రోహిత్ వేముల కులంపై చర్చ ఇంకా ముగియలేదు. పత్రికలు, ఛానెళ్లు, ప్రభుత్వాధికారులు, పోలీసులు ఈ సమస్యను ఇంకా కలియబెడుతూనే ఉన్నారు. రోహిత్ దళితుడా కాదా అన్నది అర్జెంటుగా తేల్చేయ్యాలన్నది కొందరి పంతంగా కనిపిస్తోంది.
నిజం చెప్పాలంటే రోహిత్ దళితుడే అని నమ్ముతున్నవారికి ఎలాంటి సమస్యా లేదు. వారా చర్చలో నుండి ఎప్పుడో వెళ్ళిపోయారు. వారు రోహిత్ కు, అతనితో పాటు సస్పెండ్ అయినవారికి న్యాయం జరగాలన్న డిమాండ్ తో ఉద్యమంలో మునిగి ఉన్నారు. ఎటొచ్చీ రోహిత్ దళితుడు కాదని నమ్ముతున్నవారికే వచ్చింది సమస్యంతా. రోహిత్ దళితుడు కాదని రుజువు చేస్తే తప్ప వారికి శాంతి లేదు.
రోహిత్ దళితుడు కాదని రుజువు చేసే బాధ్యత రెవిన్యూ, పోలీసు అధికారులపై కూడా మోపినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రోహిత్ ఇంటికి, వారి తండ్రి ఇంటికి, వారి తాతల ఇంటికి రెవిన్యూ అధికారులు, పోలీసు అధికారులు క్యూ కట్టి మరీ వెళ్ళి వస్తున్నారు.
రోహిత్ దళితుడు కాకపోతే సగం సమస్య ప్రభుత్వాలకు తీరిపోతుంది. కేంద్ర మంత్రి దత్తాత్రేయ పైన పోలీసులు ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల (నిరోధం) కేసు పెట్టారాయే. కేంద్ర పాలక పార్టీ బిజేపి అనుబంధ విద్యార్ధి సంఘం ఏబివిపి నాయకుడి పైన కూడా ఆ కేసు పెట్టి ఉన్నారు. రోహిత్ ఎస్‌సి కాదు అని రుజువు చేస్తే ఇక కేసు లేదు కదా!
అసిస్టెంట్ కమిషనర్ స్ధాయి పోలీసు అధికారి రోహిత్ తండ్రి, తాత గార్ల వద్దకి వెళ్ళి వారి స్టేట్ మెంట్లు తీసుకొని వెళ్లారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగా తమపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాల గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్తే కానిస్టేబుల్ కూడా పట్టించుకోడు. తిట్టి, తిప్పి పంపేస్తారు. కాస్త గట్టివాళ్లైతే సాధ్యమైనంత వరకు కేసు నమోదు చేయకుండా రాజీ చేసుకోమని బోధిస్తారు.
అలాంటిది అసిస్టెంట్ కమిషనర్ గారు రోహిత్ తండ్రి, తాత గార్ల స్టేట్ మెంట్ తీసుకోవడానికి స్వయంగా గురజాల వెళ్లారంటే అధికార వ్యవస్ధ తీవ్రంగా శ్రమిస్తున్నదన్నమాటే. కానీ వారి శ్రమ రోహిత్ కి, అతని సహచరులకు జరిగిన అన్యాయాన్ని సవరించడం కంటే అతను ఎస్.సి కాదు అని రుజువు చేయడానికే అయినట్లు కనిపిస్తోంది. కాదంటే రోహిత్ తాత గారి నుండి కుల ధృవీకరణ పొందవలసిన అవసరం ఈ సమయంలో ఎందుకు వస్తుంది?
రోహిత్ తల్లి కూడా వడ్డెర కులమే అని రోహిత్ తండ్రి, ఆ తండ్రి గారి తండ్రి (తాత) నొక్కి వక్కాణిస్తున్నారని పత్రికలు కోడై కూస్తున్నాయి. ఆమె తాను వడ్డెర అని చెప్పినందునే పెళ్లి చేసుకున్నానని ఆయన చెబుతున్నారు.
“మేము బి.సి లకు చెందిన వడ్డెర కులస్ధులము. మీడియాలో వచ్చిన కుల ధృవీకరణ పత్రం రోహిత్ అమ్మమ్మ తప్పుడు సాక్ష్యంతో తెచ్చింది. నాకు ఈ సంగతి తెలియనివ్వలేదు. నా భార్య అమాయకురాలు (ignorant)” అని రోహిత్ తండ్రి వేముల నాగ మణి కుమార్ చెప్పినట్లు వివిధ పత్రికలు చెబుతున్నాయి.
ది హిందు పత్రిక సమాచారం ప్రకారం రోహిత్ తల్లి పైన ఆమె మాజీ భర్త మణి కుమార్, ఆమె మామ వెంకటేశ్వర్లు కోపంగా ఉన్నారు. రాధిక (రోహిత్ తల్లి) వల్ల తన కొడుకు పిచ్చివాడుగా మారే స్ధితికి వచ్చాడని మామ గారు ఆరోపిస్తున్నారు.
