ఇంత పతనం ఎందుకు జీ న్యూస్‌? -జీ విలేఖరి రాజీనామా


Vishwa Deepak

[జీ న్యూస్ విలేఖరి విశ్వ దీపక్ చానెల్ కు రాజీనామా చేస్తూ చానెల్ యాజమాన్యానికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖనే ఆయన రాజీనామా లేఖగా వెలువరించారు. లేఖ ఆంగ్ల అనువాదాన్ని ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. ఇతర పత్రికలు కూడా ప్రచురించి ఉండవచ్చు. విశ్వ దీపక్ రాజీనామా లేఖ అనువాదమే ఈ టపా.

ఈ అనువాదాన్ని బ్లాగ్ పాఠకుడు సందీప్ ఎస్‌పి గారు వ్యాఖ్య ద్వారా అందించారు. నవ తెలంగాణ పత్రికలో మొదట అచ్చయిన ఈ తెలుగు అనువాదానికి కర్త జి వి కే ప్రసాద్ గారు. అనువాదం తాను చేశారా లేక మరొకరు చేస్తే తాను పోస్ట్ చేశారా అన్నది తెలియలేదు. ప్రస్తుతానికి ఆయనే అనువాదం చేసి ఉంటారని భావిస్తున్నాను. -విశేఖర్]

*********

Tue 23 Feb 03:42:22.945318 2016

ప్రియమైన జీ న్యూస్‌,

సంవత్సరం పైగా పని చేసిన తర్వాత మీ నుండి విడిపోవాల్సిన సమయం వచ్చేసింది. నేనీ పని ఇదివరకే చేయాల్సింది. ఇప్పటికైనా చేయకపోతే నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేను. ఇప్పుడు నేను రాయబోతున్నది ఆవేశం, కోపం లేదా ఉక్రోశం ఫలితంగా ఏ మాత్రం కాదు. బాగా ఆలోచించి చేస్తున్న ప్రకటన ఇది.

నేనొక పాత్రికేయుడినే కాకుండా, ప్రస్తుతం జాతీయ దురహంకారం అనే విషం ఎగజిమ్ముతున్న ఈ దేశంలో ఒక పౌరుణ్ని కూడా. పౌరుడిగా నా బాధ్యతలు, నా వృత్తి ధర్మం ఈ విషం ఇంకా వ్యాపించకుండా ఆడ్డుకోవాలని నాకు చెబుతున్నాయి. ఇది చిన్న పడవతో సముద్రాన్ని దాటెయ్యడం లాంటి ప్రయత్నమే అయినా ప్రారం భించాలనుకుంటున్నాను.

అందుకే నేను జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌ పేరిట మొదలైన జాతీయ దురహంకారం, దాన్ని ఎగదోయ డంలో మన సంస్థ పాత్రను వ్యతిరేకిస్తూ నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను.

నిజానికి ఇది వృత్తిపరమైన బాధ్యతకు సంబంధించినది. సామాజిక బాధ్యత గ్రహింపునకు సంబంధించినది. ఇది దేశభక్తికి సంబంధించినది కూడా. ఈ మూడు ప్రమాణాల్లోనూ గత సంవత్సర కాలంగా మీతో కలిసి పని చేస్తున్న కాలంలో నేను ఒక పాత్రికేయుడిగా విఫలమయ్యాను.

2014 మే తర్వాత నుంచి, అంటే నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి, దాదాపు దేశంలోని ప్రతి న్యూస్‌ రూం మతతత్వ ప్రభావానికి లోనైంది. కానీ మన దగ్గరి పరిస్థితి మాత్రం మరింత భయంకరమైంది. ఇక్కడ ప్రతి వార్తను మోడీ కోణంలోనే, మోడీ ప్రభుత్వ అజెండాకు ఎంత ఊపు లభిస్తుందనే అంచనాతోనే రాయిస్తున్నారు.

అసలు మనం పాత్రికేయులమేనా అనే అనుమానం నాలో మొదలైంది. మనం ప్రభుత్వ ప్రతినిధుల లాగా లేదా ‘సుపారీ హంతకుల’ లాగా అనిపించసాగింది… ఒక పాత్రికేయుడిగా ఇంత ‘మోడీ భక్తి’ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా అంతరాత్మ నాపై తిరుగుబాటు చేయసాగింది..

