నువ్వు ముస్లింవి, ఇల్లు ఖాళీ చెయ్!


Misbah Qadri

Misbah Qadri

గుజరాత్ మారణకాండ అనంతరం ముస్లిం ప్రజలు రక్షణ కోసం వెలివాడల్లో బ్రతుకులు ఈడ్చవలసిన దుర్గతి దాపురించింది. ఇటువంటి హీన పరిస్ధితుల మధ్య బతకలేక కాస్మోపాలిటన్ నగరం ముంబైలో గౌరవంగా బతకొచ్చని గంపెడు ఆశలతో తరలి వచ్చిన ముస్లింలకు ఆధునిక కాస్మోపాలిటన్ సంస్కృతికి బదులు మత విద్వేషం స్వాగతం పలికింది. ఆధునిక నగరం అని జనులు చెప్పుకునే ముంబై నగరం పైకి మాత్రమే ఆధునికం అనీ లోలోపల కుల, మత, లింగ వివక్షలతో కుళ్లిపోయిందని మిష్భా ఖాద్రి అనుభవం చాటి చెబుతోంది.

25 సంవత్సరాల కమ్యూనికేషన్స్ వృత్తి నిపుణురాలైన మిష్బా ఖాద్రిని అద్దె ఇంటి ఓనర్లు తన్ని తరిమివేయడంతో న్యాయం కోసం జాతీయ మానవ హక్కుల కమిషన్ తలుపు తట్టడానికి సిద్ధం అవుతోంది. ఆమె కేవలం ముస్లిం అయినందుకే, అద్దె చెల్లించగల స్తోమత ఉన్నప్పటికీ, ఫ్లాట్ నుండి ఆమెను గెంటివేశారు. ఆమెకు ఫ్లాట్ లో చోటు ఇచ్చినందుకు ఆమె ముస్లిమేతర స్నేహితులు సైతం వివిధ ప్రశ్నలు, వేధింపులు ఎదుర్కోవలసి వచ్చింది.

తీవ్ర శ్రమకు ఓర్చి వెతికిన పిమ్మట మిష్భా ఖాద్రికి వదాలా లోని 3-బి‌హెచ్‌కే అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో సంఘ్వి హైట్స్ లో ఓ ఫ్లాట్ దొరికింది. ఫేస్ బుక్ లో వేదికగా ఇద్దరు ఉద్యోగినులు అప్పటికే షేర్ చేసుకుంటున్న ఫ్లాట్ లో చేరేందుకు ఆమెకు అవకాశం దొరికింది. ఆ ఇద్దరు ఉద్యోగినులు హిందువులు.

అయితే ఖాద్రి అన్నీ సిద్ధం చేసుకుని అపార్ట్ మెంట్ కు మారడానికి ఒక రోజు ముందు అద్దె ఇళ్ల బ్రోకర్ నుండి హెచ్చరిక అందింది. అపార్ట్ మెంట్ కు చెందిన హౌసింగ్ సొసైటీ ముస్లింలకు ఫ్లాట్ లను అద్దెకు ఇచ్చేందుకు అనుమతించదని ఆయన హెచ్చరించాడు. ఏదో విధంగా అంగీకారం దొరికినా ఆమె ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. మిష్బా మతం రీత్యా ఆమె పొరుగువారి నుండి ఎలాంటి వేధింపులు ఎదురైనా ఫ్లాట్ యజమాని గానీ, బ్రోకర్ గానీ అటువంటి వేధింపులకు చట్టబద్ధంగా బాధ్యులు కారని ఆ సర్టిఫికేట్ లో రాసి ఇవ్వాలని ఆయన సూచించాడు. సర్టిఫికేట్ తో పాటు రెస్యూమేను కూడా సమర్పించాలని ఆమెను ఆదేశించారు.

ఈ షరతులకు మిష్బా ఖాద్రి అంగీకరించలేదు. అయినాసరే ఆమె ఆ ఫ్లాట్ లో చేరక తప్పలేదు. ఆమె అప్పటికే నివసిస్తున్న ఫ్లాట్ వాళ్ళు ఇచ్చిన నోటీసు కాలం ముగియడంతో తప్పనిసరిగా ఆమె కొత్త ఫ్లాట్ లో చేరింది. అదీకాక ఫ్లాట్ ను పంచుకోవడానికి సిద్ధపడిన హిందూ ఉద్యోగినులు మిష్బాకు మద్దతుగా నిలవడంతో ఫ్లాట్ లో చేరేందుకు ధైర్యం చేసింది. హౌసింగ్ సౌసైటీతో, బ్రోకర్ మరియు యజమానులతో ఆ తర్వాత ఎదోలా రాజీకి రావచ్చని ఆమె భావించింది.

