ఒక నక్షత్రం రాలిపడలేదు; నేరుగా దివికే ఏగి వెళ్లింది. చుక్కల చెంతకు వెళ్తున్నానని చెప్పి మరీ వెళ్లింది.
ఆత్మలపై, దైవాలపై, దెయ్యాలపై నమ్మకంతో కాదు సుమా! తనను తాను ‘అచ్చంగా ఒక THING ని’ మాత్రమే అని తెలుసుకుని మరీ వెళ్లిపోయింది.
ఈ విశ్వం అంతా నక్షత్ర ధూళితో నిర్మితమై ఉన్నదన్న సర్వజ్ఞాన్య ఎరికతో ఆ పదార్ధం జీవాన్ని చాలించుకుని నక్షత్ర ధూళితో తిరిగి కలిసేందుకు సెలవంటూ వెళ్లింది.
ఆత్మహత్య పాపం కాకపోవచ్చు గానీ పరికితనం. నిజంగా పిరికితనమే.
కానీ ‘ఆత్మహత్య పిరికితనం అని చెప్పిన అజ్ఞాని ఎవరు?’ అని నిలదీసి పరిహసించే ఆత్మహత్యకు పాల్పడడం ఒక్క రోహిత్ వేముల కు మాత్రమే సాధ్యపడింది కావచ్చు.
రోహిత్ వేముల, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక పరిశోధక విద్యార్ధి (రీసర్చ్ స్కాలర్). సైన్స్-టెక్నాలజీ-సమాజం లో పరిశోధన చేస్తున్న రోహిత్ గుంటూరు జిల్లాకు చెందిన అత్యంత పేద దళిత విద్యార్ధి.
చిన్నప్పటి నుండీ “చుక్కల వైపు చూస్తూ నేను ఎప్పటికైనా రచయితను కావాలి” అని కలలు గన్న రోహిత్ తన పుట్టుక కలలు కనడానికి తనను అనర్హుడిని చేసిందని తెలిసి హతాశుడై, నమ్మలేక, నమ్మి నిలవలేక, తన ఉనికిని తానుగా రద్దు చేసుకున్నాడు రోహిత్ వేముల.
నిర్వికారం! నిర్వేదం!! తన ఉనికి ఈ ప్రపంచంలో ఎవరికీ, కనీసం చాలా మందికి, అక్కరలేదని, చివరికి తన ఉనికి తనకు కూడా చెందదని తెలిసిన రోజున సున్నిత హృదయులకు కలిగే భావనలు ఇవే. ఇవేనని చెప్పి మరీ వెళ్ళాడు రోహిత్ వేముల!
“నేను ఒట్టి ఖాళీని, అంతే!” అని రోహిత్ తన మొదటి, చివరి రచన చేస్తున్నప్పుడు అతని మదిలో మెదిలే భావాలను కాసిన్ని మాటలతో చెప్పడం చాలా కష్టం.
ఊహ తెలిసిన దగ్గర్నుండీ ఎన్నెన్ని దృశ్యాలను చూస్తాము. ఎన్నెన్ని సౌందర్యాలను కంటాము. ఇంకెన్ని మధురోహలను నింపుకుంటాము. బంధాలను-అనుబంధాలను, మిత్రత్వాలను-శతృత్వాలను, ఆందోళనలను-అనుభూతులను, నిజాలను-కల్పనలను, హీరోయిజాలను-విలనీలను, గొప్పతనాలను-జారుడుతనాలను… ఎన్నింటినో ఎదుర్కొంటాము, అనుభవిస్తాము, ప్రతిక్షేపించుకుంటాము, జీవిస్తాము, బాధిస్తాము, అనుభూతిస్తాము.
ఇవేవీ మనవి కావని, అవి మన జీవితంలో భాగం కాలేని సొంతం చేసుకోలేని జన్మలో ఉన్నామన్న ఎరుకలో లోకం ఉన్నదని జీవితంలో ఏదో ఒక క్షణాన… తెలియడం ఎవరినైనా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది; హతాశుల్ని చేస్తుంది; ఒక్కసారిగా మరుగుజ్జుడైపోయిన భావనను రుద్దుతుంది; తనది కానీ శరీరంలో తనది కాని జీవాన్ని అనుభవిస్తున్న స్వద్వేషం కలుగుతుంది.