ప్రతి వార్త వెనుక ఒక అజెండా. ప్రతి న్యూస్‌ షో వెనుక మోడీ ప్రభుత్వాన్ని గొప్పగా కీర్తించే ప్రయత్నం. ప్రతి చర్చ వెనుక మోడీ వ్యతిరేకులను ‘కాల్చి పడేసే’ ప్రయత్నం. ఇదంతా ఏమిటసలు?

అసలు మమ్మల్ని ఇంత దీనంగా, హీనంగా, అనైతికంగా, పతనశీలంగా ఎందుకు తయారు చేశారు? దేశంలోని అత్యున్నత మీడియా సంస్థలో చదువుకొని, ఆజ్‌ తక్‌, బీబీసీ, డాయిచే వెలే జర్మనీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో పని చేసిన తర్వాత నేను ఆర్జించిన వృత్తిపరమైన గుర్తింపు ‘ఛీ’ న్యూస్‌ జర్నలిస్టు అనే ఛీదరింపే. మన నిజాయితీ బజారు పాలైంది. ఇందుకు ఎవరిది బాధ్యత?

ఎన్నని చెప్పాలి? ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎడతెగని ప్రచారం ఇంకా చేస్తూనే ఉన్నాం. ఎందుకు? కరెంటు, నీళ్లు, చదువు, సరి-బేసి వంటి ప్రజలకు ఉపయోగపడే మౌలిక విధానాలను సైతం దుమ్మెత్తి పోశాం. కేజ్రీవాల్‌తో విభేదించేం దుకు, విమర్శించేందుకు పూర్తి హక్కుంది. కానీ కేజ్రీవాల్‌ ‘సుపారీ హత్య’ హక్కు మాత్రం ఒక పాత్రికేయుడిగా ఎవరికీ ఉండదు. కేజ్రీవాల్‌పై చేసిన నెగెటివ్‌ స్టోరీల జాబితా తయారు చేస్తే పేజీలు నిండిపోతాయి. అసలు జర్నలిజం మౌలిక సిద్ధాంతమైన ‘తటస్థత’, పాఠకుల/వీక్షకుల పట్ల నిజాయితీ మనకు వర్తిస్తాయా, వర్తించవా?

దళిత స్కాలర్‌ రోహిత్‌ వేముల విషయంలోనూ ఇలాగే జరిగింది. మొదట్లో మనం దళిత స్కాలర్‌ అని రాశాం. ఆ తర్వాత దళిత విద్యార్థి అని రాయ సాగాం. సరే, కనీసం వార్తలైనా సరిగా రాయాలి కదా! రోహిత్‌ను ఆత్మహత్యకు పురికొల్పడం వెనుక ఏబీవీపీ, బీజేపీ మంత్రి బండారు దత్తాత్రేయల పాత్రలు స్పష్టంగా ముందుకొచ్చాయి. కానీ ఒక మీడి యా సంస్థగా మనం విషయాన్ని పలుచన చేసేలా, కారకులను కాపాడేలా వ్యవహరించాం.

అసహనం అంశంపై ఉదయ ప్రకాశ్‌తో మొదలై దేశంలోని అన్ని భాషలకు చెందిన ప్రఖ్యాత రచయితలు అకాడమీ పురస్కా రాలు వెనక్కి ఇచ్చెయ్యసాగారు. కానీ మనం మాత్రం వారినే ప్రశ్నించే వైఖరిని చేపట్టాం. కేవలం ఉదయ ప్రకాశ్‌నే తీసుకున్నా ఆయన సాహిత్యం లక్షల మంది చదువుతారు. మనం మాట్లాడే భాష, మనకు ఉపాధి మార్గంగా ఉన్న భాష (హిందీ)లో గౌరవప్రదమైన స్థానం ఆయనది. ఆయన రచనల్లో మన జీవితం, మన స్వప్నాలు, పోరాటాలు ప్రతిబింబిస్తాయి. కానీ మనం ఇవన్నీ ప్రాయోజితమైనవని రుజువు చేయడంలో నిమగమయ్యాం. అప్పుడు కూడా బాధ కలిగింది.

అయినా భరించాను. కానీ ఎప్పటి దాకా భరించాలి? ఎందుకు భరించాలి?

నాకు అశాంతితో నిద్ర పట్టడం లేదు.. తప్పు చేశానన్న భావన నన్ను దహించివేయసాగింది. ఒక వ్యక్తి జీవితంలో అన్నింటికన్నా పెద్ద కళంకం దేశద్రోహం. కానీ పాత్రికేయులుగా మనకు ఎవరిపైనైనా దేశద్రోహి అనే ముద్రవేసే హక్కుందా? దీన్ని నిర్ధారించాల్సింది న్యాయస్థానాలు కదా!

