప్పుడే బయిటకు వచ్చే అవకాశం లేదు.

కానీ డేవిడ్ హెడ్లీ ఉరఫ్ దావూద్ జిలానీని ప్రశ్నిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ సరిగ్గా హిందూత్వకు కావలసిన సమాచారం చెప్పేట్లుగానే ప్రశ్నలు వేయడం దానికి తగిన సమాధానాలు హెడ్లీ ఇవ్వడం గమనించి తీరాలి. ముంబై పేలుళ్లకు సంబంధించి (సౌదీ అరేబియా డిపోర్ట్ చేసిన దరిమిలా) ఎన్‌ఐ‌ఏ అరెస్ట్ చేసిన నిందితుడికి వ్యతిరేకంగానూ, భారత ప్రభుత్వ ఆరోపణలకు అనుకూలంగానూ హెడ్లీ వీడియో ద్వారా అప్రూవర్ సాక్షం ఇస్తున్నాడు. అప్రూవర్ సాక్షం గనక అన్నీ నిజాలే అనుకోవాలని బి‌జే‌పి ప్రభుత్వం, వంత పాడుతున్న టైమ్స్ నౌ చెబుతున్నాయి.

కానీ ఇష్రాత్ జహాన్ గురించి హేడ్లీ చెప్పింది పుకారు (hearsay) మాత్రమే అని ఎన్‌ఐ‌ఏ అప్పుడే కొట్టిపారేసింది. ఇష్రాత్ జహాన్ ఎలాంటి టెర్రరిస్టు కాదని ఖర్మ కాలి జావేద్ వలలో పడిన అమాయక భారతీయ యువతి అని భారత దేశ అత్యున్నత నేర పరిశోధనా సంస్ధ (సి‌బి‌ఐ), గుజరాత్ హై కోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ససాక్షారంగా రుజువు చేశాయి. దరిమిలా గుజరాత్ హై కోర్టు అది బూటకపు ఎన్ కౌంటర్ అని తీర్పు చెప్పింది.

ఇప్పుడు ఈ కోర్టు తీర్పును బి‌జే‌పి, టైమ్స్ నౌ, హిందూత్వ తప్పు పడుతున్నాయి. ప్రధాని మోడిని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర చేశారని ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పుకుంటున్నారు. జే‌ఎన్‌యూ విద్యార్ధులపై హిందూత్వ చేసిన రగడ ప్రకారం కోర్టు తీర్పును తప్పు పడుతున్నందుకు వీరంతా దేశ ద్రోహులు కావాలి. అవుతారా?

అసలు ఎవడో సి‌ఐ‌ఏ ఏజంటూ, ఆ తర్వాత ఐ‌ఎస్‌ఐ ఏజంటూ ఆ తర్వాత లష్కర్-ఏ-తొయిబా తరపున కూడా పని చేసిన టెర్రరిస్టూ ఐన డేవిడ్ హెడ్లీ సాక్షం నమ్ముతారా లేక భారత పరిశోధనా సంస్ధలు, కోర్టులు చేసిన నిర్ధారణలను నమ్ముతారా? సి‌బి‌ఐ, భారత కోర్టుల నిర్ధారణలను త్రోసిరాజని హెడ్లీ సాక్షాన్ని నమ్మి హై లైట్ చేయడం, అమాయక దేశ పౌరులను నేరస్ధులుగా చిత్రీకరించడం జాతీయ వ్యతిరేకత, దేశ ద్రోహంలు కావా?

మొదటి విడత ఎగ్జామినేషన్ లో ఇష్రాత్ జహాన్ లష్కర్ సభ్యురాలు అని హెడ్లీ చెప్పాడు. దానిని బి‌జే‌పి, టైమ్స్ నౌ అందుకుని హాహాకారాలు చేశాయి. ఇష్రాత్ జహాన్ కుటుంబాన్ని మరోసారి క్షోభకు గురి చేశారు. మళ్ళీ రెండో విడతలో క్రాస్ ఎగ్జామినేషన్ కు వచ్చే సరికి మొదటిసారి చెప్పిన విషయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

ఇష్రాత్ జహాన్ లష్కర్ సభ్యురాలు అన్న సంగతి తనకు పూర్తిగా తెలియదని ఇతర లష్కర్ నేతలు చెప్పుకుంటుండగా మాత్రమే తాను విన్నానని క్రాస్ ఎగ్జామినేషన్ లో హెడ్లీ చెప్పాడు. ‘పుకారు’ అని ఎన్‌ఐ‌ఏ కొట్టిపారవేయడం అందుకే.

