మహిషాసురుడు సభకు ఎందుకు వచ్చాడు?


మహిషాసుర సంహారానికి వ్యతిరేకంగా, హిందూ నమ్మకాలకు విరుద్ధంగా మహిషాసురుడి అమర దినాన్ని జే‌ఎన్‌యూ లోని ఎస్‌సి, ఎస్‌టి, ఓ‌బి‌సి, మైనారిటీ విద్యార్ధులు జరపడం “మానసిక భ్రష్టత్వంగా మానవ వనరుల శాఖ మంత్రి నిన్న పార్లమెంటులో తూలనాడారు.

హిందూ పురాణాలలో దేవతలుగా, వీరులుగా, దేవుళ్ళుగా కొలవబడుతున్నవాళ్ళు దేశంలో అనేక మూలల్లో విలన్లుగా చీత్కరిస్తున్న వాస్తవాలు మంత్రి గారికి తెలియక కాదు. రిజర్వేషన్ వ్యతిరేక, హిందూ భావోద్వేగ, అగ్రకులాల ఓట్లను సొమ్ము చేసుకునేందుకు ఆమె హిందూ సాంప్రదాయాలను దళితులు తూలనాడుతున్నారన్న అభిప్రాయాన్ని కల్పించారు.

తమిళనాడులో రావణుడిని దేవుడిగా కొలిచేవారు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మధ్య తూర్పు భారతంలో అడవుల్లో వ్యాపించి ఉన్న ఆదిమ తెగలు సంతాల్ లు కూడా మహిషాసురుడిని దేవుడిగా కొలుస్తారు. ఇవన్నీ ఆయా జాతుల సాంస్కృతిక చరిత్రను తెలిపేవి.

విజేతలు చరిత్రలు రాస్తారు గనుక భారత దేశ ఆదిమ జాతులపై విదేశీ ఇండో-ఆర్యన్ భాషల  దండయాత్రీకులు విజయం సాధించి తమ పురాణాలు తాము రాసుకున్నారు. అవే ఆధిపత్య వర్గాల భావజాలంగా, భావోద్వేగాలుగా స్ధిరపడిపోయాయి. పాలితులు పాలకుల భావాలను అనుకరిస్తారు, అనుసరిస్తారు. ఆ విధంగా ఇతర భారత ప్రజలు కూడా హిందూ దేవతలపై ఆరాధన ప్రారంభించారు. అంత మాత్రాన హిందూ పురాణాలే పూజ్యనీయమూ, నిర్నిరోధమూ అయిపోలేవు.

ఈ నేపధ్యంలో విశ్వ విద్యాలయాల్లో వివిధ భావజాలాల మధ్య చర్చలు, అభౌతిక ఘర్షణలు జరగడం సాధారణం. అవి జరగాలి కూడా. ఒక్క విరుద్ధ భావం ఉన్నా చర్చలోకి రావాలి. అందులోని సానుకూల, ప్రతికూలతలను వెలికి తీయాలి. అందుకు విశ్వ విద్యాలయాలు సరైన వేదికలు. ఈ అవగాహన హిందూత్వ ఆధిపత్య భావజాలానికి మింగుడుపడదు.

హిందూత్వ దృష్టిలో తమ దేవతలే ఆధిపత్య స్ధానంలో ఉండాలి. జనాన్ని సామూహికంగా నియంత్రణలో ఉంచుకోవడానికి సంస్కృతి శక్తివంతమైన సాధనం. ఆధిపత్య సంస్కృతి బలహీనపడిపోతే ఆధిపత్య భావజాలం కూడా బలహీనపడుతుంది. అనగా హిందూత్వ భావజాలంలో భాగమైన హిందువులే అధికులు అన్న నిశ్చయం కొట్టుకుపోతుంది. అది చివరికి హిందూత్వ రాజకీయ, ఆర్ధిక ఆధిపత్యం బలహీనపడేందుకు దోహదం చేస్తుంది.

అందుకే హిందూత్వ ఆధిక్యతలో ఉండడం బి‌జే‌పికి కావాలి. ఒక్క బి‌జే‌పికి మాత్రమే కాదు. అది కాంగ్రెస్ కి కూడా కావాలి. రాక్షసులుగా, దయ్యాలుగా విలన్ స్ధానాల్లోకి నెట్టివేయబడిన అసురులు నిజానికి పురాతన భారతీయ తెగల ప్రజలు. ఆదివాసీలు. వారితో పాటు అనేక వందల తెగలు దేశంలో ఉనికిలో ఉన్నాయి. సినిమాల్లో రాక్షసుల వేషాలు సరిగ్గా గిరిజనుల వేషాలతో పోలి ఉండడం గమనిస్తే హిందూ పురాణ రచయితల దృష్టిలో రాక్షసులు ఎవరో ఇట్టే అర్ధం అవుతుంది.