1985లో తన కొడుకు, రాధిక పెళ్లి జరిగిందని వెంకటేశ్వర్లు చెప్పారు. రాధిక తండ్రి విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ కాగా తల్లి టీచర్ అనీ ఆయన చెప్పారు. పెళ్లి అయ్యాక గుంటూరు వెళ్లారని అక్కడ కూతురు శ్రీదేవి, కొడుకు పుట్టారని కానీ మూడో బిడ్డ రాజా చైతన్య పుట్టాక భ్యార్యా భర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారని ఆయన చెప్పారు.
“నా ఆస్తిలో ఒక భాగాన్ని కొడుక్కి ఇచ్చాను. వారి విడాకుల బాధనంతా భరించాను. దీనంతటికీ నా కోడలే కారణం” అని వెంకటేశ్వర్లు తీర్మానించారు.
సరే, ఇండియాలో కుటుంబ గొడవలకన్నింటికీ సాధారణంగా స్త్రీలే కారణం అవుతుంటారు. “కుటుంబాన్ని నిలబెట్టాలన్నా ఆడదే, కుటుంబాన్ని కూల్చాలన్నా ఆడదే” అన్న నానుడి పల్లెల్లో మొరటుగా, పట్నాల్లో కాస్త మర్యాదగా వింటుంటాము. కనుక రాధిక, మాణికుమార్ ల గొడవకు కూడా ఆమెయే కారణం అయి ఉండవచ్చు, ఆశ్చర్యం లేదు.
కానీ ‘నేను మాల’ అని రాధిక స్వయంగా చెప్పుకున్నాక ఆమె మాల కాకుండా ఎలా పోతుంది? ‘రాధిక అమాయకురాలు. ఆమె తల్లి దొంగ సర్టిఫికేట్ తెచ్చింది’ అని రోహిత్ తండ్రి చెబుతుంటే, ఆ తండ్రి తండ్రి గారేమో “అసలు ఇదంతా చేసేంది ఆమే. ప్రభుత్వాన్ని మోసం చేసి దొంగ సర్టిఫికేట్ తెచ్చింది. రోహిత్ చావు నాకు బాధగా ఉన్నా, ఆమెను మాత్రం నేను క్షమించబోను” అని ఆగ్రహం ప్రకటిస్తున్నారు. ఆయన కోపానికి కారణం విడాకులా లేక తప్పుడు సర్టిఫికేటా అన్నది తెలియలేదు.
రాధిక గారు ఆమే చెప్పినట్లు ‘మాల’ కులానికి చెందినవారైతే రోహిత్ కూడా చట్టబద్ధంగా మాల అవుతారు. ఆ సర్టిఫికేట్ తప్పు అయితే మాల, చట్టబద్ధంగా, కాలేరు. రాధిక తల్లి దండ్రుల్లో ఏ ఒక్కరు మాల అయినా రోహిత్ కూడా ‘మాల’ అవుతారు, చట్టబద్ధంగా కూడా సుమా!
****************
ఇది చట్టాల గొడవ. ఒక వేళ అంతిమంగా రోహిత్ వడ్డెర అయ్యారని భావిద్దాం, వాదనకు. అయితే దళితుడు కాదా? అసలు ‘దళిత సమస్య’ అంత ముఖ్యమా? ఈ అంశంపై బ్లాగ్ లో రాసిన పోస్టుల కింద కొందరు మిత్రులు వ్యాఖ్యలు రాశారు, “అసలిది దళిత సమస్యగా కాకుండా విద్యార్ధి సమస్యగా చూడలేరా” అని.
విద్యార్ధి సమస్యగా తప్పకుండా చూడవచ్చు, చూడాలి కూడా. ఆయన విద్యార్ధి అయినందు వల్లనే అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యుడు అయ్యారు. విద్యార్ధి కనుకనే విద్యార్ధి సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమిస్తున్నారు. రోహిత్ సస్పెన్షన్ సమస్య, ఆత్మహత్య సమస్య అన్నీ ఆయన విద్యార్ధి అయినందునే తలెత్తాయి. కనుక ఇది విద్యార్ధి సమస్య కాకుండా ఎలా పోతుంది?
వచ్చిన చిక్కల్లా ‘దళిత విద్యార్ధి’ అని చెప్పడమే. ‘విద్యార్ధి సమస్య’ గా ఎందుకు చూడరు అన్నది ప్రశ్న. ‘దళిత విద్యార్ధి సమస్య’ గా ఎందుకు చూడకూడదు, అన్నది నా ప్రశ్న.

Chalo UoH on Jan 27th
రోహిత్ చనిపోయారు కాబట్టి ఆయన కులం దళిత కులమా కాదా అన్న ప్రశ్న వస్తోంది గానీ, సస్పెండ్ అయిన ఇతర నలుగురు విద్యార్ధులు దళితులే కదా. సస్పెండ్ అయిన ఐదుగురు విద్యార్ధులు ఏఎస్‌ఏ కార్యకర్తలు. వారిలో ఒకరు వడ్డెర అయితే ఇది ‘దళిత విద్యార్ధి సమస్య’ కాకుండా పోతుందా?
“దళిత విద్యార్ధి సమస్య” ఎందుకు అయిందో గత పోస్టుల్లో చెప్పాను. మళ్ళీ చెబుతాను.
