ఆంధ్ర ప్రదేశ్ కు ఇవ్వడానికి లేని నిధులు బంగ్లాదేశ్ కు అప్పు ఇచ్చేందుకు ఎక్కడి నుండి వస్తాయి. దేశంలో ఒక రాష్ట్ర ప్రగతికి నిధులు లేనప్పుడు ఇతర దేశానికి రుణం ఇవ్వడం ఎలా సాధ్యం? అది కూడా ఒక ముస్లిం దేశానికి? లోటు బడ్జెట్ తో మూలుగుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి డబ్బు లేదని కేంద్రం చెప్పింది. ఇప్పుడేమో ఏకంగా 2 బిలియన్ డాలర్ల (సుమారు రు. 12 వేల కోట్ల పైనే) రుణాన్ని బంగ్లా దేశ్ కు మోడి ప్రభుత్వం ప్రకటించింది.
హాలండ్ (నెదర్లాండ్) పర్యటన అనంతరం ప్రధాన మంత్రి మోడి బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నారు. తన పర్యటన మొదటి రోజు ఆయన బంగ్లాదేశ్ తో పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇరు దేశాలు 22 ఒప్పందాలు చేసుకున్నాయని పత్రికలు నివేదించాయి. ఇందులో భూ మార్పిడి ఒప్పందం కూడా ఒకటి. భూ సరిహద్దు నిర్ణయించడంతో పాటు సముద్రంలో కూడా సరిహద్దులు నిర్ణయించుకునే ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయడం విశేషం.
తన పర్యటనలో బంగ్లాదేశ్ కు ప్రధాని మోడి 2 బిలియన్ల రుణాన్ని ప్రకటించారు. ఇది గతంలో ప్రకటించిన 1 బిలియన్ డాలర్లకు అదనం. మొత్తం మీద 3 బిలియన్ డాలర్ల (సుమారు రు. 19,000 కోట్లు) రుణాన్ని మోడి ప్రభుత్వం సంవత్సర కాలంలో పొరుగున ఉన్న ‘ముస్లిం’ దేశానికి ప్రకటించింది. గతంలో ప్రకటించిన 1 బిలియన్ రుణంలో తక్షణమే 200 మిలియన్లు, త్వరిత గతిన మిగిలిన 800 మిలియన్లు ఇస్తామని ఇండియా ప్రకటించింది.
ఇదే సంవత్సర కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాబడి తగ్గిపోయి లోటు బడ్జెట్ తో సతమతం అవుతోంది. కొత్త రాష్ట్రం లోటు పూడ్చడానికి ప్రతి యెడూ కనీసం 5,000 కోట్లు ఇవ్వాలని విభజన చట్టం చెబుతుండగా ఇంతవరకు ఈ విషయంలో ముందడుగు పడలేదు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా అట్టహాసంగా ప్రకటించి పోయిన బడ్జెట్ లో రు. 100 కోట్లు మాత్రమే ఇచ్చారు. రైల్వే బడ్జెట్ లో విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తారని ఆశించి అక్కడి ప్రజలు భంగ పడ్డారు.
ఇక ప్రత్యేక హోదా గురించి చెప్పనే అవసరం లేదు. నిజానికి ప్రత్యేక హోదా కు ఆంధ్ర ప్రదేశ్ కు అర్హత లేదు. బాగా వెనుకబడిన రాష్ట్రాలను ముందుబడిన (!) రాష్ట్రాల సరసన నిలిపేందుకు వీలుగా ఈ ప్రత్యేక హోదాను సృష్టించారు. ఈ హోదా పొందిన రాష్ట్రాలకు కేంద్రం నుండి అదనపు నిధులు వస్తాయి. ఇలా వచ్చే నిధులు రాను రానూ ప్రజల కోసం అని కాకుండా వివిధ రాష్ట్రాల్లోని ఛోటా పాలకవర్గాలకు పలహారంగా పరిణమించాయి. దానితో ప్రతి రాష్ట్రమూ ‘మేము వెనకబడ్డాం’ అని చెప్పుకునేందుకు పోటీ పడుతున్నాయి.
