ఇంతకీ మోడి యోగా చేస్తారా? -పుతిన్


Putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు రావలసిన సందేహమే వచ్చింది. ఎవరి ప్రయత్నము, ప్రోత్సాహము లేకుండానే సానుకూల గుణాల వల్ల ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన యోగాను సైతం రాజకీయంగా సొమ్ము చేసుకునే పనిలో పడిపోయిన బి.జె.పి, నరేంద్ర మోడీలు బహుశా ఈ ప్రశ్నను ముందే ఊహించి ఉండవచ్చు. అయితే పుతిన్ నుండి ఈ ప్రశ్న వస్తుందని మాత్రం ఊహించి ఉండరు.

అంతర్జాతీయ విలేఖరులతో మాట్లాడుతున్న సందర్భంలో ఐ.ఏ.ఎన్.ఎస్ (ఇండియా అబ్రాడ్ న్యూస్ సర్వీస్) వార్తా సంస్ధ విలేఖరి ద్వారా యోగా మంత్రిత్వ శాఖను మోడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి విని పుతిన్ ఆశ్చర్యపోయారు. కేవలం యోగా కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ఏమిటన్నది ఆయన ఆశ్చర్యం.

అసలు ఎవరైనా యోగా కోసం ఎందుకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తారని ఆయన ఆశ్చర్యపోయారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని పుతిన్ ఎలా తెలుసుకుంటారు? పౌరుల వ్యక్తిగత మత విశ్వాసాలను రాజకీయాల్లోకి ఈడ్చుకువచ్చి, వివిధ మతాల సమూహాల మధ్య వైరం రగిల్చి, భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు, సీట్లు చివరికి అధికారాన్ని సైతం సంపాదించిన బి.జె.పి చరిత్ర గురించి పుతిన్ కి తెలియకపోవడం ఆశ్చర్యకరం!

“ఇంతకీ నరేంద్ర మోడీ యోగా చేస్తారా?” అని రష్యా అధ్యక్షుడు పుతిన్ విలేఖరులను వాకబు చేశారు. బహుశా మోడీ కూడా యోగా ప్రాక్టీస్ చేస్తుండవచ్చని ఆయనకు సమాధానం వచ్చింది. అయితే ‘తానూ యోగా ఆచరిస్తాను” అని ప్రధాని నరేంద్ర మోడి ఇంతవరకు బహిరంగంగా ఎప్పుడూ చెప్పలేదని కూడా పుతిన్ కు విలేఖరులు సమాధానం ఇచ్చారు.

ఐ.ఏ.ఎన్.ఎస్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ పుతిన్ “ఆయన ఓ మంచి వ్యక్తి. వ్యక్తిగత మిత్రులు” అని చెప్పారు. మోడి, పుతిన్ లను కఠినమైన నాయకులుగా అంతా పరిగణిస్తున్నారా అన్న ప్రశ్నకు పుతిన్ తన విషయం చెప్పారు. తాను కఠినుడిని కానని చెప్పారు.

“నేను టఫ్ కాదు. రాజీ కుదుర్చుకోవడానికే నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. నిజానికి నా ప్రత్యర్ధులే తరచుగా కఠిన వైఖరి అవలంబిస్తుంటారు” అని పుతిన్ వివరించారు. “తమకు రెండు అభిప్రాయాలు ఉన్నాయని వారు చెబుతుంటారు. ఒకటేమో తామే రైట్ అని. రెండోదేమో నేను తప్పు అని” అని పుతిన్ విలేఖరులకు చెప్పారు.

‘వాళ్ళు’ అంటే పుతిన్ ఉద్దేశ్యంలో పశ్చిమ దేశాల నేతలు అని. పుతిన్ చెప్పింది వాస్తవం కూడా. తమ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోకుండా ప్రపంచ రాజకీయ రంగంపై రష్యా స్వతంత్ర, సార్వభౌమ పంధా అవలంబించడం, అది పుతిన్ వల్లనే జరగడంతో పశ్చిమ దేశాలకు ఆయనంటే తగని ద్వేషం. పుతిన్ పైన పశ్చిమ నేతలు పచ్చి అబద్ధాలు సృష్టించి వల్లిస్తే పశ్చిమ పత్రికలు వాటిని తమ మసాలా జోడించి మరీ ప్రచారం చేస్తాయి. తాము సొంతగా కట్టు కధలు అల్లి ప్రచారం చేస్తాయి.

జార్జియా యుద్ధం, ఉక్రెయిన్ ఆందోళనలు, క్రిమియా రిఫరెండం, రష్యా ఆర్ధిక వ్యవస్ధ, రష్యాలో మానవ హక్కులు… ఇలా ప్రతి అంశం లోనూ విపరీతమైన విద్వేష ప్రచారాన్ని పశ్చిమ దేశాల ఆధిపత్య వర్గాలు సాగిస్తుంటాయి. వారి విద్వేషాన్నే పుతిన్ పై విధంగా క్లుప్తీకరించి చెప్పారు. తాము గొప్ప ప్రజాస్వామికవాదులం, స్వేచ్ఛా ప్రజాస్వామ్య సంరక్షకులం అని చెబుతూనే ప్రపంచ ప్రజల ప్రయోజనాలపై అత్యంత కిరాతకంగా దాడి చేయడం పశ్చిమ దేశాల ప్రభుత్వాల నైజం. ఆ సంగతినే పుతిన్ చెప్పారు.

2 thoughts on “ఇంతకీ మోడి యోగా చేస్తారా? -పుతిన్

  1. మంచి ప్రశ్నే వేసారు.వాజ్ పేయి గారు కూడా ప్రధాని అవగానే భారంగా నడవలేక నడిచేవారు.మోడీ గారు కూడా అలాగే భారంగా నడుస్తుంటారు.యోగా చేస్తే అంత భారీ శరీరం మాత్రం ఉండదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s