అసలు ఘర్షణ అంతా ముజఫర్ నగర్ మతోన్మాద అల్లర్లపై రూపొందించిన డాక్యుమెంటరీని ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రదర్శిస్తుంటే ఏబివిపి అడ్డుకుని దాడి చేశారు. ఈ దాడిపైన UoH లోని ఏఎస్‌ఏ స్పందించింది. ఆ తర్వాత యాకూబ్ మెమెన్ ఉరితీతను నిరసిస్తూ ఏఎస్‌ఏ నిరసన ప్రదర్శన నిర్వహించింది.
ఈ ప్రదర్శనను ఏబివిపి నేత నిరసనగా చూడకుండా ఏఎస్‌ఏ ను దూషణతో సంబోధిస్తూ ఫేస్ బుక్ లో వ్యాఖ్య చేశారు. దానిని ఉపసంహరించుకోవాలని ఏఎస్‌ఏ కోరడం, గొడవ, సస్పెన్షన్ ఇవన్నీ తెలిసినవే.
ఈ గొడవలో ఆ ఐదుగురు విద్యార్ధుల ఉనికి “అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్” గానే వ్యక్తం అవుతున్న సంగతిని చూడాలి. అంబేడ్కర్ అనుయాయులు ఎవరు అంటే తమను తాము దళితులుగా గుర్తించుకున్నవారే. వారు తప్ప అంబేద్కర్ ను కాంగ్రెస్ నేతగా, రాజ్యాంగ నిర్మాతగా, మేధావిగా గుర్తిస్తున్నవారు ఎవరు, ఒక్క వామపక్షాలు తప్ప? ఆ మాటకొస్తే రిజర్వేషన్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టినందుకు ఆయన్ని ద్వేషించేవారికి, బహిరంగంగా కాకపోయినా, కొదవ లేదు. ఇది ఒక సంగతి.
సస్పెండ్ అయింది ఐదుగురు విద్యార్ధులు. రోహిత్ ని వదిలేస్తే మిగిలిన నలుగురూ దళితులే. వారిని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఎలా సంబోధించారు? “కులతత్వవాదులు” (castiest) “జాతీయ వ్యతిరేకులు” (anti-national) అని.
దౌర్భాగ్యం కాకపోతే సమాజంలో, రాజకీయాల్లో, విద్యాలయాల్లో, గుళ్ళు గోపురాల్లో, కోర్టుల్లో, పోలీసు స్టేషన్లలో అడుగడుగునా కులంతో తప్ప మనిషిని మనిషిగా గుర్తించలేని పరిస్ధితి ఉంటే, దళిత కులాలను అవమానపరిచే పరిస్ధితులే ఉంటే, అది ‘కులతత్వం’ కాకుండా, కులతత్వాన్ని ప్రశ్నిస్తున్నవారు “కులతత్వవాదులు” కావడం ఎలా సంభవం?
పోలీసు స్టేషన్ కి వెళ్తే కులం తప్పనిసరి. కోర్టుల్లో కులం ప్రస్తావన లేకుండా కేసులు నడవ్వు. పెళ్లి సంబంధం కోసం వెళ్తే కులం అడుగుతారు. అద్దెకు ఇల్లు ఇవ్వమంటే కులం ఏమిటంటారు. ప్రేమించబోతే కులమే అడ్డం. ఆరాధించబోతే కులమే అడ్డం. ‘నువ్వు నీచ కులం’ అని అడుగడుగునా చెబుతూ ‘ఆ నీచ కులంగానే సంఘటితం అవుతాం’ అంటే ‘కులతత్వం’ అనడం ఏమి న్యాయం?
గుంటూరులో జాగర్లమూడి కమ్మ హాస్టల్ అని ఒకటుంది. బ్రాహ్మణ భోజనశాలలకు లెక్కే లేదు. రెడ్డి హాస్టల్, కమ్మ హాస్టల్ లు పట్నాల్లోనే కొలువు తీరి ఉన్నాయి. వైశ్య సంక్షేమ సంఘం, బ్రాహ్మణ సంక్షేమ సంఘం… ఇలా ఎన్ని కుల సంస్ధలు, సంఘాలు లేవు. ఇవేవీ ‘కులతత్వ’ వాదులు కాకుండా ‘అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్’ మాత్రమే ‘కులతత్వ’ వాది ఎలా అయింది?
మెసేటప్పుడు చేలో ఉండాలి. దున్నేటప్పుడు గట్టు మీద సేద తీరాలి. అన్యాయం కాదా?
ఏఎస్‌ఏ విద్యార్ధులను “కులతత్వవాదులు” అని సంబోధిస్తూ, ఆరోపిస్తూ “వారిపై చర్య తీసుకోండి” అని కేంద్ర మంత్రి మరో కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఆ మరో కేంద్ర మంత్రి ‘చర్యలు తీసుకున్నారా లేదా?’ అంటూ లేఖలపై లేఖలు, హెచ్చరికలపై హెచ్చరికలు చేశారు.
ప్రభుత్వమే ‘కులతత్వం’గా ఏఎస్‌ఏ చర్యలను ఆరోపిస్తూ, “జాతీయ వ్యతిరేకం’ అని నిర్ధారిస్తూ సస్పెన్షన్ చర్య తీసుకున్నాక ఆ చర్య ఏఎస్‌ఏ కులాల పైనా కాకుండా ఉంటుందా? ఏఎస్‌ఏ కు చెందిన దళిత కులాల విధార్ధులపై తీసుకున్న ‘అణచివేత’ చర్య కాకుండా ఉంటుందా?
