రోహిత్ వేముల ఆత్మహత్యకు తాము బాధ్యులం కాదని బాధ్యులైన వారంతా వివిధ మాటల్లో ప్రకటించారు.
“ఇది దళిత-దళితేతర సమస్య” కాదు అనీ “శిక్షించిన కమిటీ నేత దళిత ప్రొఫెసరే” అనీ ప్రకటిస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రి దూరం జరిగారు. “ఐదు రిమైండర్ లు రాయడం మామూలే. ఒత్తిడి కాదు” అని కూడా ఆమె నిరాకరించారు.
“ఇది నేను తీసుకున్న చర్య కాదు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్నది” అంటూ వైస్ ఛాన్సలర్ అప్పారావు గారు నిరాకరణ వ్రతం పాటించారు.
“అసలు రోహిత్ దళుతుడే కాదు” అని ఒక బి.జె.పి నేతా, “లేఖలో ఎవరినీ బాధ్యుల్ని చేయలేదు కదా” అని ఒక బి.జె.పి మంత్రీ తమ పార్టీని తప్పించేందుకు ప్రయత్నించారు.
“నా దగ్గరికి ఏబివిపి విద్యార్ధులు వస్తే లేఖ రాశా. అంతేతప్ప నాకేం తెలియదు” అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు తప్పుకోబోయారు.
“ఆత్మహత్యపై లోతుగా విచారణ చేయాలి” అని ఏబివిపి కూడా ప్రకటించేసింది. కారకులే విచారణ కోరితే సగం పాపం తగ్గిపోతుందని నమ్మిక కావచ్చు.
రోహిత్ ఆత్మహత్యకు నిజమైన కారకులు ఎవరో ఈ నిరాకరణలే చెప్పడం లేదూ!
ఈ CORTON. SPECIALITY ఏమంటె ఎవరు నోరు తెరవకా ముందే వచింది
గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడిమినట్లు…