రామ్ నాధ్ గోయెంకా జర్నలిజం అవార్డుల ప్రధానోత్సవంలో అమీర్ ఖాన్ చెప్పిన మాటలపై రేగిన రగడ కొనసాగుతోంది. కేంద్ర మంత్రులే స్వయంగా రంగంలోకి దిగి ఖండన మండనలు జారీ చేస్తూ అమీర్ ప్రకటనకు పెడార్ధాలు తీస్తున్న నేపధ్యంలో అమీర్ ఖాన్ మరోసారి స్పందించాడు. తాను చెప్పిందేమిటో పూర్తిగా చదివి మాట్లాడాలని కోరారు.
తనకు గానీ, తన భార్యకు గానీ భారత దేశం వదిలి వెళ్ళే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. తప్పుడు అర్ధాలు తీస్తున్నవారు తాను చెప్పిందేమిటో సరిగ్గా చూసి/చదివి ఉండరనీ లేదా చదివి కూడా ఉద్దేశ్యపూర్వకంగా పెడార్ధాలు తీస్తూనయినా ఉండాలనీ నిరసించాడు.
అమీర్ ఖాన్ ప్రకటన పూర్తి పాఠం ఇలా ఉంది:
“మొదట నన్ను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పనివ్వండి! నాకు గానీ, నా భార్య కిరణ్ కి గానీ దేశం వదిలి వెళ్ళే ఉద్దేశ్యం ఏ కోశానా లేదు. మేము ఎప్పుడూ దేశం వదిలి వెళ్లలేదు. భవిష్యత్తులో వెళ్ళే ఉద్దేశం కూడా ఏమీ లేదు. ఇందుకు విరుద్ధంగా అర్ధం వచ్చే విధంగా మాట్లాడుతున్నవారు నా ఇంటర్వ్యూను చూడలేదన్నా అయి ఉండాలి, లేదా నేను చెప్పిన దానిని ఉద్దేశ్యపూర్వకంగా పెడార్ధాలు తీస్తూనయినా అయి ఉండాలి. భారత దేశం నా దేశం. ఇక్కడ పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఎప్పటికీ నేను ఉండేది ఇక్కడే.
“రెండవది, నా ఇంటర్వ్యూలో చెప్పిన ప్రతి అంశానికీ నేను కట్టుబడి ఉన్నాను.
“నన్ను జాతి వ్యతిరేకిగా పిలుస్తున్న వారందరికీ నేను చెప్పడలిచింది ఏమిటంటే భారతీయుడుగా ఉన్నందుకు నేను గర్విస్తాను. అందుకు నాకు ఎవరి అనుమతి గానీ, ఆమోదంగానీ అవసరం లేదు.
“నా హృదయంతో మాట్లాడినందుకు గాను నాపై దుర్భాషలతో కేకలు వేస్తున్నవారందరికీ… నేను చెప్పిన మాటలను మీరు ధ్రువపరుస్తున్నందుకు నాకు చాలా విచారంగా ఉంది.
“నా పక్కన మద్దతుగా నిలబడ్డవారందరికీ… ధన్యవాదాలు. ఈ సుందరమైన, అసమానమైన మన దేశం నిజంగా దేనికి (ఏ విలువలకు) నిలబడుతుందో దానిని మనం కాపాడుకోవాలి. మన దేశ సమగ్రత, భిన్నత్వం, ఉమ్మడితనం, అనేక భాషలు, సంస్కృతులు, దాని చరిత్ర, దాని సహనశీలత, దాని ఏకాంతవాద అవగానను, ప్రేమను, సున్నితత్వాన్ని, దాని భావావేశాల బలాన్ని మనం కాపాడుకోవాలి.
“రవీంద్రనాధ్ ఠాగూర్ రాసిన పద్యంతో నా యీ ప్రకటనను ముగిస్తాను. నిజానికది ప్రార్ధన:
(చలం అనువాదం)
ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తి తిరుగుతాడో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడ అవిరామమైన అన్వేషణ, పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞాన వాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో,
తలపులో పనిలో నిత్య విశాల పదాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో,
ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు!
జై హింద్!
