సినిమాల్లో విజయవంతమైన కెరీర్ తో సరిపెట్టుకోకుండా, ‘సత్యమేవ జయతే’ పేరుతో టి.విలో కార్యక్రమం నిర్వహించడం ద్వారా అనేకమంది భారతీయుల మన్ననలు అందుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ‘పరమత సహనం/అసహనం’ పై దేశంలో చెలరేగిన రాజకీయ మరియు అరాచకీయ దుమారం నుండి దూరంగా నిలబడి తప్పించుకోవడానికి బదులు అటో, ఇటో ఒక మాట విసిరి తానూ ఉన్నానని నిరూపించుకునే సెలబ్రిటీలు చాలా తక్కువమందే.
ఒకవేళ ఎవరన్నా ముందుకు వచ్చినా కర్ర విరగ కుండా పామూ చావకుండా తనను కాపాడుకునేవైపు దూకే సెలబ్రిటీలనే మనం ఎక్కువమందిని చూస్తాము. అమీర్ ఖాన్ ఇందుకు భిన్నంగా స్పందించడం, తన వ్యాఖ్యల వల్ల తన సినిమాలు ఏమైపోతాయో అన్న బెంగ లేకుండా స్పందించడం అభినందనీయం. అదికూడా తన మాటలు ఎవరికి వ్యతిరేకంగా పరిణమిస్తాయో వారి సమక్షంలోనే ఆ కాసిన్ని మాటలు చెప్పడం ఇంకా అభినందనీయం.
రామ్ నాధ్ గోయెంకా జర్నలిజం ప్రతిభా అవార్డుల ప్రదానం సదర్భంగా అవార్డుల ప్రదాతలు ఆమీర్ ఖాన్ ని ఆహ్వానించారు. ఆయనని వేదికపై కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారు. ఆ సభలో బి.జె.పి నేత, దేశ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా హాజరయ్యారు. రామ్ నాధ్ గోయెంకా ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్ర ప్రభ పత్రికల వ్యవస్ధాపకులు. ఆయన బి.జె.పి మద్దతుదారు అన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఆంధ్ర ప్రభ సైతం బి.జె.పి కి మద్దతుగా వార్తలు, అభిప్రాయాలూ ఇస్తుందన్నది రహస్యం ఏమీ కాదు. కనుక అవార్డుల కార్యక్రమానికి బి.జె.పి నేతలు విస్తృతంగా హాజరయ్యారు. అలాంటి వేదికపైనే అమీర్ ఖాన్ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. ఎక్కడో దాక్కుని మాట్లాడలేదు.
అసలు అమీర్ ఖాన్ అన్న మాటలు ఏమిటి? ఆయన చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.
“ఒక వ్యక్తిగా, ఈ దేశంలో భాగమైన ఒక పౌరునిగా, (దేశంలో) ఏమి జరుగుతున్నదో మేమూ పత్రికల్లో చదువుతాము, (టి.వి) వార్తల్లో చూస్తాము. కనుక ఖచ్చితంగా నేను అప్రమత్తం అయ్యాను. నేను కాదనలేను. అనేక సంఘటనలవల్ల నేను అప్రమత్తం అయ్యాను.”
“ఇంటి వద్ద నేను కిరణ్ తో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు ఆమె ‘మనం ఇండియా నుంచి వెళ్లిపోవాలా?’ అని అడిగింది.. కిరణ్ నుండి అటువంటిది వ్యక్తం కావలసిన పరిస్ధితి ఏర్పడడం అత్యంత దౌర్భాగ్యం. ఆమెకు అది చాలా పెద్ద ప్రకటన. ఆమె తన బిడ్డ కోసం భయపడుతోంది. మా చుట్టూ వాతావరణం ఎలా మారబోతోందోనని భయపడుతోంది. ప్రతి రోజూ వార్తా పత్రిక తెరవడానికి కూడా ఆమె భయపడుతూ ఉంది.