కులం అన్నది నువ్వే. కులం అని చెప్పి చర్య తీసుకున్నది నువ్వే. ఆ చర్యకు ప్రతిస్పందనలో మాత్రం ‘కులం’ ఉండకూడదు అనడం ఏమి న్యాయం?
మంత్రులు, ఏబివిపి మాత్రమే కాదు, యూనివర్సిటీ అధికారులు కూడా ఏఎస్‌ఏ ఉనికిని ‘కులతత్వం’గా తమ నివేదికలో పేర్కొన్నారు. “క్యాంపస్ లో కుల సంఘాలు, మత సంఘాలు, పెరిగిపోతున్నాయి. ఈ పరిస్ధితిపై దృష్టి సారించాలి” అని వారు భవిష్యత్తు కోసం ఒక పరిశీలన నమోదు చేశారు.
ఇంతమంది కులం అని చెబుతుంటే బాధిత విద్యార్ధుల ప్రతిస్పందనలో, ఉద్యమకారుల ప్రతిస్పందనలో, విశ్లేషణల్లో ‘కులం’ ‘కుల ప్రస్తావన’ లేకుండా ఎలా ఉండగలదు?
అలాగైతే ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టమే కులతత్వం కాదా? రిజర్వేషన్లు ప్రతిపాదించిన అంబేద్కర్ ‘కులవాది’ కారా? కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, నీరుకొండ లలో ఆధిపత్య కుల మారణకాండలో న్యాయం జరగాలంటూ దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన దళితులు కులతత్వంతోనే తిరుగుబాటు చేసినట్లు కాదా?
ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాము?
ఇన్నాళ్లూ కింది కులాలు, నిజానికి ఇప్పటికీ, తమ కులం ఖర్మ ఫలితం అని నమ్ముతున్నారు. వారిలో కొందరు అలా నమ్మడానికి సిద్ధంగా లేరు. అందిన ఆయుధం పట్టుకుని తిరుగుబాటు చేస్తున్నారు. వారి తిరుగుబాటుకు కారణం కులతత్వం. కానీ తిరుగుబాటు కూడా ‘కులతత్వం’ అంటారేమీ? ఎవరి బుద్ధి గడ్డి తింటున్నట్లు?
అవును. రోహిత్, ఇతర నలుగురిది విద్యార్ధి సమస్యే. విద్యార్ధి సమస్య “కూడా.”
‘ఈ నిర్దిష్ట సందర్భంలో’ వారిది ఓం ప్రధమం ‘దళిత సమస్య’. ఆ తర్వాతనే ‘విద్యార్ధి సమస్య.’ ఎందుకంటే వారిపై చర్య తీసుకున్నది ఆ దృష్టితోనే. వారు కులతత్వవాదులు అన్న దృష్టితోనే చర్య తీసుకున్నారు. వారిది దళిత కులం. అందుకే ఇది ఓం ప్రధమం ‘దళిత సమస్య’. ఆ తర్వాత విద్యార్ధి సమస్య.
‘దళిత సమస్య’ అనగానే అది దళితేతర కులాలకు వ్యతిరేకం అయినట్లు కాదు. ఇక్కడ దళితులపై అణచివేత మోపింది హిందూత్వకు చెందిన రాజకీయ పార్టీ నేతృత్వంలోని రాజ్యం. వారిని ఫేస్ బుక్ లో దూషించింది ఆ హిందూత్వకు చెందిన విద్యార్ధి సంస్ధ. అందువలన సస్పెన్షన్ చర్య, హిందూత్వ రాజ్యం తీసుకున్న దళిత వ్యతిరేక చర్య. అందుకనే అది దళిత సమస్య.
“ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. దీనితో (ఆత్మహత్యతో) బిజేపి కి గానీ, ఏబివిపి కి గానీ ఎలాంటి సంబంధమూ లేదు” అని ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారని జనవరి 20 నాడు ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక నివేదించింది. హిందూత్వ పార్టీ, ఏబివిపి ఎంత దగ్గరో ఆయన సమాధానం చెప్పడం లేదా? (ఆ తర్వాత అంటే, ఆయన లేఖ రాసిన తర్వాత.)
కనుక రోహిత్, ప్రశాంత్, విజయ్ కుమార్, శేషయ్య, సుంకన్నలు ఎదుర్కొన్న సస్పెన్షన్ దళిత విద్యార్ధులకు వ్యతిరేకంగా తీసుకున్న ఆధిపత్య చర్య. అందుకే ఆ చర్య ‘దళిత వ్యతిరేక చర్య’ అయింది. ఉద్యమం కూడా ఆ దృక్పధాన్నే వహిస్తుంది. వహించాలి. లేకపోతే ఆ ఉద్యమం వ్యర్ధం. తగిన న్యాయం దక్కకపోతే మరో ‘న్యాయం దొరకని దళిత అణచివేత’ గా ఈ ఘటన కూడా చరిత్రలో రికార్డు అవుతుంది.