రాజ్య సభలో స్మృతి ఇరానీ ఎస్‌సి, ఎస్‌టి, ఓ‌బి‌సి లను దూషించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పు పట్టడం లేదు. భారత ప్రజల వివిధ మత సాంప్రదాయాలను, అలవాట్లను సభలో ప్రస్తావించడాన్ని మాత్రమే వారు తప్పు పట్టారు. దుర్గా దేవి గురించి అంత నీచంగా రాసిన రాతలను సభలో చదవడమే కాంగ్రెస్ నేతల అభ్యంతరం.

పరిశోధక విద్యార్ధులకు భారత ప్రజల చరిత్రకు తమ భాష్యం తాము చెప్పుకునే హక్కు ఉన్నదన్న వాదన వారు చేయలేదు. ‘మానసిక భ్రష్టత్వం’  గా విద్యార్ధుల కార్యక్రమాన్ని అభివర్ణించడాన్ని వారు తప్పు పట్టలేదు. “నేనూ దుర్గ భక్తురాలీనే, రోజూ ఆమెను కొలుస్తాను” అన్న బలహీన వివరణను ఇచ్చుకోవలసిన విమర్శలు మాత్రమే కాంగ్రెస్ నుండి ఎదురయ్యాయి. (బెంగాల్ ఎన్నికల వల్లనో ఏమో లెఫ్ట్ నుంచి మాటలు లేవు.)

కనుక మహిషాసురుడు పై చేయి సాధించకూడదు. ఆ రాక్షసుడు పై చేయి సాధించేందుకు దోహదం చేసే ఎటువంటి చర్యా దేశంలో జరగకూడదు. ఈ రోజు మహిషాసురుడుని ఒకరు కొలిస్తే రేపు ఒకరు ఇద్దరు అవుతారు. ఆ తర్వాత ఇద్దరు పదుగురు అవుతారు. పది మంది మరింత మంది అవుతారు. ఇదిలాగే కొనసాగితే హిందూత్వ వ్యతిరేక భావజాలం విస్తరిస్తుంది. హిందు మతంలో భాగమైన అగ్రకులాల ఆధిపత్యానికి ఎసరు వస్తుంది. కొండొకచో అగ్రకులాలు కూడా అగ్రజులుగా చెప్పుకునేందుకు సిగ్గుపడవచ్చు. ఇలాంటి పరిణామాన్ని మొగ్గలోనే తుంచివేయాలి.

అందుకు పార్లమెంటు కంటే మించిన వేదిక మరొక వేదిక ఉంటుందా? సమీప భవిష్యత్తులో జరగనున్న బెంగాల్ ఎన్నికల దృష్ట్యా మరింత లాభాన్ని మహిషాసుర ప్రస్తావన చేకూర్చుతుంది. ఇతర బి‌జే‌పి నేతలను అరిచి కూర్చోబెట్టడం తేలిక. స్మృతి ఇరానీ అయితే మహిళ, కొత్త మంత్రి. ఏమన్నా తప్పులు జరిగినట్లు ఒప్పుకోవాల్సి వచ్చినా ‘కొత్త’ అని తప్పుకోవచ్చు. ఉద్దేశ పూర్వకంగా  తప్పు చేసి కూడా ‘కొత్త’ అని తప్పుకోవచ్చు. ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరిస్తే ఒక మహిళా మంత్రిని కించపరుస్తారా అని ప్రశ్నించి దాక్కోవచ్చు.

మహిషాసుర కార్యక్రమంలో నేనూ పాల్గొన్నా -బి‌జే‌పి ఎం‌పి

కాగా ఢిల్లీకి చెందిన బి‌జే‌పి ఎం‌పి ఒకరు తానూ జే‌ఎన్‌యూ లో జరిగిన మహిషాసుర అమరదినం కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్పి స్మృతి ఇరానీని ఇబ్బందిలోకి నెట్టేశారు. ఆ తర్వాత అదీ ఇదీ అని ఏవో సవరణలు చెప్పుకుని తప్పుకోబోయినప్పటికీ అవేమీ పారలేదు.

“డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని నేను అనుసరిస్తాను. ఆయనకు వ్యతిరేకంగా ఎలా వెళ్లగలను? బాబా సాహెబ్ గొప్ప జాతీయవాది. నేనూ జాతీయవాదినే. 2013లో నేనూ మహిషాసుర పండగలో పాల్గొన్నాను. అప్పుడు నేను బి‌జే‌పి లో లేను” అని ఢిల్లీ ఎం‌పి ఉదిత్ రాజ్ ఇండియా టుడేకు చెప్పారు.