కానీ వారం తిరిగేలోపే ఏజెంటు ఆమె వద్దకు వచ్చాడు. వెంటనే ఫ్లాట్ ఖాళీ చేయాలని హెచ్చరించాడు. ఖాళీ చేయకపోతే బలవంతంగా ఖాళీ చేయిస్తానని సామాన్లు బైటికి విసిరేస్తానని, పోలీసుల్ని కూడా పిలుస్తానని ఏజెంటు హెచ్చరించాడు. “పోలీసుల్ని పిలిపిస్తానని ఆయన బెదిరించాడు. ఫ్లాట్ నుండి గెంటివేస్తానని హెచ్చరించాడు. చివరికి ఈ వ్యవహారం చాలా ఘోరంగా తయారయింది” అని ఖాద్రి చెప్పారని పత్రికలు తెలిపాయి.

ఏజెంట్ హెచ్చరికలతో మిష్బా బిల్డర్ ప్రతినిధిని కలిసింది. ఆయనా అదే మాట చెప్పాడు. తమ అపార్ట్ మెంట్ లలో ముస్లింలకు ఫ్లాట్లు అద్దెకు ఇవ్వకూడదన్నది తమ కంపెనీ విధానం అని ఆయన అసలు విషయం వివరించాడు. దరిమిలా వెంటనే ఫ్లాట్ ఖాళీ చేయాలని ఆమెకు అల్టిమేటం అందింది. ఫలితంగా ఆమె బలవంతంగా ఫ్లాట్ ఖాళీ చేయవలసి వచ్చింది. ఇంకా ఘోరం ఏమిటంటే ఒక ముస్లిం మహిళకు తమ ఫ్లాట్ లో చోటు ఇచ్చినందుకు ఆ ఇద్దరు హిందూ ఉద్యోగినులు కూడా ఫ్లాట్ ఖాళీ చేయాల్సి వచ్చింది.

ముంబైకే చెందిన ఒక బహుళజాతి ఎగుమతుల కంపెనీ జీషన్ ఆలీ ఖాన్ అనే ముస్లిం యువకునికి ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. నువ్వు ముస్లింవి కనుక ఉద్యోగం ఇచ్చేదీ లేదు పొమ్మని ఈ మెయిల్ ద్వారా సదరు కంపెనీ జీషన్ కు సమాచారం ఇచ్చింది. వ్యవహారం బైటపడి రచ్చ కావడంతో నెపాన్ని కంపెనీ ఒక మహిళా ఉద్యోగిని పైకి నెట్టి తప్పుకుంది.

ఆధునికత అనేది కాంక్రీటు అరణ్యం రూపం లోనూ అత్యాధునిక సౌకర్యాల రూపంలోనూ ఉండదని అది మనుషుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల లోనూ, సంస్కృతీ విలువలలోనూ ప్రధానంగా ఉంటుందన్నది జనం గుర్తెరగాలి. ప్రాచీన కాలాల నాటి మంచిని పక్కన బెట్టి వెనుకబడిన కుళ్ళు భావాలను దేశీయ సంస్కృతి పేరుతో మోస్తూ సాటి మనిషిని తమ మధ్య నివసించేందుకు కూడా అంగీకరించకపోవడం కంటే మించిన వెనుకబాటుతనం మరొకటి ఉండబోదు. పుచ్చిపోయిన కుల, మత భావాలతో మెదళ్ళను నింపుకుని అత్యాధునిక వసతుల మధ్య నివసిస్తూ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడితేనో, తెంపు లేకుండా వినూత్న సాఫ్ట్ వేర్ కోడింగ్ చేయగలితేనో మనుషులు ఆధునికులు కాజాలరు. ఆధునికతకు ప్రధాన గీటురాయి, అనేకానేక వివక్షాపూరిత భావజాలాలకు అతీతంగా మనుషులంతా నిజమైన ‘వసుధైక కుటుంబం’గా మనగలగడమే. ఆర్ధిక జీవనం నిండా వర్గ వివక్ష, దోపిడి అలుముకుని ఉన్నంత కాలం ఇలాంటి ‘నిజమైన వసుధైక కుటుంబం’ ఉనికిలోకి రావడం అసాధ్యం.

4 thoughts on “నువ్వు ముస్లింవి, ఇల్లు ఖాళీ చెయ్!

 1. Background:
  A 25-year-old woman in Mumbai has alleged that she was asked to vacate a flat because she is a Muslim, reports said on Wednesday.
  Misbah Quadri, who claims to be a model moved into a 3-BHK apartment at Sanghvi Heights in Wadala, was told by the broker that the housing society did not accept Muslim tenants a day before she was to shift.The story was first published by communist paper called “The Hindu”

  Who is she and what;s her background?
  Recently it has been revealed through social media investigators that the Misbah is a typical Hindu hating AAP supporter. Her Social media profiles have anti Modi posts and follows another drama queen called Teesta Setalvad(who is already facing twisting of facts and cheating case)

  What’s the real story behind the whole flat mess ?
  It has become fad for wannabe journalists or sycophant secularists to make a quick buck/recognition by playing victim and proposing non existing minority persecution..Misbah was asked to leave because she fought with broker and land owner. Many muslim families live in the society without any complaint.

