ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంతకైనా తెగించేలా చేస్తాయి. రాజకీయ, ఆర్ధిక అవినీతికి వ్యతిరేకంగా జన్మించిన పార్టీ ఎఎపి. ఆ పార్టీ కూడా గెలవడం కోసం తన స్ధాపనా సూత్రాలను కూడా వదిలిపెట్టి అభ్యర్ధులను నిలబెట్టిందని మాజీ అన్నా బృందం సభ్యుడు ప్రశాంత్ భూషణ్ బహిరంగంగా పత్రికలకు ఎక్కవలసిన పరిస్ధితి!
అంబేద్కర్ 125వ శత జయంతి ఉత్సవాలను గ్రాండ్ గా జరిపేందుకు కాంగ్రెస్, బి.జె.పి లు శాయశక్తుల ఎలా కృషి చేస్తున్నాయో మొన్నటి ది హిందు సంపాదకీయం “Admiration sans adherence’ చక్కగా వివరించింది. దాదాపు అదే సందేశాన్ని ఈ కార్టూన్ ద్వారా తెలియజేస్తున్నారు.
అంబేద్కర్ విగ్రహం అందరికీ రాజ్యాంగ నిర్మాత విగ్రహంగా కనిపిస్తే రాజకీయ నాయకులకు మాత్రం ఓటు బ్యాంకును తెరిచే తాళంలాగా కనిపిస్తోందని కార్టూనిస్టు చమత్కరించారు. ఆ పోటీ పడేవారిలో బి.జె.పి అధ్యక్షుడు షా ఒకడుగు ముందుండడం చిత్రంలో గమనించవచ్చు. బి.జె.పితో వెనుకబడిన కాంగ్రెస్ నేత షా పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమూ గమనించవచ్చు.