“ఇష్రాత్ జహాన్ మరో ముగ్గురిని గుజరాత్ పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేశారు. వారు లష్కర్ తీవ్రవాదులు అని పోలీసులు ప్రకటించారు” అన్న సంగతి పత్రికల్లో లష్కర్ తీవ్రవాదులు చదివారు. చదివినదానిని వారు మాట్లాడుకున్నారు. అది హేడ్లీ విన్నాడు. ‘ఓహో, ఇండియాలో ఇష్రాత్ జహాన్ అనే పేరుతో లష్కర్ సభ్యురాలు ఉన్నది, ఆమెను చంపారు’ అని హెడ్లీ అనుకున్నాడు. అనుకున్నదాన్ని ఎన్‌ఐ‌ఏ కు చెప్పాడు. ఎన్‌ఐ‌ఏ దానిని ‘పుకారు’ అని చెత్తబుట్టలోకి సరిగ్గానే విసిరిపారేసింది.

‘రాజు గారు తాటాకుతో నాలిక గీక్కున్నారు’ అన్న వార్త ఆ నోటా ఈ నోటా పడి చివరకు “అబ్బో రాజు గారు తాటి దూలంతో నాలుక గీక్కుంటారు, తెలుసా” అనుకోవడం వరకు వెళ్తుంది.

అదే తరహాలో హెడ్లీ తలపోసిన ఊహ “భారత్ లో తలపెట్టిన లష్కర్ ఆపరేషన్ ఒకటి విఫలమై సభ్యులను ఎన్ కౌంటర్ లో చంపేశారని, వారిలో ఒకరి పేరు ఇష్రాత్ జహాన్ అనీ లష్కర్ అధిపతి హెడ్లీకి చెప్పి వాపోయాడు” అన్నవరకూ వచ్చింది. దాన్ని నెత్తిన వేసుకుని టైమ్స్ నౌ, హిందూత్వ గణాలు మోస్తున్నాయి.

ఎంత ఘోరం! ఎంత దారుణం! ఎంత అన్యాయం!

ఇష్రాత్ జహాన్ కుటుంబానికి ఇక ఎప్పటికీ శాంతి దక్కదా?

ఇదేనా భారత ప్రజలను పాలించవలసిన పద్ధతి? రాజకీయ స్వప్రయోజనాల కోసం అమాయక భారతీయ యువతిని చంపేసింది కాకుండా తప్పుడు ముద్రలు వేయడమేనా మంచి రోజులు!?

13 thoughts on “ఇష్రాత్ జహాన్, హిందూత్వ మరియు ఒక ఆంగ్ల ఛానెల్!

  1. రాజ్యం తలుచుకుంటే తిమ్మినిబమ్మి చేయడం(ప్రచారం) ఎంతసులువోసల్లకుకట్టినట్లు తెలియజేస్తున్నా సామాన్యులు దీనిని అంత సీరియస్ గా తీసుకోరెందుకో? దీనిని తెలియజేయాల్సిన వారు ఎందుకంత బలహీనంగా ఉంటారు? దీనివల్ల వాళ్ళకీ ఉపయోగం ఉందికదా!

  2. కశ్మీర్‌పై హిందూత్వవాదులకి ద్వేషమా లేదా జనానికి ద్వేషమా? కశ్మీర్‌ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చెయ్యాలని కోరే PDPతో భాజపా ఎందుకు పొత్తు పెట్టుకుంది అని ఫేస్‌బుక్‌లో ఒకాయన వ్రాస్తే భాజపా అభిమానులు దానికి సమాధానం చెప్పకుండా “భారత్ మాతా కీ జై అన్నందుకు ఫలానా వ్యక్తిని కొట్టారు” అని వార్తలు వ్రాసి ఉన్న క్లిప్పింగ్‌లు పెట్టారు.