రోహిత్ వేములకూ అదే కలిగింది.
యుద్దనపూడి సులోచనా రాణి నవలలు ఎందుకు పేద మధ్యతరగతి ఆడపిల్లలకు అంతగా నచ్చుతాయి? అవి కలల్లో తేలిపోయే అవకాశాన్ని ఇస్తాయి. తమకు తెలియని లోకాలు తమవేనని నచ్చజెపుతూ సుదూర స్వప్నాల వెంట స్వయంగా పరుగెత్తేలా చేస్తాయి. జీవన్మధుర తరంగాలపై తేలిపోయే అవకాశాలు మన పక్కనే ఉన్నాయన్న ఆశల్ని సృజింపజేస్తాయి. సుందర తీరాలలోకి చొచ్చుకుని వెళ్లిపోయే స్వేచ్చని ప్రసాదిస్తాయి. అలాంటి అవకాశాల ఆశలు కూడా కొందరికే సొంతమనీ, సొంతం కానివారి జాబితాలో మనకూ ఉన్నామని తెలిసిన రోజున…?
తెరపై అందమైన హీరోయిన్ తో కలిసి పాడుతూ విలన్లను చీల్చి చెండాడుతూ విజృంభిస్తున్న పాత్రలు జనులకు ఎందుకు నచ్చుతాయి? ఆ పాత్రల్లో తమను తాము విలీనం చేసుకున్నప్పుడే, ఆ హీరోతో తమను తాము ఐడెంటిఫై చేసుకోగలిగినప్పుడే అలాంటి పాత్రలు మనకు నచ్చుతాయి. తద్వారా మన హీరోయిజాన్ని తెరపై చూసుకుంటూ ఆనందించిన ఫలితమే సినిమా హాలులో మోగే ఈలలు, కేకలు, చప్పట్లు, కేరింతలు, నవ్వింతలు, తుళ్లింతలు!
“అలా తుళ్లింత పడిపోయే అర్హత మీకు లేదు” అని భారత దేశంలో విశృంఖలంగా వర్ధిల్లిన వెయితలల హైందవ విషనాగు తన దేహం బైట ఉన్న పంచములకు చీత్కరిస్తూ చెప్పింది; గర్జిస్తూ చెప్పింది; స్వర్ణ యుగాల సాక్షిగా చెప్పింది; విషం విరజిమ్ముతూ చెప్పింది. రామ రాజ్యాల సాక్షిగా శిరసులు ఖండించి, ముక్కు చెవులు కోసి పరిహసిస్తూ చెప్పింది; మెడకు ముంత, మొలకు తాటాకు తగిలించి చెప్పింది.
ఇప్పుడు యూనివర్సిటీ హాస్టల్ నుండి బహిష్కరించి, నలుగురితో కలవకుండా, బహిష్కరించబడిన నలుగురితో కూడా కలుసుకోకుండా నిషేధించి, ఒంటరులను చేసి, సంఘ బహిష్కరణ కావించి, హిందూత్వ అరాచకాలను తెగడొద్దు అని గద్దించి ఆజ్ఞాపించి మరీ రోహిత్ వేములకు మళ్ళీ చెప్పింది.
ఫలితమే రోహిత్ వేముల ఆత్మహత్య!
తన కలలన్నీ హాస్టల్ బహిష్కరణ ద్వారా చిదిమివేయబడ్డ క్షణాలలో రోహిత్ వేములకు ఆత్మహత్య తక్షణ కార్యక్రమంగా మిగిలిపోయింది. చుక్కల్ని చూస్తూ, రచయితగా సాహిత్యాకాశంలో మరో చుక్కనవుదామనుకున్న రోహిత్ కల ‘ముజఫర్ నగర్ మతోన్మాద మారణకాండ’ ను ఖండించి, నిర్జించి, బాధితులకు కనీసం భావాత్మక తోడుగానైనా ఉందామనుకున్నందుకు పఠేల్మని బద్దలైపోయింది.