కన్నయ్య సహా పలువురు విద్యార్థులను మనం ప్రజల దృష్టిలో ‘దేశద్రోహులు’గా నిలబెట్టాం. రేపు వీరిలో ఎవరైనా హత్యకు గురైతే బాధ్యత ఎవరిదవుతుంది? అల్లర్లు, అంతర్యుద్ధం మొదలయ్యే పరిస్థితుల్ని మనం సృష్టించాం. ఇది ఏ రకమైన దేశభక్తి? ఏ రకమైన జర్నలిజం?

మనం బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్‌ గొంతుకలమా? వాళ్లేది చెబితే అదే చేస్తామా? ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అనే నినాదమే లేని వీడియోను పదే పదే చూపించి మనం ఉన్మాదాన్ని వ్యాపింపజేశాం. చీకట్లో వినిపిస్తున్న గొంతుకలను మనం కన్నయ్య, ఆయన సహచరులవేనని ఎలా గుర్తించాం? కేవలం దురభిప్రాయాల కారణంగా ‘భారతీయ కోర్ట్‌ జిందాబాద్‌’ అన్న నినాదాన్ని ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’గా మార్చేసి ప్రచారం చేశాం. ప్రభుత్వం కనుసన్నల్లో పని చేస్తూ విద్యార్థుల కెరియర్‌ను, వారి ఆశలను, కుటుంబాలను వినాశనం వైపు నెట్టేశాం…

ఉమర్‌ ఖాలిద్‌ చెల్లెను రేప్‌ చేస్తామని, ఆమెపై యాసిడ్‌ దాడి చేస్తామని కొంత మంది బెదిరిస్తు న్నారు. ఆమెను దేశద్రోహి చెల్లెలు అని అంటున్నారు. కాస్త ఆలోచించండి. నిజంగానే అలాంటిదేమైనా జరిగితే ఇందుకు బాధ్యత మనది కాదా? తాను దేశ వ్యతిరేక నినాదాలను సమర్థించనని కన్నయ్య ఒకసారి కాదు, వెయ్యి సార్లన్నాడు. అయినా మనం ఆయన మాటను వినం. ఎందుకంటే మనం వ్యాపింపజేసిన ఉన్మాదం ఎన్‌డీయే ప్రభుత్వానికి అనుగుణమైంది.

మనం అసలు కన్నయ్య ఇంటినైనా జాగ్రత్తగా చూశామా? అది ఇల్లు కాదు, దేశంలోని రైతుల, సామాన్యుల దుస్థితికి ప్రతీక! దేశంలో అనుక్షణం భూస్థాపితమవుతున్న ఆకాంక్షల స్మశానం అది. కానీ మనం గుడ్డివాళ్లమైపోయాం! భారతీయ గ్రామీణ జీవన యదార్థ చిత్రం ఇదే. ఆ కూలిపోయిన గోడలలో, చిక్కి శల్యమైన జీవితాల్లో మనం జాతీయవాదం అనే ఇంజెక్షన్‌ ఇచ్చాం. తుది ఫలితం ఏమవుతుందనే ఆలోచనే లేకుండానే. పక్షవాతంతో బాధపడుతున్న కన్నయ్య తండ్రి ఈ వేదన మూలంగా చనిపోతే దానికి బాధ్యు లెవరు?

‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో స్టోరీ వచ్చే దాకా, అసలు కన్నయ్యకు పీడితుల పక్షంలో మాట్లా డేందుకు ప్రేరణ ఏమిటనేది దేశానికి తెలియనే లేదు. రామా నాగా, తదితరులది కూడా ఇదే పరిస్థితి. చాలా బలహీనమైన కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ యువతీయువకులు జేఎన్‌యూలో సబ్సి డీతో ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నారు. ముందుకు వెళ్లగలిగే ధైర్యాన్ని పొందుతున్నారు. కాని టీఆర్‌పీ అనే బజారు వాంఛ, అమ్ముడుపోయిన మన వివేకం వీరి కెరియర్‌లను దాదాపు నాశనం చేసేశాయి.

