“ఇందుగలదందులేదని సందేహంబు వలదు యోగా సర్వోపగతుందెందెందు వెదకి చూచిన అందెందే గలదు” అని చదువుకోవచ్చని ఖాయంగా అనిపిస్తుంది కింది ఫోటోలు చూస్తే!
‘అంతర్జాతీయ యోగా దినం’ అంటూ ఇప్పుడు హడావుడి చేస్తున్నారు గానీ, నిజానికి యోగా ఎన్నడో ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉంది.
1982 లోనే అమెరికా పౌరులు యోగా, ధ్యానం లను అభ్యసించడమే కాకుండా కొందరు దేశ విదేశాలు తిరిగి ప్రచారం చేశారని కూడా ఈ బ్లాగర్ కి తెలుసు.
ఎలాగంటే ఆ సంవత్సరంలో ప్రఖ్యాత తాడికొండ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్ధిగా ఉండగా అక్కడి విద్యార్ధులకు యోగా, ధ్యానం నేర్పడానికి వచ్చింది భారతీయ గురువులు కాదు. నలుగురు అమెరికన్ యువకులు మూడు వారాల పాటు అక్కడ బసచేసి 450 మంది విద్యార్ధులకు యోగా, ధ్యానం లను ‘Transidental Meditation’ క్లాసులలో భాగంగా నేర్పి వెళ్లారు.
ఆ మాటకొస్తే ప్రాచీన భారతీయ ఆరోగ్య అభ్యాసంగా ‘యోగా’ను చెప్పడం ఇప్పుడు కాస్త కష్టమే. ఎందుకంటే ప్రాచీన గ్రీకు, రోమన్ చరిత్రలోనూ యోగాను పాటించిన చరిత్ర నమోదై ఉంది. ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన వారసత్వంగా ‘యోగా’ను చెప్పుకోవడంలో పూర్తి వాస్తవం లేదని ‘యోగా ఇంటర్నేషనల్’ లాంటి ప్రఖ్యాత యోగా వెబ్ సైట్ ను సందర్శించినా తెలుస్తుంది.
ఈ రోజు మన ప్రధాని నరేంద్ర మోడి ప్రతిపాదించారని, ఆయన ప్రతిపాదించడమే తడవుగా ఐరాస అధిపతి బాన్-కి-మూన్ దానిని ఆమోదించేశారని, దాని ఫలితమే రేపు జరగబోయే ‘ఇంటర్నేషనల్ యోగా డే’ అని చెప్పడం జరుగుతోంది.
వాస్తవం ఏమిటంటే, పైన చెప్పినట్లుగా ఇప్పటి ప్రధాని ఢిల్లీకి రావడానికి చాలా సంవత్సరాలకు ముందే యోగా ఆధునిక పశ్చిమ దేశాల మరియు దక్షిణాసియా దేశాలను జ్వరంలా పట్టుకుంది. మన ప్రధాని, ఐరాస అధిపతి మాట్లాడుకోక ముందే ఇరు ప్రాంతాల జనం ఒకరినొకరు మాట్లాడుకుని, ఇచ్చి పుచ్చుకున్నారు.
ఇజ్రాయెల్ లో మిడ్ బర్న్ పండగ జరుపుకోవడం దగ్గర్నుండి భారత రాజధాని ఢిల్లీ లోని స్వామి నారాయణ్ అక్షరధామ్ మందిరంలో పిల్లలు కఠినమైన ఆసనాలను ఆచరించడం వరకు వివిధ దేశాలలోని ప్రజలు వివిధ చోట్ల, ఇందుగలదందులేదన్న చందంగా, యోగాను ఆచరించడాన్ని ఫొటోల్లో చూడవచ్చు.