  3. “ఇష్రాత్ జహాన్ మరో ముగ్గురిని గుజరాత్ పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేశారు. వారు లష్కర్ తీవ్రవాదులు అని పోలీసులు ప్రకటించారు” అన్న సంగతి పత్రికల్లో లష్కర్ తీవ్రవాదులు చదివారు. చదివినదానిని వారు మాట్లాడుకున్నారు. అది హేడ్లీ విన్నాడు. ‘ఓహో, ఇండియాలో ఇష్రాత్ జహాన్ అనే పేరుతో లష్కర్ సభ్యురాలు ఉన్నది, ఆమెను చంపారు’ అని హెడ్లీ అనుకున్నాడు. అనుకున్నదాన్ని ఎన్‌ఐ‌ఏ కు చెప్పాడు. ఎన్‌ఐ‌ఏ దానిని ‘పుకారు’ అని చెత్తబుట్టలోకి సరిగ్గానే విసిరిపారేసింది.

    yeh right, he called you yester day and revealed that in person.
    If you follow David’s news from the begining you will know that he revealed some other names too who belong to LeT and in India, obviously you wanted to prove some one is wrong, rather than proving or providing information on who is right.

  4. So you can see only that part in the entire article. I have mentioned the facts in Ishrat Jahan case found out by our SIT, CBI and then confirmed by our courts. You don’t want to see them, because they do not confirm to your rock solid beliefs.

    Obviously you wanted to believe that Ishrat is a terrorist that confirms to the conspiracy hatched by powerful political forces even though it does not confirm to the facts brought about by our own ‘national’ investigative organisations.

    Belief is different from fact.

    By the way, a part of the para produced by you is my assumption, which I forgot to mention in the flow, (Will correct now). You need not believe it.

  5. Now you are on the track. Lets say we are agreeing to the verdict by National investigation team and the court are correct and Ishrat is not guilty. You are with me till now right, I am also agreeing. But the same system told that Afzhal and Ayub are culprits and terrorists they why the heck you deny that? Why all these double standards.?? If chidambaram says its truth, Mani says something its not truth because he is hindutva vadi.
    My friend it is you who thinks all your beliefs as facts and that belief is anti hindutva. For the thousandth time hindutva is beyond caste or religion system, it is a life style – no one is the registered owener of Hindutva – not you, not me, not modi, not RSS not VHP and hell no not ABVP. What ever Kanhayya and group did in a University is wrong and the leftiests interfering in university matter is much wrong. Now you will say Kanhayya did not say anything about Afzal. Well there were slogans in favor of him when Kanhayya organised a meeting so if he did support personally or not .. he is guilty of going against the nation. Just like modi did not attack directly in Gujarat doesnot make him not involved in the roits.
    When your articles are unbiased then lets debate logically. If you write based on assumptions commenters also have assumptions, respect that.

  6. Well you can assume what you like. Who opposed you?

    I think this is the first time your comment appeared on this blog, unless you have come with some other name. Then how come the question of disrespecting your comments? It’s strange you mention so.

    For your information, this blog is not unbiased. It is biased. It is biased against all types of oppression… class, caste, religion, region, gender and what not! At this point time, It is biased against Hindutva’s oppressive politics.

    And spare me from your Hindutva teachings. I’m not interested. I oppose Hindutva politics. Whether you agree with it or not, the essence of Hinduism is caste. Without caste it can not exist. Our agreements and disagreements do not change that.

    Leftists interfering in universities etc?! What are you talking about my friend? They are not in power to interfere in the goings of universities per se. Are they roaming on streets and parks on Feb 14ths to marry a girl and a boy simply because they are talking to each other or sitting on a bench? Are they attacking pub going girls? Are they attacking birthday parties branding them as rave parties? Are they blocking union activities of students’ organizations? Are they violently blocking screening of documentaries like ‘Muzaffarnagar baqui hai’? Are they blocking proceedings of courts like Patiala house courts? Are they attacking students and journalists in the guise of practicing lawyers? Are they certifying who is national and who is not? Are they killing Akhlaqs? Even today AMU had to cancel a discussion program where Kanhayya is expected to speak! And you are lecturing about beliefs and facts! Very sorry.

