ఎక్కడ అసహనం, ఆయ్?


Show me intolerance!

అసహనమా?

ఏదీ చూపించు…

చూపించు ఎక్కడో?

************

అమీర్ ఖాన్ అలా మాట్లాడుతున్నాడంటేనే భారత దేశం ఎంత సహన దేశమో చెప్పడానికి ఒక రుజువు అని హిందూత్వ అభిమాన గణం గొప్పలు పోతోంది.

కానీ అమీర్ ఖాన్ మాటల్ని ‘ఎవరో ప్రభావంలో ఉండి మాట్లాటలు’ అనీ, ‘అయితే ఏ దేశం వెళ్తావో అదీ చెప్పు!’ అనీ ‘పాకిస్తాన్ వెళ్లిపో, ఫో!’ అనీ, ‘దేశాన్ని కించపరుస్తావా?’ అనీ, ‘నీసలు దేశభక్తి ఉందా?’ అనీ, ‘ఎన్ని అవమానాలు భరించినా అంబేద్కర్ దేశం వదిలి వెళ్తానని ఎప్పుడూ అనలేదు’ అనీ ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో, మైకుల ముందరా, చివరికి పార్లమెంటులో కూడా నోరు పారేసుకోవడం ద్వారా ఖండన మండనలు, ప్రకటనలు, అరుపులు, కేకలు, గుండెలు బాదుకోవడాలూ… ఇవన్నీ అసహనం ఎక్కడుందో చెప్పడం లేదా?

హేతువాదంతో ఆలోచించాలని, మూఢ నమ్మకాలను త్యజించాలని చెప్పినందుకు రెండేళ్ల క్రితం ఆయన ఇంటికి వెళ్ళి మరీ నరేంద్ర దభోల్కర్ ను కాల్చి చంపారే ఈ మతోన్మాద దుండగులు, అది అసహనం కాదా? అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి ద్వారా మూఢనమ్మకాలు పోగొట్టి ప్రజల సామాజిక జీవనాన్ని మెరుగుపరచడాన్ని సహించలేకపోవడం సహనమా, అసహనమా?

‘శివాజీ ఎవరు?’ అన్న ప్రసంగం (‘శివాజీ కోన్ హోతా’ పేరుతో పుస్తకంగా ప్రచురించబడి లక్షల కాపీలు ఆమ్ముడయింది. ఆంగ్ల అనువాదం ఇప్పటికీ వేలాదిగా అమ్ముడవుతోంది.) ద్వారా ప్రజలకు అంతో ఇంతో మేలు చేసిన శివాజీ మహారాజును ఒక మతచట్రంలో బంధించడం సరికాదంటూ ససాక్షారంగా తెలియజెప్పిన గోవింద్ పన్సారే సరిగ్గా దభోల్కర్ ను చంపినట్లుగానే కాల్చి చంపడం సహనమేనా?

నిన్నగాక మొన్న ఆగస్టు చివరి వారంలో, ప్రఖ్యాత కన్నడ రచయిత, హంపి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, 100 పుస్తకాలు, అనేక వందల వ్యాసాల రచయిత, అనేకానేక రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ అవార్డుల గ్రహీత అయిన ఎం.ఎం.ఖల్బుర్గిని మళ్ళీ అదే రీతిలో ఇంటికి వచ్చి కాల్చి చంపేశారు. తన వద్దకు వచ్చే పరిశోధక విద్యార్ధులతో మాట్లాడడం కష్టంగా మారడంతో పోలీసు రక్షణ వద్దని మాన్పించిన రెండో వారంలోనే చంపేశారు. అది అసహనం కాక ఏమిటి? బి.జె.పికి బలమైన ఓటు బ్యాంకు కలిగిన లింగాయత్ కులం చరిత్ర (ఆయనదీ అదే కులం) ను పరిశోధించి వెలువరించినందున, అందులో హిందూ వ్యతిరేకతను మతోన్మాదులు కనిపెట్టినందున ఖల్బుర్గి హత్యకు గురయ్యారు.

వీళ్ళందరూ అనేక యేళ్లుగా చారిత్రక వాస్తవాలను హేతుబద్ధ దృక్పధంతో వెల్లడి చేస్తున్నందుకు అన్నే యేళ్లుగా మతోన్మాద గుంపుల నుండి బెదిరింపులు ఎదుర్కొంటూ వచ్చారు. తమకు అనుకూలమైన పరిస్ధితులు దేశంలో ఏర్పడ్డాయని నమ్మడం వల్లనే ఈ హత్యలు ఇటీవలి కాలంలో పెరిగాయి.