ఈ ఫోటోలు కేవలం ఒక నిర్దిష్ట కాలం వరకే పరిమితమైనవి కాదు. ఎప్పుడో 2009 లో తీసిన ఫోటో నుండి ఇటీవల మే, 2015 వరకూ తీసిన ఫోటోలు ఇందులో ఉన్నాయి. అవన్నీ ఆయా దేశాల ప్రజలు అత్యంత నిష్టగా, నమ్మకంగా యోగాను ఆచరించడం గమనించవచ్చు.
పశ్చిమ దేశాల్లో యోగాను వివిధ ఇతర ప్రక్రియలకు జత చేసి సరికొత్త యోగా పద్ధతులను ఆచరిస్తున్నారు. కుక్క పిల్లతో కలిసి చేస్తూ దానికి దోయ అని పేరు పెట్టేశారు. నెలల పిల్లలతో కలిసి యోగా ప్రాక్టీస్ చేస్తూ తల్లి-పిల్లకు మధ్య గాఢమైన బంధం పెనవేసుకుపోయేందుకు అది దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఆక్రోబాటిక్స్ కలిపి పాటించే యోగా ను ఆక్రో-యోగా గా చెప్పి ఆచరిస్తున్నారు. సూర్య నమస్కారాలను సైతం నిష్టగా ఆచరిస్తున్న పశ్చిమ దేశస్ధులను కింద చూడవచ్చు.
ఈ రోజు ఈ టి.వి ఆంధ్ర ప్రదేశ్ ప్రసారం చేసిన యోగా గురువు చాగంటి గారి యోగా వివరణ ప్రకారం వివిధ యోగా అభ్యాసాల కలయికనే సూర్య నమస్కారాలుగా చెబుతున్నారు తప్ప అందులో దైవ సంబంధం ఏమీ లేదు. మనసు, శరీరం, సమాజం శాంతిగా బ్రతికేందుకు యోగా దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. ఆయన వివరణలో శరీరం, మనసుల ఆరోగ్యమే తప్ప ఎక్కడా హిందూ సంప్రదాయ వారసత్వ ప్రస్తావనే రాకపోవడం విశేషం.
కనుక మతపరమైన మూఢ నమ్మకాలను యోగా నుండి వేరు చేస్తే దాని ప్రభావం ఏమిటో నిజంగా గ్రహించగలం. ధ్యానాన్ని ఏకాగ్రతా సాధనంగానే చూడాలి తప్ప భగవంతుడి ధ్యానంగా చూస్తే ఒరిగేది ఏమీ ఉండదు.
ఈ ఫోటోలను రాయిటర్స్ పత్రిక జూన్ 18 తేదీన ప్రచురించింది.
యోగా హిందువూలది కాదని చెప్పటానికి మీరు పడుతున్న తిప్పలు చూస్తూంటే ఆశ్చర్యం వేస్తుంది. సూర్యుడు తూర్పున ఉదయి స్తాడని నొక్కి వక్కాణించి నిరూపించక్కరలేదో, యోగా కూడా హిందువులదని చెప్పవలసిన అవసరం భారతదేశంలో ఉన్న హిందువులకు లేదు. మీరు పదే పదే యోగా హిందువులది కాదని రాసుకొంటే అది మీ ఇష్టం. కాని వాస్తవాలను మార్చలేరు కదా! పైగా ఇలా రాస్తూంటే మీ బ్లాగులో రాసే వార్తల విశ్వసనీయత దెబ్బతింట్టుంది.
హిందువుల ఆవిష్కరణలు అన్ని పేర్లు మార్చి కోట్టేయటం పాశ్చ్యత్య దేశాలవారికి వెన్న తో పెట్టిన విద్య. ఇప్పటి తరం వారు వాళ్ల చేష్టలను అడ్డుకోవటానికి ఎంతో మంది ఇప్పటికే రంగంలో దిగి ఉన్నారు.
అక్కడికి హిందూ మతం తమరి గుత్త సొత్తయినట్లు!