************
వీర సింహాలై అమీర్ ఖాన్ మీద నోరుపారేసుకుంటున్న వారందరూ ఇప్పటికైనా ఆయన చెప్పిందేమిటో అర్ధం చేసుకోవాలి. ఆయన అన్నది భారత దేశం అసహన దేశం అని కాదు. గత 6-7 నెలలుగా అసహనం పెరుగుతోంది అని. కొన్ని శక్తులు పనిగట్టుకుని ఈ అసహనాన్ని ప్రోది చేస్తున్నారని ఆయన పైకి చెప్పకుండా చెప్పారు. అసహనం ఎంతలా పెరుగుతోందంటే సెలబ్రిటీ భార్యగానే కాక, తాను కూడా (నిర్మాతగా) సెలబ్రిటీగా ఉండి కూడా తన బిడ్డ భవిష్యత్తు గురించి అమీర్ భార్య కిరణ్ బెంగపెట్టుకునేంతగా!
‘ఈ వెధవని షూట్ చేసి పారేయ్యాలి’ అని ఓ తాతగారు తన మనవడి మీద విసుక్కుంటే నిజంగానే తుపాకి పట్టుకుని కాల్చేసే ఉద్దేశంతోనే ఆయన ఉన్నట్లా? ‘రే చంపుతారొరే నానిగా’ అని ఓ అన్న తమ్ముడ్ని గద్దిస్తే నిజంగా చంపేస్తాడనేనా? “అబ్బబ్బ! ఏం అల్లరి! కొన్నాళ్లు వీళ్ళని ఏ అడవుల్లోనో వదిలేసి వస్తే బాగుడ్ను” అని ఓ తల్లి విసుక్కుంటే నిజంగానే ఆ తల్లి తన పిల్లాడ్ని/పిల్లని అడవుల్లో వదిలేయమని కోరినట్లేనా?
అమీర్ ఖాన్ భార్య, నిర్మాత కిరణ్ అన్నది కూడా అలాగే. ఇంత చిన్న విషయం కూడా విడమరిచి చెప్పవలసిన అగత్యం ఏమిటా అని?! కమలా పండు తోలు వొలిచి, తొనలు విడదీసి, నమిలి, తిని కూడా పెట్టమంటే ఆ ఫలితాన్ని అనుభవించేది దానిని తినిపెట్టినవారే గానీ ఆ పండు తినాలనుకున్నవారు కాదు కదా! అలాగే అమీర్ ఖాన్ అన్న మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎటొచ్చీ అర్ధం చేసుకోవడంలోనే వస్తోంది తంటా!
అయితే ఈ తంటా అర్ధం చేసుకోలేనివారితోనే! ‘అయితే పాకిస్తాన్ వెళ్ళు’ అని కూస్తున్న శివసేన నాయకులో, ‘దేశం పరువు తీశావు, నీ పరువు కూడా తీసుకున్నావు’ అని ఆవేశపడిపోయిన కేంద్ర మంత్రి షానవాజ్ హుస్సేన్ గారో, ‘ఏ దేశం వెళ్తావో అదీ చెప్పు’ అని అడుగుతున్న చెత్త దర్శక నిర్మాతో… వీళ్ళు అనేది అర్ధం కాక కాదు. ఒకరిది ‘ట్రబుల్డ్ వాటర్స్ లో ఫిషింగ్’ చేసే దురుద్దేశం! తాము రేపే మతోన్మాద మంటల్ని తిరిగి బాధితులవైపే మరల్చే నంగనాచితనం ఇంకొకరిది. పొగరుతో కన్నూ మిన్నూ కానక అన్నదేంటో కూడా పట్టని విచ్చలవిడితనం మరొకరిది!
పాఠకులు ఈ రాజకీయ దుర్మధనాన్ని అర్ధం చేసుకోవాలి. అమీర్ ఖాన్ చెప్పిన మాటల సందర్భాన్ని పట్టుకోవాలి. దానికి బదులు ముంబై దాడుల నిందితుడు మెమన్ ఉరి గురించి ప్రస్తావించడం వల్ల ఏమిటి ప్రయోజనం? ముంబై టెర్రరిస్టు దాడులు జరిగినప్పుడు (ఉరితీయబడ్డ) మెమన్ అసలు ఇండియాలోనే లేడని చెప్పేందుకు పక్కా సాక్ష్యం ఉన్నా మన కోర్టులు పట్టించుకోని సంగతి ఎలా చెబితే అర్ధం అవుతుంది? “సాక్ష్యాలు లేకపోయినప్పటికీ భారత దేశ ఆత్మ శాంతించడానికి తప్పదు” అంటూ అఫ్జల్ గురుని ఉరితీయాలని సుప్రీం కోర్టు చెప్పిన సంగతి ఏ న్యాయ రక్షణ అవుతుంది?