నీ పుట్టుకే అశుభం, శాపం, అవాంఛనీయం, యాక్ ఛీ! మళ్ళీ నీ యజమాని తప్పునే ఎంచుతావా? అంటూ చిన్నతనం నుండి వెంటాడుతూ వచ్చిన ఛీత్కారం ఆధునిక విద్యాలయంలోనూ గడ్డ పలుగై మనసుని చీల్చుతూ ఎదుట నిలబడినప్పుడు రోహిత్ కి తనకు తాను ఖాళీయై కనిపించాడు, తట్టుకోలేకపోయాడు. ఉండీ లేదనిపిస్తున్న ఉనికి ఖాళీయే కదా మరి!
ఆ ఖాళీని ఉత్తేజభరితమైన తన ఆత్మతో నింపాలనుకుని విఫలుడై ఆత్మహత్యతో నింపి చుక్కల చెంతకు వెళ్లిపోయాడు రోహిత్ వేముల!
ఇప్పుడు రోహిత్ వేముల ఖాళీ కాదు. అతనిప్పుడు జ్వలిత ఖడ్గం! వేయి తలల హైందవ విషనాగును ఆరు పేజీల నీలపు అక్షరాలతో ఖండించ బూనిన చైతన్య ఖడ్గం. హైదరాబాద్ క్యాంపస్ లోనే కాదు, దేశవ్యాపితంగా అనేక విద్యాలయాల్లో, వీధుల్లో, రాజకీయాల్లో… ఆవేశ గుండెల చెకుముకి రాళ్ళతో వేయి అగ్ని కణాలకు జన్మనిచ్చిన మెరుపు ఖడ్గం అతనిప్పుడు!
తన అంతానికి, తన కలల అకాల మరణానికి మిత్రులు, శత్రువులు ఎవరూ కారణం కాదని వేన వేల కాంతుల ఉదాత్త హృదయంతో ప్రకటించిన రోహిత్ మొదటి, చివరి రచన తెలుగులో…
******************
శుభోదయం,
మీరీ ఉత్తరం చదివేటప్పటికి నేనిక్కడ ఉండను. మీలో కొందరు నిజంగా (నిండు హృదయంతో) నన్ను పదిలపరుచు కున్నారని, ప్రేమించారని, బాగా చూశారని నాకు తెలుసు. ఎవరిమీదా నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. నాకు సమస్యలు ఉన్నదల్లా ఎప్పుడూ నాతోనే. నా శరీరానికి, ఆత్మకు మధ్య ఎడమ పెరుగుతూ పోతున్నదని నాకు తోస్తున్నది. నేను రాక్షసుడిలా మారాను. రచయిత కావాలని ఎప్పుడూ అనుకునేవాడ్ని; కారల్ సాగన్ లాగా సైన్స్ రచయిత. చివరికి, నేను రచిస్తున్న ఒకే ఒక్క ఉత్తరం ఇదే.
నేను సైన్స్ నీ, నక్షత్రాలను, ప్రకృతినీ ప్రేమిస్తాను. కానీ, జనం ఎప్పటినుండో ప్రకృతి నుండి వేరైపోయారని తెలియక, జనాన్ని కూడా నేను ప్రేమించాను. మన భావాలు వాడిపారేసినవి (second handed). మన ప్రేమ (ముందే అనుకుని) నిర్మించుకున్నది. మన నమ్మకాలు రంగులు అద్దినవి. మన స్వాభావికత కృత్రిమ కళతో మాత్రమే కొలవగలిగినవి. గాయపడకుండా నిజంగా ప్రేమించడం చాలా కష్టం అయింది.
ఒక మనిషి విలువ అతని తక్షణ ఐడెంటిటీగానూ, సమీప అవకాశం (ఒకరికి అత్యంత దగ్గరగా దేనిని చూస్తే దానితో అతనిని/ఆమెను కొలవడం) గానూ దిగజారిపోయింది. ఒక వోటుగా; ఒక అంకెగా; ఒక వస్తువు (thing) గా. ఒక మనిషి ఎప్పుడూ ఒక (ఆలోచించగల) మెదడుగా చూడబడలేదు; నక్షత్ర ధూళితో నిర్మితమైన ప్రసిద్ధమైనదిగా (ఎప్పుడూ చూడబడలేదు); ప్రతి రంగంలో… చదువులో, వీధుల్లో, రాజకీయాల్లో, చావులో, ఉనికిలోనూ.
