రామలింగ రాజు సోదరులు, ఇతర పెద్ద మనుషులకు అవినీతికి పాల్పడినందుకు గాను హై కోర్టు శిక్షలు ప్రకటించింది. అత్యధికంగా 7 సం.ల జైలు శిక్ష + 5.5 కోట్లు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఈ శిక్షలను చూసి అందరూ సంతోషిస్తున్నారు. తగిన శిక్ష పడిందని వ్యాఖ్యానిస్తున్నారు.
అసలు సత్యం కంపెనీ అధిపతి రామలింగ రాజు బృందం పాల్పడిన అవినీతికి పడిన శిక్ష మొత్తం కార్పొరేట్ అవినీతికి పడవలసిన శిక్షతో పోల్చితే ఎంత చిన్న దెబ్బతో సమానమో అది కార్పొరేట్ అవినీతిని ఏ మాత్రం బాధపెట్టగలదో ఈ కార్టూన్ చెబుతోంది.
సత్యం కంపెనీకి ఆడిటింగ్ నిర్వహించిన కంపెనీ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే పేరు గలది. ఇది ‘ద సిటీ’ (లండన్) నుండి పని చేసే బహుళజాతి కంపెనీ. ప్రపంచంలోని అతి పెద్ద ఆడిటింగ్ కంపెనీల్లో ఇది రెండవది. మొదటి స్ధానం డెలాయిట్ ది. 2014లో డెలాయిట్ ఆదాయం 34.2 బిలియన్ డాలర్లు కాగా ప్రైస్ వాటర్ హౌస్ ఆదాయం 34 బిలియన్లు. (ఇది టర్నోవర్ కాదు కేవలం వార్షిక ఆదాయం మాత్రమే.
కుంభకోణం విలువ 7,000 కోట్ల రూపాయలు. లావాదేవీలు లేకుండానే అవి జరిగినట్లు అకౌంట్ బుక్స్ లో (బ్యాలన్స్ షీట్) ఎప్పుడో చూపామని అది పెరిగి పెద్దదై 7,000 కోట్లు అయిందని జనవరి 7, 2009 తేదీన ఇన్వెస్టర్లకు రాసిన ఈ మెయిల్ లేఖలో రామలింగరాజు పేర్కొన్నారు.
అకౌంట్ పుస్తకాలు సరిగ్గా ఉన్నదీ లేనిది ఆడిటింగ్ కంపెనీలు ప్రతియేడూ నిర్వహిస్తాయి. అలాంటిది ఎన్నడో యేళ్ళ క్రితం జరిగిన తప్పును కనిపెట్టకుండా ఉండడం ఆడిటింగ్ కంపెనీకి సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యపడితే అది ఆడిటింగ్ కంపెనీ కాకపోయినా అయి ఉండాలి లేదా కంపెనీతో కుమ్మక్కయినా అయి ఉండాలి. ఈ రెండోదే నిజమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మనం చెప్పడం కాదు అమెరికా సెక్యూరిటీ ఎక్చేంజ్ కమిషనే (మన సెబి లాంటిది) ఆ సంగతి చెప్పింది. సత్యం కంపెనీతో కుమ్మక్కు అయినందుకు 6 మిలియన్ డాలర్ల జరిమానా వసూలు చేసింది కూడా. జైలు శిక్షలు ఎందుకు పడలేదన్నది భ్రహ్మ రహస్యం. బిలియన్ల డాలర్ల మోసాలు చేసి జరిమానాతో బైటపడడం అమెరికా కార్పొరేట్ కంపెనీలకు సాధారణ అలవాటు. వారి వ్యవస్ధ అలా తయారు చేసుకున్నారు మరి.
అది కూడా బ్రిటిష్ కంపెనీ అయినందున జరిమానా వసూలు చేశారు గానీ అమెరికా కంపెనీ అయితే అదీ ఉండేది కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో శ్రీలంక (రాజారత్నం), ఇండియా (రజత్ గుప్తా) సంతతికి చెందిన వ్యాపారులకు భారీ శిక్షలు వేస్తారు గానీ అమెరికన్లను మాత్రం అసలు ముట్టుకోవు. రజత్ గుప్తా విషయం అయితే ఆయన తప్పు అసలే లేదని కేవలం అమెరికన్ మోసగాళ్లను తప్పించడానికే ఆయన్ని బలిపశువుని చేశారని కొన్ని పత్రికలు పరిశోధనాత్మక కధనాలు వెలువరించాయి. అందులో మన తెహెల్కా కూడా ఒకటి.
ఇట్లాంటి దేశాలు అవినీతి గురించి మనకి నీతులు చెబుతాయి!
సత్యం లాంటి చిన్న కంపెనీతో లాలూచీ పడితేనే 1.7 బిలియన్ డాలర్ల కార్పొరేట్ అవినీతి జరిగింది. ఈ అవినీతిలో ఆడిటింగ్ కంపెనీ (PwC) కి భారీ భాగం ఉంటుందని గమనిస్తే సంవత్సరానికి 34 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ కంపెనీ ఇంకెన్ని కంపెనీల్లో లాలూచీ పడుతూ అవినీతికి పాల్పడి ఉండాలి?