“స్మృతి ఇరానీ ఏ సందర్భంలో ఆ మాటలు చెప్పారో నాకు తెలియదు. మీరు ఆమెనే అడగాలి” అని స్మృతి ఇరానీ మాటలపై వ్యాఖ్యానించమని కోరగా ఉదిత్ రాజ్ చెప్పారు.

11 thoughts on “మహిషాసురుడు సభకు ఎందుకు వచ్చాడు?

 1. ప్రశ్నించలేనంత లోతుకు హిందూ పురాణాల వేళ్ళు ఈ దేశంలో కూరుక పోయాయి. ‘ఆమె మాట్లాడటంలో తప్పేముంది’ అని ప్రశ్నించే అమాయక చక్రవర్తులే దేశ జనభాలో ఎక్కువ మంది. అంతగా మన బుర్రలు నిండి పోయాయి. ఒక పదేళ్ళ క్రితం ఉన్న ‘ఐడెంటిటీ’ ఉద్యమాలు కూడ ఈ రోజు ఉనికిలో లేక పోవడం వారికి అంది వచ్చిన అవకాశం. ‘అయితే పెరిగేదంతా తరుగుట కొరకే’ అన్న సామెత గుర్తు తెచ్చుకోవటం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్తితి. రోహిత్ వేముల నుండి జే ఎన్ యు వరకు మొత్తం ఎపిసోడ్ లో డిజైన్ చేయబడిన కుట్రలు కుహాకాలను బయటపెట్టడంలో చాల ముందున్నారని తెలియటం ప్రజాస్వామ్యవాదులకు ఒక బరోసా!

  మీ విశ్లేషణ అద్బుతం. చాలా బాగుంది.

 2. గత 10 ఏళ్ళనుండి విశ్వవిధ్యాలయాలలో(కొన్ని) జరుగుతున్న సాంఘీక,సాంస్కృతిక కార్యక్రమాలగురించి పెద్దగా చర్చలు జరుగుతున్నట్లు లేదు! బి.జె.పి ప్రభుత్వం మూలంగా ఇది వెలుగులోకివచ్చింది.(నా అవగాహనమేరకు)
  విశ్వవిద్యాలయలవరకు తీసుకుంటే జరుగుతున్న సంఘటనలక్రమాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని ప్రైవేటువిశ్వవిధ్యాలయాలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావచ్చనిపిస్తోంది!

 3. Sekhar gaaru, జనం పట్టించుకునేది , మీరు మహిషాసురుడిని పూజిస్తున్నారా లేక రావణుడిని పూజిస్తున్నారా అని కాదు కదా .
  ఎందుకంటే అందరిని పూజించే జనాలు ఉంటారు , ఇక్కడ దేవతల పైన అసభ్యకరమైన వార్తలు రాయడం , అవమానించడం.

  జె ఎన్ యు లో కూడా అదే అనుకుంట , జనం మాట్లాడుకునేది , జాతి వ్యతిరేఖ నినాదాలు గురించి, అఫ్జల్ గురించి . ఉరి మీద చర్చ చాలా సంవత్సరాలు గా ఉంది .

 4. విశేఖర్ గారు,

  స్మ్రుతి ఇరాని గారు ఎప్పుడొ జరిగిన మహిషాసుర…. విషయాన్ని ఇప్పుడు గుర్తు చేయడం తప్పే కావచ్చు. తమ చర్యల సమర్ధత కోసం లేదా బెంగాల్ రాజకీయం కోసం కావచ్చు. ఆ పాంప్లెట్ లో ని విషయాలు హిందువులని బాధించాయి.

  ఆవిడ స్పీచ్ నేను విన్నాను. ఆ పాంప్లెట్ చదివి, దాని కింద ఉన్న అచ్చు వేసిన సంఘం పేరు వారు చదివారు. అది ఆ సంఘం వారిని అవమానించడం కాదే. ఇక డిప్రైవిడ్ మెంటాలిటీ అంటారా అందులో ఉన్న మాటెర్ గురించి. దుర్గా మాత ని సెక్ష్ వర్కర్ అని , హనీ మూన్ అని అవమానించడం గురించి.
  ఈ దేశం లో ఎవరు ఎవరినైనా ఆరాధించొచ్చు. నిరాకారాన్ని, దేవతలను, మనుషులను, రాక్షసులను, అందర్ని. హిందూ మతం దీన్ని వ్యతిరేకించదు. ఎంతో మంది హిందువులు అగ్ర కులాల వాళ్ళు మతం మారారు. మా ఇంట్లో నేను తప్ప అందరూ క్రిస్టియన్లే. సొసైటీ లో సమస్య లేదు. రాజకెయాల్లోనే సమస్య.

