యు.పి.ఏ ప్రభుత్వం హయాంలో చైనా చొరబాట్ల గురించి బి.జె.పి చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ప్రధాని నరేంద్ర మోడి గారయితే చైనా విషయంలో యు.పి.ఏ పై నిప్పులు చెరిగేవారు. హిందూత్వ అభిమానగణం గురించి ఇక చెప్పనే అవసరం లేదు. హిందూత్వపై విమర్శలు కనపడిన చోటల్లా చొరబడి చైనా అది చేయడం లేదా, ఇది చేయడం లేదా అని దాడికి దిగుతారు. కొండొకచో బూతులకు లంకించుకుంటారు.
తీరా మోడి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా, చైనా అధ్యక్షుడు ఇండియా పర్యటనలో ఉండగానే చైనా సైనికులు తూర్పు సెక్టార్ లో (యు.పి.ఏ పాలనలో చేసినట్లుగానే) అనేక కిలో మీటర్లు చొరబడినప్పటికీ హిందూత్వ సంస్ధలు గానీ, దాని అభిమానులు గానీ కిక్కురుమనలేదు. ఇప్పుడు ఎన్.డి.ఏ-2 రక్షణ మంత్రి మనోహర్ పరికర్ ఏకంగా చైనా-ఇండియా సరిహద్దు భద్రతనే తగ్గించేశారు. 90,000 సైనికులతో కూడిన భద్రత విభాగాన్ని నెలకొల్పాలని యు.పి.ఏ ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ సంఖ్యను అమాంతం 25 నుండి 30,000 వరకు తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు.
90,000 సైనికులతో భద్రత కల్పించాలంటే 10 బిలియన్ డాలర్లు (దాదాపు రు. 63,000 కోట్లకు సమానం) ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. అంత ఖర్చు ఎందుకని ఇప్పటి రక్షణ మంత్రి ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఖర్చు గురించి ఆలోచించలేదని తమ ప్రభుత్వం మాత్రం ఖర్చు గురించి ఆలోచించి అంతమంది సైనికులతో చైనా సరిహద్దు వద్ద భద్రత కల్పించాల్సిన అవసరం లేదని నిర్ణయించిందని మనోహర్ పరికర్ చెప్పారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.
చైనా, ఇండియాలు 3,500 కి.మీ దూరం మేర సరిహద్దు కలిగి ఉన్నాయి. కాశ్మీర్ ఉత్తర సరిహద్దు నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు పొడవైన సరిహద్దు కలిగి ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో అత్యధిక భాగం ఎందుకూ పనికిరాని భూములతో కూడి ఉంది. చాలా వరకు కొండలు, గుట్టలతో నిండి ఉంటుంది. ఇక్కడ సైనిక భద్రత ఏర్పాటు చేయడం కూడా చాలా శ్రమ, ఖర్చుతో కూడి ఉంటుంది. దానితో ఇన్నాళ్లూ ఈ సరిహద్దు పైన భద్రత గురించి ఇరు దేశాలు పెద్దగా శ్రద్ధ చూపలేదు.
అయితే అమెరికా సామ్రాజ్యవాదులు తమ ఆధిపత్యం కొనసాగడానికీ, అంతకంతకూ ఎదుగుతున్న చైనాను నిలువరించడానికి ‘ఆసియా-పివోట్’ వ్యూహాన్ని ప్రకటించిన తర్వాత చైనా జాగ్రత్త పడడం ప్రారంభించింది. అత్యంత ప్రతికూల ప్రాంతాల్లో సైతం రోడ్లను నిర్మించింది. సైనికులను వేగంగా తరలించడానికి వీలుగా పలు ఏర్పాట్లు చేసుకుంది.
అమెరికా తలపెట్టి అమలు చేస్తున్న ‘ఆసియా-పివోట్’ వ్యూహంలో ఇండియా ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుందని అమెరికా అంచనా. ఆ మేరకు పాకిస్తాన్ ను దూరం పెడుతున్నట్లు నటిస్తూ ఇండియాను దగ్గరకు తీయడం మొదలు పెట్టింది. భారత పాలకులు సైతం అమెరికాకు గతంలో కంటే దగ్గరకు జరుగుతున్నారు. ఇది యు.పి.ఏ పాలనలోనే ఆరంభం కాగా ఎన్.డి.ఏ-2 పాలనలో మరింత ఊపు అందుకుంది. ఈ నేపధ్యంలో చైనా సరిహద్దులో యు.పి.ఏ తలపెట్టిన భద్రతను కూడా ఎన్.డి.ఏ ప్రభుత్వం తగ్గించడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయం.