“లోలోపల కలవరపాటు భావన వృద్ధి చెందుతోందన్న విషయాన్నీ, అప్రమత్తతతో పాటుగా నిస్పృహ పెరుగుతోందన్న విషయాన్నీ ఇది సూచిస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతోందన్న ప్రశ్న మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. హీనపరచబడుతున్న భావన క్రుంగదీస్తూ ఉంటుంది. కానీ, ఒక సమాజంలో భద్రంగా ఉన్నామన్న భావన, న్యాయం జరుగుతుందన్న భరోసా ఉండడం చాలా ముఖ్యం.
“మనం మన ప్రతినిధులుగా ఎన్నుకున్న వారిని, ఐదేళ్లపాటు మన గురించి చూస్తూ ఉండమని ఎంచుకున్న వారినీ (తీసుకోండి)… చట్టాన్ని కొంతమంది తమ చేతుల్లోకి తీసుకుంటున్నపుడు, వారి యెడల దృఢంగా వ్యవహరించాలని, దృఢమైన ప్రకటన చేయాలనీ, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలనీ… మనం వారి వైపు చూస్తాం. అలాంటిది జరుగుతున్నపుడు మనం భద్రంగానే ఉన్నామన్న భావన కలుగుతుంది. కానీ అలాంటిది ఏదీ జరగనప్పుడు అబధ్రతా భావన కలుగుతుంది.
“ఎందరో సృజనశీలురు -చరిత్రకారులు, శాస్త్రవేత్తలు- అంతకంతకూ ఎక్కువగా ఒక నిర్దిష్ట అవగాహనకు వస్తున్నారు. దానిని వ్యక్తం చేయాలని వారు భావిస్తున్నారు. సృజనాత్మకత కలిగిన వారు తమ అసంతృప్తిని, ఆశాభంగాన్నీ వ్యక్తం చేయడానికి ఉన్న దారుల్లో ఒకటి తమ అవార్డులను వెనక్కి ఇచ్చేయడం. మనం చెప్పదలుచుకున్న దాన్ని స్పష్టంగా చెప్పడానికి ఉన్న దారుల్లో అదొకటని నేను భావిస్తున్నాను.
“ఏ పార్టీ అధికారంలో ఉందన్నది అప్రస్తుతం… ఎవరు అధికారంలో ఉన్నారన్నది అనవసరం… (ఉదాహరణకి) బి.జె.పి ఇప్పుడు అధికారంలో ఉన్నది. టి.వి చర్చల్లో వారిపై అనేక ఆరోపణలు వస్తుంటాయి. వారు దానికి సమాధానంగా 1984లో ఏం జరిగిన అల్లర్ల (ఇందిర హత్య అనంతరం సిక్కులపై సాగిన ఊచకోత) సంగతి ఏమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు జరిగిన తప్పు ఇప్పుడు జరుగుతున్న తప్పును ఒప్పు చేయబోవు. 1984 నాటివి వినాశకరమైనవి. అది చాలా భయంకరం”
…. ఇవీ అమీర్ ఖాన్ తనను అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పిన మాటలు!
*********
ఇవి ఒక పార్టీ పక్షం తీసుకుని చెప్పిన మాటలు కావు. ఒక నాయకుడి కోసం చెప్పినవి కావు. ఒకరికి వ్యతిరేకంగా చెప్పినవి కూడా కావు. అమీర్ ఖాన్ చెప్పినట్లుగా ఈ దేశంలో నివశిస్తున్న పౌరుడిగా తన కుటుంబం ఎదుర్కొంటున్న అభద్రతను ఎంతో సమతూకంతో, తొట్రుపాటు లేకుండా చెప్పిన మాటలు!
