అనుపమ్ ఖేర్ తో సహా హిందూత్వ (హిందూ మతావలంబకులు కాదు) గణాలు చెబుతున్న మాట, అమీర్ ఖాన్ దేశాన్ని అవమానించాడని. తన (భార్య) వ్యాఖ్యల ద్వారా అమీర్ కుటుంబం దేశం పరువు తీశారని, సిగ్గుపడేలా చేశారని విమర్శించారు.
విచిత్రం ఏమిటంటే ఒక పక్క అమీర్ ఖాన్ భార్య అన్న మాటల్ని తప్పు పడుతూనే మరో పక్క ఆ మాటలు ఖండించే హక్కు మాకూ ఉందని వాదనలు చేయడం. ఏదో ఒకటే కరెక్ట్ కావాలి. అమీర్ ఖాన్ భార్య అన్నది తప్పే అయితే అదే తప్పు ఆయన విమర్శకులు చేయకూడదు. అనగా ‘నీకు దేశభక్తి లేదు; అవమానించావు; పాకిస్తాన్ వెళ్లిఫో…’ అంటూ విద్వేషం విరజిమ్మ కూడదు.
కాదూ తమ విమర్శలు కరెక్టే అయితే ఆ హక్కు అమీర్ ఖాన్ కీ ఉంటుందని గుర్తించాలి. వారి దేశభక్తిని శంకించడం మాని, వారి భయాలకు సమాధానాలు చెప్పాలి. అమీర్ విమర్శలకు సావధానంగా సమాధానం ఇవ్వాలి. అమీర్ అడిగింది మామూలు ప్రశ్న. ఆమె భార్య వ్యక్తం చేసింది మామూలు భయం. ఆ భయం తన పిల్లల గురించే అని అమీర్ చెప్పినా ఆమె భయానికి పెడార్ధాలు తీయడంలోనే ఖుషీ పొందడం శాడిజం అవుతుంది.
దాద్రి హత్యలు, ఖల్బుర్గి తదితరుల హత్యలు జరుగుతుంటే ఈ దేశ ప్రధాని ఎందుకు నోరు విప్పడు? అన్నిటికీ ప్రధాని నోరు విప్పుతారా? అని హోమ్ మంత్రి పార్లమెంటులో ప్రశ్నించారు. విప్పరు, నిజమే. కానీ వరుసపెట్టి జరిగిన దారుణాలు ‘అన్నింటికీ’ అని కొట్టిపారేయదగినవా? 50 మంది వరకు రచయితలు, కళాకారులు నిరసనగా అవార్డులు వెనక్కి ఇస్తున్నా నోరు తెరవరా? విషయ తీవ్రత గుర్తించేలా చేయడానికి కూడా అవార్డుల వాపస్ పని చేయలేదా?
వారందరూ లెఫ్టిస్టులు, కాంగ్రెస్ వాదులు, బి.జె.పి వ్యతిరేకులు అని కొందరు నేతలు, మేతావులు, వందిమాగధులు, అభిమాన గణాలు అడుగుతున్నారు. కానీ వారు కూడా ఈ దేశ పౌరులే కదా? ప్రధాని అయిన వ్యక్తి, అధికారంలో ఉన్న మంత్రులు, ఇతర చట్ట సభల సభ్యులు తమకు మద్దతు ఇచ్చేవారిని మాత్రమే పాలిస్తున్నారా? లేక దేశాన్నంతటినీ పాలిస్తున్నారా?
ఈ అపర దేశ భక్తుల లాజిక్ ఏ విధంగా ఉన్నదో కింది ఫోటో చక్కగా చూపుతోంది.
(ఈ ఫోటోను ఫేస్ బుక్ లోని Kalyani SJ స్టేటస్ నుండి సంగ్రహించాను.)
సంతోషం sir….మీ వ్యాఖ్యానం లో నా పేరు గుర్తు
చేసుకున్నందుకు….
కళ్యాణి గారు, మీ ఫేస్ బుక్ పేజీల్లో కొన్ని చర్చలు చూశాను/చదివాను. మంచి అంశాలపైన మీరు చర్చలు చేస్తున్నారు. మీవైపు నుండి ఎలాంటి తొట్రుపాటు, అసహనం లేకుండా చర్చ చేయడం అభినందనీయం.
మీ పేరు విషయమై మీరు చేసుకున్న మార్పును చదివాను. అందుక్కూడా అభినందనలు. చెప్పే, రాసే ఆదర్శాలకూ, ఆచరణకూ పొంతన చాలా తక్కువ కనపడుతున్న ఈ రోజుల్లో మీ లాంటి వారి ఉదాహరణలు సంతోషాన్ని కలగజేస్తాయి.
మీ కృషిని కొనసాగించగలరు.
prapancham lo erra gadidalaku tappa migilina vaarandariki logikkulu teliyavu………..meemu kuda erragadidaluga maarali……………..logic ga alochinchali ante………..
మరీనూ! గాడిదలకు గాడిదలుగా మారే అవసరం ఏమిటీ?
విషయం చర్చించాలనుకుంటే ఇది పద్ధతి కాదని వేరే చెప్పాలా? పద్ధతిగా వస్తే రా. లేదా మానుకో.
//గాడిదలకు గాడిదలుగా మారే అవసరం ఏమిటీ?//
సూపర్ జవాబు!
ఎర్ర గాడిదలకున్న తెలివి ఆ మామూలు గాడిదలకు లేదని అక్కసు కామోసు!