రెండేళ్ల క్రితం యు.పి.ఏ-2 పాలనలో చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దు దాటి అనేక కిలో మీటర్లకు ముందుకు వచ్చి గుడారాలు నెలకొల్పారు. అప్పట్లో ఈ ఘటన అంతర్జాతీయంగా సంచలనం అయింది. గుడారాలు ఎత్తివేసి వెనక్కి వెళ్ళేలా చేయడానికి ఇండియా ప్రయత్నించినప్పటికీ అనేక రోజుల పాటు ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇరు దేశాల సైనికులు పలుమార్లు ఫ్లాగ్ మీటింగ్ లు నిర్వహించినా ప్రతిష్టంభన తొలగలేదు. ఈ ప్రతిష్టంభన ఏకంగా 21 రోజుల పాటు కొనసాగింది.
చివరికి చైనాయే నిర్ణయం తీసుకుని తమ సైనికులు వెనక్కి రావాలని ఆదేశించడంతో పరిస్ధితి సద్దుమణిగింది. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల ఫలితంగానే చైనా తన సైనికులను ఉపసంహరించిందని అప్పటి ప్రభుత్వం చెప్పినప్పటికీ చర్చలలో కుదిరిన ఒప్పందం ఏమిటో భారత ప్రజలకు చెప్పలేదు. ఎన్.డి.ఏ ప్రభుత్వం వచ్చాకయినా ఆనాటి ఒప్పందం వివరాలు ప్రజలకు వెల్లడి అవుతుందని ఆశించినవారికి శృంగభంగం తప్పలేదు.
అప్పటి 21 రోజుల ఉద్రిక్తత దరిమిలా యు.పి.ఏ ప్రభుత్వం చైనా-ఇండియా సరిహద్దులో నియమించడానికి పటిష్టమైన సైనిక బృందాన్ని తయారు చేయాలని నిర్ణయించింది. 10 బిలియన్ డాలర్ల అంచనాతో 90,000 మంది మెరికల్లాంటి సైనికులతో పటాలాన్ని ఏర్పాటు చేయాలని దానిని ప్రత్యేకంగా చైనా సరిహద్దు లోనే వినియోగించాలని నిర్ణయం చేసింది. పర్వత దాడి బలగం (mountain strike force) గా సరిహద్దు రక్షణ సైనికులను రూపు దిద్దాలని భావించింది. అనుకున్నట్లు అంతా జరిగితే ఈ బలగం పర్వత ప్రాంతాల్లో వేగంగా కదలగల సుశిక్షిత బలగంగా రూపు దిద్దుకోవాలి. వాయు బలగాలు కూడా ఇందులో భాగంగా ఉండాలని పధక రచన జరిగింది. అవసరమైతే భూతల బలగాలకు సాయంగా వాయు బలగాలను సరిహద్దులోని పర్వత సానుల్లో దించగల ఏర్పాట్లు చేయాలని తలపెట్టారు. ఎన్.డి.ఏ-2 ఈ పధకంలో 2/3 వంతు భాగాన్ని తెగ్గోసి ఆ నిధులను వేరే చోటికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
చైనా-ఇండియా ల సరిహద్దులో అడపా దడపా సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం అక్కడ సరిహద్దు ఎక్కడ ఉన్నదీ ఇంతవరకు నిర్ణయం కాకపోవడమే. సరిహద్దు నిర్ణయం కావాలంటే ఇరు దేశాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో చర్చలు జరపాలి. అత్యంత బద్ధ శత్రువులుగా ఉన్న దేశాలు కూడా ఈ పద్ధతిలోనే సరిహద్దులను నిర్ణయించుకున్నాయి. కానీ భారత పాలకులు ఆ వైపుగా ఎన్నడూ ప్రయ్తత్నించలేదు.
నెహ్రూ ప్రభుత్వం వినాశకరమైన ‘ఫార్వర్డ్ పాలసీ’ ని అమలు చేయడం వల్లనే 1962లో చైనాతో యుద్ధం సంభవించిందన్నది ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్న వాస్తవం. సాధ్యమైనంత ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించుకుని సైనిక పోస్టులు నెలకొల్పాలని ఆనాటి ప్రభుత్వం మిలట్రీకి ఆదేశాలు ఇచ్చింది. అలా చేస్తే చైనా ఏమీ చేయదని, దాడి చేయగల శక్తి ఉన్నప్పటికీ దాడి చేయబోదని అప్పటి ఇంటలిజెన్స్ బ్యూరో అధిపతి బి.ఎన్.మాలిక్ హామీ ఇవ్వడంతో నెహ్రూ ప్రభుత్వం దుస్సాహసానికి దిగింది. తాము గుర్తించిన అంతర్జాతీయ సరిహద్దును కూడా దాటి ముందుకు వెళ్ళి సైనిక పోస్టులు నెలకొల్పింది.