నేను ఇలాంటి ఉత్తరం రాయడం ఇదే మొదటిసారి. మొదటిసారి రాస్తున్న అంతిమ ఉత్తరం! అర్ధవంతంగా కనిపించడంలో నేను విఫలం అయితే నన్ను క్షమించండి.
ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడంలో, ఇన్నేళ్లుగానూ, బహుశా నేను తప్పు కావచ్చు. ప్రేమ, బాధ, చావు.. వీటన్నింటిని అర్ధం చేసుకోవడంలో (నేను తప్పు కావచ్చు). తొందరపడవలసిందేమీ లేదు. కానీ నేను ఎప్పుడూ తొందరపడుతూనే ఉన్నా; ఒక జీవితం ప్రారంభించాలని. ఇన్నాళ్లూ కొంతమందికి, వారికి, జీవితమే ఒక శాపం. నా పుట్టుకే ఒక ప్రాణాంతకమైన ప్రమాదం. నా బాల్యపు ఒంటరితనం నుండి నేను ఎన్నడూ బైటికి రాలేకపోయాను. (నేను) నా గతం నుండి (విసిరివేయబడ్డ) ఒక ప్రశంసార్హత లేని (పరిగణించబడడానికి అర్హత లేని) బిడ్డడిని.
ఈ క్షణంలో నేను గాయపడి లేను. నాకు విచారమూ లేదు. నేను ఒట్టి ఖాళీని, అంతే! నాకు నేనే అక్కర లేదు. అటువంటి భావన చాలా హృదయవిదారకం. అందుకే నేను ఈ పని చేస్తున్నాను.
జనం నన్ను పిరికివాడుగా అంచనా వేయవచ్చు. ఒకసారి నేనంటూ ఈ లోకాన్ని వీడాక, నేను స్వార్ధపరుడిననీ, అవివేకిననీ భావించవచ్చు. నన్ను ఏమని పిలుస్తారన్న విషయమై నేను బెంగపడడం లేదు. మరణానంతర కధల పైనా, దయ్యాల పైనా, ఆత్మలపైనా నాకు నమ్మకం లేదు. అలాంటిది ఏదైనా ఉంటే గనక, నా నమ్మకం ఏమిటంటే, నేను చుక్కలవైపుకి ప్రయాణం కడతాను; (ప్రయాణించి) ఇతర ప్రపంచాల గురించి తెలుసుకుంటాను.
ఈ ఉత్తరం చదువుతున్నవారు మీరు ఎవరైనా సరే నా కోసం ఏమన్నా చేయగలిగితే, 7 నెలల ఫెలోషిప్ మొత్తం, ఒక లక్ష డెబ్భై ఐదు వేల రూపాయలు, నాకు రావలసి ఉంది; నా కుటుంబానికి అది చెల్లించబడేలా చూడగలరు. రాం జీ కి నేను 40 వేల రూపాయలు ఇవ్వాలి. ఆయన ఎప్పుడూ దానిని తిరిగి ఇవ్వమని అడగలేదు. అయినప్పటికీ (నాకు రావలసిన) ఆ మొత్తం నుండి ఆయనకు చెల్లించాలని కోరుతున్నాను.
నా అంతిమ క్రియలు నిశ్శబ్దంగా, గడబిడ లేకుండా జరగనివ్వండి. నేను అలా ప్రత్యక్షమై ఇలా వెళ్ళిపోయినట్లే ప్రవర్తించండి. నా కోసం కన్నీళ్లు పెట్టుకోవద్దు. నేను బతికి ఉండడం కంటే చనిపోవడంలోనే సంతోషంగా ఉంటానని తెలిసి మెలగండి.
“నీడల నుండి చుక్కల చెంతకు.” సెలవు.
ఉమా అన్నా, దీని కోసం నీ గదిని ఉపయోగించినందుకు క్షమించాలి.
ఏఎస్‌ఏ కుటుంబానికి, మీ అందరినీ నిరాశపరిచినందుకు క్షమాపణలు. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు. మీ భవిష్యత్తు లో అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నాను.
చివరిగా ఒక్కసారి,
జై భీమ్
మర్యాదలు రాయడం మర్చిపోయాను.
నన్ను నేను చంపుకోవడానికి ఎవరూ బాధ్యులు కారు.
