క్లుప్తంగా… 8/4/15


Togadia, Bhagwatగుజరాత్ లో ముస్లిం తరిమివేత

హిందూత్వ కోరలు చాస్తూ విషం చిమ్ముతున్న వార్తలు క్రమంగా పెరిగిపోతున్నాయి. గుజరాత్ లో భావనగర్ జిల్లాలోని ఒక చోట 60 హిందూ కుటుంబాల మధ్య నివశిస్తున్న ఒకే ఒక్క ముస్లిం కుటుంబాన్ని అక్కడి నుండి బలవంతంగా తన్ని తగలేశారు. ముస్లిం కుటుంబాన్ని బలవంతంగా తరిమి కొట్టాలని గత సం. ఏప్రిల్ లో హిందూత్వ గణానికి ఉద్భోదించిన కేసులో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా ఇప్పటికీ కోర్టు, ఎలక్షన్ కమిషన్ విచారణ ఎదుర్కొంటున్నారు. కేసు విచారణలో ఉండగానే తొగాడియా ఆజ్ఞల్ని హిందూ మూకలు అమలు చేయడం బట్టి దేశంలో కనీసం గుజరాత్ రాష్ట్రంలో ప్రభుత్వాలు పని చేస్తున్నాయా అన్న అనుమానం కలుగుతోంది.

గత ఆరేడు నెలలుగా జనాన్ని రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసిన వి.హెచ్.పి కొద్ది రోజులుగా ముస్లిం ఇంటి ముందు భజనలు, భక్తి గీతాలు పాడుతూ, వాయిద్యాలు మోగిస్తూ అదే పనిగా రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. చివరికి ఆ ముస్లిం కుటుంబం తన ఇంటిని, ఆస్తుల్ని అన్నింటిని అమ్మేసుకుని వెళ్లిపోవాల్సి వచ్చింది. అమ్మకం ధర కూడా వి.హెచ్.పి నేతలే నిర్ధారించినట్లు తెలుస్తోంది. హిందూత్వ ఉన్మాదం వాస్తవానికి ఆర్ధిక ప్రయోజనాల కోసమే పని చేస్తోందని స్పష్టం అవుతోంది.

జర్మనీ ప్రయాణంలో మోడి:

వచ్చే ఆదివారం నుండి మన ప్రధాని మోడి ఐరోపా ముఖ్యంగా జర్మనీ పర్యటనలో ఉంటారు. తన ‘మేక్ ఇండియా’ నినాదాన్ని జర్మనీలో చెలాయించే ప్రయత్నం మోడి చేస్తారని అందరికీ అవగాహనలో ఉన్న సంగతే. అయితే ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐరోపా Hannover Messeదేశాలు తమ మార్కెట్లను వదిలిపెట్టి ఇండియాలో పెట్టుబడులు ఎలా పెడతాయో పరిశీలించాల్సిన విషయం. సంవత్సరం నుండి మొత్తుకుంటున్నా ఒక్క రూపాయి పెట్టుబడి రాని కాడికి జర్మనీ వెళ్తే మాత్రం వస్తాయా అన్నది అనుమానం.

అయితే జర్మనీలో మోడి సమాదరణ లభించనున్నట్లు సమాచారం. జర్మనీ ఛాన్సలర్ మెర్కెల్ తో కలిసి ‘హనోవర్ మెస్సే’ అనే భారీ బిజినెస్ టైకూన్ల కాన్ఫరెన్స్ ను మోడి ప్రారంభిస్తారు. ఇందులో 350 ఇండియా కంపెనీలు పాల్గొనడం విశేషం. మోడి రాకతో ఇరు దేశాల సంబంధాలు నూతన స్ధాయికి చేరాయని అక్టోబర్ లో మెర్కెల్ ఇండియా రాకతో అవి ఇంకా ఎత్తు చేరతాయని జర్మనీ అంబాసడర్ (ఇండియాలో) మైఖేల్ స్టీనర్ హామీ ఇచ్చేశారు. పర్యటన మొదటి రోజునే మోడి జర్మనీ కంపెనీల సి.ఇ.ఓ లతో రౌండ్ టేబుల్ సమావేశంలో, ఆ తర్వాత 800 మంది వ్యాపార నేతలతో సమావేశంలో పాల్గొంటారు.

క్లీన్ ఎనర్జీ, మౌలిక నిర్మాణాల అభివృద్ధి, స్మార్ట్ సిటీల ప్రాజెక్టు అభివృద్ధి మొదలైన అంశాలపై మోడి బెర్లిన్ లో జర్మనీ ఛాన్సలర్ తో ద్వైపాక్షిక సమావేశం కూడా జరపనున్నారు. సోలార్ ప్రాజెక్టులు, స్మార్ట్ సిటీల నిర్మాణంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ చెబుతోంది. ప్రధానితో ఐదుగురు మంత్రులు -నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, రవి శంకర్ ప్రసాద్, రాజీ ప్రతాప్ రూడి, వెంకయ్య నాయుడు లు కూడా వెళ్తారు.