ఈ పద్ధతికి స్వస్తి చెప్పాలని, వెంటనే వెనక్కి వెళ్లాలని చైనా నుండి తగిన హెచ్చరికలు అందినప్పటికి భారత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఫలితంగా చైనా దాడి చేయడం భారత సైనికులను వెనక్కి కొట్టడం జరిగిపోయింది. నిజానికి అప్పటి మిలట్రీ ఇంటలిజెన్స్ విభాగం ఫార్వర్డ్ పాలసీ తగదని హెచ్చరించింది. ఏమి చేసినా చైనా ఊరుకుంటుందన్న ఐ.బి అంచనా తప్పని, చైనా దాడి చేసి తమ భూభాగాలను తిరిగి వశం చేసుకుంటుందని స్పష్టం చేసింది. అయినా నెహ్రూ ప్రభుత్వం వినలేదు.
ఈ పరిణామాలను యధాతధంగా అర్ధం చేసుకోగల శక్తి హిందూత్వ దురభిమానులకు లేదు. చైనా దాడి చేసి భారత భూభాగాలను దురాక్రమించిందన్నదే వారి నిశ్చయాత్మక అవగాహన. ఆ అవగాహనతో చైనా వ్యతిరేక సెంటిమెంట్లను రెచ్చగొడుతూ వచ్చారు. అప్పటి చైనా కమ్యూనిస్టు చైనా కావడమే హిందూత్వకు బాగా పట్టిన విషయం. ఆ పట్టింపుతో చైనా ఏం చేసినా తప్పు, ఇండియా ఏం చేసినా ఒప్పు అన్న అవగాహనను వ్యాప్తి చేశారు. పోనీ తాము అధికారానికి వచ్చాక అదే అవగాహనకు కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు. పాకిస్తాన్ ను శత్రువుగా ప్రచారం చేసిన బి.జె.పి మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు ఆ దేశంతో శాంతి చర్చలకు బీజం వేసింది. పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ ను దేశానికి ఆహ్వానించింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక చైనాతో చర్చలకు తెరలేపింది. వీటిని ఎలా అర్ధం చేసుకోవాలో హిందూత్వ అభిమానులు చెప్పవలసి ఉంది. యు.పి.ఏ తీసుకున్న కఠిన వైఖరిని సైతం సడలించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో బి.జె.పి పార్టీ, హిందూత్వ సంస్ధలు, అభిమానులు చెప్పవలసి ఉంది.
బి.జె.పి పార్టీ, ఇతర హిందూత్వ సంస్ధలకు బదులుగా ప్రభుత్వ అధికారులు తాజా విధానానికి సమాధానం ఇస్తున్నారు. వారి ప్రకారం బి.జె.పి ప్రభుత్వం యు.పి.ఏ నిర్ణయాన్ని తిరగదోడడం లేదు. కేవలం బలగాల సంఖ్యను తగ్గిస్తున్నారు అంతే. అది కూడా నిధులు లేకపోవడం వల్లనే తప్ప మరొక కారణం లేదు. అదే నిజమైతే మొన్న ప్రధాని మోడి చైనా పర్యటనలో సరిహద్దు సమస్యను శాంతియుతంగా, సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఎందుకు నిర్ణయించినట్లు? చైనాలోని నగర ప్రభుత్వాలతో కూడా చర్చించి చైనా పెట్టుబడుల కోసం ఎందుకు దేబిరించినట్లు? ప్రతిపక్షంలో ఉండగా బి.జె.పి డిమాండ్ చేసిన ఘర్షణ వైఖరిని ఇప్పుడు ఎందుకు అవలంబించరు?
