నా గొయ్యి నువ్వు, నీ గొయ్యి నేను -కార్టూన్


Back stab

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రుల వ్యవహారం ఇది. ప్రజల్లో ఒకరిని మరొకరు పలుచన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న దాయాది ముఖ్యమంత్రులు ఒకరి గొయ్యి మరొకరు తవ్వుకుంటూ ఇద్దరూ గోతిలో పడిపోతున్నారు.

వ్యక్తిగతంగా, రాజకీయంగా చూస్తే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల పైనా జాలి చూపాల్సిన పరిస్ధితి కావచ్చు గానీ ప్రజల కోణంలో నుండి చూస్తే ఇరువురి చర్యల వల్ల వారి వారి అసలు రంగు బయటపడుతున్నందుకు ఆనందించాల్సిన సంగతి.

శాసన మండలి సభ్యుల ఎన్నికల సందర్భంగా టి.డి.పి సభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్టు అయినప్పటినుండి టి.డి.పి, టి.ఆర్.ఎస్ పార్టీలు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ పార్టీలు ఒకరి గుట్టుమట్లు మరొకరు బైటపెట్టుకుంటూ తమను గద్దె ఎక్కించి ప్రజలు ఎంత తప్పు చేశారో రుజువు చేసుకుంటున్నారు.

నామినేటెడ్ ఎం.ఎల్.ఏ స్టీఫెన్సన్ ఓటు కొనుగోలు చేసేందుకు టి.డి.పి 5 కోట్లు ఇవ్వజూపిందని టి.ఆర్.ఎస్ ఆరోపణ. తెలంగాణ ఏ.సి.బి వలపన్ని 50 లక్షల రూపాయలు స్టీఫెన్సన్ కు ఇచ్చేందుకు తీసుకువస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన మరుసటి రోజే స్టీఫెన్సన్ తో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలని చెబుతూ టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఆడియో టేపులను విడుదల చేసింది. ఫోన్ సంభాషణలను తాము రికార్డు చేశామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి నాయని నరసింహ నాయుడు ప్రకటించారు.

ఆడియో టేపుల్లోని మాటలు తనవి కాదని, అవి తయారు చేసిన (doctored) టేపులని టి.డి.పి నేతలు వాదించడం మొదలు పెట్టారు. అంతటితో సరిపెడితే ఎలా ఉండేదో గానీ దానితో పాటు తెలంగాణలో తమ నేత ఫోన్ ను ట్యాప్ చేశారని మరో ఆరోపణ చేసి తమ గొయ్యి తామే తవ్వుకున్నారు టి.డి.పి నేతలు!

చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించడం అంటే ఫోన్ సంభాషణలు నిజమే అని టి.డి.పి అంగీకరించినట్లే కదా! ఫోన్ సంభాషణలు నిజమే అయితే డబ్బిచ్చి ఎం.ఎల్.ఏ ఓటు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించామని టి.డి.పి అంగీకరించినట్లే.

ఫోన్ సంభాషణలు చంద్రబాబు నాయుడు గారివే అనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు ఫోన్ ను ట్యాప్ చేశామని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లే. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టడం, వాటిని రికార్డు చేయడం చట్ట విరుద్ధం. కనుక తాము చట్టవిరుద్ధంగా వ్యవహరించిన నేరానికి పాల్పడ్డామని టి.ఆర్.ఎస్ ప్రభుత్వం అంగీకరించింది.

ఒకరేమో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు కోట్లు ఖర్చు పెడతారు. మరొకరేమో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ సంభాషణలపై నిఘా పెట్టేందుకు, రికార్డు చేసేందుకు సైతం వెనుదీయరు. వీరు మనల్ని ఏలుతున్న ముఖ్యమంత్రులు!

8 thoughts on “నా గొయ్యి నువ్వు, నీ గొయ్యి నేను -కార్టూన్

  1. That is not phone tapping, but call recording. Phone tapping devices are very costly, but call recording software can be installed on our own mobiles by free download. Even I have call recording software on my phones.

  2. నిజానికి ఇది ఒక పనికిమాలిన సమస్య. ప్రజలుకూడా దీనిని నీతి అవినీతి కోణంలో చూడడంలేదు. వీడుదొరికాడు కనుక దొంగ అయ్యాడు అంటే అంటూ రేవంత్ మీద సానుభూతి చూపిస్తున్నారు కొందరు. హమ్మయ్య తెలుగుదేశంవాడు ఒకడు దొరికిపోయాడురా అంటున్నారు ఇంకొందరు. రెండు పెద్ద కులాలవాళ్లు ఆడుకునే ఆటగా మిగిలిన వాళ్ళు భావిస్తున్నారు. ఎవ్వరికీ తప్పుచేసినవాళ్ళమీద కోపం లేదు.

  3. హైదరబాద్ నుండి ఏ.పి సి.యం ను పంపించేయాలని కే.సి.ఆర్ ఆలోచనలాగా ఉన్నది!
    హైదరబాద్ అధికారాలను గవర్నర్ కి అప్పగించడానికి ఏ.పి సి.యం ప్రయత్నిస్తున్నట్టుంది!!

  4. I Have been waiting from June 1st a post from you what will be your opnion on this issue at last ” meeru emi dachukoledu mee lo vunna andhra pakashapathanni “. enti thana party MLA nu kontuntey raa babu konukondi ani KCR ready gaa vundala … adhi taping ani Chandrababu cheppagane mee Hindu nammu thundi meeru nammutharu ….kalagam pulagangam chesi adhedo rajakeeya samasya marchalni mee praythanm johar commere
    d lalsalam ( Naku Dbout ye ee post accept chesthvani)

  5. పక్కా ఆదారాలు దొరికినా చంద్రబాబు నీతి, నిజాయితీ, సిద్దాంతం అంటూ మాట్లాడుటుంటే మనిషన్న వాడికి పట్టరాని కొపం రావాలి. ఆ ఐదు కొట్లు ఎక్కడవీ? పారిశ్రామిక వెత్తలూ, కాంట్రాక్టర్లూ దగ్గరనుంచి తీసుకున్నవి.వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఎదొ ఒక లబ్ది చేకూరిస్తేనేకదా

  6. Phone tapping చేసే అధికారం పోలీసులకి ఉంది. ఫోన్‌లో అల్-ఖైదా గురించో, ISIS గురించో మాట్లాడుకునేవాళ్ళు కూడా ఉంటారు. అల్-ఖైదా లాంటివాళ్ళని పట్టుకోవడానికైతే phone tapping అవసరమే. ఇక్కడ స్తీఫెన్సన్ చేసినది call recording. అతని సొంత ఫోన్‌కి వచ్చిన కాల్‌నే తాను రికార్ద్ చేసుకున్నాడు. Call recording software వాడడం నిషిద్ధం కాదు కనుక స్తీఫెన్సన్ చేసినది తప్పు కాదు.

  7. for last several years politics playing by the most of the politicians in AP are being rune in very nasty and immorality conditions. Every thing is going on for recommendation filled with corruption in non-genuine cases. First people and employees in both Government and private sectors will change their mind attitudes and not to support irregular recommendations.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s