విద్యార్ధులు దళితులు కాకపోతే ఇలా అనేవారా? అని మిత్రులు ప్రశ్నిస్తున్నారు. ఆనం. ఎందుకు అంటాం? గమనించాల్సింది ఏంటంటే వారు దళితులు కాకపోతే అసలీ చర్యే ఉండేది కాదు. వారు ఏఎస్‌ఏగా ఆర్గనైజ్ అయ్యి తమ ఉనికిని చాటుతున్నారు గనుకనే సస్పెన్షన్ చర్య తీసుకోబడింది.
జరిగిన ఘటనపై కేంద్రీకరించి చర్చ చేయాలి గానీ, ‘అలా అయితే’, ‘అలా కాకపోయి ఉంటే’ అన్న ఊహలపై చర్చలు చేసుకోవడం ఎందుకు? దానివల్ల ఏ ప్రయోజనమూ నెరవేరదు.
**************
రోహిత్ దళితుడేనా?
ఈ ప్రశ్న అసలు అర్ధం ఏమిటంటే రోహిత్ ది వడ్డెర కులం. కనుక ఆయన దళితుడు కాదు. కనుక ‘దళిత విద్యార్ధి’ అంటూ భావోద్వేగాలు రేపడం ఎందుకు అని.
రోహిత్ చనిపోయాకనే భావోద్వేగాలు రేగాయి తప్ప అంతకు మునుపు దళిత అణచివేత ఉన్నా భావోద్వేగాలు లేవు అని ఈ ప్రశ్న ద్వారా సూచిస్తున్నారు. ఇది పరమ అన్యాయం. గొంతు విప్పితే ఒక పేరు, గొంతు విప్పక పోతే మరొక పేరు. స్పందిస్తే ఒక పేరు. స్పందించకపోతే మరో పేరు. ఏమి న్యాయమండీ ఇది.
పోనీ వడ్డెర అనుకుందాం. అయితే దళితుడు కాదా?
‘దళిత్’ అంటే అణచివేతకు గురయినవాడు అని అర్ధం వడ్డెర కులం వాళ్ళు సాంఘికంగా ఎస్‌సి/ఎస్‌టి ల కంటే ఒక మెట్టు పైన ఉండవచ్చు గానీ వాళ్లూ హిందూ కుల వ్యవస్ధలో అట్టడుగున ఉన్నవారే కదా.
దళితులు అంటే ఎవరో ambedkar.org వాళ్ళే ఏం చెబుతున్నారో చూడండి.
The root word of this word Dalit is Dal. The adjective of dal is Dalit. We find this word dal on page 471 of the prestigious Oxford Sanskrit English Dictionary, new edition, 1964, edited by the world – famous Sanskrit scholar, Sir Monier Williams.
“Dalit” is found in many Indian languages and even a Dravidian language. The meaning given to `Dalit’ in the dictionary is: burst, split, scattered, dispersed, broken, torn as under, destroyed, crushed…
…The first to popularise this word were our militant Dalit Panthers of Bombay. Their manifesto has defined this word. Though this word has now come to mean Untouchables, the Panthers have included Tribes, Muslims, Women and all those persecuted minorities.
కనుక దళితులు అంటే ఒక్క ఎస్‌సి, ఎస్‌టి లే కాదు. మొదటిసారి ‘దళిత్’ పదాన్ని వాడుకలోకి తెచ్చిన ‘దళిత్ పాంధర్స్ పార్టీ వాళ్ళు ఎస్‌సి, ఎస్‌టి లతో పాటు ఆదిమ తెగలు, ముస్లింలు, మహిళలు… తదితర అణచివేతకు గురవుతున్న ప్రజా సమూహాలను దళితులుగా గుర్తించారు.
కనుక రోహిత్ వడ్డెర అయినా దళితుడే. తనను తాను దళితునిగా రోహిత్ గుర్తించుకున్నాక ఇతరులకు సందేహం అనవసరం. ఇది రోహిత్ ఒక్కరి సమస్య కాదు. ఐదుగురు విద్యార్ధుల సమస్య. ఏఎస్‌ఏ ఎదుర్కొన్న సమస్య. ఏబివిపి అనే హిందూత్వ సంస్ధ చర్యలతో విసిగిపోయిన విద్యార్ధి లోకం సమస్య. ఇతర నలుగురూ ఎస్‌సి కులాల వారే గనుక మొత్తంగా దళిత సమస్య.
ఈ దళిత సమస్య దళితేతరులు సృష్టించినది కాదు. హిందూత్వ రాజ్యం సృష్టించిన సమస్య. ప్రాచీన హిందూ సంప్రదాయాలను పునరుద్ధరించే కృషిలో నిమగ్నమైన హిందూత్వ గుప్తుల స్వర్ణయుగం నాటి కరుడుగట్టిన కుల వ్యవస్ధను ఆధునిక రూపాల్లో పునరుద్ధరించడానికి కంకణం కట్టుకుంది. ఇది దళితులకే కాదు, ప్రజాస్వామిక భావాలు కలిగిన దళితేతరులకు కూడా సమస్యే. అందుకే దళితేతరులు సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు.
దళితేతరులు ఉనికిలో ఉన్న ‘దళిత సమస్య’ ను గుర్తించడం ప్రగతిశీలం. కుల సమస్య ఉనికిని గుర్తించి, తృణీకరిస్తేనే కుల వ్యవస్ధ బలహీనం అవుతుంది. భాగస్వాములందరూ కులాల కుళ్లును కడిగివేసేందుకు ఉద్యుక్తం కావాలి. ఒక్క దళితులు మాత్రమే స్పందిస్తే అది మళ్ళీ ghettoisation కు మాత్రమే దారి తీస్తుంది.
