ఆహార భద్రత గురించి మన దేశ ప్రధానుల దగ్గర్నుండి ఛోటా మోటా ఐ.ఏ.ఎస్ అధికారుల వరకు చెప్పని కబురు లేదు. వాస్తవంలో భారత దేశ ఆహార భద్రత పురుగులు పట్టి కుళ్లిపోయిన యాపిల్ పరిస్ధితికి దిగజారిందని కార్టూనిస్టు వ్యంగ్యంగా చూపారు. 2 నిమిషాల్లో వండిపడేసే మ్యాగిలో ఆనారోగ్య కారక రసాయనాలు ఉన్నాయని తేలడంతో పలు రాష్ట్రాలు మ్యాగి శాంపిళ్ళను పరీక్ష చేయిస్తున్న నేపధ్యంలో మన ఆహార భద్రత పరిస్ధితిని ఈ కార్టూన్ వివరిస్తోంది.
గత ఏప్రిల్ నెలలో మొదటిసారి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మార్కెట్ లోని మ్యాగీ ప్యాకెట్లను వెనక్కి తీసుకోవాలని నేస్లే ఇండియా కంపెనీకి ఆదేశాలు ఇవ్వడంతో దేశంలో కలకలం చెలరేగింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆహార నియంత్రణ విభాగం మ్యాగి శాంపిళ్లను పరీక్షించి అందులో ప్రమాదకర సీసం, ఎం.ఎస్.జి (మోనో సోడియం గ్లూటోమేట్) లు పరిమితికి మించి ఉన్నాయని తెలినందున మ్యాగీని నిషేధించాలని జాతీయ ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్ధ (ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ) ను కోరింది.
సీసం రసాయనం ఆహార పదార్ధాల్లో పరిమితికి మించి ఉన్నట్లయితే అది ఆరోగ్యానికి తీవ్ర హానికరం డాక్టర్లు ఎల్లప్పుడూ హెచ్చరిస్తుంటారు. మనో సోడియం గ్లూటోమెట్ అన్నది ఒక అమినో యాసిడ్. దీనిని ఆహార పదార్ధాలకు అదనపు రుచి చేర్చడానికి కంపెనీలు వాడుతాయి. ఈ ఎం.ఎస్.జి నిబంధనల ప్రకారం 0.01 పిపిఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉండాల్సి ఉండగా 17 పిపిఎం వరకు ఉన్నదని ఉత్తర ప్రదేశ్ ఎఫ్.డి.ఏ తెలిపింది.
ఢిల్లీ ప్రభుత్వం కూడా మ్యాగీ శ్యాంపిళ్లను ప్రయోగశాలకు పంపి పరీక్షించగా 13 శాంపిళ్లకు గాను 10 శాంపిళ్లలో ఎం.ఎస్.జి పరిమితికి మించి ఉన్నట్లు తెలినట్లు చెప్పింది. దానితో ఢిల్లీ ప్రభుత్వం 15 రోజుల పాటు మ్యాగి అమ్మకాలను నిషేధించింది. అనంతరం ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా మ్యాగీని నిషేధించింది. తమ పరీక్షల్లో కూడా ఎం.ఎస్.జి ఉన్నట్లు తేలిందని ఉత్తరా ఖండ్ ప్రభుత్వం తెలిపింది.
కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు, మహా రాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా మ్యాగీ శాంపిళ్లను పరీక్షలకు పంపినట్లు తెలిపింది. బి.జె.పి ఏలుబడిలోని గోవా ప్రభుత్వం మాత్రం మ్యాగీ భద్రమైన ఆహారమే అని ప్రకటించింది. కాగా నేస్లే కంపెనీ తమ మ్యాగీలో ఎం.ఎస్.జి ని ఉపయోగించం అని చెబుతూనే భారత దేశంలో ఎం.ఎస్.జి వినియోగంపై పరిమితి విధించలేదని సమర్ధించుకుంది. తద్వారా తన మాటను తానే పూర్వపక్షం చేసుకుంది.