PwC కంపెనీ 157 దేశాల్లో విస్తరించి ఉంది. ప్రపంచ వ్యాపితంగా 2 లక్షలమంది ఉద్యోగులు దానికోసం పని చేస్తుంటారు. 1998లో స్ధాపించబడిన కంపెనీ కేవలం 17 సంవత్సరాలలో ఇంతపెద్ద కంపెనీగా అవతరించడం ఎలా సాధ్యం? ఎంత మొత్తంలో కార్పొరేట్ అవినీతిలో భాగం పొందితే ఇంత ఆర్జన సాధిస్తుంది? జనం ఆలోచించాల్సిన విషయం ఇది.
కార్పొరేట్ అవినీతి ఎంత పెద్ద తిమింగలమో చెప్పడానికె ఇదంతా. ఆడిటింగ్ సంస్ధలు ప్రపంచంలో సవాలక్షా ఉన్నాయి. వారందరు కార్పొరేట్ కంపెనీల, సంపన్నుల అక్రమ సంపాదనను సక్రమం చేసే పనిలోనే నిమగ్నమై ఉంటారు. (మన జగన్ గారి అవినీతిలో ఆడిటర్ విజయసాయి పాత్ర గుర్తుకు తెచ్చుకోండి.)
ఆడిటర్లు సక్రమంగా చేసేపని ఏదన్నా ఉంటే అది మధ్యతరగతి ఉద్యోగుల ఆదాయ పన్ను వ్యవహారాలను చూసిపెట్టడమే. మిగిలినదంతా లెక్కల సర్దుబాటు మాత్రమే. ఆడిటర్లకు కోపం వచ్చినా ఇది నిజం. కోర్టుల్లో లాయర్ల పీడన, సర్దుబాట్లు ఎలాంటివో అకౌంటింగ్ లో ఆడిటర్ల పీడన, సర్దుబాట్లు అలాంటివి. ఇవన్నీ వ్యవస్ధలో జరిగే భారీ తప్పులను, నేరాలను, అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి, ‘అంతా బాగానే ఉంది’ అని జనాన్ని నమ్మించడానికి వ్యవస్ధ తనకు తానుగా నిర్మించుకునే ఉప వ్యవస్ధలు. ఇటువంటి విశాల దృక్పధం ఉంటే తప్ప కేశవ్ గారి కార్టూన్ ఎంత సరైనదో మన అవగాహనలోకి రాదు.
[కార్పొరేట్ అవినీతి అనే ఊబకాయుడి గుండెకు లక్ష్యం వేసుకుని సంధించిన శిక్షల బాణం పోయి పోయి బలం లేక బూటుకాలుకు తగిలిందని, ఆ బాణం దెబ్బ ‘అబ్బా’ అని ఊరుకోగల చిన్నది మాత్రమేనని కార్టూన్ చెబుతోంది.]
రాజుకి స్వయానా ఈ మోషాన్ని తానే బయటపెట్టవలసిన అవసరం ఏమొచ్చింది?(తరువాత కాదని బుకాయించాడు)నిష్క్రియ పర్వమా?ఇన్వెస్టర్ల వద్ద సానుభూతి పొందాలనా?
అవినీతి గురించి, అవినీతి పరులకు ఇన్స్టెంట్ శిక్షలు పడాలనే నీతి వాగ్గేయ కారులు ఇలాంటి వారికి ఇంస్తేమ్ట్ డెత్ సేన్తన్స్ ఎందుకు వేయాలిని కోరారు? మా చి న్న పుడు ఒక కధ చెప్పుకునే వారు. మేక ‘ మే ‘ అని శివుడు గూర్చి తపం మొదలు పెట్టిందట. ఈ తపస్సు భరించ లేక శివుడు గారు వచ్చి ఏమిటి మే కా ఏమిటి నీ కోరిక అని అడగ్గానే మేక గారు శివయ్యా శివయ్యా , ఈ మనుషులందరూ నన్ను చంపి తినాలనే కోరుకుంటున్నారు. దయ చేసి వారికి ఆకోరిక లేకుండా చేసి , వారి భారి మా మేక జాతి ని రక్షించ మని అడగ్గా, శివుడు గారు ఆలోచించి నిజమే!, మరి నాక్కూడా నిన్ను తిన బుద్దిద్దవుతుమ్తి మరి. నేనెలా నిఇకు మియ్యను? అని నిరాకరిమ్చాదట. ఆ విధంగా చిన్న కారు సన్న కారు నేరస్తులను చూస్టే రాజ్యానికి చంపేయాలని కోపం రావడం, రామ లింగ రాజుల్ని చుఉస్తే జాలి కలగడం సహా జాతి సహజం మరి.