కుల విభేధాలు లేకుండా విద్యార్ధులందరి నుండి వ్యక్తం అవుతున్న స్పందనను ఆహ్వానించాలి. వారిలో లేనివారు ఇప్పుడు కూడా వారిలో కలవచ్చు. ఆలస్యం వలదు.
మనుషులు అనే మహాసముద్రంలో కులాలు,మతాలు,జాతులు అనే పిల్లకాలువాలు ఎన్నో కలిసిపోతుంటాయి.సముద్రాన్ని పిల్లకాలువాలతో సంభోదించలేముకదా!ప్రజలలో శాస్త్రీయదృక్పధాన్ని నెలకొల్పలేకపోవడంతో ఇంకా వెనుకబాటుతనపుభావాలు తమప్రభావాన్ని కొనసాగించగలుగుతున్నాయి.
కులాలపరంగా(రిజర్వేసన్స్ పరంగా తీసుకున్నా,సామాజిక పరిస్తితులపరంగా తీసుకున్నా) బి.సి లను అణగదొక్కబడిన కులాల వారికి చేయూతనివ్వకుండా రాజ్యం దూరంపెట్టగలిగారు.దీనితో జనాభాపరంగా;కులాలపరంగా అణగదొక్కబడడన్ని అత్యధికులసమస్యకాకుండా చేయగలిగారు.
http://www.hindustantimes.com/static/rohith-vemula-an-unfinished-portrait/index.html
‘”దళిత సమస్య’ అనగానే అది దళితేతర కులాలకు వ్యతిరేకం అయినట్లు కాదు.” ఇది దళితేతరులు ఎప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటారో… అప్పుడు వాళ్ళు కాళ్ళల్లో కర్రల్లా మారే పని మానుకుంటారు.
it seems vishekar trying to defend him. All this problem started when they supported yakoob memon. as an Indian this is unacceptable why don’t you treat as an anti-nationalist instead of Dalit. If the problem is of Dalits as you said, all the Dalits would have suffered but no. so, the suspension aimed at those anti nationalists that’s it not aimed at dalits.
ప్రజలను వేల కులాలుగా విభజిస్తే,అది ఒక దేశంగా లేదా జాతిగా ఎలా మనగలుగుతుంది? సాంఘికంగా చూసినా,వైజ్ఞానికంగా చూసినా మనమింకా ఒక దేశ పౌరులుగా,సమగ్ర జాతిగా రూపొందలేదన్న సత్యాన్ని ఎంత త్వరగా గుర్తిసే అంత మంచింది–డాక్టర్ బీఆర్ అంబేద్కర్
26/01/2016 నాటి సాక్షి దినపత్రికలోని ఏబీకే ప్రసాద్ గారి వ్యాఖ్యానం.
దళిత వివక్ష అంటూ నొక్కి వక్కాణించి బోలెడంత చెప్పేసారు కానీ, అసలు అతను చట్టాన్ని చేతుల్లోకి ఎందుకు తీసుకున్నాడో, ఎందుకు సస్పెండ్ అయ్యాడో మాత్రం ఒక్క వాక్యంలో భలేగా తేల్చేసారే?!
ఏ చట్టాన్ని చేతిలోకి తీసుకునేప్పుడు తెలియదా అతనికి కాని సదరు అంబేడ్కర్ సంఘానికి కాని, చట్టం అన్ని కులాలకీ ఒకేలా వర్తిస్తుందని?
ఇక కులం ముఖ్యమా ముఖ్యమా అని అంథలా వాదిస్తున్నారే, మరి అసలు ఇంతలా దళిత విధ్యార్ధి దళిత విద్యార్ధి అని పది రోజులుగా అంతటా హోరెత్తించేసారే? సరే ఇదంతే ఏదో మాకు ఈ కర్ణశోష తప్పదు అనుకొని మేము భరించేస్తాము.
కానీ ఆత్మహత్యకు సంబందించి పెట్టిన కేసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ఖేసుల గురించి బొత్తిగా మాట్లాడరే? అంటే అదొక ఆయుధంగా చేసుకొని చట్టనికి వ్యతిరేకంగా ఎం చేసినా మీ దృష్టిలో న్యాయమే అన్నమాట?
ఇక అసిస్టెంట్ కమిష్నర్ స్తాయి ఆఫీసర్ ఎందుకు వెళ్ళి దర్యాప్తు చేయాల్సి వచ్చింది అని మీరు అన్నారే, అసలు రోహిత్ పార్ధివ దేహాన్ని మేము పోస్టు మార్టెం కి ఇవ్వం అనే హక్కు విద్యార్ధి నాయకులకి ఎవరిచ్చారు? అది మరి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కాదా? సవాన్ని పోస్ట్మార్టెం కి తీసికెళ్ళదానికి 200 మంది పోలీసుల బలగం అవసరమైన సందర్భం ఈ కేసుది. అసిస్టెంట్ కమిష్నరు కాదు కదా, స్వయానా సైబరాబాద్ పోలీసు కమిష్నరే దర్యప్తుకి గుంటూరు వెళ్ళినా ఏమాత్రం తప్పు పట్టల్సిన పని లేదు. కేసుకి అంతటి ప్రాముఖ్యం విధ్యార్ధి సంఘాలు కల్పించాయి.
