మూడు దేశాల పర్యటనకు మోడి
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారు మూడు పశ్చిమ దేశాల పర్యటనకు పయనమై వెళ్లారు. మొదటి విడతగా ఫ్రాన్స్ లో నాలుగు రోజులు పర్యటించే ప్రధాని అనంతరం మూడు రోజుల పాటు ఏంజెలా మెర్కల్ అతిధిగా జర్మనీ పర్యటిస్తారు. తదనంతరం ప్రధాని కెనడా సందర్శించడం ఒక విశేషం.
భారత ప్రధాన మంత్రులు కెనడా వెళ్ళడం చాలా తక్కువ. వెళ్తే రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి, వారి కుటుంబ సభ్యులు వెల్లడమే గానీ ఇండియా-కెనడా ల మధ్య దౌత్య సంబంధాలు పైకి కనిపించవు. బహుశా కెనడాకు ఉపయోగపడే విధానాలను సైతం అమెరికాయే సాధించిపెట్టడం దీనికి కారణం కావచ్చు.
ఫ్రాన్స్ లో అధ్యక్షుడు ఒలాండే తో మోడి సమావేశం అవుతారు. అక్కడి వ్యాపార నాయకులతో చర్చలు జరుపుతారు. తాను తలపెట్టిన ‘మెక్ ఇన్ ఇండియా’ నినాదానికి తగురీతిలో స్పందించాలని, పిలుపును విజయవంతం చేయాలని కోరనున్నారు. ఇండియా వచ్చిన విదేశీ నాయకులకు ‘చాయ్ పే చర్చా’ పేరుతో ఆతిధ్యం ఇచ్చి చర్చలు జరిపినట్లుగానే ఫ్రాన్స్ అధ్యక్షునితో చాయ్ పే చర్చ తరహాలో ఒక పధకం మోడి రూపొందించినట్లు వార్తలు చెబుతున్నాయి.
అభిజ్ఞవర్గాల ప్రకారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండే తో కలిసి పడవ ప్రయాణం చేస్తారు. ఈ పడవలో కలిసి ప్రయాణం చేస్తూ తేనీరు సేవనం కావిస్తారు. దీనిని కొందరు ‘బోట్ పే చర్చా’ అని కూడా పిలుస్తున్నారుట. నిజానికి చాయ్ తాగుతూ మాట్లాడుకోవడం అందరూ ఇళ్ళల్లో జరిగేదే. మోడి ఎన్నికల ప్రచారానికి ముందే వివిధ దేశాల నేతలు శిఖరాగ్ర చర్చలు జరిపినప్పుడు గానీ, అంతర్జాతీయ సమావేశాలు జరిగే సమయంలో గానీ టీ తాగుతూ,. బ్రేక్ ఫాస్ట్ చేస్తూ, చివరికి భోజనం చేస్తూ కూడా అధికారిక చర్చలు జరిపే అలవాటు ఉన్నది.
తేనీరు సేవనానికి సకల దేశాల అలవాట్లలోనూ ఇంత విస్తృతమైన ప్రాముఖ్యత ఉన్నందునే మోడి గారి ‘చాయ్ పే చర్చా’ ప్రచారం ఎంతగానో అచ్చివచ్చింది. ఓట్లు, సీట్లు కూడా రాల్చి పెట్టింది. ఫ్రాన్స్ వరకు చూస్తే ఇండియా తలపెట్టిన తమ రాఫెల్ జెట్ ఫైటర్ల అమ్మకం జరుగుతుందని ఆ దేశం ఆశీస్తోంది. ఆరేవా కంపెనీతో అణు ఒప్పందం చేసుకోవాలని ఫ్రాన్స్ ప్రయత్నిస్తోంది.