తమ చర్యలతో గాని, తమ మాటలతో గానీ నన్నీ చర్యకు ఎవరూ పురిగొల్పలేదు.
ఇది నా నిర్ణయం, నేను మాత్రమే ఈ నిర్ణయానికి బాధ్యుడను.
నేను వెళ్లిపోయాక ఇలా చేసినందుకు నా మిత్రులను గానీ శత్రువులను గానీ ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు.
సద్భావముతో
రోహిత్ వేముల (సంతకం)
17/01/2016
IN ENGLISH (WRITTEN BY ROHIT HIMSELF)
Good morning,
I would not be around when you read this letter. Don’t get angry on me. I know some of you truly cared for me, loved me and treated me very well. I have no complaints on anyone. It was always with myself I had problems. I feel a growing gap between my soul and my body. And I have become a monster. I always wanted to be a writer. A writer of science, like Carl Sagan. At last, this is the only letter I am getting to write.
I loved Science, Stars, Nature, but then I loved people without knowing that people have long since divorced from nature. Our feelings are second handed. Our love is constructed. Our beliefs colored. Our originality valid through artificial art. It has become truly difficult to love without getting hurt.
The value of a man was reduced to his immediate identity and nearest possibility. To a vote. To a number. To a thing. Never was a man treated as a mind. As a glorious thing made up of star dust. In very field, in studies, in streets, in politics, and in dying and living.
I am writing this kind of letter for the first time. My first time of a final letter. Forgive me if I fail to make sense.
May be I was wrong, all the while, in understanding world. In understanding love, pain, life, death. There was no urgency. But I always was rushing. Desperate to start a life. All the while, some people, for them, life itself is curse. My birth is my fatal accident. I can never recover from my childhood loneliness. The unappreciated child from my past.
[ I myself strike these words off.]
I am not hurt at this moment. I am not sad. I am just empty. Unconcerned about myself. That’s pathetic. And that’s why I am doing this.
People may dub me as a coward. And selfish, or stupid once I am gone. I am not bothered about what I am called. I don’t believe in after-death stories, ghosts, or spirits. If there is anything at all I believe, I believe that I can travel to the stars. And know about the other worlds.
If you, who is reading this letter can do anything for me, I have to get 7 months of my fellowship, one lakh and seventy five thousand rupees. Please see to it that my family is paid that. I have to give some 40 thousand to Ramji. He never asked them back. But please pay that to him from that.
Let my funeral be silent and smooth. Behave like I just appeared and gone. Do not shed tears for me. Know that I am happy dead than being alive.
“From shadows to the stars.” Bye.
Uma anna, sorry for using your room for this thing.
To ASA family, sorry for disappointing all of you. You loved me very much. I wish all the very best for the future.
For one last time,
Jai Bheem
I forgot to write the formalities. No one is responsible for my this act of killing myself.
No one has instigated me, whether by their acts or by their words to this act.
This is my decision and I am the only one responsible for this.
Do not trouble my friends and enemies on this after I am gone.
Sincerely
[Rohith Vemula signature]
17/01/2016
రోహిత్ విషాదాంతం గురించి మనసు కదిలించేలా రాశారు.
ఒకరిచర్యను(ముఖ్యంగా ఇటువంటిచర్యను) పొగడడానికి గానీ,తిట్టడానికి గానీ అంతగా ఆసక్తి ఉండదు.నేనెన్నడూ సూసైడ్ నోట్ చదవలేదు.ఇదే మొదటిసారి.
మన పరిసరాలను పరిశీలిస్తే ఒక క్రమంతో కూడుకున్నవి(అంశాలు) తక్కువగానూ,క్రమరహితంగా కూడుకున్నవి(వీటిలో వ్యక్తిగత తారతమ్యాలు చేర్చవచ్చనుకుంటా) ఎక్కువగా తారసపడతాయి.అయితే సామాజికంగా,ఆర్ధికంగా ఉన్నటువంటి తేడాలు ఆధిపత్యవర్గాలు కల్పించబడినవే.దీనికి ఏవిధంగా ప్రతిస్పందించాలన్నది వారివారి వ్యక్తిగత విషయం.
