పోలీసుల కస్టడీలో ఉండగా పోలీసుల చేతుల్లో దెబ్బలు తిని చనిపోతే ఆ చావులను లాకప్ హత్యలు అంటారు. (ఇది పాఠకులకు తెలియదని కాదు. కానీ రాయడంలో ఒక పద్ధతిని పాటిస్తే చెప్పదలిచిన విషయం స్పష్టంగా ఉంటుందని.) గత 8 నెలల్లో భారత దేశంలోని పోలీసులు తమ నిర్బంధంలో తీసుకున్నవారిలో ఏకంగా 111 మందిని చంపేశారు.
‘నిజం’ రాబట్టడానికి అని చెబుతూ పోలీసులు ధర్డ్ డిగ్రీ పద్ధతుల్ని పాటిస్తారు. ధర్డ్ డిగ్రీ పద్ధతులు వాస్తవానికి చట్టబద్ధం కాదు. అనగా లాఠీలతో కుళ్లబొడవడం, గోళ్ళలో గుండు సూదులు గుచ్చి చిత్రవధ పెట్టడం, అరికాలు ఆరి చేతులపై తీవ్రంగా కొట్టడం, ‘నిరీక్షణ’ సినిమాలో చూపినట్లు నీళ్లని వేగంగా శరీరం మీదికి పంప్ చేయడం… ఇవన్నీ ధర్డ్ డిగ్రీ పద్ధతులే.
తెల్లవాడు మన దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో పోలీసుల ద్వారా ఆచరణలోకి తెచ్చిన ఈ హింసాత్మక వేధింపుల విచారణా పద్ధతుల్ని భారత జనులపై విస్తృతంగా ప్రయోగించారు. తెల్లవాడు ఇక లేడు, పోయాడు అని చెప్పారు. మనం ఇక రిపబ్లిక్ అన్నారు. ప్రజాస్వామ్యం అన్నారు. కానీ ఆనాటి ధర్డ్ డిగ్రీ విచారణ ఇప్పటికీ నిరాఘాటంగా కొనసాగుతూనే ఉన్నాయని జాతీయ మానవ హక్కుల సంస్ధ వద్దకు వస్తున్న వేలాది కేసుల ద్వారా స్పష్టం అవుతోంది.
పార్లమెంటులో లోక్ సభలో ఒక ప్రశ్నకు జవాబు ఇస్తూ పోలీసుల హింసాత్మక వేధింపుల లెక్కలను, లాకప్ హత్యల లెక్కలను హోమ్ శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు సభ్యులకు అందించారు. ఈ లెక్కల ప్రకారం గత ఏప్రిల్ 1 నుండి నవంబర్ 30 తో ముగిసిన 8 నెలల కాలంలో భారత పోలీసు ఠాణాల్లో 111 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిని పోలీసులు తమ కరకు విచారణను ప్రయోగించి చంపేశారు.
పోలీసుల అత్యాచారాలకు బలైన పౌరుల సంఖ్య అయితే ఏకంగా 24,916. ఈ కేసులన్నీ కేవలం జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) వద్దకు వచ్చినవి మాత్రమే. మానవ హక్కుల సంస్ధ దృష్టికి రాని పోలీసు హత్యలు, వేధింపులు, అత్యాచారాల సంఖ్య ఎంత పెద్దదో ఎవరికి వారు ఊహించుకోవలసిందే.

