కొత్త ధీమ్ సెట్ చేశాను!


broadsheet-f

‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ లేదా తెలుగువార్తలు వెబ్ సైట్ కు కొత్త ధీమ్ సెట్ చేశాను. దాని పేరు బ్రాడ్ షీట్. ఇది ప్రీమియం ధీమ్. అంటే వర్డ్ ప్రెస్ వాళ్ళు మంచి డిజైన్ లు తయారు చేసి అమ్మకానికి పెడతారు. వాటిని కొనుక్కోవాల్సి ఉంటుంది.

మరి డబ్బు! నేనేమీ డబ్బు త్యాగం చేసేయలేదు. నా వెబ్ సైట్ లో వర్డ్ ప్రెస్ వాళ్ళ యాడ్ లు కనిపిస్తున్నాయి కదా. వాటికి సంబంధించిన ఆదాయంలో కొంత షేర్ ఇస్తున్నారు. అది పెద్ద మొత్తం ఏమీ కాదు. నెలకి కొద్ది కొద్ది డాలర్ల చొప్పున కూడితే అవి ఇటీవల 100 డాలర్లు అయ్యాయిట. నా ఖాతా అడిగి మరీ జమ చేశారు. ఆ డబ్బుతోనే ఈ ధీమ్ కొన్నాను.

కొత్త ధీమ్ లో ఎంచక్కా అన్నీ కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ను చాలా పొదుపుగా వాడుతూ అన్నింటినీ ఇరికించారు. కానీ ఇది చదువరులకు సౌకర్యంగా ఉందో లేదో తెలియదు. ఏమన్నా తేడాలు ఉంటే చెప్పండి. సవరించవచ్చునేమో చూద్దాం. ఈ ధీమ్ కొనుగోలు వన్ టైమ్ పే మెంట్ అట. అంటే దీనికోసం మళ్ళీ మళ్ళీ డబ్బు కత్తనవసరం లేదు.

వర్డ్ ప్రెస్ ని హోస్ట్ గా ఎంచుకుంటే 3 GB ఉచితంగా స్పేస్ ఇస్తారు. ఆ తర్వాత కూడా స్పేస్ అవసరం అయితే కొనుక్కోవాలి. నా ఉచిత 3 GB స్పేస్ దాదాపు అయిపోవస్తోంది. కనుక వర్డ్ ప్రెస్ సర్వర్ లో కమర్షియల్ స్పేస్ కొనుక్కోవాల్సి ఉంటుంది.

ఇదంతా పాఠకుల సమాచారం కోసం.

 

 

13 thoughts on “కొత్త ధీమ్ సెట్ చేశాను!

 1. కొత్త టెంప్లేట్ బాగుంది.. కుదిరితే బాడీ కలర్ ముదురు రంగు పెట్టండి అప్పుడు మధ్యలో కంటంట్ హై-లెట్ అవ్తుంది చూడడనికి బాగుంటుంది. ఈ లింక్ చూడండి ఇది బ్లాగర్ టెంప్లేట్ ఇందులో ఉన్నట్లుగా మధ్యలో కంటెంట్ వైట్ కలరు చుట్టూ ముదురు గ్రే కలరు ఉండడం వల్ల మధ్యలో కంటేంట్ చదవడానికి బాగుంటుంది. నాకు ఇలా ఉంటే బాగుంటుందేమో అనిపించిది ….. నాగ శ్రీనివాస

  http://johnytemplate.blogspot.in/search/label/magazine

 2. హాయ్ టెకి/నాశ్రీ, సలహాకు ధన్యవాదాలు. మీరు చెప్పింది ప్రయత్నించాను. కానీ అనుమతి లేదు. అలా చేయాలంటే మరికొంత డబ్బు చెల్లించాలట. 200 డాలర్ల ప్యాకేజీ కొనుక్కుంటే ఇక మన ఇష్టం. కానీ అంత అవసరం లేదు కదా. భవిష్యత్తులో అవకాశం ఉంటే చూద్దాం.

 3. నా శ్రీ గారు, ఇంతకుముందు మీరు చిన్న అక్షరాల గురించి అసంతృప్తి ప్రకటించినట్లు గుర్తు. ఈ ధీమ్ లో అక్షరాల సైజు ఇబ్బందిగా ఉన్నాయా?

 4. అక్షరాలు బాగానే ఉన్నాయి ఇందులో.
  బాక్-గ్రౌండ్ కలర్ స్కై-బ్లూ సెట్ చేశారు కదా, అలాగే బ్లాక్ గానీ వేరే ముదురు రంగు గానీ పెడితే ఇంకా బాగుంటుంది.ఇందులో కూడా బ్లాగర్ వినియోగ దారులు కామెంట్ పెట్టడానికి ఆప్షన్ లేదు చూడండి.….. నాగ శ్రీనివాస

 5. మీరు కోరినట్లే ముదురు నీలం సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంది? బోర్డర్ కలర్ ని మార్చడానికి మాత్రమే వీలుంది తప్ప టెక్స్ట్ బ్యాక్ గ్రౌండ్ మార్చే ఏర్పాటు లేదు. అందుకు డబ్బులు పెట్టాలి.

  ముదురు నీలం బదులు ఇంకేమన్నా కలర్ బాగుంటుందా?

 6. ఇప్పుడు నాకు కంటికి ఇంపుగా కనిపిస్తోంది. పైన హెడ్డర్ కలర్ ఒకసారి చూడడి అది ఇంకా బ్లూ కలర్ లోనే ఉంది. దానిని వైట్ చెయ్యండు (fff). appudu bAgunTundi.

 7. పాతదే బాగున్నట్లనిపిస్తోంది విశేఖర్ గారు. చూడగానే అన్ని టపాలూ ఒకే పరిమాణంలో ఉండి ఫొటొ తో పాతు కొంచెం వార్త సమాచారం తో సింపుల్ అండ్ కన్వినెంట్ గా అనిపించేది. ఇది బాగలెదనికాదు, ఇదే చదవడానికి హాయిగా అనిపిస్తుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s