ఈ మాటల్ని హిందూత్వ గణాలు తమ సహజ ధోరణితోనే తీసుకున్నాయి. ఏ వాతావరణాన్ని అవి సృష్టిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయో, ఏ వాతావరణం వల్ల తన కుటుంబం అభద్రతతో ఉన్నదని అమీర్ ఖాన్ చెప్పుకున్నాడో ఆ వాతావరణం ఉండడం నిజమేనని మరింతగా ధ్రువపరుస్తూ వారు స్పందించారు. ఒకరిద్దరు బి.జె.పి నేతలు సమతూకంతో స్పందించినట్లు కనపడుతూనే అమీర్ ఖాన్ మాటలకు పెడార్ధాలు తీయడంలో మాత్రం విఫలం చెందలేదు.
బి.జె.పి (చండీఘర్) ఎం.పి కిరణ్ ఖేర్ భర్త అనుపమ్ ఖేర్ ట్విట్టర్ లో ఇలా ప్రశ్నించాడు. “డియర్ అమీర్ ఖాన్. ఏ దేశం వెళ్లాలో నువ్వు నీ భార్యని అడిగావా? ఈ దేశమే నిన్ను అమీర్ ఖాన్ ను చేసిందన్న సంగతి నీ భార్యకు చెప్పావా? ఈ దేశంలో ఇంతకంటే ఘోరమైన కాలంలో బతికావని, కానీ ఎన్నడూ దేశం వదిలి వెళ్లాలన్న ఆలోచన నీకు ఎన్నడూ రాలేదని కిరణ్ కు చెప్పావా? ‘ఇంక్రెడిబుల్ ఇండియా’ కాస్తా ‘ఇంటాలరెంట్ ఇండియా ఎప్పుడు అయింది? కేవలం గత 7-8 నెలల కాలంలోనేనా?”
నా యిష్టం అంటూ బుర్రలోని చెత్తనంతా పుస్తకంలో గుమ్మరించి తెలుగు ప్రజల మీదికి వదిలిన రామ్ గోపాల్ వర్మ ఇలా అన్నారు. “అసహనం గురించి ఫిర్యాదు చేస్తున్న సెలబ్రిటీలు అలా ఫిర్యాదు చేసేవారిలో నిజానికి చివర ఉండాలి. ఎందుకంటే ఈ సోకాల్డ్ ఇంటాలరెంట్ ఇండియా లోనే వారు సెలబ్రిటీలు అయ్యారు. ఏ దేశంతో పోల్చి చూసినా భారత దేశమే అత్యంత సహనశీల దేశం. ఎవరైనా కొందరు అసంతృప్తిగా ఉంటే వారు ఏ దేశానికి వెళ్తారో కూడా చెప్పాలి.”
బి.జె.పి ఎం.పి, నటుడు, పరేశ్ రావల్ కాస్త మర్యాదగా ఇలా స్పందించారు. “అమీర్ పోరాడే తత్వం కలవాడు. కనుక దేశం విడిచి వెళ్లడానికి బదులు దేశంలోనే ఉండి పరిస్ధితిని మార్చాలి. ఇక్కడే బతకాలి, ఇక్కడే చావాలి. నిజమైన దేశభక్తుడు కష్ట సమయంలో అలజడిలో ఉన్న(ట్లయితే) జన్మ భూమిని వదిలి పారిపోడు… తప్పించుకోవద్దు…. దానిని (దేశాన్ని) నిర్మించు…”
“బాబీ” హీరో రిషి కపూర్ ఇలా స్పందించారు. “మిస్టర్ మరియు మిస్టర్ అమీర్ ఖాన్! వివిధ అంశాలు తప్పుదారి పడుతున్నప్పుడు వ్యవస్ధకు దిద్దుబాటు అవసరం అయితే దానికి మరమ్మతు చెయ్యి. సవ్యంగా మలుచు. దానినుండి పారిపోవద్దు. హీరోయిజం అంటే అదే!”
హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమల నిన్నటి హీరోయిన్ రవీనా టాండన్ ఇలా స్పందించారు. “ప్రధాని మోడి ప్రధాని కావడం ఇష్టం లేనివారంతా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరుకుంటారు. విచారకరం ఏమిటంటే, రాజకీయాల పుణ్యమా అని, వారు దేశాన్ని సిగ్గుపరుస్తున్నారు.”
మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తర్ అబ్బాస్ నక్వి ఇలా అన్నారు. “ఈ దేశం ఆయనకు ఎంతో ప్రేమను, గౌరవాన్ని ఇచ్చింది. ఏదో తొందరలోనో లేదా ఇతరుల ప్రభావం వల్లనో ఆయన ఇలా మాట్లాడి ఉంటారు. ఈ దేశం డి.ఎన్.ఏ లోనే సహనశీలత ఉన్నది. ఆయన ఎక్కడికీ వెళ్లరు, మేము వెళ్లనివ్వం కూడా.”
బి.జె.పి ప్రతినిధి నళిని కోహ్లి ఇలా అన్నారు, “మితవాద సంస్ధలు కొన్ని నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ పి.కె (అమీర్ ఖాన్ నటించిన సినిమా) బ్రహ్మాండమైన బాక్స్ ఆఫీస్ సక్సెస్ గా నిలిచింది. భారత సమాజం ఎంతటి సహనశీలమో ఈ ఉదాహరణే చెబుతుంది. అక్కడక్కడా కొన్ని ఘటనలు ఇండియాలో మినహాయింపులే గానీ అవి భారత దేశ అసహనశీల స్వభావానికి చిహ్నం కాదు. చిల్లర ఘటనలను ఇండియాను నిర్వచించేవిగా చెప్పడం దురదృష్టకరం. మన రాజ్యాంగం ప్రతి పౌరునికీ భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు కూడా హక్కు ఉన్నది. అలాగే ఆయనతో అంగీకరించనివారికి కూడా ఆ స్వేచ్ఛ ఉంటుంది… ఇంత చర్చ జరుగుతోందంటేనే అసమ్మతిని కూడా సహించే సహనశీలత ఈ సమాజానికి ఉన్నట్లు అర్ధం. దేశం విడిచి వెళ్ళేవారు అనేక కారణాలతో వెళ్తుంటారు. చదువు, కెరీర్, వ్యాపారం, ఇలా. వాటిలో పన్నులు ఎగవేయడం కూడా ఒకటి.”
*********
అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ దేశం వదిలి వెళ్లడానికి నిర్ణయించేసుకున్నారనే వీళ్ళంతా నిర్ణయించేయడమే ఆశ్చర్యకరం. ఇంటిలో భార్యతో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సందర్భంలో, ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్న తీవ్ర హింసాత్మక ఘటనలను తలుచుకుని అబధ్రతా భావానికి లోనైన తన భార్య అన్న మాటను అమీర్ ఖాన్ ఒక వేదికపై విలేఖరులతో పంచుకున్నాడు. ఆ వేదికను దేశం అంతా చూస్తోంది. చూడనివారు పత్రికలో వార్తల్లో చూస్తారని అమీర్ కి తెలుసు. తెలుసు గనకనే తన అనుభవాన్ని, అభిప్రాయాన్ని అమీర్ పంచుకున్నాడు. అంతమాత్రాన అమీర్ కుటుంబం దేశం విడిచి వెళ్ళే పిరికిపోతుదని నిర్ణయించడం సమంజసమేనా?
దేశం విడిచి వెళ్లవలసి వస్తుందా అంటూ ఒక గృహిణి వ్యక్తం చేసిన భయాన్ని ఆ కుటుంబం లక్షణంగా మార్చివేయడం ఇంతోసి పెద్దలకు తగునా? ఆ గృహిణి భయం పోగొట్టి వారి భద్రతకు గ్యారంటీ ఇచ్చే మాటలు పలకడానికి బదులు వారి దేశభక్తిని శంకిస్తూ, వారి ధైర్యాన్ని శంకిస్తూ, వారి పౌర హక్కుల్ని పరోక్షంగా ప్రశ్నిస్తూ, వారిని భయాన్ని రెట్టింపు చేయడం భాధ్యత కలిగిన సచివులకు, సో కాల్డ్ సెలబ్రిటీలకు, నేతలకు తగునా?
