అమెరికన్ వాల్ స్ట్రీట్ కంపెనీలు ఎప్పటిలాగానే లాభాలు నమోదు చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు పైపైకి చూస్తున్నాయి. ఆర్ధిక సంక్షోభం ముగిసిందని ప్రభుత్వాలు తీర్మానిస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వృద్ధి రేటు కూడా పెరుగుద్దంటున్నారు. జనం మాత్రం కరువు బారిన పడి విలాపిస్తున్నారు.
పశ్చిమ అమెరికా తీర రాష్ట్రాలను ఎన్నడూ ఎరగని కరువు పట్టి పీడిస్తోంది. ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రమే కాదు, నెవాడా, ఆరిజోనా, ఉటా తదితర రాష్ట్రాలన్నీ నీటి కోసం అలమటిస్తున్నాయి. ప్రతి యెడూ సాధారణంగా ఈ సమయానికల్లా మంచులో కూరుకుపోయి ఉండే సియర్రా నెవాడా పర్వత శ్రేణుల్లో మంచు జాడలే లేవు.
పరిస్ధితి తీవ్రత తెలియజేయడానికి కాలిఫోర్నియా గవర్నర్ (మన ముఖ్యమంత్రితో సమానం) జెర్రీ బ్రౌన్ సియర్రా నెవాడా పర్వత శ్రేణుల వద్ద నిలబడి నీటిపై రేషన్ విధిస్తూ ప్రకటన జారీ చేశాడు. తన రేషన్ నిర్ణయానికి ఆయన తన వేదిక ద్వారానే కారణం చెప్పాడు.
పశ్చిమ అమెరికా నీరు లేక కరువు బారిన పడడం వరుసగా ఇది నాలుగవసారి. ఇప్పటికే ఇది కాలిఫోర్నియా, అరిజోనా, ఉటా రాష్ట్రాలలో రికార్డుల్ని తిరగరాస్తోంది. ఉటా-ఆరిజోనా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే రిజర్వాయర్ ‘పావెల్ సరస్సు’ ఇప్పుడు 45 శాతం సామర్ధ్యం నీటినే కలిగి ఉంది. ఇది ఇంకా దిగజారి వచ్చే సెప్టెంబర్ నాటికి రికార్డు స్ధాయిలో తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు.
కొలరాడో నది మీద ఉండే ఈ రిజర్వాయర్ రెండో అతి పెద్దది. పై మూడు రాష్ట్రాలతో పాటు కొలరాడో, వైమింగ్, న్యూ మెక్సికో రాష్ట్రాలకు కూడా నీటి వసతి కల్పిస్తుంది. ఇది టూరిస్టు కేంద్ర కూడాను. నగరాల వాడకానికి, మానవ వినియోగానికి, పరిశ్రమల పోషణకు, వ్యవసాయ పోషణకు… అన్నింటికి పావెల్ సరస్సు నీరు ఆధారం. అలాంటి చెరువు ఎండిపోవడం, అడుగంటుతుండడం బట్టి పశ్చిమ అమెరికాలో కరువు తీవ్రతను అంచనా వేయవచ్చు.
కాలిఫోర్నియా స్నో ప్యాక్ ఆ రాష్ట్రంలో మూడో వంతు నీటి అవసరాలు తీర్చుతుంది. అది కూడా ఇప్పటికే అట్టడుగుకు దిగజారింది. కాలిఫోర్నియా పర్వతాలపై నిరంతరాయం పెరుకుపోయి మంచు నిల్వలను స్నో ప్యాక్ గా వ్యవహరిస్తారు. ఇందులో అధిక మొత్తం కరిగి నీరయిందని, అసలు కురుసిందే తక్కువని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
Getty Images ఫోటోగ్రాఫర్ ఒకరు పశ్చిమ అమెరికా రాష్ట్రాలను సందర్శించి భద్రం చేసిన ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.
అమెరికా లో పశ్చిమ రాష్ట్రాలలో కరువు సమస్య తీవ్రంగా ఉందని వరుస కధనాలు ఇస్తున్నారు.
మనదేశకరువుతో ఒకసారి పొల్చిచూసుకొందాం!
ప్రపంచంలో ఉత్తర అమెరిక దేశాలు,ఉత్తర ఐరోపా దేశాలు అత్యధిక నీటి వినియోగ(తలసరి) దేశాలు.
మనదేశ సగటు వినియోగం వారిలో పదోవంతు కూడా ఉండదు!విచ్చలవిడిగా ఖర్చుపెట్టే వారికి అందులో పావువంతు తగ్గించుకొన్నా నిజానికి ఫర్వాలేదు!వారిలెక్కలతో పోల్చిచూస్తే ఈ దేశపౌరులు కొన్ని దశాబ్దాలుగా అత్యంత తీవ్రనీటికరువును ఎదుర్కొంటున్నట్టేలెక్క!
ప్రజలకు ముఖ్యమైన మౌలిక అవసరాలలో నీరు అత్యంత ప్రాధాన్యమైనది.ప్రజలకు కల్పిచవలసిన నీటిహక్కులకోసం పోరాడుతున్న ప్రజాసంఘాలు ఏమైనా ఉన్నాయా?
భవిష్యత్తులో దేశాలమధ్య ఉద్ధాలు సంభవిస్తే అది నీటికోసమేనని అంటుంటారు!
ఈ లెక్కన మనదేశ ప్రజలు అత్యంత అచేతనావస్థలో ఉంటున్నట్టేనా!