అమీర్ ఖాన్ ఆత్మ ఘోష ఎంత న్యాయబద్ధమో తెలియడానికి ఈ మూడు ఉదాహరణలు చాలవా? చెదురు ముదురు ఘటనలుగా వీటిని కొట్టిపారేయడం బి.జె.పి తదితర హిందూత్వ సంస్ధల అవసరం. కానీ వారి అవసరంలో నుండి వచ్చే వాదనలు దేశ ప్రజల్లో (ముస్లింలు, హేతువాదులు, వామపక్షీయులు, ప్రజాస్వామికవాదులు… వీళ్ళు కూడా దేశ ప్రజలే అని అంగీకరిస్తే)  నెలకొన్న అభద్రతను పూర్వపక్షం చేయవుగాక చేయవు!

12 thoughts on “ఎక్కడ అసహనం, ఆయ్?

 1. అసహనం కాదు బాబు దాని పేరు దభాయింపు. కయ్యానికి కాలు దువ్వటం. రెచ్చగొట్టటం ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు. అసహనం చాలా సాదారణ మైన మాట.

 2. అక్కడ ఒక్కడ్ని ఇక్కడ ఒక్కడ్ని చంపితే అసహనం అన్న మాట…. మూకుమ్మడి గా బాంబ్ లు పెట్టి చంపితే అసహనం లేనట్టు…. బాగా చెప్పారు…

 3. మూకుమ్మడి బాంబు దాడులకు అరెస్టులు జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి విచారణలు సాగుతున్నాయి. సాక్ష్యాల సంగతి పక్కనబెట్టి ఉరి శిక్షలూ వేసేశారు. ఇలా అక్కడ ఒకరినీ ఇక్కడ ఒకరినీ (మీ దృష్టిలో యూనివర్సిటీ మాజీ వి.సి, పరిశోధకులు, రచయిత, ఉద్యమకారులు అక్కడ ఒకరూ ఇక్కడ ఒకరూ!) కాల్చి చంపినపుడు మాత్రం అరెస్టులు ఉండవు. శిక్షలు అసలే ఉండవు. నిందితుల ఆచూకీ ఎప్పటికీ లభించనే లభించదు.

  అమీర్ ఖాన్ చెప్పింది ఈ విషయమే. ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు ప్రజలు ఎన్నుకున్న నేత ఉన్మాదులకు హెచ్చరికగా కనీస ప్రకటన కూడా ఇవ్వకపోగా, నేర విచారణ జరుగుందన్న హామీ కూడా ఇవ్వకపోతే భద్రత, న్యాయం దక్కుతాయన్న హామీ ఉండదని.

  గుజరాత్ మారణకాండ అనంతరం అనేక యేళ్ళ తర్వాత మోడిని మొదటిసారి కలుసుకున్న అమెరికా రాయబారి సరిగ్గా ఇదే సంగతి చెప్పాడు. గుజరాత్ హత్యాకాండ సంగతి ఎత్తినందుకు ‘గుజరాత్ అంతర్గత వ్యవహారాల్లో మీ జోక్యం అనవసరం’ అన్న మోడితో అమెరికా రాయబారి:

  “… జరిగిన హత్యాకాండకు బాధ్యులుగా ఎవర్నీ గుర్తించకపోవడంపట్ల, తద్వారా చట్టంనుండి వారు తప్పించుకోగలరన్న వాతావరణం ఏర్పడుతున్నదన్న అంశంపట్లా అనేక వర్గాల ప్రజల్లో ఉన్న అభిప్రాయాలనే మేము వ్యక్తీకరిస్తున్నాం. రెండోది, అబూఘ్రయిబ్ విషయానికి సంబంధించి: అమెరికన్లు కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడవచ్చు. అయితే అలాంటివి జరిగినప్పుడు పరిశోధించి, విచారించి, తప్పు చేసిన వారిని శిక్షించడానికి అమెరికాలో స్పష్టమైన పద్ధతులున్నాయి. అటువంటి పద్ధతులనే గుజరాత్ లో కూడా చూడాలని మేము గానీ ఇతరులు గానీ భావిస్తున్నాము…” అన్నాడు.

  వివరాలకు కింద లింక్ ని చూడండి.

  ‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి

  ఈ సంగతి ఇంకా ఎన్నిసార్లు చెప్పినా బహుశా మీ లాంటి వారికి అర్ధం కాకపోవచ్చు. చెబుతున్న, రాస్తున్న అంశాలన్నీ సంయక్ దృష్టితో చూస్తూ సారాంశాన్ని అర్ధం చేసుకోవాలి. దానిని బట్టి వ్యాఖ్యానం ఉండాలి. అలా కాకుండా మీకు నచ్చని అంశాల్ని ఒకటి రెండు ఎంచుకుని, మీకు కావలసిన అర్ధం మాత్రమే తీసుకుని స్పందించడం వల్ల ప్రయోజనం శూన్యం. మహా అయితే అక్కసు తీరుతుందంతే.

 4. మళ్ళి మా బాగా చెప్పారు…. మరి కాశ్మీర్ లో నుండి వెల్లగొట్టబడి డిల్లి రోడ్ల పై శరణార్దులుగా బతుకుతున్న వారి గురించి ఎమైనా చెప్తారా? పేరు గుర్తుకు లేదు కానీ, బహుశా కేరళ లో అనుకుంటా…. ప్రశ్నాపత్రం లో ఒక మతాన్ని కించపరుస్తూ ఒక ప్రశ్న ఇచ్చాడని ఒక ప్రొఫెసర్ చెయ్యి నరికేసారు…ఆ చెయ్యి హిందుయేతర చెయ్యి కాదు కాబట్టి మీకు కనపడలేదేమో…. ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగాయి…ఎంత మంది ని ఉరి తీసారు…. అది ఎమైనా తెలపగలరా? అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు చార్మినార్ ఎక్స్ ప్రెస్ ను తగులబెట్టారని చదివా…. వారు అందరూ క్షేమమే కద.!

 5. శేఖర్ గారు, మీరు చెప్పిన అన్ని అంశాలతో ఏకీభవిస్తున్నాను, కానీ ఇలాంటి ఘటనలు ఎప్పటినుండో జరుగుతున్నాయని చెప్పడం లో అతిశయోక్తి లేదు కాకపోతే ఈ సారి జరిగిన ఘటనలలో హిందుత్వ భవన్ ఎక్కువ ఉండటం, బి జె పి అధికారం లో ఉండటం మూలంగానే ఇంతటి ప్రాముఖ్యాన్ని సన్థరించుకున్నై. పత్రికలు , వార్త చానెళ్ళు , బ్లాగులు దుమ్మెత్తి పోస్తున్నాయి . .. అసహనం కేవలం మతం విషయం లోనేనా? ఉదాహరణకి తెలంగాణా మనోభావాలు దెబ్బ తీస్తున్నాయని కొన్ని సినిమాల షూటింగ్ జరగనివ్వలేదు.., ఢిల్లీ లో ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ మిధ చెయ్యి చేస్కున్న ఎమ్మెల్యే మిధ చర్యలు లేవు … ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం సందర్భారాహిత్యం గా మీరు అనుకోవచు , కానీ ఇది కూడా అసహనం అని నేను అంటాను, చెప్పుకుంటూ పోతే ఇలాంటి సంఘటనలు కోకొల్లలు . 2013 లో అక్బరుద్దీన్ ఒవైసి మాట్లాడిన మాటలను ఇప్పుడు మనం మాట్లాడినంత గట్టిగ మాటల్డితే అతను ఎక్కడ వున్దెవారొ…/
  చివరిగా ఒక్క మాట ఇంతకంటే ఘోరమైన సంఘటనలు జరిగినప్పుడు ఈ రచయితలు అవార్డులు వాటి పారితోషకాలు వెనక్కి ఇవ్వలెధు.. కానీ ఈ సరి బి జె పి అధికారం లో ఉండటం వలన ఇచ్చేస్తున్నారు . దీని గురించి ఇంత రచ్చచెస్తున్నరు… కానీ సామాన్య ప్రజలేవ్వరికి దేశం విడిచి వెళ్లిపోవాల ? అన్ని ప్రశ్న తలఎత్తలేదు .

  కిల్బుర్గి హత్య ఖండించవల్సిందే , నిందితులని శిక్షించావాల్సిందే.., కానీ అయన మాత్రం హిందూ దేవత విగ్రహాల మీద ఉచ్చ పోసుకోవచ్చు అని పుస్తకాలలో రాసి వ్యాపారాలు చేసేస్కుంటారు..
  ఇలాంటి రాతలు , మాటలు, వ్యాఖ్యలు , ప్రచారాలు , ఉద్బోధలు … ఫార్మల్ ప్రపంచం లో ఇంత ఇది గ ఉంటె సువార్త సభల్లో , ఇంకా అలాంటి ఇతరత్రా సభల్లో ఎంత జరుగుతుందో తెలిసి పట్టించుకోకుండా ఉండటం .. ముమ్మాటికి అసహనమే లెండి . ఎందుకంటే మనం లౌకిక వాదులం , బి జె పి ఒక మత తత్వ పార్టీ .