కాబట్టి ఈ కల్లబొల్లి మాటలతో కాలం వృధా చేసుకోక, ఎదైనా రోహిత్ కుటుంబానికి పనికి వచ్చే పని చేస్తే మీకూ వారికీ ఈ సమాజానికి చట్టానికి అందరికీ మంచిది.
ఒక చిన్న facebook పోస్ట్ కు వెళ్లి సుషీల్ అనే విద్యార్ధి ని ప్రస్నిన్చాడము పేరు మీద అర్దరాత్రి అతని రూం మీద దాడి చెయ్యటము ఎంత వరకు సమంజసమో రచయిత చెప్పి వుంటే ఇంకా బాగుండేది.
ఇప్పటికి ఐన ప్రజాస్వామ్య వాదులకు కుల ముసుగు లో మత ముసుగు లో విద్యార్థుల పైన జరుగుతున్న దాడులు వెలుగు లోకి వచ్చినందులకు వాస్తవము బోధ పడుతుందని నమ్ముతున్నాను.
సుషీల్ కు కూడా ఏ కులం వాళ్ళో మద్దతు ఇస్తే సమస్య వుండేది కాదు.. ఎవరు లేదు కనుకనే మంత్రి కి మొరపెట్టుకోవాల్సిన అగత్యము ఏర్పడింది. ఒక వేళ అన్యాయాన్ని ఎదిరిద్దామా అని ఎవరు ఐన అనుకున్న వారి వారి ఇంటి సమస్యలు. ఇంట్లో అమ్మల పుస్తెల తాళ్ళు అమ్ముకుని చదువుకుంటున్నారు కదా.. ప్రతి నెలా ఇంటి నుండి వస్తేనే డబ్బు.. లేకపోతే చదువు వదులు కోవలసిన పరిస్థితి. ప్రతి విద్యార్ధి కి స్కాలర్షిప్ ఇస్తే ఏ గొడవ లేదు. కొంతమంది కి స్కాలర్షిప్ ఇచ్చి మిగత విద్యార్థులకి ఇంటి దగ్గిర నుండి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. సాధ్య మైనంత వరకు త్వరగా ఈ డిగ్రీ పూర్తి చేసి తల్లి దండ్రులను ఆడుకోవాల్సిన పరిస్థితి . అందుకే గొడవలు లేకుండా ఉండాలనే చాల మంది విద్యార్థులు ఆశిస్తారు.
ఒక చిన్న facebook పోస్ట్ కు వెళ్లి సుషీల్ అనే విద్యార్ధి ని ప్రస్నిన్చాడము పేరు మీద అర్దరాత్రి అతని రూం మీద దాడి చెయ్యటము ఎంత వరకు సమంజసమో రచయిత చెప్పి వుంటే ఇంకా బాగుండేది.
ఇప్పటికి ఐన ప్రజాస్వామ్య వాదులకు కుల ముసుగు లో మత ముసుగు లో విద్యార్థుల పైన జరుగుతున్న దాడులు వెలుగు లోకి వచ్చినందులకు వాస్తవము బోధ పడుతుందని నమ్ముతున్నాను.
సుషీల్ కు కూడా ఏ కులం వాళ్ళో మద్దతు ఇస్తే సమస్య వుండేది కాదు.. ఎవరు లేదు కనుకనే మంత్రి కి మొరపెట్టుకోవాల్సిన అగత్యము ఏర్పడింది. ఒక వేళ అన్యాయాన్ని ఎదిరిద్దామా అని ఎవరు ఐన అనుకున్న వారి వారి ఇంటి సమస్యలు. ఇంట్లో అమ్మల పుస్తెల తాళ్ళు అమ్ముకుని చదువుకుంటున్నారు కదా.. ప్రతి నెలా ఇంటి నుండి వస్తేనే డబ్బు.. లేకపోతే చదువు వదులు కోవలసిన పరిస్థితి. ప్రతి విద్యార్ధి కి స్కాలర్షిప్ ఇస్తే ఏ గొడవ లేదు. కొంతమంది కి స్కాలర్షిప్ ఇచ్చి మిగత విద్యార్థులకి ఇంటి దగ్గిర నుండి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. సాధ్య మైనంత వరకు త్వరగా ఈ డిగ్రీ పూర్తి చేసి తల్లి దండ్రులను ఆడుకోవాల్సిన పరిస్థితి . అందుకే గొడవలు లేకుండా ఉండాలనే చాల మంది విద్యార్థులు ఆశిస్తారు.
Why this blog is not publishing my comments
@SriValli Vidhyarthi rajkeeyallo avekave shaltho limit cross chestharu delhi univ lo mujafarnagar documentory vishyamulo lo ABVP chesindhi di adhey ….HCU lo ASA valla nu gunda lu annapudu valle action ku dhigi Sushil nu ghorava cheyadam adhey ( bahusha dhadi kuda chesi vundavachu ) kani avi antha sevear dhadi kadu ani HCU commitee ye chepindhi valla pai HCU ku thochinaa action thisukundhi. katha akkadi ke agipovali kani ….. madhya lo Dhathraya endhuku vachadu MLC lu endhuku vachadu , Smroothi irani endhuku vachindhi ….Just Vidhyarhi sanghala madhya jarigina chinna godavaloki intha madhi endhuku vacahru ayaa … .. Delhi Univ lo mujafar nagar lo jarigina dhadi kanpinchaledhaa ( http://www.fuccha.in/abvp-members-disrupted-the-screening-of-muzaffarnagar-riots-documentary-at-dus-kirori-mal-college/ )ki ye MP ye manthri endhuku ….arey idhi endhuku kanipisthayee ABVP emayeena cheyachu ….alanti gorave SC lu chesthey bayataku ella goduthamu govt lettet lu pampi pampi …….