    Forget about Kanhayya. I’m talking about Afzal Guru. If you did notice properly I’ve written many articles opposing arbitrary hanging of Afzal Guru many months before Kanhayya and Khalid came onto the scene. I wrote articles supporting right of Kashmiri people for self determination as per the ‘Instrument of Accession’ and ‘plebiscite offer’ by the Indian Govt.

    And you talk about logical debate!

    I’m nowhere near your crooked logical debate. I’m biased towards working masses of this country. I’m biased towards safeguarding the resources of this country from the loot and plunder of foreign companies and their Indian supporters who are busy in projecting themselves as nationalists to cover their anti-people and hence anti-national rule.

  7. I like your reply. At least you said you are biased. I came here because the title says ‘teluguvarthalu’ may be its a decoy. You declared it as Red zone so thanks for the disclaimer.

    If you were talking about The moral policing by Bhajarangi Dal, VHP is wrong doing all you mentioned above on Feb14th etc, yes they are wrong. That doesn’t make what leftists does in universities is right. I am also an alumni member of couple of universities and I exactly know what I meant so I don’t want to or need to explain.

    If you believe Afzal guru’s hanging is arbitrary then I have nothing to say. That means the investigation is right in case of Ishrat and wrong in case of Afzal according to you. And you call my logic is crooked. I am not biased hence I look forward to seek the truth and agrees to what is truth. If BJP is wrong they are wrong.. if Congress is wrong they are wrong too. I believe in greater good for the country which is the true biased feeling towards masses for me. Hatred towards entire system or castism is not going to do any favor to the working class. I am not here to preach you Hinduism, I said Hindutva – both are two different entities and our discussion is not on that topic.

    I never said you disrespected my comments, it’s strange that you interpreted so. I saw couple of your posts mentioning some of the other commenter’s. Any ways you clearly mentioned your intensions so enjoy with your beliefs I have no arguments. There is nothing wrong with standing on their own grounds as long as one is not hypocritical and do not have double standards.

    FYI,
    https://teluguvartalu.com/2016/03/13/%E0%B0%B5%E0%B1%88%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B1%80-%E0%B0%AC%E0%B0%B9%E0%B1%81%E0%B0%B3-%E0%B0%97%E0%B1%8A%E0%B0%82%E0%B0%A4%E0%B1%81/#comments

    https://teluguvartalu.com/2016/03/04/%E0%B0%B5%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AB%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B0%BF/#comments

  8. “That means the investigation is right in case of Ishrat and wrong in case of Afzal according to you.”

    Yes, that’s right. Ishrat investigation is right because there are material evidences as well as circumstantial evidences that were brought before the court. Afzal Guru investigation is wrong because there is not an iota of material evidence to support Afzal’s conviction. There are plenty of circumstantial evidences that negate the so called circumstantial evidences purported to be supporting conviction.

    As I said in various posts earlier, the supreme court itself agreed that there were no material evidences, still upheld the conviction “to satisfy collective conscience of the nation.”

    Yes, you are right. Hinduism and Hindutva are different. But the problem is that Hinduism is the blood of Hindutva. Body is different from blood but body can not exist without blood. The rallying point of Hindutva is Hinduism or so called Hindu culture.

    “If you write based on assumptions commenters also have assumptions, respect that.”

    Doesn’t this mean I disrespected some commenters. Since you wrote this didn’t it mean that commenter was you? I’ve replied to some comments. Replying a comment with a post is actually equal to putting high regard on that comment and identifying that comment as an important one. It is respect, not disrespect.

    You seem to be think that there are only black and white. Hope I’m wrong. But sadly your conclusions says otherwise.

    Isn’t it possible for courts to give some wrong judgements? It is possible, in my understanding. It is possible for one court giving right judgement and another court giving wrong judgement. It is also possible for the same court giving right judgement in one case and wrong in another case. You can’t just make a sweeping statement ‘if one judgement is right then every other one is right, if one is wrong then every other one is wrong. There are several grey shades. You may have to identify them case by case basis. One should also be objective.

    Teluguvartalu is domain name. Title says news and analysis. You may have to note it.

    You like it or not, there is nothing like unbiased. One should always be biased towards truth and against deception. Deception doesn’t disclose itself. It has many disguises that appear to be truth. Sadly, there are no straight and easy ways to uncover deception.

    Yes, I am wrong about this being your first comment. I stand corrected. Thank you.