Indian Police structure (Click to expand)
జాతీయ మానవ హక్కుల సంఘం అనేది ఒకటుందని తెలిసిన సాధారణ భారతీయ పౌరులు ఎంతమంది ఉంటారు? వార్తల్లో చదవడమే తప్ప నిజంగా మనకూ కష్టం వస్తే ఎన్‌హెచ్‌ఆర్‌సి దగ్గరికి వెళ్లవచ్చు అని భావించేవారు విద్యావంతుల్లో చూసినా చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో పోలీసుల వరకు తమ బాధల్ని తెచ్చేవారు ఇంకా తక్కువ మంది. వారిలోనూ పోలీసుల దాష్టీకాన్ని రుచిచూసి ఆ తర్వాత ఆ పోలీసులకే వ్యతిరేకంగా ఎన్‌హెచ్‌ఆర్‌సి మెట్లు ఎక్కేవారిని వెళ్లమీద లెక్కించవలసిందే. అలాంటి వెళ్లమీద లెక్కించవలసిన సంఖ్య 24,916. ఇది వెళ్లమీద లెక్కించగల సంఖ్య కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మంత్రి రిజుజు ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసు వేధింపుల కేటగిరీ కింద మొత్తం 25,357 కేసులు మానవ హక్కుల సంస్ధ వద్ద నమోదు కాగా వాటిలో 111 కేసుల్లో బాధితులు చనిపోయారు. 330 కేసుల్లో కస్టడీ హింసలపై ఫిర్యాదులు అందాయి. ఇతర పోలీసు వేధింపులు 24,916గా నమోదు అయ్యాయి.
హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధ వారణాసిలోని ఒక పండ్ల వ్యాపారి పోలీసులతో ఎదురైన అనుభవాన్ని తమకు ఏం చెప్పాడో కింది పేరాలో వివరించింది.
A fruit vendor in Varanasi described how police tortured him to extract confessions to multiple, unrelated false charges:
“[M]y hands and legs were tied; a wooden stick was passed through my legs. They started beating me badly on the legs with lathis (batons) and kicking me. They were saying, ‘You must name all the members of the 13-person gang.’ They beat me until I was crying and shouting for help. When I was almost fainting, they stopped the beating. A constable said, ‘With this kind of a beating, a ghost would run away. Why won’t you tell me what I want to know?’ Then they turned me upside down… They poured water from a plastic jug into my mouth and nose, and I fainted.”
‘ఇది పోలీసు రాజ్యం, తుపాకి రాజ్యం’ అంటూ ఈ మధ్య శాసన సభ సభ్యులు కూడా చట్ట సభల్లో నినాదాలు ఇవ్వడం వెనుక ఉన్న వాస్తవం ఇదీ. చట్ట సభల సభ్యులే పోలీసు రాజ్యం గురించి ఫిర్యాదు చేస్తుంటే ఇక సామాన్యులకు ఎవరు రక్ష?
పోలీసుల అత్యాచారాలకు బలైన పౌరుల సంఖ్య అయితే ఏకంగా 24,916.
సర్,ఇక్కడ అత్యాచారాలంటే పోలీసుల చేతుల్లో దెబ్బలు దెబ్బలుతినడమేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా?
లాకప్ హత్యలకు గురయ్యేవారిలో…ఎక్కువగా పేదలు, వెనుకబడ్డ వర్గాలవారే ఉంటారు. ధనికులు ఎంత పెద్ద నేరం చేసినా ….గుండెనొప్పితో ఆసుపత్రిలో రాచభోగాలు అనుభవిస్తారు. దీన్ని బట్టే పోలీసు వ్యవస్థను ఎవరు ప్రభావితం చేసేది అర్థమవుతోంది.
పాసిజానికి ఆనవాళ్ళు
అట్రాసిటీస్ కి తెలుగుగా ఆ పదం వాడాను. పోలీసులు చేసే అతి+ఆచారాల కిందికి ఎన్ని వస్తాయో అన్నీ ఈ కోవలోనివే కదా.
ఇలాంటివి మీరు ఒక టాపిక్ గా చేయకూడదు. అర్ధం వరకే తీసుకోవాలి.
మానవ హక్కుల సంఘం అనే ఒక సంస్థ గురించి బాగా వింటున్నాం కాని అది ఎంతవరకు స్పందిస్తుందనే విషయం ఎవరికీ సరిగా తెలీదు ……….మానవ హక్కుల సంఘం కూడా పట్టించుకోని cases ని ఇక ఏ సంఘం పట్టించుకుని ఉంటుంది ….ఏది ఏమైనా freedom is not for free ……………………