  ప్రతి హిందూ స్త్రీ పుట్టింటి వచ్చాకా ఏ కష్టం వచ్చినా అమ్మా, ఆది పరాసక్తి దీన్ని ఎదుర్కోనే శక్తి ఇవ్వు అని కోరే తాల్లి దుగ.

 5. అమ్మ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ దేశ ప్రయోజనం ఆశించి ? వీళ్ళు తవ్వి తీసిన చరిత్రలో ఆవిడ సెక్ష్ వర్కర్ అని సాక్ష్యాలు దొరికాయా? ఇది కావలని రెచ్చగొట్టటం కాదా? ఇతరుల మనోభావాలు అందులోనూ తీవ్ర ప్రభావం కల మత విషయాలు రేపడం దేనికి?
  అల్లా మీదనో, క్రీస్తు మీదనో, ఇలాంటి వ్యాఖ్యలు చేయగల ధైర్యం ఎవరికైనా ఉందా? ఉండొచ్చు. కాని వోట్ల రాజకీయ పరంగా లేదు.

  జరుగుతున్న పరిణామాలు ఇంకో కోణంలో చూద్దాం. ఈ లెఫ్టిస్ట్ సంఘాల వారు కార్మిక పోరాటాలు, ఇతరుల సమస్యలు, ప్రభుత్వ ఆర్ధిక విధానాలు పై పోరాటాలు కాకుండా యెమన్లు, అఫ్జల్ గురులు, మత కుల రెచ్చ గొట్టె కార్యక్రమాలు మొదలు పెట్టారేమి?

  పీడిత వర్గాలు(మినారిటీస్,దలిత్స్,ఇతర అసంత్రుప్త వర్గాలని) అందరినీ ఏకం చేసేందుకే,ఇతరుల్ని రెచ్చ గొట్టి వారిలో కొందరు తీవ్రం గా స్పందిస్తే వారిని చూపి వీరిలో మరింత యూనిటీ కలిగించి వోట్ బాంక్ ఏర్పరచు కుంటున్నారా?

  తప్పు లేదు. ప్రతి పార్టీ చేసింది అదే. కాని దేశ భక్తులుగా ప్రజలు భావించే వామ పక్షాల వారు ఆ వర్గాల సమస్యల పరంగా పోరాడాలి కాని ఇవేమి రాజకీయాలు? ఇతర్ల మతాలను రెచ్చగొట్టటం.(లేకుంటె అలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు).

  హిందువులూ సర్మ లూ కళ్ళు తెరవండి. ఈ రాజకీయుల ఉచ్చు లో పడొద్దు. శాంతి వహించండి. మోదీ ని గెలిపించింది అభివ్రుద్ది కోసం కాని, అసాంతి కోసం కాదని చెఫ్ఫండి.

  ఆ పాంప్లెట్ లో విషయాలు మీరు ఖండించక పొవడం నిరుత్సాహం కలిగించింది శెఖర్.:

 6. అనిత గారూ, మీరు చెప్పిన (పార్లమెంటులో స్మృతిగారు చదివిన) పాంప్లెట్ మేము తాము రాసింది కాదని జే‌ఎన్‌యూ విద్యార్ధులు (మహిషాసుర్ మార్టిర్డం ఆర్గనైజర్లు) చెప్పారు. స్మృతి చెప్పిన అనేక అబద్ధాల్లో అదీ ఒకటి. కింది లంకెలోకి వెళ్ళి హిందు వార్త చూడండి. ఈ వార్తని ఇతర పత్రికలు కూడా ప్రచురించాయి.

  Mahishasura: JNU student denies Smriti’s claim

 7. వెంకట్ గారూ, జనం ఏం పట్టించుకునేది ఒక అంశం. మీరు దేవతల మీద అసభ్యకర రాతలు అని అంటున్నారు. సెక్స్ వర్కర్ అంత అసభ్యమే అయితే ఆ వ్యవస్ధని నిర్మూలించడానికి పాలకులు ఎందుకు కృషి చేయరన్నది కూడా మనం ఆలోచించాలి. రంభ, ఊర్వశి తదితర నాట్యకత్తెలను అభివర్ణించింది కూడా మన హిందూ పురాణాలే కదా. అది మాత్రం దేశద్రోహం కాకుండా పోతుందా చెప్పండి!

 8. పాలకులు కృషి చేయడం అనేది వేరే చర్చ . అది నిర్మూలించడానికి కృషి చేయడం లేదని , ఆ పదాలు వాడటం లో తప్పు లేదని ఎలా వాదిస్తున్నారు ?
  రంభ ఊర్వసి మన్మధుడు అహల్య తో దీనికి పోలిక లేదు , ఇవి ఎందుకు మీరు ప్రస్తావిస్తున్నారో అర్ధం కాలేదు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s