వీళ్ళ మాటల్ని బట్టి చూస్తే వీళ్ళ వల్లనే -బాలీవుడ్ సినిమా పరిశ్రమ వల్లనే, అక్కడి సెలబ్రిటీల వల్లనే, బి.జె.పి నాయకులు ప్రభుత్వం వల్లనే- భారత దేశం అత్యంత సహనంతో వ్యవహరిస్తోందని భావిస్తున్నట్లు కనపడుతోంది. కానీ వారు తెలుసుకోవలసిన ప్రాధమిక విషయం ఏమిటంటే వీళ్ళ వల్ల కాదు సరికదా, వీళ్ళ కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ కూడా (NOT “BECAUSE OF” THESE PEOPLE, BUT “DESPITE” THESE PEOPLE) దేశం సహనంతో ఉంటోంది.
పి.కె విజయవంతం అయింది అందులోని దృశ్యాలు చూపరుల నిత్యజీవన అనుభవాలకు దగ్గరగా వచ్చినందువల్లనే గానీ ఈ పెద్దలు, సెలబ్రిటీలు ‘మనది సహనశీల దేశం, కాబట్టి చూడండహో’ అని డప్పు కొట్టడం వల్ల మాత్రం కాదు. అబ్బాస్ నక్వీ అంగీకరించినట్లు ఈ దేశం డి.ఎన్.ఏ లోనే సహనం ఉంది. భిన్న సంస్కృతులను, ఆచారాలను, మతాలను తమ జీవిత సత్యాలుగా భారతీయులు మార్చుకుని సహస్రాబ్దాలే గడిచిపోయాయి. కానీ ఆ సహనశీలతను విధ్వంసం కావిస్తున్నదెవరు? హిందూత్వ పార్టీలు, సంస్ధలు కాదా? సో కాల్డ్ హిందూ సంస్కృతీ పరిరక్షక ఉన్మాదులు కాదా?
రామమందిరం పేరుతో, శిలాన్యాస్ పేరుతో, రధయాత్ర పేరుతో దేశం నిండా మతకల్లోలాలను రెచ్చగొట్టిన హిందూత్వ శక్తుల విశృంఖలత్వాన్ని ఎదుర్కొని కూడా భారత ప్రజలు తమను తాము కూడదీసుకుని సాధారణమైన తమ ‘సహన’ స్వభావం లోకి మళ్ళీ వచ్చేశారు. సబర్మతి ఎక్స్ ప్రెస్ బోగీ దహనాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రం రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చివేసిన హిందూత్వ శక్తుల విష పరిష్వంగాన్ని చవి చూసి కూడా అదే శక్తులకు ‘అభివృద్ధి’ని కాంక్షిస్తూ పట్టం కట్టడం భారత ప్రజల సహనశీలత కాక మరేమిటి?
ఎటొచ్చీ ప్రజల సహనశీలత ‘తమ గొప్పే’ అన్నట్లుగా హిందూత్వ శక్తులు డప్పు కొట్టుకోవడమే అతి పెద్ద అభాస! హీరోయిన్ కి అరచేతి వెడల్పు బట్టలు తగిలించీ, జనంలోని మూఢ నమ్మకాలనూ అందులోనుంచి జనించే భయాందోళనలనూ సొమ్ము చూసుకునే సినిమాలు తీయడం మరిగిన దర్శక నిర్మాతలు భారత ప్రజల సహనశీలతను చూపి గొప్పలు పోవడం జనానికే చిన్నతనం!
ఈ దర్శక నిర్మాతకు జనంలోని సహనశీలతను గొప్ప చేసి చూపే సినిమా తీయాలన్న ఆలోచనే ఎన్నడూ వచ్చి ఉండదు. ఈ కుక్కమూతి పిందె తగుదునమ్మా అంటూ ‘ఏ దేశానికి వెళ్తారో చెప్పమని’ అడగడం వింత కాక మరేమిటి?