మన ఇంటిలో ఒక వెండి చెంబు లేదా బంగారు గ్లాసు దొంగతనం జరిగితేనే పోలీసులు దొంగ నుంచి అది రికవర్ చేసుకుని, దాన్ని కోర్త్‌లో చూపించి, అది మనకి తిరిగి ఇప్పిస్తారు. మరి రామలింగరాజుని నమ్మి మోసపోయిన షేర్ హోల్దర్‌లకి డబ్బులు తిరిగి ఇప్పించారా? రామలింగరాజు చేసిన మోసం ఏ చెంబు దొంగతనమో, చాట దొంగతనమో లాంటి చిన్నది కాదు కదా. సత్యం కంపెనీని సొంతం చేసుకున్న తెక్ మహీంద్రా అప్పటి షేర్ల ధర ప్రకారమే ఆ కంపెనీని కొని ఉంటుంది. జనం రామలింగరాజు దగ్గర పది రూపాయల షేర్‌ని వంద రూపాయలకి కొన్నా, వాళ్ళకి కొత్త యాజమాన్యం పది రూపాయల షేర్‌కి సరిపడా dividend మాత్రమే ఇస్తుంది కానీ దాన్ని వాళ్ళు వంద రూపాయలకి కొన్నారు కదా అని dividend ఎక్కువ ఇవ్వదు.
మీ వ్యాఖ్యకు సందర్భం ఏమిటి? మార్క్సిస్టు-లెనినిస్టు పేరుతో ఇలా అసందర్భంగా రాసి పరువు తీయడం ఎందుకు? సందర్భం లేకుండా రాస్తే ప్రచురించడం వీలు కాదు. గమనించగలరు.
మీరు భాష అర్థం కానంత పల్లెటూరివారని నేను అనుకోను. రామలింగరాజుకి చెరసాల శిక్షైతే పడింది కానీ అతను జనం నుంచి వదూలు చేసిన డబ్బుల్లో రూపాయి కూడా బయటకి రాలేదు కదా. ఆ ఆర్థిక నేరగాణ్ణి శిక్షించారు కానీ రూపాయి కూడా రికవరీ చెయ్యలేదు. శిక్షాకాలం పూర్తై బయటకి వచ్చిన తరువాత కూడా రామలింగరాజు విలాసంగా బతుకుతాడు అనే విషయం చెప్పడానికే అది వ్రాసాను.
మీరు ఈ మధ్య నాకు శతృవులా మాట్లాడుతున్నారు. నా దగ్గర ఏమైనా ఉందా, నన్ను తిడితే బయటకి రాలడానికి? అలాంటి ప్రయోగాలు ………… చేస్తారు.
ప్రవీణ్ గారూ, మీ వ్యాఖ్యల్ని విమర్శించడం తిట్టడం, శత్రువులా మాట్లాడడం అయితే… మీరు ఎన్నిసార్లు నన్ను తిట్టినట్లు? నాకు ఎన్ని సార్లు శత్రువు అయినట్లు?
ఓ పక్క వందిమాగధుల్లో ఒకరిని కాను అంటారు. మరో పక్క మిమ్మల్ని విమర్శించొద్దు అంటున్నారు. ఇది న్యాయం కాదు.
ఇప్పటికన్నా విషయం గ్రహించదలుచుకుంటే: మీ రాతలు మార్క్సిజం-లెనినిజం కాకపోగా అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. మీ రాతలు మీ యిష్టం. కానీ అది మార్క్సిస్టు-లెనినిస్టు పేరుతో చేయకండి మొర్రో అని మొత్తుకుంటున్నాను. సందర్భ శుద్ధితో రాయమంటున్నాను. అదే పనిగా వ్యాఖ్యలు రాస్తూ… రాస్తూ… చివరికి అర్ధం, సందర్భం లేకుండా రాసేస్తున్నారు. పోనీ ప్రచురించకుండా ఉందామంటే ఎందుకు ప్రచురించరు అంటారు. ప్రచురిస్తేనేమో…. ఎందుకు లెండి! ఎన్నిసార్లని రాయను. చాలా విసుగు తెప్పిస్తున్నారు.
ఇక్కడ సత్యం కంపెనీని నమ్మి మోసపోయిన షేర్ హోల్దర్ల గురించి వ్రాసాను. Equity tradingకి కార్మికవర్గంతో సంబంధం లేకపోవచ్చు కానీ ఒక కంపెనీలో equities కొని మోసపోయినవాళ్ళ గురించి నేను వ్రాయడం తప్పా? రామలింగరాజు వల్ల ఆ కంపెనీ ఉద్యోగులు కూడా నష్టపోయారు (ఉద్యోగ భద్రత పోయి, కొంత మంది ఉద్యోగాలు కూడా పూర్తిగా ఊడి ఉంటాయి). రామలింగరాజు ఆస్తులు జప్తు చెయ్యబడలేదు, అతనికి రూపాయి కూడా జేబు నుంచి పోలేదు అనేది నిజమే కదా. ఇక్కడ నేను వ్రాసినదాంట్లో తప్పేమి కనిపించింది?