రాయిటర్స్ పత్రిక ఒక కారణం కనిపెట్టింది. భారత ప్రభుత్వం అతిపెద్ద విమాన వాహక నౌకను నిర్మించాలని భావిస్తోందని సదరు నౌకను నిధులను సమకూర్చడానికే సరిహద్దు బలగాలకు కేటాయించిన నిధులను తగ్గించి వాటిని నౌకా నిర్మాణానికి తరలించిందని పత్రిక తెలిపింది. విమాన వాహక నౌకా నిర్మాణం కోసమే చైనా సరిహద్దులో బలగాల సంఖ్యను తగ్గించ్చిందని తెలిపింది. ఇదే నిజమైతే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంటుంది. మరి చైనా సరిహద్దులో రక్షణను ఏం చేయదలిచారు? చైనా నుండి మళ్ళీ చొరబాటు ఉండదని బి.జె.పి ప్రభుత్వం నమ్ముతున్నదా? నమ్మితే ఆ నమ్మకం యు.పి.ఏ ఎందుకు కలిగి ఉండకూడదు? పాకిస్తాన్, చైనా ల విషయాల్లో కాస్త దానికి కూస్త దానికి రెచ్చిపోయే హిందూత్వ అభిమానులు ఇవన్నీ ఆలోచించి సమాధానం చెప్పవలసి ఉంది.
గత ప్రభుత్వం ఖర్చు గురించి ఆలోచించలేదని తమ ప్రభుత్వం మాత్రం ఖర్చు గురించి ఆలోచించి అంతమంది సైనికులతో చైనా సరిహద్దు వద్ద భద్రత కల్పించాల్సిన అవసరం లేదని నిర్ణయించిందని మనోహర్ పరికర్ చెప్పారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.
ఖర్చు తగ్గించుకోవడం తెలివైన నిర్ణయమే! మరి దేశ భద్రత మాటేమిటి? దేశబధ్రత గాలి(చైనాకొదిలేసినట్లా)కొదిలేసినట్లా? అటువంటప్పుడు బడ్జెట్లో అన్నేసి లక్షల కోట్లు వృదా ఖర్చు ఎందుకో మనోహర్(మోది) వివరిస్తే బాగున్ను!
ఎన్.డి.ఏ-2 ఈ పధకంలో 2/3 వంతు భాగాన్ని తెగ్గోసి ఆ నిధులను వేరే చోటికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
సైనికులను 2/3 వంతు తగ్గించాలనుకొన్నప్పుడు నిధులుకూడా అదేనిష్పత్తిలో తగ్గించాలని ఏమీలేదుకదా! ప్రభుత్వం ప్రకటించేవరకు ఎంతమొత్తం డబ్బు తగ్గుతుందో అప్పుడే చెప్పలేము. మొత్తమ్మీద నిధులను తగ్గించడం గ్యారంటీ!
నెహ్రూ ప్రభుత్వం వినాశకరమైన ‘ఫార్వర్డ్ పాలసీ’ ని అమలు చేయడం వల్లనే 1962లో చైనాతో యుద్ధం సంభవించిందన్నది ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్న వాస్తవం.
తాము గుర్తించిన అంతర్జాతీయ సరిహద్దును కూడా దాటి ముందుకు వెళ్ళి సైనిక పోస్టులు నెలకొల్పింది.
ఫలితంగా చైనా దాడి చేయడం భారత సైనికులను వెనక్కి కొట్టడం జరిగిపోయింది. చైనా దాడి చేసి తమ భూభాగాలను తిరిగి వశం చేసుకుంది.
చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దు దాటి అనేక కిలో మీటర్లకు ముందుకు వచ్చి గుడారాలు నెలకొల్పారు.
పై వాఖ్యాలను గమనించండి-అప్పుడు నెహ్రు చేసినది తప్పైనప్పుడు,ఇప్పుడు చైనా సైనికులు చేసిన చర్యలను ఎలా చూడాలి?
అప్పుడూ ఇప్పుడూ చైనాయే బలమైన సైనిక వ్యవస్థను కలిగి ఉన్నది.
వారి సైనికులను వెనక్కివెల్లమని ఇండియా చైనాను ప్రదేయపడిందిగానీ, గర్జించలేదుకదా! దాడిచేయలేదుకదా!
ఈ పరిణామాలను ఎలా అర్ధం చేసుకోవాలి?
kodhi mandhi chesina thapuki andharu anadhu
సరే, అలాగే చేద్దాం. కానీ ఆ కొద్ది మంది ఎవ్వరో మీరు చెప్పాల్సి ఉంటుంది. అందరు ఎవరో కూడా మీరు స్పష్టంగా చెప్పాలి.
churches india lo emi chestunayee, matham marpidilu kadha.. alanti vallo nenu okadini
నేను అడిగింది మీకు అర్ధమైనట్లు లేదు. “కొద్ది మంది చేసిన తప్పుకి అందరినీ అనొద్దు” అని మీరు అన్నారు కదా. ఆ ‘కొద్ది మంది’, ‘అందరు’ ఎవరు? అని నేను అడిగాను. మీరు ఎవరని కాదు.
ఇంతకీ మీరు చర్చిల లాగా మత మార్పిడులు చేస్తారా?