జవహర్ లాల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) అధ్యక్షుడు కనహైయా కుమార్ పై ‘దేశ ద్రోహం’ కేసు మోపి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇపుడీ వ్యవహారం సరికొత్త మలుపు తీసుకుంది.
అఫ్జల్ గురును ఉరి తీసి 3 సం.లు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 9 తేదీన జేఎన్‌యూ లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్ధి సంఘం అధ్యక్షులు, మరి కొందరు విద్యార్ధులు పాక్ అనుకూల, ఇండియా వ్యతిరేక నినాదాలు చేశారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులను ఉసిగొల్పి ఈ కేసులు మోపింది.
అయితే పాక్ అనుకూల నినాదాలు చేసింది వాస్తవానికి వామపక్ష విద్యార్ధి సంఘాల సభ్యులో, లేక కాశ్మీర్ విద్యార్ధులో కాదనీ విద్యార్ధుల గుంపులో కలిసి పోయిన కొందరు ఏబివిపి విద్యార్ధి సంఘం నాయకులేననీ తెలిపే వీడియో ఒకటి ఇంటర్నెట్ లో షికారు చేస్తోంది.
బిజేపి ఎంపి, ఏబివిపి సభ్యులు ఫిర్యాదు చేయడంతోనే వామపక్ష విద్యార్ధి సంఘాల సభ్యుల హాస్టల్ గదులపై దాడులు చేసి చేతికందిన వారిని అరెస్ట్ చేసి అత్యంత క్రూరమైన, బ్రిటిష్ వలస పాలకుల వలస ప్రయోజనాల కోసం భారత ప్రజల జాతీయోద్యమాన్ని అణచివేయడానికి చేసిన ‘దేశద్రోహ’ చట్టాన్ని వారిపై మోపింది కేంద్రం లోని బిజేపి ప్రభుత్వం. అందుకు వార్తా ఛానెళ్లు ప్రసారం చేసిన అస్పష్టమైన వీడియో క్లిప్పింగులను ఆధారంగా హిందూత్వ మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు.
ఇప్పుడు అందుకు విరుద్ధమైన ఆధారంగా కనిపిస్తున్న వీడియో క్లిప్పింగ్ ను జీ న్యూస్ లాంటి చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. బిజేపి, ఏబివిపి నేతల ఫిర్యాదులను ఎకాఎకిన నమ్మి విద్యార్ధులపై జాతీయ వ్యతిరేక ఆరోపణలు చేయడంలో ఆతృత, ఆసక్తి కనబరిచిన కేంద్ర హోమ్ మంత్రి గారు ఇప్పుడు తాజా వీడియో ఆధారంగా ఏబివిపి నేతలపై దేశ ద్రోహం కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తారా?
తామే టెర్రరిస్టు దాడులకు, పేలుళ్లకు పాల్పడుతూ సదరు చర్యల భారాన్ని ముస్లిం మీదకు వచ్చేలా కుట్రలు చేయడం హిందూత్వ సంస్ధలకు ఇది కొత్త కాదు. మాలెగావ్ పేలుళ్లకు కుట్ర చేసినట్లు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్ లు దొరికిపోయారు. యేడేళ్ళ నాటి ఈ కేసులో ముద్దాయిలపై మహారాష్ట్ర సంఘటిత నేరాల నియంత్రణ చట్టం (MCOCA) కింద కేసులు నమోదు చేయవచ్చని ఇటీవల ట్రయల్ కోర్టు గట్టిగా అభిప్రాయ పడింది.

MALEGAON BLASTS ACCUSED SADHVI PRAGYA SINGH
హైద్రాబాద్ లోని మక్కా మసీదులో జరిగిన పైపు బాంబు పేలుళ్లకు బాధ్యులుగా మొదట ముస్లింలను పోలీసులు అరెస్ట్ చేసి చిత్ర హింసలకు అనంతర కాలంలో పేలుళ్లకు వాస్తవంగా కుట్రలు చేసింది స్వామీ ఆసీమానంద్ తదితర హిందూత్వ నాయకులేనన్న సంగతి వెల్లడి అయింది.
ఇప్పుడు ఈ జేఎన్‌యూ ‘దేశ ద్రోహం’ కేసు!
మనకు ఇష్టం లేని కుక్కను చంపడానికి ‘పిచ్చి కుక్క’ అని ముద్ర వేసేస్తే దాన్ని చంపడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. పైగా మద్దతు కూడా రావచ్చు, ‘పిచ్చి కుక్క’ ముద్ర వేయడానికి కుక్కకు నిజంగా పిచ్చి ఎక్కాల్సిన అవసరం లేదు. ‘పిచ్చి ఎక్కింది’ అని తప్పుడు ప్రచారం చేస్తే చాలు.
దొంగే ‘దొంగ, దొంగ!’ అని అరవడం కూడా ఇది!
ఇంటర్నెట్ లో చెలామణిలో ఉన్న వీడియో అసలుది కాదని, మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని ఏబివిపి అంటోంది. మార్ఫింగ్ చేసిందా లేక నిజమైనదేనా అన్న సంగతి పోలీసుల పరిశోధనలో తేలుతుంది. ముందు ఏబివిపి కార్యకర్తలపై దేశ ద్రోహం అభియోగం మోపి, కేసులు పెట్టవద్దా, కన్హైయా కుమార్ పై పెట్టినట్లు?
అఫ్జల్ గురు కార్యక్రమం రోజున విశ్వ విద్యాలయంలో విద్యార్ధులను ఉద్దేశించి కన్హైయా చేసిన ప్రసంగం పూర్తి పాఠాన్ని ఈ కింది వీడియోలో చూడవచ్చు. ఇందులో పాకిస్తాన్ అనుకూల నినాదాలు గానీ, ఇండియా వ్యతిరేక భావజాలం లేదా నినాదాలు గానీ ఆయన ఇచ్చిన దాఖలా ఏమీ లేదు. కన్హైయాకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్షం లేకపోయినా కేసు పెట్టి అర్జెంటుగా జైలులో పెట్టడం బట్టి అత్యున్నత స్ధాయిలోనే వామపక్ష విద్యార్ధి సంఘ నేతలకు వ్యతిరేకంగా కుట్ర జరిగినట్లు స్పష్టం అవుతోంది.
–
*********
BJP Insider పేరుతో ఓ ట్విట్టర్ వాడుకరి జరిపిన కింది (బొమ్మల్లోని) సంభాషణలను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవడం సముచితం కాగలదు. హిందూత్వ సంస్ధల Modus Operandi ని ఈ ట్విట్టర్ సంభాషణ చమత్కారంగా పట్టిస్తుంది.
–
BJP Insider ట్విట్టర్ పేజీ కోసం కింది లంకెలోకి వెళ్ళండి!
http://www.thehindu.com/news/national/pakistani-flag-hoisting-was-a-hindutva-plot-to-foment-strife-police-say/article2790960.ece
ఇలాంటి పనులు చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. పై లింకు ఓ సారి చూడండి.
“Patriotism is the last refuge of the scoundrel” – Samuel Johnson ప్రస్తుత పరిస్తితికి ఈ కొటేషన్ సరిగ్గా సూట్ అవుతుంది.