  మీ రాతలు అలోచిమ్పజేసివి గ ఉండాలని మేము కోరుకుంటాం, కేవలం బి జె పి వ్యతిరేకం గ మాత్రమే కాకుండా

 6. నిజమే , సాక్ష్యాలు లేకపోయినా ఉరి తీసేసారు , బాంబు దాడులకు ప్రణాళికలు వేసి కానీ దడి సమయం లో మాత్రం దేశం లో లేనందుకు మనం అందరం ఉరి తీయొద్దని గుండెలు బాదుకున్నాం, అయిన మన మాట వినకుండా 22 సంవత్సరాల తర్వాత ఉరి తీసేసారు… కానీ ఫ్రాన్స్ లో 3 రోజుల్లో దాదాపు 140 మందిని ఎటువంటి ఆధారాలు విచారణ లేకుండా వెతికి వెతికి చంపేసారు, రాత్రికి రాత్రికి రజంగ సూత్రాలని మార్చారు … ఎందుకుంట ఇలాంటివి చెయ్యడానికి ఫ్రాన్స్ దేశం, ప్రభుత్వం ఎంతో సహనసీలంయినవి.. భారత్ లో కసాబ్ ను 5 ఏళ్ళు బిర్యినలితో పోషించాం ఎందుకంటే ఇక్కడి మనుషులు , ప్రభుత్వాలు అసహన పూరితం అయినవి

 7. ……… “గంగతో రాంబాబు” సినిమాలో తెలంగాణావాదులు మహారాష్ట్ర నవనిర్మాణ సేనలాగ ఇతర రాష్ట్రాలవాళ్ళపై దాడులు చేస్తున్నట్టు చూపించారు. ఆ సినిమాలో స్త్రీలని కించపరిచే సన్నివేశాలు కూడా ఉన్నాయి. స్త్రీవాదులు మొగుళ్ళని వదిలేస్తారనీ, వాళ్ళు మొగుళ్ళకే భరణం ఇవ్వాలనుకుంటారనీ చెప్పే సంభాషణలు కూడా ఉన్నాయి. కానీ స్త్రీలు ఎవరూ ఆ సినిమాని నిషేధించమని గొడవ చెయ్యలేదు. ప్రాంతీయ అస్తిత్వవాదులకి ఉన్న చైతన్యం స్త్రీలకి లేకుండా పోయింది.

 8. మనిషిని చంపినందుకు ప్రతీకారంగా హత్య చేసినవానికి ఉన్న అసహనానికీ, ఆవుని చంపినందుకు ప్రతీకారంగా హత్య చేసినవానికి ఉన్న అసహనానికీ మధ్య తేడా లేదా? బిసాడా గ్రామంలో జరిగినది కేవలం ఒక పుకారుని నమ్మి చేసిన హత్య. ఒక పుకారుని నమ్మి హత్య చేసేవాళ్ళకి ఇంకా ఎక్కువ అసహనం ఉంటుంది. భాజపాకే చెందిన సంగీత్ సింగ్ సోమ్ అనే శాసన సభ్యుడు దున్నపోతు మాంసం ఎగుమతి చేసే ఒక కంపెనీలో షేర్లు కలిగి ఉన్నాడు. ఆ శాసనసభ్యుడు కూడా ఆవు మాంసాన్ని నిషేధించాలని కోరాడు. మన దేశంలో ఇప్పటికీ ఎక్కువ మంది దున్నపోతులతోనే పొలాల్లో దుక్కి చేస్తారు. పాలు ఇచ్చే జంతువుని చంపడానికీ, దుక్కి చేసే జంతువుని చంపడానికీ మధ్య తేడా ఎంత? వీటిలో ఒకటి లేకపోతే పాలు దొరకవు, ఇంకొకటి లేకపోతే పంటలు పండవు.