మనం వీరి రాజకీయాలతో ఏకీభవించకపోవచ్చు. వీరి భావాల్లో అతివాదం ఉండొచ్చు. కానీ వీళ్లు దేశద్రోహులెట్లా అవుతారు? ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో జీ న్యూస్‌ను రిఫరెన్స్‌గా పేర్కొనడం కేవలం యాదృచ్ఛికమని అనగలరా? మనం ఢిల్లీ పోలీసులతో కుమ్మక్కయ్యామని అంటున్న వారికి ఏం జవాబు చెప్పాలో చెప్పండి. అసలు జేఎన్‌యూతో గానీ, జేఎన్‌యూ విద్యార్థులతో గానీ మనకున్న వైరమేమిటి? నా అభిప్రాయంలో ఆధునిక జీవన విలువలకు, ప్రజాస్వామ్యానికి, వైవిధ్యానికి, పరస్పర విరుద్ధ భావాల సహ అస్తిత్వానికి దేశంలో ఉన్న అత్యంత సుందరమైన నందనవనం జేఎన్‌యూనే. కానీ దీన్నిప్పుడు చట్టవ్యతిరేక, దేశద్రోహ కార్యకలాపాలకు కేంద్రంగా వక్రీకరిస్తున్నారు.

అసలు చట్టాన్ని ఉల్లంఘించింది జేఎన్‌యూనా లేక కోర్టులోకి చొరబడి లెఫ్ట్‌ కార్యకర్తను కొట్టిన బీజేపీ ఎమ్మెల్యేనా? కింద పడ్డ సీపీఐ కార్యకర్త అమీక్‌ జమైను ఎమ్మెల్యే, అతని అనుచరులు బూట్లతో తొక్కు తుంటే పక్కనే ఉన్న పోలీసులు చూస్తూ ఉండి పోయారు. కొడుతున్న దృశ్యాలు తెరపై కనబడు తుంటే మనం మాత్రం ‘ఒ.పి. శర్మను కొట్టారన్న ఆరోపణలు’ అని రాశాం. ‘ఆరోపణ’ ఎందుకు అని నేనడిగితే, పై నుంచి వచ్చిన ‘ఆదేశం’ అని మీరు చెప్పారు. కానీ మనం ఇంత కిందకు ఎలా దిగజారాం? మోడీ వరకైనా అర్థం చేసుకోవచ్చు కానీ స్టోరీ రాసేటప్పుడు ఒ.పి. శర్మ వంటి బీజేపీ నేతల, ఏబీవీపీ కార్యకర్తలను కూడా కాపాడడం ఏమిటి?

నాకు నా ఉనికిపై, వృత్తిపై అసహ్యం వేయసాగింది. ఇందుకేనా నేను మిగతా పనులన్నీ వదిలి పాత్రికేయ వృత్తిని చేపట్టాలని నిర్ణయించుకుంది? బహుశా కాదు.

ఇప్పుడు నా ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి జర్నలిజాన్ని వదిలెయ్యడం లేదా ఈ పరిస్థితులను నాకు దూరంగా నెట్టెయ్యడం. నేను రెండో మార్గం చేపడు తున్నాను. నేనేమీ తీర్పు చెప్పడం లేదు. నా వృత్తి, గుర్తింపులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు మాత్రమే లేవనెత్తాను. చిన్నదే అయినా నాకూ బాధ్యత ఉంది ఇందులో. నాకిప్పుడు వేరే చోట్లలో ఉద్యోగం లభించదని స్పష్టంగా తెలుసు. నేను ఇందులోనే కొనసాగితే రెండేండ్లలో లక్ష రూపాయల వేతన స్థాయికి చేరుకోగలుగుతాను. కానీ ఈ సౌలభ్యం నా నుంచి చాలా త్యాగాలు కోరుతోంది. నేను వాటికి సిద్ధంగా లేను. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా, వేతనం లేకపోతే పడే కష్టాలేమిటో తెలుసు. అయినా నేను నా అంతరాత్మ ప్రబోధాన్ని అణచిపెట్ట దల్చుకోలేదు.

నాకు వ్యక్తిగతంగా ఎవరితో ఏ ఫిర్యాదూ లేదని నేను మరోసారి చెబుతున్నాను. సంస్థాగతమైన, సంపాదకీయమైన వ్యవహారాలకు సంబంధించినది గానే దీనిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒక మీడియా సంస్థకు తన మితవాద వైఖరులను, అభిరుచులను ప్రకటించే, ప్రశంసించే హక్కుంటే, వ్యక్తిగా మా లాంటి వాళ్లకు మా రాజకీయ వైఖరిని స్పష్టం చేసేందుకు పూర్తి హక్కుంది.