ఆ మాటకొస్తే ‘సత్యమేవ జయతే’ సీరియల్ ద్వారా భారత సమాజంలోని ఫ్యూడల్ లక్షణాలను ఎత్తిచూపుతూ వాటిని తొలగించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన కర్తవ్యాన్ని నిర్వహించింది అమీర్ ఖానే కాదా? అమీర్ ఖాన్ ‘నా యిష్టం’ అంటూ పొగరుబోతు చెత్తని జనం మీదికి వదల్లేదు. భారత దేశ ప్రజలపై ఆవరిస్తున్న ఉన్మాదపూరిత వాతావరణాన్ని సవరించుకోవలసిన అవసరం ఎంత ఉన్నదో బి.జె.పి పెద్దల సాక్షిగానే అత్యంత సాహసోపేతంగా అమీర్ ఖాన్ గుర్తు చేశాడు. ఆయన రాజ్యాంగం సమకూర్చిన హక్కునే వినియోగించుకున్నారు. ఆ వినియోగించుకోవడం స్వార్ధంతో చేయలేదు, బాధ్యతతో చేశారు. లక్ష్యిత వ్యక్తులకు, గ్రూపులకు కర్తవ్యాన్ని గుర్తు చేశారు.
అమీర్ ఖాన్ గత 6-7 నెలలుగా అభద్రతను కలిగించే సంఘటనలు జరుగుతున్నాయని చెప్పాడు. భారత దేశంలో అనాదిగా ఇవే జరుగుతున్నాయని మాత్రం చెప్పలేదు. కానీ ఎన్నడో గుడిని కూల్చి మసీదు కట్టారని చెప్పి, ఇప్పుడు మసీదు కూల్చి గుడి కట్టాలంటూ ఉన్మాదం రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి తెగించింది ఎవరు?
మత శక్తుల దురాగతాల వల్ల వాతావరణం కలుషితం అవుతున్న సంగతిని గుర్తు చేయడమూ, భారత దేశమే అసహనంతో నిండిపోయిందని చెప్పడమూ ఒకటేనా? తాము కాలుష్యాన్ని తెస్తున్న సంగతిని పక్కనబెట్టి, ఆ కాలుష్యాన్ని దరి చేరనీయకుండా దూరం పెట్టేందుకు శక్తులు కూడదీసుకుంటున్న భారత ప్రజల ఆత్మ తమ గొప్పే అని చెప్పబూనడానికి మించిన హిపోక్రసీ ఉండగలదా? సహనశీలతా గొప్పతనం అసహనాన్ని కుమ్మరిస్తున్న శక్తులదా లేక ఆ అసహనాన్ని దూరం పెడుతున్న ప్రజలదా?
నిజానికి కాలుష్యాన్ని తెస్తున్నది ఈ రోజు అమీర్ ఖాన్ కి సుద్దులు బోధిస్తున్నవారే. ప్రతి ఒక్కరూ తమ తమ రంగాలలో, తమ స్వార్ధం కోసం జనం మీదికి కాలుష్యాన్ని వదులుతున్నారు. ఈ గురివింద గింజలు మొదట తమ నలుపును చూసుకోవాలని గుర్తు చేయడం ఎంతమాత్రం తప్పు కాబోదు!
I may have to disagree with you in few points. This country is secular and tolerant only because of the people from majority religion are secular and tolerant. We never discussed the tolerance issues when Taslima were thrown out of this country but we discussed when MF Hussain left this country. We never discussed tolerennce issues when there were Fatwas given against AR Rehman amd Sania Mirja. We never encourage movies when they are little controversial towards minority religions (Eg Davinci code, Viswaroopam) but we encourage PK. So called intellectuals are not discussing the issues in other religions ( I am sure you know what happens in so called Swastata Suvarta kutamulu). Yes, I am becoming intolerant because of these double standards. We don’t need tolerence, we need religious respect and it should be from all the sides.