ప్రతి అంశాన్ని మతం కళ్ళతో చూడవద్దని కదా నేను చెబుతున్నది. కాదు చూస్తాను అంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఇలా ప్రతి సందర్భంలో దూరిపోయి నా రాతలకు మీ సొంత అర్ధాలు ఇవ్వడం మాత్రం అభ్యంతరకరం. రాసేది తిన్నగా అర్ధం చేసుకోవాలి. అర్ధం కాకపోతే మళ్ళీ అడగవచ్చు, తప్పు లేదు. కానీ సొంత అర్ధాలు ఇవ్వడం కరెక్ట్ కాదు.
విశ్వసనీయత విషయం పాఠకులు చూసుకుంటారు. మీ బెదిరింపులు వద్దు. ఇలా రాస్తే ప్రచురించడం కష్టం అవుతుంది. గమనించగలరు.
విషయం పైన మీ అభిప్రాయం ఉంటే చెప్పండి. యోగా హిందువులదే అన్నది మీ అభిప్రాయం. అది రాయండి. వీలయితే ఆధారాలు ఇవ్వండి. చర్చించుకుందాం. ఒకవేళ నేను రాసింది తప్పయితే అది నాకూ తెలుస్తుంది. కానీ ‘తిప్పలు పడడం’ లాంటి జడ్జిమెంటల్ ధోరణి వల్ల ఉపయోగం శూన్యం.
వెనకాలా మీరు పెట్టిన ప్రపంచ పటం తీసివెయ్యడమే బెటర్ ఎమో.. అతికించి నత్ళు అనిపిస్తోందొ… కుదిరితే ఒకసారి చూడంది
నా.శ్రీ గారు మీరు చెప్పింది పూర్తిగా అర్ధం కాలేదు. పటం పెట్టడం బాగాలేదు తీసివెయ్యమనా లేక అతికించినట్లు కాకుండా మేటర్ తో పాటు కిందికీ మీదికి కదులుతూ ఉంటే బాగుంటుందనా?
పటాన్ని పెట్టినప్పుడు తీసివెయ్యడం కూడా కుదురుతుంది కదా! పటం ఉపయోగంగా ఉంటుందని పెట్టాను.
పటం ఉండడం వల్ల సైటు అందం చెడిపోతున్నట్లు అనిపించింది…. అది తీసివేస్తేనే బాగుంటుందేమో అని పిస్తోంది!… మీసైటు హెడ్డింగు ఉన్న ఇమేజ్ పతం మీద అతికించిన భావం కలుగుతోంది…
హెడ్డింగు పైకి కిందకి కదులుతోంది కదా! అతికించిన భావన ఎలా కలుగుతుంది?
అతికిన భావన అంటే మీ హెడ్డింగు ట్రాన్స్పరెంటుగా లెదు కదా అందుకని పతం మధ్యలో తెల్లగా ఎదో ప్లాస్టరు వెసినట్లుగా అనిపించింది అంతె… అందుకని అల్లా అన్నాను.. నెను టాబ్ లొ చూస్తున్నాను… బహుశా కంప్యూటర్ లొ చూస్తే బానె ఉండవచ్చునేమో..
హెడ్డింగ్ కూడా transparent గా ఉంటే బాగుంటుందని మీ అభిప్రాయం అనుకుంటాను. అందుకు ప్రయత్నిస్తాను.
కంప్యూటర్ లో చూసినప్పుడు ఎలా ఉందో -చూసినప్పుడు- చెప్పడం మరువకండి.
OK sure
Transparent గా ఉండేట్లు చేశాను. ఇప్పుడెలా ఉంది? ఫాంట్ సైజు మార్చే అవకాశం ఇవ్వ లేదు.
ఇప్పుదు బాగుంది 🙂
నరేంద్రమోదీ తన జిమ్మిక్కులు కొనసాగిస్తూనే ఉన్నారనడానికి తాజా నిదర్శనం “అంతర్జాతీయయోగా దినోత్సవం”
ఇప్పటువరకు దేశీయంగా ఎన్నో నినాదాలను అందుకున్న మోదీ,ఇప్పుడు అంతర్జాతీయ వేదికలను కూడా వాడుకోవడం మొదలుపెట్టారు.