@Ram Sushil ku ye kulam vallu sahayamu cheyaledu pitcha joke MLC Ramchandrao HCU ku vachi gorav endhuku chesadu .. HCU lo vunna Professor lu ekkuva mandhi OC lu kadha ..gatha VC ippati VC, kotha ga vachina incharge VC OC ye kada ..sushil kumar valla amma poosthelu ammukne antha peda ralla … mee kashyam vallaku abaddalu … photo morphing lu cheyadam entha suluvu ..first pegulu baytaku vachi nattu kottaru ani pracahram chesaru thira adhi appendices opertaion ani teli poyee na tharuvatha … kotha kotha abddala tho vastharaa …… NIjangaa ne HCU lo sc laku anthaa support vunte ippati varaku athmahathay lu chesukunna valla antah SC valla ku dorike support thattu ko leka anadam thattu ko leka ne suscide chesukunaraaa …. thala thoaka leni vadanalu kashaya rangu ku sahajame .
చందు, నువ్వెందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నావు అని అడిగితే వాడెవడో కూడా అదే కదా చేసింది అనే లాజిక్ ఏ కోర్టూ ఒప్పుకోదు సోదరా. రెండు తప్పులు కలిసినంత మాత్రాన అది ఒప్పు అయ్యిపోదు.
అసలు అర్ధరాత్రి ఒకరి గదికి 30-40 మంది వెళ్ళాల్సిన పరిస్తితి ఎందుకొచ్చింది? హాస్టల్ రూల్స్ అందుకు ఒప్పుకోవేమో? వెళ్ళిందే కాక, బెదిరించడం, కొట్టడం, బలవంతంగా క్షమాపణలు రాయించుకోవడం – ఇవన్నీ ఏ చట్టం ఒప్పు అని చెబుతుంది?
ఆక్షేపణలు ఉన్నంత మాత్రాన అలా గుంపుగా దాడి చేసేయడమేనా? విశ్వవిద్యాలయం లో క్రమశిక్షణ విషయంలో ఫిర్యాదులు చేయచ్చు కదా?
ఇక రోహిత్ ని సస్పెండ్ చేసిన హాశ్తల్ లోకి అతనని వెళ్ళనిచ్చింది ఎవరు? అతనితో పాటు ఆరుబయిట కూర్చున్న వారు అతను వెళుతుంటే ఏం చేసారు? హాస్టల్లోకి నువ్వు రావడం నిషిద్దం అని చెబితే ఆ అబ్బాయి మళ్ళీ ఒక సారి ధిక్కారం ప్రదర్శించి అక్కడికే వెళ్ళాడు. లోపలకి వెళ్ళాక ఎం జరిగిందో, విగత జీవి అయ్యి బైటికి వచ్చాడు.
ఇన్ని సార్లు చట్టాని చేతులోకి తీసుకున్న విషయం గురించి మాట్లాదండి అంటే ఎక్కడో డిల్లిలో జరిగిన విషయం మీద సోది చెప్పబోతున్నావు. అసలు ఆ డాక్యుమెంటరీ మీద కోర్టు పరిధిలోకి ఎందుకు వెళ్ళిందో కూడా చెప్పమంటావా?
కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు హోంవర్క్ బాగా చేసుకొని రా తమ్ముడూ.
“లోపలకి వెళ్ళాక ఎం జరిగిందో, విగత జీవి అయ్యి బైటికి వచ్చాడు.”
“అసలు ఆ డాక్యుమెంటరీ మీద కోర్టు పరిధిలోకి ఎందుకు వెళ్ళిందో కూడా చెప్పమంటావా?”
శ్రీవల్లి గారూ
మీ వద్ద అదనపు సమాచారం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఏమన్నా ఉంటే మాతో పంచుకోండి. విషయాలు అందరికీ తెలిపినట్లూ అవుతుంది.
@srivalli Hostel lo paliki veluthunte addukune hakku meeku evaru itacharu akka baga prepair ayee ravalaa ani vyakthi gathangaa salaha isthunnaru ante nenu itchi naa counter meeku baga thagilindhi annamata 🙂
@srivalli sodhi endhuku gani delhi dhadi nuvvu samrdistaava ledaa
శ్రీవల్లి, చందు గార్లకు,
చర్చ వ్యక్తిగతంగా కాకుండా విషయం పైన చేసుకుందాం. మీరు ఇంకా వ్యక్తిగత ప్రస్తావనలు చేయలేదు గానీ, కాస్త అటు వైపు వెళ్తున్నారు.
ఈ చర్చ ఆసక్తిగా సాగుతోంది. ఇది కొనసాగాలన్న దృష్టితో ఈ మాటలు చెబుతున్నాను. దయచేసి ఏమీ అనుకోకండి.