ఆలోచనలకూ,చర్యలకూ అంతరాలు లేకుండా చూసుకొన్నవాడే ప్రశాంతంగా ఉండగలడు. వాస్తవికతకు పెద్దపీఠ వేయకపోవడం విద్యావిధానకర్తల లోపము.
ఇటువంటి చర్యలు ప్రచారమాధ్యమాలలో(ఇవి తక్షణ ప్రచారానికి ఉపయోగించుకుంటాయిగానీ విషయంశాలలోతులకుపోవు) ప్రాధాన్యత కల్పించబడడం వలన మరికొంతమందికి ఉసిగొల్పడానికి ఉపయోగపడవచ్చునేమోగానీ నిర్మాణాత్మక చర్యలకు ఉపయోగపడకపోవచ్చు.
ఘనమైన నివాళి శేఖర్ గారు. హృదయం దహించి వేస్తుంది.
i wonder the support a student is getting after committing suicide. that too based on trump card “Dalith” and “Poor”. powerfully to say “Poor Dalith”. Shekar sir didnt analysed the situations forced him to commit suicide. As per my knowledge from the news papers, due to college elections issues there were some issues among student groups. Two group of people complained against each other. VC of Central University appointed a committee to look into the issue. this committee recommended suspension a group of people. Not satisfied with the recommendations of committee students applied to review the recommendations. VC appointed another committee to peep into the issue. even the second committee also recommended the same. as per the committee recommendations VC took action against the group who found culprit.
In the entire issue where is the question of “Dalith”. Is it ok a a “Rich and Forward Caste” person committed suicide.
please dont use the word “Dalith” in each and every issue.
if iam not wrong about the issue. please consider the issue as issue between students and not in any other angle.
గోపీనాధ్ గారూ మీరు చెప్పిన కారణాలు కూడా -పరోక్షంగా- విశ్లేషిస్తూ మరో టపా రాశాను చూడండి.
మీరు చూసినంత సింపుల్ గా నేనీ అంశాన్ని చూడ్డం లేదు. పైకి కొన్ని మాత్రమే కారణాలు కనపడతాయి. తర్కించి, తవ్వి చూడాల్సిన అంశాలు పూర్తిగా వేరేగా ఉంటాయి, తరచుగా.
ఆత్మహత్య లేఖ అసలు కారణాలని, గోప్యంగానైనా, చూపుతోంది.
Sekhar garu, Meeru kooda ee vishayam lo oka vaipe chusi abhiprayam cheptunnaremo ani anipistondi. Mari ee sanghatana gurinchi vastunna migilina vivarala gurinchi cheppe prayatnam nijam ga meeru cheyagalara? atani suspension ki dari teesina paristhithulu.. avi enduku kaligayi vanti vatini vivaram ga teliyacheppe prayatnam chestara?
rohith ekkadaa thana kulaparamaina venukabaatu thanaanni cheppaledu. thana thalli bhartha ku vidaakulichchindi ani ee roju paper lo chadivaamu. athani ontari baalyaaniki adi kooda oka kaaranam kaavachchu kadaa? kevalam dalithudainanduku ontari thanam feel ayyanani ekkadaa raayaledu. athani family background valla athanu alaa anukoni undavachchu.adee kaaka, dalithulaite okati, vere kulaalaku chendina vaaraite okati ane nyaayam emiti?ainaa vidyarthi annaka thanu chaduvuthunna samstha nibandhanalaku lobade pravarthinchaali. adi evarainaa okate..thana meeda anni aasalu pettukunna kutumbaaniki emi nyayam cheyaalani athani uddesyam. dalithula anchivete nijamgaa undi unte ee desam lo dalithudannavaadu ee desam lo unnatha sthaanalaku edigi undevaade kaadu. ivannee kattu kathalu…kulam valle rohith chanipoyaadannadi maatram nammasakyangaa ledu. thanu enduku raakshasudu gaa maaruthunnaadu? daani gurinchi etuvanti vivarana ivva lede… ilaa kulaala perutho vidateesukuntoo pote , chaduvullo naanyatha atakekkinatle. already ekkindi koodaanu. rohith ku etuvantee protsahamoo andakunte, research scholor ayye vaade kaadu..dayachesi raajakeeyaalanu coppinchakandi vidyarthula jeevithaallo…