ఈ నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ కు అదనపు నిధులు సమకూర్చి పెట్టేందుకు, హైద్రాబాద్ ఆదాయం కోల్పోతున్నందున, ప్రత్యేక హోదా ను కేంద్ర స్ధాయిలోని పాలక వర్గాలు ఎరగా వేశాయి. అప్పటికి విభజనకు ఒప్పించడానికి వేసిన ఈ ఎర కేవలం ఎర మాత్రమేనని బి.జె.పి నేతలకు కూడా అవగాహన ఉన్నట్లు ఇప్పటి వారి సన్నాయి నొక్కుల ద్వారా తెలుస్తున్నది.
ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ప్రత్యేక హోదా విషయమై విలేఖరుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ హోదా విషయంలో యు.పి.ఎ ప్రభుత్వం సరిగ్గా అధ్యయనం చేయలేదని వాపోయారు. యు.పి.ఎ అధ్యయనం చేయకుండా ఇచ్చిన వాగ్దానం తమ మెడకు చుట్టుకుందని మంత్రిగారి అంతరార్ధం.
‘మేసేటప్పుడు చేలో, దున్నేటప్పుడు గట్టు మీద’ ఉండడం అంటే ఇదే కదా. ఆ రోజు ఆంధ్ర ప్రదేశ్ కు యు.పి.ఎ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తున్న సమయాన, ఆ వరాలన్నీ రాజ్య సభలో తమ నేత వెంకయ్య నాయుడుగారి ప్రతిభే అని బి.జె.పి చెప్పుకుంది. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక ఆ వరాలను పరిపూర్తి చేసే బాధ్యత నెత్తిపై పడ్డాక తప్పు యు.పి.ఎ ప్రభుత్వానిదయింది.
ఏతా వాతా తేలేది ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ ఏ రూపంలో నైనా ‘ఆదుకునే’ ఉద్దేశ్యం ఎన్.డి.ఏ-2 ప్రభుత్వానికి లేదు. రాజధాని నిర్మాణానికి సహాయ పడతాం అన్నారు. అదేమీ ఆచరణలో కనిపించడం లేదు. సొంత దేశంలో ఒక రాష్ట్రానికి అక్కరకు రాని నిధులు బంగ్లా దేశ్ రుణానికి ఎలా వచ్చాయన్నదే ప్రశ్న!
ఇంతకీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రకటించిన ‘అచ్ఛే దిన్’ బంగ్లాదేశ్ పాలకవర్గాలకు కూడానా?
ఇంతకాలం తెలంగాణకు కొమ్ముకాసిన మీరు, ఆంధ్రా మీద ప్రేమ ఒలకపోయటం తమాషగా ఉంది. నిజానికి మీకు ఆంధ్ర మీద ప్రేమకన్నా మోడి బంగ్లదేశ్ తో సత్సంబంధాలు నెలకొల్పటానికి చేసిన ప్రయత్నం పైనే అభ్యంతరం. ముస్లిం లను వెనెకేసుకొస్తూ సెక్యులర్ సూక్తులు వల్లించే మీరు, ముస్లిం దేశానికి సహాయం చేయటం ప్రశ్నిస్తున్నారు. “ఇతర దేశానికి రుణం ఇవ్వడం ఎలా సాధ్యం? అది కూడా ఒక ముస్లిం దేశానికి? ”
పక్క దేశానికి చేసిన సహాయన్ని, రాష్ట్రానికి చేయలేదంట్టూ పోల్చటమే అసమంజసం. ఒక దేశాన్ని రాష్ట్రం తో ఎలా పోలుస్తారు?
ఎన్నికల సమయంలో వాగ్ధానలను అమ్మే నాయకులు,వాస్తవాలకు వచ్చేటప్పటికి మొండిచేయి చూపిస్తూనే ఉంటారు. లేకపోతే,బీహార్ కు తక్షణమే 20,000 కోట్లు విడుదల చేయడం అంటే ఎన్నికల జిమ్ముక్కు కాకుంటే మరేమనాలి? వాస్తవాలు గ్రహించిననాడు ప్రజలు మరో పక్షానికి అధికారం అప్పజెపుతారు.