  9. The posts you start based on a comment in another post are not always of high regard, but of utter mocery sometimes. I know that, the readers know that and you too know that.

    There is a lot of materialistic evidence in ayodhya that babri masid is a hindu temple before it became masid. But people took the court hearing in their own convenient way so that even the supreme court had to give a diplomatic verdict. That is the unfortunate situation in India. Media and intellectuals bully common people’s mind in such a way that saying out loud what is turth is sometimes wrong. In Afzal’s case there is enough evidence to determine. The final verdict was that he is guilty. Period. No court comes to conclusion with out enough evidence.

    So you wanted to take the entire proceedings in Afzal’s case including the verdict based on your convenience and deceptive beliefs. Its just not enough for you and other Afzal supporters to believe that he is guilty, for me it is. You do not need the same magnitude of evidence in every case. Evidence should be sufficient to prove the crime, in the case I mentioned above the so called circumstantial evidences were enough to prove but there were other showcases too. I got the answers i needed. One person’s truth is other’s deception in any court case. What you believe is completely opposite to what you believe so there will be no conclusion. I am stopping it here.

  10. It seems you are hell bent to prove that I disrespected some people. You go through those articles once again. One can find that I respected the commenters and criticized their contentions.

    ” I know that, the readers know that and you too know that.”

    What is this! As if you have the power of telepathy? You are disregarding what I say even assuming what other readers think, and inclined to believe what you assume. To hell with it!

    I’ve already written regarding Afzal’s case. The supreme court clarified in various judgements that only circumstantial evidences did not suffice for conviction. There should be material evidences to support circumstantial evidences. Unless there are material evidences corroborating the circumstantial, the courts should not go for conviction. I thought you have known this, so I omitted it above. It seems my assumption is wrong.

    Material evidence in Ayodhya? You have to understand that the historians should agree to what Hindutva historians propose. Excavations should be scientific. There have to be done certain forensic tests. All those findings have to be preserved in order for other historians to examine. Even when all of these procedures are followed, there could be differences in inferences of different historians. But still, there could be common thread.

    These procedures are not followed in Babri incident. There was only a frenzy mob hell bent to bring down the masque, incited by mindless Hindutva propaganda, preoccupied with undemocratic views of beliefs. This is not scientific approach. This is not evidence. This is politically motivated destruction of a structure.

  11. No one ask for DNA proof to believe who their parents are. Not always scientific proofs are required. Substantial evidences are enough in certain situations.
    In Afzal case – there were enough evidences. It’s not required to have CCTV footage always.
    For Ayodhya dispute – ASI did numerous investigations, excavations and declared that there is a clear evidence of underlying structure resembles hindu temple under the demolished Mosque structure which is further ancient than the actual mosque structure or the new temple structure.

    I totally forgot whom I am talking to. You will not believe any thing against your will even there are evidences apparently those were produced incorrectly per your deception unless they state per your wish. For people like you Afzal is martyr and kanhayya is next bhagat singh. May god bless your ignorant soul. Amen!

  12. And you said “I’m stopping here”!

    “No one ask for DNA proof to believe who their parents are. Not always scientific proofs are required.”

    It’s your belief. It is unscientific. If you remember the courts asked for Tiwari’s DNA to make him accept that Rohith Sekhar was his son. One of my colleagues is going to face the same test. (His son is under my guardianship.)

    “Substantial evidences are enough in certain situations.”

    What is meant by “substantial evidences”? It is open to anybody’s imagination and one can always say their view is substantial.

    “In Afzal case – there were enough evidences.”

    Yeah! Like Modi the PM declaring “more than 7,000 villages were electrified during last year”, where as thousands of them still remaining un-electrified as per his own engineers’ admission.

    Excavations should be scientific. ASI’s inferences were widely criticized by historians as unscientific and biased towards ruling classes’ vote bank needs. When excavations are corrupted to satisfy mob frenzy, biased inferences follow automatically.

    Your guess is right. Some of ASI’s inferences are camouflaged deceptions.

    Will you please stop patting your own shoulders? It seems you tend to assume you are sanctioned by divine right to look down upon people in discussion with you. Discussions should be free from such prejudices, overconfidence and dominating voice. Good luck!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s