యు.పి.ఏ అనేక పార్టీల కలగూర గంప కావడంతో (తమకు) ఏమీ చేయలేకపోయారని, మోడి ప్రభుత్వానికి మెజారిటీ ఉండడంతో తమకు పనులు జరుగుతున్నాయని, పరిస్ధితి మారిందని జర్మనీ దౌత్యవేత్త సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. మోడి తెచ్చిన భూ సేకరణ చట్ట సవరణ బిల్లు భారతీయ రైతులకు అసంతృప్తి, అలజడి, ఆందోళన కలిగిస్తుంటే ఆయన సంస్కరణలు విదేశీ కంపెనీలకు సంతృప్తికరంగా ఉండడం గమనార్హం.

చమురు మదపుటేనుగులు ఒక్కటైతే…

ప్రపంచ చమురు, సహజవాయువు మార్కెట్ లో భారీ కంపెనీలుగా పేరు బడ్డ రాయల్ డచ్ షెల్, బి.జి గ్రూపులు విలీనం కానున్నట్లు ప్రకటించాయి. లాయల్ డచ్ షెల్, హాలండ్ కు చెందినది కాగా బి.జి గ్రూపు బ్రిటన్ కు చెందిన కంపెనీ. బి.జి కంటే షెల్ కంపెనీ పెద్దదే అయినప్పటికీ బి.జి కున్న మార్కెట్ శక్తి తక్కువది కాదు. ఇది నిజానికి విలీనం (merger) కాదు. స్వాధీనం (acquisition) మాత్రమే.

shellబి.జి కి వివిధ రూపాల్లో 70 బిలియన్ డాలర్లు చెల్లించి షెల్ కంపెనీ స్వాధీనం చేసుకుంటోంది. అమెరికా-సౌదీ అరేబియాల సంయుక్తంగా సాగిస్తున్న మార్కెట్ ఒత్తిడుల ఫలితంగా చమురు ధరలు బ్యారేల్ కు 120 డాలర్ల నుండి 60 డాలర్లకు పడిపోయింది. కొద్ది వారాల క్రితమైతే 40 డాలర్ల వరకు చమురు ధర పడిపోయింది. ఇలా చమురు, సహజవాయువు ధరలు పడిపోయినప్పుడు సాపేక్షికంగా చిన్న కంపెనీలు మార్కెట్ లో పోటీ పడలేక పెద్ద కంపెనీలతో విలీనం అయిపోతాయి. ఇప్పుడు జరుగుతున్నదీ అదే.

బి.జి కి షెల్ ఇవ్వ జూపిన మొత్తం గత రెండు దశాబ్దాలలోనే భారీ మొత్తంగా చెబుతున్నారు. గతంలో ఔషధ కంపెనీల స్వాధీనం లోనూ, టెలీ కంపెనీల స్వాధీనం లోనూ ఇంతకంటే భారీ మొత్తాలు చెల్లించబడ్డాయి. విలీనాలు, స్వాధీనాల వల్ల పెట్టుబడిదారీ కంపెనీలు మహా రాకాసులుగా మారి వ్యాపారంలో గుత్తస్వామ్యం వహించడానికి దారి తీస్తుంది. పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు వల్లించే పోటీ మటు మాయం అయిపోతుంది. పోటీవల్ల సరుకుల నాణ్యత పెరిగి  ధరలు తగ్గడం అటుంచి విలీనాలు-స్వాధీనాల వల్ల అసలు పోటీయే మాయమైపోతోంది. ‘పెట్టుబడిదారీ వ్యవస్ధ అత్యున్నత దశ సామ్రాజ్యవాదం’ అని లెనిన్ అన్న మాటలు ప్రత్యక్షర సత్యం అని మరోసారి షెల్-బి.జి ల విలీనం చాటింది.

స్వాధీనం తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద సహజవాయువు ఉత్పత్తిదారుగా తాము అవతరిస్తామని షెల్ కంపెనీ అధికారులు చెప్పడం గమనార్హం. రుజువయిన చమురు, వాయు నిల్వలు 25 శాతం పెరుగుతాయని వారు వెల్లడించారు.

One thought on “క్లుప్తంగా… 8/4/15

  1. ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐరోపా దేశాలు/పెట్టుబడీ దారులు తమ మార్కెట్లను వదిలిపెట్టి ఇండియాలో పెట్టుబడులు ఎలా పెడతాయో పరిశీలించాల్సిన విషయం
    1.ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అనువైన చోట(భారత్ వంటి త్రుతీయ ప్రపంచ దేశేలలో) ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావు?
    2.ఇక్కడ అనువైన పరిస్తుతులు ఉన్నాయికదా-చౌకైన శ్రామిక శ్రమ,బలహీనమైన కార్మిక చట్టలు,సదా ప్రొత్సహించే దళారులు మొ,,
    అటువంటప్పుడు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడీదారులు ఎందుకు ముందుకురారు?

    చాలానెలల తరువాత క్లుప్తంగా.. శీర్షికన వార్తలు/విశేషాలు అందించారు.బాగుంది!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s