తెలుగు అనువాదం: జివికే ప్రసాద్

*********

ఫస్ట్ పోస్ట్ లో ప్రచురించబడిన లేఖ పాఠాన్ని, ఆంగ్ల అనువాదంలో,  కింద చూడవచ్చు. విశ్వ దీపక్ తన లేఖను హిందీలో రాశారు. హిందీ మూలాన్ని న్యూస్ లాండ్రీ వెబ్ సైట్ ప్రచురించింది. లేఖను విశ్వ దీపక్ ఫేస్ బుక్ లో మొదట పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Dear ZEE News,

After 1 year 4 months and 4 days, it’s high time that I should leave your organization. I should have left it much before, but if I don’t leave, then I will never be able to forgive myself.

What I want to say next has not been stated out of emotion or anger. It is a well-considered statement. Besides being a journalist, I am a citizen of this country, where the poison of nationalism is being spread and the country is being pushed towards a civil war. My civil liability and professional responsibility says that I should stop this poison. I know my efforts are like crossing the sea with the help of a boat but I am keen to make the effort. On this thought, on the issue of blind nationalism over JNUSU President Kanhaiya Kumar, I resign from my post. I want this resignation to be accepted without any personal malice.

Indeed, this it is not personal. It is a matter of professional responsibility. In the end, it is a matter of sense of responsibility and patriotism too. With regret, I say that on these three parameters, by being associated with you, as an organization, in the last year, I have failed many times.

After May 2014, when Narendra Modi has become the PM, almost every newsroom of the country has been communalized, but here, situations are even more catastrophic. I apologise for using such a heavy word. But I have no other word except this. Why is it that all news is written by adding a ‘Modi angle’? Stories are written keeping in mind how it will benefit the agenda of the Modi government. We have seriously started doubting that we are journalists. It feels like we are the spokespersons of the government, or that we are supari killers. Modi is the PM of our country, and is my PM too. But being a journalist, it is difficult to accept so much Modi devotion. My conscience is starting to rebel against me, it seems like I am sick. Behind every story there is an agenda, behind every show there is an effort to call the Modi government ‘great’. Wanting to attack the opposition in every argument. No word other than attack or war is acceptable. What is all this? Sometimes I stop and think that I am getting mad. Why are we being made so inferior and immoral? After studying from the country’s top media institutions and working at Aaj Tak and BBC, Deutsche Welle (Germany), the situation is such that people have started calling me a journalist from ‘Chhee News’. Our integrity is being questioned; who will take the responsibility for all this?

There are so many things to say…A campaign is being constantly running against Delhi CM Arvind Kejriwal and is still running. Why?

Basic policies like electricity-water, education and the odd-even policy were also questioned. Disagreement with Kejriwal disagreement and criticism is something that everyone has a right to. If I start making a list of stories done against Kejriwal then I think many pages will be filled. I want to know if journalistic principles and ethics hold a certain value or not?

In the Rohith Vemula suicide case, first he was called as a Dalit scholar, then a Dalit student. At least, the story should have been written properly. The ABVP and Bandaru Dattatreya need to answer for Rohith Vemula’s suicide.

I remember that we questioned stellar writers across all regional languages including Uday Prakash when they started returning their Satitya Academi Awards on the debate on intolerance. Lakhs of people read Uday Prakash’s books. He is the pride of the language that we speak every day, and use in our workplace. His writings portray our lives, our dreams, and our struggle. But we are keen to prove that all these things were pre-planned. That hurt then, but I still tolerated it somehow.

But till when should I tolerate this situation and for how long?

I can’t sleep well these days. I am anxious. Perhaps this is the result of a feeling of guilt. The biggest blot that an individual can have on him is that he is anti-national. However, the question is as journalists, do we have the right to distribute the degree of anti-national? Isn’t it the job of the court?

We have tagged many students of JNU as ‘anti-national’ including Kanhaiya. If among them one gets killed tomorrow, who will take the responsibility? We have not only created an atmosphere for someone’s murder and the destruction of a few families but also created a platform to spread riots and cause a civil war. What kind of patriotism is this? What kind of journalism is this?

Are we the BJP or RSS’S mouthpieces, for us to do whatever they say? A video which did not even have the slogan of ‘Pakistan zindabad’ was still aired continuously. How did we blindly believe that these voices which came in the dark were of Kanhaiya or his friends? Instead of ‘Bhartiya Court zindabad,’ they heard Pakistan zindabad and spoilt some peoples career, hopes and led their families to destruction. It would have been good if we would have let the investigating agencies conduct a probe and then waited for the results.