మొదటి ప్రపంచ యుద్ధం లో మిత్ర రాజ్యాల తరపున భారత సైనికులు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. మిత్రరాజ్యాలైన ఫ్రాన్స్, బ్రిటన్ ల తరపున ఐరోపా వెళ్ళి జర్మనీతో తలపడిన చరిత్ర మన సైనికులకు ఉన్నది. కానీ ఆ పోరాటం బ్రిటిష్ సైన్యంగా చేశారు తప్ప భారత సైన్యంగా కాదని గమనించాలి. యుద్ధంలో ఫ్రాన్స్ గడ్డ పైనే 10,000 మందికి పైగా భారత సైనికులు చనిపోయారు. వారి స్మృతి చిహ్నంగా నిర్మించిన వరల్డ్ వార్ – I మెమోరియల్ ను మోడి సందర్శిస్తారు.
UNESCO ప్రధాన కార్యాలయం, భారీ విమాన తయారీ సంస్ధ ఎయిర్ బస్, ఫ్రెంచి స్పేస్ ఏజన్సీ లను కూడా మోడి సందర్శిస్తారు.
ఫ్రాన్స్ పర్యటన అనంతరం అక్కడి నుండి కుప్పలు తెప్పలుగా పెట్టుబడులు ప్రవహించాలని మోడి భావిస్తున్నారు. ఆయన మూడు దేశాల పర్యటనలో దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. కానీ ఈ ఆశలు నెరవేరే పరిస్ధితి మాత్రం ఇంకా ఏర్పడలేదు. ఫ్రాన్స్ తర్వాత జర్మనీ, ఆ తర్వాత కెనడాకు ముఖ్య అతిధిగా నరేంద్ర మోడి వెళ్తారు. వారి వెంట అనేకమంది ఆర్ధిక వేత్తల కంపెనీలు కూడా వెళ్తున్నారు.
ఇప్పుడిక అంబేడ్కర్ వారసత్వం కోసం పోటీ
నిన్న, మొన్నటి వరకూ సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ వారసత్వం తమదంటే తమదే అని కీచులాడుకున్న కాంగ్రెస్, బి.జె.పి లు ఇప్పుడు బాబా సాహెబ్ బీమ్ రావ్ అంబేద్కర్ వారసత్వం కోసం సిగపట్లు పడుతున్నాయి.
ఏప్రిల్ 14 తేదీ డా. అంబేద్కర్ పుట్టిన రోజు. అది కూడా 125వ పుట్టిన రోజు. ఇదే అదనుగా అంబేద్కర్ ను కూడా హిందూత్వ ఒడి లోకి లాగాలని తద్వారా దళిత ఓట్లకు ఆకర్షించాలని బి.జె.పి పధక రచన చేసింది. అంతవరకు బానే ఉంది గానీ, ఇప్పుడు కొత్తగా ఏప్రిల 14 తేదీని జాతీయ సెలవు దినంగా ప్రకటించడం ఎందుకో అర్ధం కాకుండా ఉంది. 125 వ పుట్టిన రోజు కనుక వచ్చే యేడు ఏప్రిల్ 14 వరకు వార్షిక సంబరాలు జరుపుతామని అంటున్నారు.
బి.జె.పి ప్రభుత్వానికి పోటీగా తామూ అంబేద్కర్ జయంతుత్సవాలను జరుపుతామని కాంగ్రెస్ ప్రకటించింది. అనేక సదస్సులు, చర్చా గోస్టులు నిర్వహిస్తామని తెలిపారు. రాహుల్, సోనియా నేతృత్వంలో ఇందుకు కమిటీ ఏర్పరిచారు. ఏప్రిల్ 14 నే ఉత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించినందున కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ముందుగానే అనగా ఏప్రిల్ 13 తేదీనే జరపాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు ఇరు పార్టీలూ అంబేడ్కర్ వారసత్వం కోసం పోటీ పడుతూ కలకలం సృష్టిస్తున్నారు. రానున్న రోజుల్లో అనగా ఏప్రిల్ 14 వరకూ ఈ పార్టీలు వివిధ రూపాల్లో తగాదాలు పడుతూ, పెడుతూ కాస్త బి.జె.పి గడిపే వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏప్రిల్ 14 సెలవు ఇప్పటికే ఉంది.. అంబేద్కర్ జయంతి కన్నా వారం ముందు జగజ్జీవన్ రాం జయంతికీ ఉంది. అంబేద్కర్ లాగే దళితులందరినీ సొంతం చేసుకుంటారా