[America’s perennial angst శీర్షికన మే 2 నాటి ది హిందులో ప్రచురితం అయిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం. -విశేఖర్]
ఆర్ధిక అగ్రరాజ్యం అయినప్పటికీ దరిద్రం, వెలివేత, నేరాలు… మొ.న అంశాలతో ముడివేయబడిన తీవ్ర స్ధాయి స్వదేశీ సమస్యలు అమెరికాను పట్టి పీడిస్తున్న సంగతిని ఇటీవల బాల్టిమోర్ లో నిరసనలుగా ప్రారంభమై అల్లర్లుగా రూపుదాల్చిన ఆందోళనలు పట్టిచ్చాయి. గత ఏప్రిల్ నెలలో నగర పోలీసుల చేతుల్లో ఒక ఆఫ్రికన్-అమెరికన్ యువకుడు, ఫ్రెడ్డీ గ్రే, ప్రాణాలు కోల్పోయిన దరిమిలా ఈ అల్లర్లు చెలరేగాయి. ఇలాంటి చావులు ఇదే మొదటిసారి కాదు. జాతి విద్వేష పోలీసింగ్ గానూ, నల్లజాతి యువకులను లా-ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు లక్ష్యం చేసుకోవడం గానూ పరిగణించబడుతున్న ఉదంతాలు తీవ్ర ప్రకంపనలుగా అమెరికా నగరాలను తాకుతున్న వరుస ఘటనల్లో ఇవి తాజావి మాత్రమే. గత సంవత్సరం మిస్సోరీ (రాష్ట్రం) లోని ఫెర్గూసన్ పట్టణంలో ఒక తెల్లజాతి పోలీసు అధికారి ఎటువంటి కారణం లేకుండానే నల్లజాతి యువకుడు మైఖేల్ బ్రౌన్ ను కాల్చి చంపినప్పుడు ఇదే తరహాలో అల్లర్లు చెలరేగాయి. 2012లో ఫ్లోరిడాలో మరో నల్లజాతి యువకుడు ట్రెవాన్ మార్టిన్ ను కాల్చి చంపిన కేసులో తెల్లజాతికి చెందిన రక్షణ వాలంటీర్ జార్జ్ జిమ్మర్ మాన్ ని నిర్దోషిగా విడుదల చేయడం పైనా అమెరికాలో తీవ్ర స్ధాయిలో బహిరంగ వాదోపవాదాలు సాగాయి.
వీటితో పాటు ఇటీవల కాలంలో జరిగిన ఇతర ఘటనలు అమెరికాకు సంబంధించి ఒక వికల దృశ్యాన్ని ప్రపంచం ముందు ఉంచాయి. చట్టాలను అమలు చేసే వ్యవస్ధ ఆఫ్రికన్-అమెరికన్ లను -ముఖ్యంగా యువకులను- అన్యాయంగా టార్గెట్ చేస్తోందని, యధాతధ ముద్రవేస్తున్నదని, క్రూరమైన పోలీసింగ్ పద్ధతులకు గురివేయబడుతున్నారని ఈ దృశ్యంలో అగుపిస్తోంది. తగినన్ని విద్యార్హతల లేమి, దరిద్రంల కారణంగా ఉపాధి సౌకర్యాల లబ్ది పడిపోతుండడంతో నల్లజాతి సమాజం అత్యధిక నేర ఘటనలతో కూడుకుని యువ ఆఫ్రికన్-అమెరికన్ లపై యధావిధి ముద్రవేయడానికి దారితీస్తోంది. 1960లు, 1970ల నాటి మరింత ఘోరమైన జాతి విద్వేషం, వెలివేత, పౌర హక్కుల హరణ సమస్యలతో పోల్చితే కాస్త తేడాగా ఉన్న ప్రస్తుత సమస్యాత్మకత ఉనికిని అధ్యక్షుడు బారక్ ఒబామా, ఇతర రాజకీయవేత్తలు అంగీకరించినప్పటికీ దాని పరిష్కారానికి వారు చేసేందేమీ లేదు.
దేశంలోని ఇతర భాగాలతో పోలిస్తే ఆఫ్రికన్-అమెరికన్ల సాంద్రత అధిక స్ధాయిలో ఉన్న బాల్టిమోర్ నగరం నగర దరిద్రం లాంటి నిర్దిష్ట సమస్యలతో తీసుకుంటోంది. దీర్ఘకాలికంగా పారిశ్రామికీకరణ వెనుకపట్టు పట్టడం మరియు నిరుద్యోగం సమస్యలు ఈ పరిస్ధితికి కారణం. ముఖ్యంగా లోపలి నగరాలలోని ఆఫ్రికన్ అమెరికన్ యువకులు అత్యంత కష్టభూయిష్టమైన జీవన స్ధితిగతులను ఎదుర్కొంటుండగానే అక్కడ నేరాల రేటు అధికంగా ఉండడానికి వారే కారణం అని ఆరోపించబడుతున్నారు. అక్కడి చట్ట అమలు వ్యవస్ధకు పోలీసు క్రూరత్వం లాక్షణిక అలంకారంగా ఉన్న పరిస్ధితి. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే నగర పాలక వ్యవస్ధలో జాతిపరమైన సమతూకం మెరుగుగా ఉన్నప్పటికీ నివాసులలో వ్యవస్ధపై నమ్మకం అధమ స్ధాయిలో కొనసాగుతోంది. బహుళ ప్రజాదరణ పొందిన టి.వి సిరీస్ ‘ద వైర్’ లో దృశ్యీకరించినట్లుగా పాతాళంలో ఉన్న పాలనా వ్యవహారాల స్ధితిగతులు లోపలి నగరాలకు సైతం విస్తరిస్తున్నాయి. నల్లజాతి సమాజానికి సంబంధించి నేరాలు-శిక్ష అంశంలో అమెరికా తన వ్యూహాలపై పునరాలోచన చేస్తే తప్ప -ఆఫ్రికన్-అమెరికన్ లను ఖైదు చేస్తున్న రేటు ఆమోదించలేనంత ఎక్కువగా ఉన్నది- మరియు లోపలి నగర దారిద్రాన్ని పరిష్కరించే మార్గాన్ని ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధి చేస్తే తప్ప అలాంటి ఘటనలు పునరావృతం అవుతాయనే అనిపిస్తోంది.
కొత్త సైటు మొదలు పెట్టాను విశేఖర్ గారు…
http://www.freebookbank.com
ఎలా ఉందో చూడండి, మీకు కుదిరితే
…………….నాగశ్రీనివాస
నాగశ్రీనివాస గారూ మీ ప్రయత్నం బాగుంది. ఈ పని ఎలా చేస్తున్నారు? సమయం బాగా తీసుకోవడం లేదా?
Thanks Andi. డేటా కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నానండి…. కుదిరినప్పుడు రాస్తున్నాను….