నరేంద్ర మోడి ఏడాది పాలనకు రాహుల్ గాంధీ ఇచ్చిన మార్కులు పదికి సున్నా (జీరో). ఈ మేరకు రాహుల్ గాంధీ స్వయంగా పార్లమెంటులో ప్రకటన చేశారు. కాంగ్రెస్ సభ్యులు ఆనందంగా బల్లలు చరిచారు.
రాహుల్ గాంధీ లాంటి పిల్లగాడు తమ అధినేతను జీరోను చేస్తే బి.జె.పి నేతలు ఊరుకుంటారా? చస్తే ఊరుకోరు. వెంకయ్య నాయుడు గారి లాంటి ప్రాసల పండితులైతే అసలే ఊరుకోరు. “జీరోలకు జీరోలే కనిపిస్తారు. హీరోలు కనిపించరు” అని రాహుల్ విమర్శను ఆయన తిప్పి కొట్టారు. లేదా తిప్పి కొట్టానని భావించారు.
రాహుల్ గాంధీయే ఒక జీరో అని కనుక ఆయన ఎక్కడ చూసినా జీరోలే కనిపిస్తాయి తప్ప హీరోలను ఆయన చూడలేరని వెంకయ్యనాయుడు గారి విమర్శ. రాహుల్ కనిపించడానికి పదిలాగా కనిపిస్తున్నా ఆయన నిజానికి ఒకటి (సోనియా గాంధీ) పక్కన సున్నా అనీ, సోనియా వల్లనే ఆయన ప్రభ వెలుగుతోందని కార్టూనిస్టు చమత్కరించారు.
రాహుల్ గారు ప్రధాని మోడిలో జీరోనే చూశారు కనుక, వెంకయ్య గారి ప్రకారం రాహుల్ జీరోలనే చూడగలరు కనుక నిజంగానే ప్రధాని నరేంద్ర మోడి జీరో అని వెంకయ్య నాయుడు గారు అంగీకరించారు. కాకపోతే రాహుల్ మాత్రం జీరో కాదా అని ఆయన ఎత్తి చూపారు.
ఏతా వాతా తేలింది ఏమిటంటే ప్రధాని మోడి, ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ ఇద్దరూ జీరోలే అని. ముఖ్యంగా భారత ప్రజలకు వారు జీరోలే. స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు హీరోలు కావచ్చు గానీ జనానికి మాత్రం జీరోలే. ఇదే ప్రజలు గమనించవలసిన పరమార్ధం.
సురేంద్ర గారు రాహుల్,మోదీ ఇద్దరీకీ 0 లు కేటాయించారు బాగుంది.సోనియాని 1 తో పోల్చారు.ఆవిడ కూడా అందుకు అర్హురాలుకాదు.