సమాచార హక్కు చట్టం బిజేపి కొంపకు చిన్న చిచ్చు పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడి ఎంతో పేదవాడు అంటూ 2014 సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు బిజేపి శ్రేణులు, నాయకులు ఉపయోగపెట్టిన ఫోటో అసలుది కాదని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిసి వచ్చింది.
నరేంద్ర మోడి క్రమ శిక్షణ కలిగిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అనీ, ఆయన పేదరికంలో పుట్టి పెరిగారని, ఇతర వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి అని ఎన్నికల ప్రచారంలో బిజేపి చెప్పింది. ఒక్క బిజేపి మాత్రమే కాదు. కాంగ్రెస్ కూడా మోడిని ‘చాయ్ వాలా’ అని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ ఎద్దేవానే ఆయుధంగా మలుచుకుని మోడి ‘చాయ్ పే చర్చ’ పేరుతో విజవంతమైన ప్రచార కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు.
చాయ్ వాలా బిరుదుతో పాటు నరేంద్ర మోడి, బిజేపి లకు ఆచ్చి వచ్చిన మరో అంశం ఒక ఫోటో. నరేంద్ర మోడి కాకీ బట్టలు ధరించి కింద మునికాళ్లపై కూర్చొని చీపురుతో నేలను శుభ్రం చేస్తున్న ఫోటో అది. నలుపు తెలుపు రంగుల్లో ఉన్న ఆ ఫోటో అప్పట్లో ఇంటర్నెట్ లో విస్తృత వ్యాప్తి పొందింది.
ఆర్‌ఎస్‌ఎస్ సాధారణ సభ్యుడుగా ఉన్న కాలంలో నరేంద్ర మోడి పేదవారని, జీవిక కోసం టీ అమ్ముకుని బతికారని, చివరికి చీపురు చేత బట్టి శ్రమ చేశారని హిందూత్వ శ్రేణులు ఊదరగొట్టాయి. అందుకు సాక్షంగా ఈ ఫోటోను చూపాయి. ఫోటోలో మోడి ధరించినట్లు కనిపిస్తున్న చిరిగిపోయిన చొక్కా చూపరులను మరింతగా ఆకర్షించింది.
అహ్మదాబాద్ కి చెందిన ఆర్‌టిఐ కార్యకర్త ఒకరు ఈ ఫోటో అసలుదేనా అని ప్రశ్నిస్తూ ఆర్‌టిఐ చట్టం కింద సమాచారం కోరారు. దానికి కేంద్రీయ ప్రభుత్వ సమాచార అధికారి, అండర్ సెక్రటరీ బి కే రాయ్ నుండి కార్యకర్తకు బదులు వచ్చింది.
సదరు సమాధానాన్ని జనతా కా రిపోర్టర్ వెబ్ సైట్ ప్రచురించింది. దానిని కింద చూడవచ్చు.
సదరు ఫోటోలో ఉన్నది ప్రధాని నరేంద్ర మోడి కాదని ఆ ఫోటో ఫోటోషాప్ ద్వారా మార్ఫింగ్ చేశారని అధికారి తన సమాధానంలో పేర్కొన్నారు.
కార్యకర్త అడిగిన సమాచారం ఆర్‌టిఐ పరిధిలోనిది కాదంటూ అధికారి తన సమాధానం మొదలు పెట్టారు. అంతటితో ఊరుకుంటే సరిపోయి ఉండేది. ఆయన, బహుశా, తన పరిధి దాటి వెళ్ళి ఫోటో మార్ఫింగ్ చేసినదన్న ‘అదనపు’ సమాచారాన్ని కూడా అందించారు
ఈ ఫోటోషాప్ మార్ఫింగ్ కళ ఎన్నికలతోనే ముగిసిపోలేదు. బిజేపి అధికారం చేపట్టి నరేంద్ర మోడి ప్రధాన మంత్రి అయ్యాక మార్ఫింగ్ జబ్బు నేరుగా కేంద్ర ప్రభుత్వ అధికారులకే పాకిపోయింది.
తమిళనాడు-చెన్నైలో వరదలు సంభవించినప్పుడు ప్రధాన మంత్రి మోడి తమిళనాడుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. సదరు సర్వే ఫోటోలను యధాతధంగా ప్రచురించడానికి బదులు మార్ఫింగ్ చేసి మరీ ట్విట్టర్ లో ప్రచురించాయి.
ఫలితంగా ప్రధాన మంత్రి కార్యాలయం ఇబ్బందిలో పడిపోయింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చివరికి ఫోటోషాప్ ఇన్ఫర్మేషన్ బ్యూరోగా అవతరించిందని పత్రికలు తీవ్ర స్ధాయిలో విమర్శించాయి. దానితో పిఐబి ఆ ఫోటోను తమ ట్విట్టర్ పేజీ నుండి ఆ ఫోటోను అధికారులు తొలగించారు. ఆ ఫోటో ఇదే. ఆ పక్కన అసలు ఫోటో. ఆ పక్కన మార్ఫింగ్ కు అరువు తెచ్చుకున్న ఫోటో.
కానీ అప్పటికే ఆలస్యం అయింది. పిఐబి ఫోటోషాపింగ్ కళను ఎద్దేవా చేస్తూ తమదైన ఫోటోషాప్ మార్ఫింగ్ తో వివిధ ట్విట్టర్ పేజీలు సృజనాత్మకతకు పదును పెట్టాయి. ట్విట్టరాటి ప్రచురించిన వివిధ మార్ఫింగ్ ఫోటోలు చూడండి!
మీ ఓపిక!
మోదీ(అనుచరగణం) ఈ ఫొటొ గురించి మరొ కల్లుబొల్లి కబురు చెప్పడం తధ్యం!
స్వచ్చభారత్ కార్యక్రమం సంధర్బంలో ఈ ఫొటొ మరలా ప్రచారంలోకి వచ్చింది.
మోదీ ఈ దేశాన్ని ఉద్ధరించేస్తాడని ఊకదంపుడు ప్రచారం బాగా జరిగింది.
అది ఎలాగూ జరగకపోగా,అతివాద మూకల పిచ్చిప్రేలాలాపనలూ,చర్యలు విస్తృతంగా వ్యాప్తిలోకి రావడం జరిగింది.ఆ ముసుగులో సంపదలదోపిడీ కార్యక్రమాలకు విస్తృతంగా బాటలువేయడం జరుగుతోంది.
ఇదీ మనమోదీ అసలు రంగు.