 9. గంగ తో రాంబాబు సినిమాలో ఎక్కడ తెలంగాణా వాదులు అని వాడలేదు ,,, సినిమా రాకముందే షూటింగ్ మిద దాడులు … గంగ తో రాంబాబు సినిమా ఒక్కటే కాదు.. ఆంధ్ర హీరోస్ అంటూ సినిమాల మీద దాడులు దౌర్జన్యాలు. షూటింగులు ఆపెయ్యడాలు అసహనం కాదా? ఇంకా ఇలాంటివి చాలానే ఎన్నొ. కొంత మంది గూండా స్త్రీ వాదులు ( స్త్రీ వాదులు అన్న ముసుగు వేసుకున్న వారి గ అర్ధం చేసుకోవాలి ) చేసే దౌర్జన్యన్నాన్ని, స్త్రీ జాతికి , స్త్రీ వాదానికి మొత్తానికి ఆపాదించడం …. వాళ్ళని అవహేళన చేసరనడం తప్పు . సినిమాల్లో ఒక రాజయకీయ నాయకుడ్ని రౌడీ గ చూపిస్తే అందరు రౌడి లేనా?? ఒక వాదం , ఒక ప్రాంతం ,ఒక కులం ముసుగులో చేసే రౌడీ దందాని చూపిస్తున్నప్పుడు కేవలం ఆ దందాని మాత్రమే మనం గ్రహించాలి … చూపించన దానిని మొత్తానికి ఆపాదించేసి మొత్తానికి నింద వేసెయ్యడం రేచాగోట్టడం లో ఒక ప్రక్రియ.
  చూపించన దానిని మొత్తానికి ఆపాదించేసి దాడులు చెయ్యడం అసహనం కదా?
  ఆ దాడులు అసలైన వాదాన్ని నిర్వీర్యం చెస్తాయి.. ఆ దాడుల్ని సమర్దించడం మనలో అసహనానికి ప్రతిక .సినిమాలో తెలంగాణా వాదం కింద జరిగే బుల్లియింగ్ ని చుపించారనడం లో సందేహం లేకపోవచ్చు. కానీ తెలంగాణా వాదాన్ని కించ పరచానడమే సందేహం. ఈ సందేహలన్నింటి నిజం అన్నట్టుగా ” పుకార్లు” పుట్టించి దాడులు చెయ్యడం రాజకీయ హత్యలు ? కాదా?
  బెదిరింపులు , దాడులు , దౌర్జన్యాలు , ,హత్యా ప్రయత్నాలు , హత్యలు అసహన పరంపరలో వివిధ దశలు.
  అసలు సినిమా ఇతివృత్తం తెలంగాణ అంశం కనే కాదు. జాగ్రత్తగా గమనిస్తే సినిమా సందర్భం భాష ,ప్రాంతీయ, స్త్రీ వాదాల్లో దురహంకార ( శివసేన లాంటి పార్టీ లు ఆడుతున్న ) రాజకీయ క్రీనీడ . సినిమా గురించి ఇంత చర్చించడం … అసలు విషయాన్ని, అందులో తీవ్రతని నిరుత్సాహ పరచడమే! కానీ వివరణ కోసం ఇంత ప్రయాస పడాల్సి వచ్చినది.

  సమాజంలో అకృత్యాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం దానిని ఎదుర్కొవాలి. ప్రభుత్వం ( గవర్నమెంట్) ,రాజ్యం (స్టేట్), దేశం ( నేషన్) ఈ మూడింటిని పరిగణ తీస్కుని మనం కార్యకలాపాలను విమర్శల్ని చెయ్యాలి . బి జే పి హయాం లో అకృత్యాలు జరిగితే దానికి బి జే పి ని మాత్రమే బాధ్యులని చేసే విధం గ మాట్లాడాలి. కానీ దేశం విడిచి వెళ్లిపోవాల అన్న సందేహం వెలిబుచ్చడం దేశాన్ని కించపరచడమే కదా? బి జే పి హయాం లో అసహనం పెరుగుతన్నది అనడానికి దేశం లో అసహనం పెరుగుతన్నది అనడానికి చాల తేడా ఉన్నది?

  రచయితలకు అవార్డులు ఇచింది ఇండియన్ స్టేట్ ( భారత రాజ్యం ) కానీ బి జే పి ప్రభుత్వం కాదు. దానిని తిరిగి ఇచ్చేయ్యడం దేశాన్ని అవమానపరిచినట్టు కదా?
  అ రచయితలు నిజం గ నిరసన తెలిపే మార్గాలు ఎన్నో ఉన్నయి.. అవార్డులు వెనక్కి ఇవ్వడం కంటే పదును అయిన మార్గాలు ఉన్నాయి .. అవి నేను చెప్పనవసరం లేదు.

  అమీర్ ఖాన్ మాట్లాడిన మొత్తానికి ఎవరు అభ్యంతరం చెప్పడం లేదు .. కానీ చివర గ వచ్చిన ” దేశం విడిచి వెళ్లిపోవాల అన్న సందేహం” ఇంత హంగామా సృష్టించినది .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s