చెన్నై: వాన గ్రహణం -కార్టూన్


Rain eclipse

“కార్టూన్ పొలికేక వేసినట్లు ఉండకూడదు. రణగొణ ధ్వనులతో అస్పష్టంగా కూడా ఉండకూడదు. నిశ్శబ్దంగా, సూటిగా, స్పష్టంగా ఉండాలి” అని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అందుకే కేశవ్ కార్టూన్స్ లో పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు ఉండవు. పొడవైన డైలాగ్స్ చాలా చాలా తక్కువ కనిపిస్తాయి. ఒక హెడ్డింగ్, ఒక శీర్షిక, ఒక సామెత, ఒక వాడుక, ఒక సార్వజనీన వాస్తవం… ఇవి మాత్రమే కనిపిస్తాయి.

కాకుంటే చెన్నైను కనీవినీ ఎరుగని రీతిలో ముంచెత్తిన వరదలను ఇంత సున్నితంగా చెప్పడం ఎలా సాధ్యం?

సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం లకు మల్లే చెన్నైను కొత్త గ్రహణం ఒకటి పట్టుకుందని దాని పేరు ‘వాన గ్రహణం’ అనీ కార్టూనిస్టు చెబుతున్నారు.

వ్యాఖ్యానించండి