“దేశంలో ఒక రాష్ట్ర ప్రగతికి నిధులు లేనప్పుడు ఇతర దేశానికి రుణం ఇవ్వడం ఎలా సాధ్యం? అది కూడా ఒక ముస్లిం దేశానికి? ”
Vishekhar garu, I have been reading your blog since long, but your criticism about, ‘giving loan lo a Muslim country’ is surprising and intriguing. I never seen such aversion towards Muslims in any of your previous posts. Are you fine with giving loan to Mangolia,Nepal, Bhutan etc as they are not a Muslim countries?
@ కిరణ్ & హనీఫ్
ఒక ముస్లిం దేశానికి సహాయం ప్రకటించడమే నా అభ్యంతరం అని మీరు నిజంగానే భావించారా?
హనీఫ్ గారు చెప్పినట్లు గతంలో ఎప్పుడూ ముస్లిం వ్యతిరేకత కనబరచని నేను ఇప్పుడు మాత్రం ఎందుకు చూపుతాను?
“అది కూడా ముస్లిం దేశానికి?” అన్నది వ్యంగ్యం. బంగ్లాదేశ్ విషయంలో బి.జె.పి తదితర హిందూత్వ సంస్ధలు రెచ్చగొట్టే భావోద్వేగాలు తెలిసిందే. భూ మార్పిడి ఒప్పందంపై ఎప్పుడో 1970ల్లోనే ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చినా ఇంతవరకు ఒప్పందం జరక్కపోవడానికి కారణం హిందూత్వ సంస్ధలు చేసే గొడవకు భయపడే.
మీరు ఎవరన్నా ఈ ఒప్పందం పై బి.బి.సి, రాయిటర్స్ లాంటి సంస్ధల వార్తల్ని చదివితే ఈ సంగతి తెలుస్తుంది. హిందూత్వ సంస్ధలు జనాన్ని రెచ్చగొట్టి ఓట్లు దూరం చేస్తారని భయపడి కాంగ్రెస్ ఒప్పందాన్ని వాయిదా వేస్తే, బి.జె.పి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఈ ఒప్పందం పై సంతకాలు చేసెసింది.
బంగ్లాదేశ్ (ముస్లింల) కు వ్యతిరేకంగా భావోద్వేగాలు రెచ్చగొట్టే హిందూత్వ అధికారం లోకి రాగానే ఆ దేశానికి రుణం ఇవ్వడమే కాకుండా సరిహద్దు ఒప్పందం కూడా చేసేసుకుంది. దీన్ని హిందూత్వ అభిమానులు ప్రశ్నించవద్దా? ఆ సంగతినే నేను వ్యంగ్యంగా చెప్పాను. ఈ తరహా విశ్లేషణ ఇటీవలి ఆర్టికల్స్ లో చాలా సార్లు ఇచ్చాను. చర్వితచరణం ఎందుకన్న ఉద్దేశ్యంతో ఈసారి రాయలేదు. అది మీరు అర్ధం చేసుకోవాల్సిన సంగతి. దానికి బదులు కిరణ్ గారేమో ‘దొరికింది అవకాశం’ అనుకున్నారు. హనీఫ్ గారేమో నిజంగానే బాధపడ్డారు.
పాఠకులు బ్లాగ్ దృక్పధం నేపధ్యంలో టపాలను అర్ధం చేసుకోవాలి. అదీకాక ఒకే విశ్లేషణ మళ్ళీ మళ్ళీ రాస్తే పునరుక్తి దోషం అవుతుంది. పాఠకుల్ని తక్కువ అంచనా వేసినట్లు కూడా అవొచ్చు.
@ కిరణ్
తెలంగాణకు అనుకూలం అయితే ఆంధ్రపై ప్రేమ లేదని అర్ధమా? సంకుచిత దృక్పధంతో ఆలోచిస్తే ఇలాంటి అర్ధాలు వస్తాయి. ఒక వ్యక్తిని మంచి అధ్లెట్ అని పొగిడితే పక్కన ఉన్న వ్యక్తిని సోంబేరు వెధవ అని తెగిడినట్లా?