ఈ బ్లాగ్ లో ముస్లిం మతోన్మాదం గురించి అనేకసార్లు, ఆ సందర్భం వచ్చినపుడు, రాశాను. సిరియా, లిబియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ తదితర దేశాలలో జరిగిన, జరుగుతున్న ఉగ్రవాద దాడులకు మూలం ఎవరో విశ్లేషణాత్మకంగా అనేక ఆర్టికల్స్ రాశాను. బహుశా ఇవి చదవలేదేమో ‘మరి అప్పుడేందుకు రాయలేదు?’ అని అడుగుతున్నారు. కొత్త పాఠకులైతే ఓసారి బ్లాగ్ ని వెతికితే అవి లబిస్తాయి.
‘మరి ఆ సంగతేంటి?’ అని వేస్తున్న ప్రశ్నలకు కూడా అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలోనే సమాధానం చెప్పాడు. ఈ ప్రశ్నలు కొత్తవి కాదు. హిందూ మతం పేరుతో మతోన్మాద మూకలు సాగిస్తున్న అరాచక హింసను ఖండించినప్పుడల్లా ఇలాంటి ప్రశ్నల మాటున దాక్కుని సమర్ధించుకోవడం ఇప్పుడు కొత్త విషయం కాదు. ఆ గమనంతోనే అమీర్ ఖాన్:
“ఏ పార్టీ అధికారంలో ఉందన్నది అప్రస్తుతం… ఎవరు అధికారంలో ఉన్నారన్నది అనవసరం… (ఉదాహరణకి) బి.జె.పి ఇప్పుడు అధికారంలో ఉన్నది. టి.వి చర్చల్లో వారిపై అనేక ఆరోపణలు వస్తుంటాయి. వారు దానికి సమాధానంగా 1984లో ఏం జరిగిన అల్లర్ల (ఇందిర హత్య అనంతరం సిక్కులపై సాగిన ఊచకోత) సంగతి ఏమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు జరిగిన తప్పు ఇప్పుడు జరుగుతున్న తప్పును ఒప్పు చేయబోవు. 1984 నాటివి వినాశకరమైనవి. అది చాలా భయంకరం”
అని చెప్పారు. ఆయన సిక్కులపై దాడుల్ని ప్రస్తావించారు గాని ముంబై దాడుల్ని ప్రస్తావించారా? అని అడిగితే చెప్పేదేమీ ఉండదు, కాస్త సావకాశంగా అర్ధం చేసుకోండి అని చెప్పడం తప్ప. తాను చెప్పిన మాటలను ఆమూలాగ్రం అర్ధం చేసుకున్నాక తదనుగుణంగా స్పందించడం అభిలషణీయం.
Matalatho melikalu petti, enni prashnalu ayina dateyavachu.! badhyata gala vyakthiga unnappudu, mana matlau chala mandhini prabhivtham chese paristhiti unnappudu… manam matladedhi emito atma sameeksha cheskovali.
desham
antha desha bhakthi unna amirkhan , thana bharya thanani ala prashninchinappudu ayana em samdhanam cheppi untadu?
gayalu gurthu chesi matlade badhulu manam enno sanklustha parishitulani datukuni dhrudam ga nilabadina sangathi enduku gurthu cheyyakudadhu
mana dhourbhagyam emiti ante manam manalni thappa andarni gouravistham, andari daggara manchi anipinchukodaniki.. ee prayatnam lo manam mana unikine kolpotham
gatha 7-8 nelalu ga jaruguthunna sanghatanalu desham lo eppatinundo jaruguthunnayi… kani eroju kevalam inthati pramukhyanni santharinchukunnayi.! adhi kevalam BJP adhikaram lo undatam istam leni journalist karanam kavochu
inthaki intolerance ani gundelu badhukuntunna , rachayitalu , cinema virulu mundhu ee INTOLERANCE anna padani upayoginchadam manesi valla panilo nimaganamithee.. paristhitulu anni sardhukuntayi!! ee intolenace gurinchi enthaa ekkuva matladithe antha intolerance…. ekkuva avuthundi