meetho sampoonangaa ekeebhavisthunnaanu ramakrishna garu. kiran oka celebrity, adee kaaka, oka star bharya. ame enduku andolana chendali. saamaanya grihinulu abhadrathaa bhavaaniki guri ayyaranna oka artham undi kaanee, eevida abhadratha ku lonavvadam sahajangaa ledu..oka vela ameer cheppukovalasinadedaina personal gaa matlaadukovaalsindi. thana bharya feelings nu andarilo bayata pettadamenduku… vere mathaalanu anusarinche vaalla double standards evarikee teliyanivi kaavu. daanni alaa vaallu konasaagisthunnarantene sahanam ee desam lo enthundo telusthundi…
సర్,
మౌనేన కలహం నాస్తి అని ఒక సంస్కృత సామెత.
సందోర్భోచితంగా మౌనంగా వుండడమే మంచిదని, ఏ గొడవలు తలెత్తవని దానర్థం.
ఒక్క మాట చెప్తే, దానిని విపరీత అర్థంతో వినేవాళ్ళ విషయంలో, ఈ celebrities కు మౌనమే శరణ్యం.
మన దేశంలో వున్న సగటు పౌరులు ‘ఓ వ్యక్తి ఒంటి చేత్తో పది మందిని మట్టు బెట్టగల సమర్థుడిగా భావనచేస్తున్నారు’ కాబట్టే నేటి హీరోలు హీరోలుగా పరిగణించబడుతున్నారు. వాస్తవానికి అది అసాధ్యం అని తెలిసినప్పటికి ఆ క్షణానికి నిజమనే భ్రమను ఇష్టపడడం చేతనే అది సాధ్యం అవుతున్నది. దీనికి తోడు హీరోలుగా పరిగణించబడుతున్నవారు, తమలోని Good Qualities ని మరింత విస్తృత పరుచుకుంటున్నారు కొన్ని సోషల్ యాక్టివిటీస్‌లో యాక్టివ్ పార్టిసిపెంట్స్‌గా వుండడం చేత.
రాజుగారి నోటిలో తాటాకు బద్ద పుల్ల ఇరుక్కుంటే, చివరాఖరికి రాజుగారి నోటిలో తాటి చెట్టు ఇరుక్కుంది అన్న వార్త చందాన వుంటుంది. నేటి లోకపు తీరు.
ఆ వార్తకు అంత విస్తృత ప్రచారం జరిగింది అది రాజుగారి విషయంలో జరిగింది కాబట్టి, ఏ ఎల్లయ్యో, పుల్లయ్యో అయ్యుంటే అంత విలువ ఇచ్చేవారు కాదు.
అతను చెప్పిన మాటల్ని, అతని భావాలకు యథాతథ విలువను యథాతథంగా తీసుకునే స్థితిలో ప్రస్తుత సమాజం లేదు.
నడినెత్తిన సూర్యుడున్నా ఇంకా వెన్నలలోనే పడుకున్నాం అనుకుంటూ Dream world లోనే అవాస్తవ జీవనం సాగిస్తున్నఈ సమాజానికి వాస్తవ స్థితిని అర్థం చేసుకునే capability వచ్చిన రోజున ఇటువంటి వాటికి విస్తృత విపరీత ప్రచారం వుండదు.
Bottom line: ప్రచార సాధనాలు, ప్రసార మాధ్యమాల సంఖ్య బాగా పెరిగింది, కాని సమాచార ప్రసరణ మాత్రం సరిగా లేనే లేదు. విక్షేప దోషంతో ఉన్నది ఉన్నట్లుగా గ్రహించలేని స్థితిలోనే ప్రస్తుత ప్రపంచం వుంది.
Mumbai ..dawnalam la thagalu pettinappudu.. amir khan ki desham vadileyyalemo anna prashana raledhu, aa dwalananni srustinchina yakub memon ni uri theesinappud, daniki asaduddin chesina vyakhyalaku meeku gani ,, mana hero ki gani ashanam gurthuku raledhu. oka teevravadini uri thesthe nduku intha asahanam ani meeru gani, mana medhavi vargam gani ..award lu tirigi icheyaledhu.. Gatha 7-8 nellalo em antha ashanam vachindi naku teliyadam ledhu. malanti samnya prajalantha desham lo bagane unnam. Meelanti rachayithalu mana hero lanti varike , konni varthalu undali ga rasukodaniki!! media lo kriyaseelakam ga kanipinchadaniki!!