కోట్లాదిమంది అతనిమాటలు(మాయ)విని ఎన్నుకొన్నందుకు విచారించేరోజులు ఎంతోదూరంలో లేవు.లేకపోతే దేశంలో ఎన్నోసమస్యలుండగా ఈ జిమ్మిక్కులు ఎవరికికావాలేండి? ఇవి అవసరమా? తనదగ్గర మౌలికసమస్యలకు పరిష్కారం లేనందువలనే ఇటువంటి అనవసర విషయాలకు ప్రచారం కల్పిస్తున్నాడు.దీనివల్ల దేశప్రజల ఏ సమస్యైనా పరిష్కారమౌతుందా?
యోగా ఎన్నోదేశాలలో ఇప్పుడు ప్రాచూర్యంలో ఉన్నదనడంలో ఎటువంటి అనుమానాలులేవు.కానీ,దానికి శాస్త్రీయతను సమకూర్చిపెంటింది మాత్రం పతాంజలి అతని ముందు వెనుక తరాల ఋషులు.కనుక ఆ క్రెడిట్ వారివారసులుగా మనకేచెందుతుంది.కొన్ని ప్రచీన నాగరికతలలో కూడా పరిగణలో ఉన్నప్పటికీ!
ప్రతీవిషయాన్నీ కమర్షలైజేషన్ చేయడంలో నిష్ణాతులు ప.దే వారు.మనకు దక్కాల్సిన పేటెంట్ హక్కులను ఎన్నింటినో వారుపొంది ఉన్నారన్నది మనకు తెలిషినవిషయమే!
ఐతే,హిందూ మతం వలనే ఇది వ్యాప్తిచెందిందనడం అవాత్సవం.భౌద్ధ,పార్సీ,జైన మొ,,మతాలవలన కూడా ఇది వ్యాప్తిచెందింది.
శేఖర్ గారు,
బ్లాగ్ ను పేరుకు తగ్గట్లు తీర్చి దిద్దినారు. చాలా బాగుంది.
వీలయితే ఆధారాలు ఇవ్వండి. చర్చించుకుందాం.
సుర్యుడు తూర్పున ఉదయిస్తాడనటానికి ఆధారాలు అడిగినట్లుంది. సుమారు 150 సం|| క్రితం వివేకనందుడి కాలం నుంచి నేటి జగ్గి వాసుదేవ్ వరకు ఎంతో మంది యోగా గురించి హిందూ గురువుల కృషి ఉంది. ప్రాణాయామం అనేది సంధ్యావందనం లో ఒక భాగం. గాయత్ర్రి సంధ్యావందనానికి రామయణ కాలం నుంచి ఇప్పటి వరకు ఉపనయనం, సంధ్యావందనం భారతీయులు చేస్తునే ఉన్నారు. యు.యన్. యోగా దినం ప్రకటించటానికి మోడి కృషి చేశాడు. మీరన్నట్లు యోగ పశ్చిమదేశాల కు చెందిన విదేశీయులదైతే వారెందుకు ఇంతకాలం గమ్ముగా కూర్చున్నారు?
యోగ భారతీయులది కాదని చెప్పటానికి మీదగ్గర ఉన్న ఆధారాలేమిటో!
మొదట టపాను కాస్త నిదానంగా చదవమని నా సలహా.
యోగా భారతీయులది కాదని నేను అనలేదు. భారతీయులదే అని చెప్పడం ఇప్పుడు కాస్త కష్టం అన్నాను. ఆధారం ఏమిటో టపాలోనే ఇచ్చాను. మరోసారి చూడండి.
ఇంతకీ భారత గురువుల కృషి 150 సం.ల నాటిదేనా? హయ్యో రాత!