తెలంగాణ విభజనకు నేను ఎందుకు అనుకూలమో మళ్ళీ కొత్తగా చెప్పనవసరం లేదనుకుంటాను. ఆంధ్ర విషయంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను. తెలంగాణ వ్యతిరేక భావోద్వేగాలు రెచ్చగొట్టడం మాని ఇదే అవకాశంగా ఎ.పి కి రావలసిన సౌకర్యాల కోసం పోరాడాలని. ఇప్పుడూ అదే రాశాను. ఎ.పి కి వాగ్దానాలు ఇచ్చి విస్మరించారు అని. ఇందులే తేడా ఏమన్నా ఉందా? ఏమీ లేదు.
అసలు సంగతి ఏమిటంటే నేను విభజనకు అనుకూలం కాబట్టి ఎ.పి కి వ్యతిరేకం అనుకున్నారు. నేను ఎ.పి కి అవసరమైన సౌకర్యాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి వాలుగా విస్మరించారు.
బంగ్లాదేశ్ సహాయం విషయానికి వస్తే నాది మళ్ళీ అదే ప్రశ్న. సొంత దేశానికి లేని నిధులు బైటి దేశానికి ఎక్కడి నుండి వస్తాయి?
రాష్ట్రాన్ని దేశాన్ని పోల్చడం ఏమిటి? రాసింది సరిగా అర్ధం చేసుకోవాలి. ఇక్కడ పోల్చింది రాష్ట్రాన్ని దేశాన్ని కాదు. సొంత దేశం, బైట దేశం అని. ఎ.పి రాష్ట్రమే కావచ్చు. కానీ అది భారత దేశమే. ఎ.పి కి నిధులు లేవు అంటే అర్ధం భారత దేశంలో ప్రజలకు నిధులు లేవు అని అర్ధం. ఎక్కడికక్కడ విడివిడిగా విషయాల్ని చూడడం మొదలుపెడితే ఇలాగే ఉంటుంది. ప్రత్యేకతలతో పాటు సార్వజనీనతలను కూడా గమనంలో ఉంచుకోవాలి.
బంగ్లాదేశ్ తో సత్సంబంధాలు నెలకొల్పడమే అవసరం. ఒక్క బంగ్లాదేశ్ మాత్రమే కాదు పొరుగు దేశాలు అన్నింటితో సత్సంబంధాలు కలిగి ఉండడం దేశానికి అవసరం. ఇన్నాళ్లూ సత్సంబంధాలను, అవి ముస్లిం దేశాలు కమ్యూనిస్టు దేశం, అన్న సాకుతో, వ్యతిరేకించింది హిందూత్వ శక్తులే. ప్రతిపక్షంలో ఉంటే శత్రు సంబంధాలు, అధికార పక్షంలో ఉంటే సత్సంబంధాలా? బి.జె.పి అవకాశవాదం ఎత్తి చూపడానికి ఇది రాశాను. ఆ సంగతి మీకు అర్ధం కాక తొందరపడ్డారు.
chala baga chepparu v sekhar garu.
nijaniki mee blog lo idi oka goppa post ani bhavinchagalanu.! kANI MITRULU KIRAN gariki Dagapadi oka rastraniki , daniki jarguthunna anyayaniki sambandinchi oka vartha vasthe thattukolekapovadam dourbhagyam. telangana vachina Andhra meedha antha kopam enduko. ?! vidyavanthulu konchem paristhitulni samajika spruha tho ardham cheskoni vyavaharinchali. bangladesh ki nidhulu ivvada douthya vidhanallo bhagam kavochhu. kani chatta prakaram andhra ku cheyyalsinavi cheyyakapobvadam droham. ee drohanni kondaru patakulu samrdhinchadam duradrustam.
శేఖర్ గారు. నేను కూడా మొదట అలాగే అనుకున్నాను. మీరు రాశారంటె ఏదో మతలబు ఉందనుకున్నాను. కిరణ్ గారికి అభ్యంతరముంటే ముందే చెప్పాల్సింది కానీ…ఈ పోస్టుకు వారి అభ్యంతరానికి సంబంధం అర్థం కాలేదు.
శేఖర్ గారు….మీరు చెప్పిన విషయానికి నేను ఏకీభవిస్తున్నాను. కానీ బయటి దేశాలతో సంబందాల విషయంలో కాస్త ఉదారంగా,….మన దేశం పెద్దన్న పాత్ర పోషించాలంటే….చిన్న దేశాలకు గ్రాంట్ల రూపంలో డబ్బులు ఇవ్వటం పరిపాటే కదా….