People are threatening Umar Khalid’s sister. People are calling her a traitor’s sister. Isn’t this our responsibility? Kanyaiya not once but repeatedly said that he doesn’t promote anti-nationalist slogans, but nobody heard him, because we were toing the line of the NDA government. Have we ever seen Kanhaiya’s house properly? Kanhaiya’s home is a painful symbol of the country’s farmers and the common man. It represents expectations of the country which are being buried every moment. But we have become blind. In my area too, there are many houses like this. In those broken walls and already fragile lives, we have injected the poison of nationalism without even thinking what the result would be. if Kanhaiya’s paralyzed father dies of shock, will we be responsible?

If The Indian Express would not have done a story, the country wouldn’t have been able to find out from where he gets the inspiration to talk. Rama Naga and others are in the same situation. Struggling against poverty, these boys are studying with the help of subsidies given to JNU. But the commercials interests have ruined their career.

We may disagree with their politics or their ideas, but how can they become traitors? How can we do the court’s job? Is it a mere coincidence that the Delhi Police in its FIR has mentioned Zee News?
It is said that we are in collusion with the Delhi Police. What answer do we give to this allegation?
Why do we hate JNU? I believe that JNU is a beautiful garden of modern values, democracy, diversity and co-existence of opposing views. And people call us traitors.

I would like know- JNU against the law or the BJP leader who barged into the court premises and thrashed the left-wing leader? While the BJP leader and his supporters were mercilessly beating Amique Jamai, the CPI activist, the cops remained mute spectators. Even as the live coverage showed OP Sharma clearly hitting Jamai, we were carrying the news as ‘allegations of violence against OP Sharma’. When I asked why we used the word ‘allegation’ when the video is self-explanatory, I was told that the order has been issued from the higher-ups. How can our ‘higher-ups’ stoop so low? It is understandable when it comes to Modi but we have to now be careful of not writing anything against AVBP leaders and BJP leaders like OP Sharma?

I have started hating my existence, my journalism and my helplessness. Did I leave other jobs and decide to be a journalist for all this? I doubt it.

Now, I just have two options; either to quit journalism or excuse myself from these situations. I am opting for the latter. I have not yet declared anything; I have just raised some questions pertaining to my profession and identity. No matter how small, but it is still my accountability-not so much towards others, but more towards me. I am convinced that I won’t be hired elsewhere. I am aware that if I stick around I might be able to earn up to lakh rupees. My salary is good, but these situations are demanding a lot of sacrifices, which I am not willing to do. Being brought up in a middle-class family, I am fully aware that you have to face a lot of difficulties with a modest income but still I don’t want to suppress my conscience.

I am repeating myself that I don’t have any personal vendetta against anybody. These matters are purely related to editorial policy. I hope they are understood in the same way. I would also like to mention that if any media house has the right to declaim its right-wing tendencies then even we as individuals are entitled to talk about our political inclinations. Being a journalist, it is my responsibility to have an unbiased approach. But as an individual and a citizen, I have chosen the leftist ideology. This is my identity. On a final note, I am thankful for the year-long struggle that I have been through in Zee News, which has helped me make good friends.

-Vishwa Deepak

 

 

3 thoughts on “ఇంత పతనం ఎందుకు జీ న్యూస్‌? -జీ విలేఖరి రాజీనామా

  1. దీనిని అనువాదం చేసింది జి.వి.కె. ప్రసాద్. ఇది ‘నవ తెలంగాణ’లో ఫిబ్రవరి 23న అచ్చయ్యింది.

  2. ప్రసాద్ గారూ మీరిచ్చిన సమాచారాన్ని ఆర్టికల్ లో చేర్చాను. గమనించగలరు.

    మరొక సమాచారం మీ నుండి కావాలి. మీ వద్ద ఆ సమాచారం ఉంటే వ్యాఖ్య ద్వారా చెప్పగలరా?

    రోహిత్ తల్లి స్వయంగా తాను ‘మాల’ అని చెప్పాక కూడా తెలంగాణ పోలీసులు అతను దళితుడు కాదు అంటూ కేంద్ర ప్రభుత్వానికి -బహుశా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా- తప్పుడు సమాచారం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? తహసీల్దారు రోహిత్ తల్లి గారిని విచారించకుండా ఏకాఎకిన తప్పు కులాన్ని రోహిత్ కి ఎందుకు ఆపాదించారు? వారి వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఉన్నదా?

    ఈ సమాచారం మీ దృష్టిలో ఉంటేనే ఇవ్వండి.

    అనువాదానికి ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s