నాకు కొన్ని సందేహాలు….
నిజంగా ఒక తల్లి తన బిడ్డల రక్షణార్ధం దేశాన్ని వదిలి వెళ్ళిపోయేంత పరిస్థితి ఈ దేసంలో ప్రస్తుతం ఉందా? కిరణ్ కొంచెం ఎక్కువ స్పందించారు.
ఆమిర్ నా అభిమాన నటుడు. సామాజిక స్ప్రుహ కల్గిన వ్యక్తి. తన మొదటి స్టేట్మెంట్ లోనే అసహన వ్యక్తుల్ని ,దేశ ప్రజల ఆత్మ ని వేరు పరచి మాట్లాడాల్సింది. వారిలో ఎవరిని వెరుగా చూడని, వారిపై అభిమానాన్ని పెంచుకున్న వారికి , వారు ఈ దేసంలో భాగమని నమ్మిన నిజమైన భారత సహన సీలురు ఎవర్కి(99.9% ప్రజలు) ఈ దేసంలో భద్రత లేదనడం నచ్చలేదు. ఎంతగా సహనాన్ని, అహింస నూ, చూపినా వారిలో ఇంకా, ఈ దేసం పై నమ్మకం రావట్లేదు ఎందుకో?
దీనికి కారణం దేస ప్రజలు కాద్దు. బి.జె.పి.మతతత్వ,, కాంగ్రెస్స్ సెఖులర్ రాజకీYఆలు, చాందస వాద ఆర్.ఎస్.ఎస్. , దేస ప్రజలేమి కొరుకుంటున్నారో అర్థం కాని మోది.
ప్రధానిగా జరిగిన సంఘటన్ల్ని ఖండించి, భరోసా ఇవ్వని మోదీ, మీ ఎంపీ లని కంట్రోల్ చేయని మొడీ మా అందరి అషననాన్ని 2019 లో చూపిస్తాం.
ఆమిర్ చెప్పింది కూడా సిస్టెం ఉద్దేసపుర్వకం గానే ఈ భరోసా కలిగించట్లేదని.
ఇక మేధావులు …కేవలం మెజారిటి మతం లో అసహనాన్నే కాక, ఇతరుల అసహనం, జాతి వ్యతిరేక శక్తులపై కూడా ఇలాంటి నిరసన వ్యక్తం చేస్తే మీ ధైర్యాన్ని మెచ్చుతాం.
ఇన్ని దసాబ్దాలుగా కలిసి ఉంటున్నాం. ఇంకా కలసి ఫోవాలని, ఒక జాతిగా ఉన్నత స్థితి పొండాలని , ఎవరిపై ద్వెషంతోనో అమాయకుల్ని చంపొద్దని, ఒకరి మత వ్యవహారాల్లొ ఇంకొకరు వేలు పెట్టొద్దని, తమ మత ఆధిపత్యం కోరొద్దని నా మనవి.
leaving the country does not mean really leaving it.This is already explained by Anantamurthy when Hindu outfits were ready to supply him a ticket to go to Pakisthan because he made such a statement before Modi became the prime minister. He explained that it is an expression to convey the intensity of one’s own feelings on the subject.
dont you find series of vulgar incidents committed by Hindu outfits in the country recently as their leaders are silent about their mischievous statements and acts. all these make us to think that in future this intolerance may reach to criminal heights.
నాకు తెలిసినంత వరకు భాజపా గెలిచింది అన్నా హజారే నడిపిన అవినీతి వ్యతిరేక ఉద్యమం వల్ల. అవినీతి వ్యతిరేకత ముసుగులో ఒక మతతత్వ పార్తీని అధికారంలోకి తేవడం సాధ్యమేనని ఋజువయ్యింది.