అక్టోబర్ 29 తేదీన ఆంధ్ర జ్యోతి దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసం ఇది. భారత దేశ పేద ప్రజల ఆహారపు అలవాట్లపై హిందూత్వ ప్రారంభించి సాగిస్తున్న సాంస్కృతిక దాడిని సమర్ధవంతంగా ససాక్షారంగా తిప్పి కొట్టిన ఈ వ్యాసం మల్లంపల్లి సాంబశివరావుగారి విరచితం. ఇలాంటి ప్రజాస్వామిక భావజాలంతో కూడిన వ్యాసాలను ప్రచురించడం ఆంధ్ర జ్యోతి పత్రికకు మాత్రమే సాధ్యం అనుకుంటాను.
ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో జరప తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ ను కోర్టులే నిషేధించడం అప్రజాస్వామిక పరిణామం. బీఫ్ మాంసాన్ని నిషేధిస్తూ మహారాష్ట్రలోని బి.జె.పి-శివసేన తెచ్చిన చట్టంపై ముంబై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో ఇటీవల తన వాదన వినిపిస్తూ ప్రభుత్వం బీఫ్ మాంసం ఉత్పత్తి చేయడంతో పాటు తెలిసి గానీ తెలియక గానీ బీఫ్ మాంసం ఇంటిలో కలిగి ఉన్నా కారాగార వాసం కూడిన శిక్ష వేయగల తీవ్ర నేరంగా పరిగణించడమే తమ ఉద్దేశ్యం అని స్పష్టం చేసింది.
బీఫ్ మాంసం రవాణా చేస్తున్నారన్న పేరుతో ఉత్తర భారతంలోని పలు చోట్ల ముస్లింలపై దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల హత్యలూ జరిగాయి. దాద్రి ఊచకోతపై దేశవ్యాపిత నిరసనలు పెల్లుబుకుతున్నప్పటికీ హిందూత్వ గణాలు యధేచ్ఛగా వీరంగం వేస్తూ దళిత, ముస్లిం పేదలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఇలాంటి ప్రతిఘటనా వ్యాసాలు మరిన్ని రావలసి ఉన్నది.
మురికి చేసే వాడు పవిత్రుడు….
శుభ్రం చేసే వారు అపవిత్రులు…
నిజమే… వ్యవస్థను రీబూట్ చేయాల్సిందే
విశేఖర్ గారు, ఇది చదవండి: ఆవు కొవ్వు ఎగుమతిపై 32 ఏళ్ళుగా ఆన్న నిషేధాన్ని ఎత్తి వేసిన హిందూత్వ సర్కార్!
http://lokbharat.com/nation/%E0%A4%AE%E0%A5%8B%E0%A4%A6%E0%A5%80-%E0%A4%B8%E0%A4%B0%E0%A4%95%E0%A4%BE%E0%A4%B0-%E0%A4%A8%E0%A5%87-%E0%A4%AC%E0%A5%80%E0%A4%AB-%E0%A4%95%E0%A5%80-%E0%A4%9A%E0%A4%B0%E0%A5%8D%E0%A4%AC%E0%A5%80/