మ్యాగీకి ప్రచారం చేసిపెట్టిన అమితాబ్ బచ్చన్, ప్రీతి జింతా, మాధురీ దీక్షిత్ లు ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాను మ్యాగీకి ప్రచారం చేయడం 2 సం.ల క్రితమే మానేశానని అమితాబ్ చెప్పగా, తాను ఎన్నాడో 10 సం.ల క్రితం ప్రచారం చేశానని ప్రీతి తెలిపారు. మాధురీ దీక్షిత్ మాత్రం తాను కంపెనీ అధికారులతో సంప్రదించానని మ్యాగీ తయారీలో తాము ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నామని, పాటిస్తామని గట్టి హామీ ఇచ్చారని తన ప్రచారాన్ని సమర్ధించుకున్నారు. అక్కడికి తమ మ్యాగీ ప్రమాదకరమే అని కంపెనీ అధికారులు నిజాయితీగా ఒప్పుకుంటారు అన్నట్లు!?
ఈ నేపధ్యంలో భారత దేశ ఆహార భద్రత అనే యాపిల్ కు మ్యాగీ నూడుల్స్ అనే పురుగులు పట్టాయని కార్టూనిస్టు చెబుతున్నారు. అనేక జబ్బులను కలగజేసె వైరస్ లన్నీ నూడుల్స్ తరహాలోనే ఉండడం మనకు తెలిసిందే. ఇన్ని రాష్ట్రాలు పరీక్షలకు పంపినప్పటికీ అవన్నీ చివరకు గోవా నిర్ణయాన్నే అమలు చేయబోరన్న గ్యారంటీ ఏమీ లేదు.
శేఖర్ గారు, మీ ప్రస్తుత టెంప్లేట్ బానే ఉంది, కానీ బాక్-గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉందడం అంతగా అతకలేదు అనిపిస్తోంది. మీ ప్రస్తుత కలర్ కోడ్ :#323232 ఉంది. దానిని #000 అని మారిస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. కుదిరితే ఒకసారి చూడండి….
…………….నాగశ్రీనివాస
ఒక్క మాగీలే కాదు….కూల్ డ్రింక్స్ కూడా విషతుల్యాలని నిరూపితమైనా జనం తాగుతున్నారు. కారణం సినిమా స్టార్ల ప్రచారం. సినిమాల ద్వారా కోట్లు సంపాదించే నటులు కనీస సామాజిక స్పృహ లేక పోవడం దారుణం. అమితాబ్ దైతే క్షమించలేము. యావత్ భారత సినిమాకు ప్రతినిధిగా గౌరవిస్తాం. ఐనదీ కానిదీ వాణిజ్య ప్రకటనల్లో నటించడం అవసరమా.?
అదేంటి? మీరు చెప్పినట్లు #000 ఇచ్చాను. ఇంకా బ్లాక్ అయిందేం?
ముందు ఉన్నది మీరన్నట్లు #323232 కాదు. అది #2c2c2c అని ఉంది. దానినే #000 గా మార్చితే ఇంకా బ్లాక్ అయింది.
అక్కడ ఒక బాక్-గ్రౌండ్ ఇమేజ్ ఉంది ….
“https://s1.wp.com/wp-content/themes/premium/thestyle/images/container-bg.png”
దానిని తీసివేయండి… అప్పుడు బ్లాక్ అవ్వవచ్చు. చేసేముందర కుదిరితె ఒకసారి బ్యాక్-అప్ తీసుకోండి.
నాగశ్రీనివాస గారూ ఆ ఇమేజిని తీసివేయడం ఎలాగో తెలియదు నాకు.
సారీ విశేఖర్ గారు.. నేను అనుకున్న విధం గా జరగలేదు. 323232 చేంజ్ చేస్తే వైట్ బాక్ గ్రౌండ్ వచ్చేస్తుంది అనుకున్నా, కానీ అక్కడ ఒక ఇమేజ్ దానిని నిరోధిస్తోంది. డైరెక్ట్ గా చూస్తేనే గానీ దానిని తొలగించలేము. అది ఎలాగో కుదరదు కనుక ఈ విషయాన్ని వదిలివేద్దాం. .. sorry again