  Is modelling her profession?
  No and never. She is a journalist who is aspiring to make a big name.She has also written some small articles in magazines.
  Beware of media ‪#‎Prestitute‬ propaganda

 2. The Hindu… communist paper? What a joke! BTW, one can not deny a fact only because it is reported by a communist paper. Moreover, not only The Hindu, so many papers reported the same incident. For example: Indian Express, Hindusthan Times, Times of India, NDTV etc… If you don’t want to see any facts which you don’t like or which do not fit your mindset, that is another matter.

  Typical ‘Hindu hating’ AAP supporter! I don’t buy such unilateral stamping, but so what? AAP is a political party in India. And India is a country of parliamentary democracy because of which the BJP is now in power even it is lead by a person who chose to see the otherside when his people (Muslims, ofcourse!) approached him for help, for protection from a mob on killing spree (Gulbarg Society, Narodapatia.. to mention a few). To remind you, this fact was duly recognised by SIT lead by Raghavan a heartless bureaurocrat who single mindedly worked hard to protect (and succeeded) a prime accused. Since when supporting a political party became a crime in this democratic country? Where do you live?

  Again, this is democracy. Everybody’s opinion counts. Everybody has a right to support a political party of his/her like, adore a leader of his/her like. Do you want to write a new constitution that stipulates that every citizen of this country should adore a single leader of your choice? You people might have kept your minds ready to be corrupted by mndless, divisive, sycophant utterances of lower rung minded netas like Giriraj Sing (who is warned to mind his tongue by Modi himself). But mind you, There are many many people in this world or in this country who keep their minds open and are ready to welcome even a tiny sized novel good view/thought that come to them. If one wants to perish in a well, so be it! Why should everybody fallow him? Be advised, never expect such obsurd things to occur.

  So anti-Modi posts may qualify to be hated by narrowminded, selfserving and an unbecoming of a democratic citizen. But they are qualified to be spoken, written, published and propagated in a democratic country, just as those of pro-Modi posts do. Again I want to ask you, do you want to live in an autocratic, dectatorial country? If that is the case, you may have to hail the dark days of Indira’s emergency rule and those are the days during which Hindutva organisations were also targetted. If you desire those days, you will not be writing the above comment. If you like a democractic society (how notional it may be) in which co-existence of diverse views is the core value, your survival is here to see. At the end of the day, hundreds of anti-Modi posts, thousands of Testa Setalvads will be there to be admired and of course to be hated. Period!

  How wonder you can say ‘non-existing minority persecution’?! Does it exist at least in Pakistan? Muslim ruling classes in Pakistan say the same thing, NON-EXISTING MINORITIES’ PERSECUTION! Shall we agree? Both of you people talk the same language man. The language of persecutors! The language of habituated deniers! The language of ruthless religious fundamentalists! The language of pure anti-democratic oppressors!

  By the way, what else we call the hateful attacks on Delhi churches? What do we call Gujarath pogram? What should we call countless attacks on minorities that took place on this land of ‘unity in diversity’ since our so called ‘independence’?

  If you read properly you must have read that Misbah Khadri is a communication proffessional which makes her a media proffessional and hence a journalist. And yes, she aspires to be a model. So what, again? If a journalist aspires to be a model, is it a crime or what? Don’t models aspire to work as journalists? Doesn’t a journalist aspire to be a model? What’s there in it to accuse? Your world is stinking man. Stinking with obscurantism, willful blindness, mindless hatred of middle ages and what not?

  Yes, people should be warned of presstitude media. No doubt about it. But what shall we call this type of mindless hatred of other religions and denying facts simply because they do not fit into a particular set of thinking? Should we call it Hinduitude, Muslimitude, Christitude and so on?

  If we stick to democratic openness and unbiased discretion maybe this type of onesided blindness would not recur. May one be helped by thyselves!

 3. Hi Sri Harsha, If you read the article you sugested carefully, you will find that that apartment is an effect of hatred but not a reason of it. To quote a para from your news finding…

  “While this may be a sound business proposition, questions are being raised on whether this is an attempt at creating high-end ghettoes. But equally, some see this as a practical solution in a country where it is still often difficult for Muslims to rent or buy houses.”

  Ghettoisation! It is what resulted from Muslims of Gujarat after 2002 pogrom to protect themselves. They are forced to ghettoise themselves. And it is rightly pointed out by the news reporter. However, I don’t support such ghettoisation. Even many muslims don’t. To quote from the same news item…

  Despite the high sales pitch, not all Muslims find the idea exciting. “Being a Muslim myself, I don’t want to live in an all-Muslim apartment complex,” said Professor Shahid Jamal, head of the communications department at Shiv Nadar University. “Why should anyone prefer to live within a community of the same religion? Isn’t that what ghettoes are all about?” he added.

  That is what called secularist way of thinking. Secularism is not an isolated idea. It is a democratic way of living. People accustomed to religious hatred may not understand it.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s